Monday, 4 September 2023

గురువు స్థానం గ్రేట్! (Sep-23, Enlightenment Story)

 *గురువు స్థానం గ్రేట్!*

   🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂                 

 ఒకప్పుడు హెడ్ మాస్టర్లకి రాజులు ఇచ్చిన గౌరవం ఇలా ఉండేది. ఇంగ్లాండ్ కి రాజైన రెండవ చార్లెస్ కొడుకు రాజధానికి కాస్త దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతున్నాడు. ఆ పాఠశాల హెడ్మాస్టర్ పేరు బస్బీ.

ఒక రోజు ఆయనకి రాజుగారినుండి ఒక ఉత్తరం వచ్చింది.తన కుమారుడు ఎలా చదువుతున్నాడో తనిఖీ చేయడానికి ఒకసారి పాఠశాలని సందర్శిస్తానని ఆ ఉత్తరం సారాంశం.

హెడ్ మాస్టర్ తిరుగు టపాలో రాజు గారిని రావద్దని జవాబు రాశారు. సర్వంసహా రాజ్యాధికారి, తన రాజ్యంలోని   పాఠశాలని చూడాలని కోరుతూ ఉత్తరం రాస్తే (పైగా అది ప్రభుత్వ పాఠశాల) ‘రావద్దనేంత దమ్ముందా ? హెడ్మాస్టారుకి ?’ ఆ దమ్ము ఉన్నవాడు కాబట్టే అలా రాసాడు. కారణం కూడా చెప్పాడు.

మా ప్రభువు అయిన మీరు, వస్తే గౌరవ సూచకంగా నా తలపై ఉన్న టోపీని తీయాలి. ఇప్పటివరకు నా దగ్గర చదువుకుంటున్న విద్యార్థులు నాకన్నా అధికుడు లేడని భావిస్తున్నారు. 

నాకన్నా పై అధికారి ఒకడు ఉన్నాడని, ఆయన వద్ద నేను ఒదిగి ఒదిగి ఉంటానని గుర్తించిన క్షణం, వారికి నాపై గౌరవ భావం తగ్గుతుంది. క్రమశిక్షణలో మార్పు వస్తుంది. దాని ఫలితం విద్యాభ్యాసం పై పడుతుంది., ఇది మీరు అర్ధం చేసుకోగలరని ప్రార్ధిస్తున్నాను. ఒకవేళ మీ రాక తప్పనిసరి అయితే నేను రాజీనామా చేయవలసి ఉంటుంది.

హెడ్మాస్టరుగారి ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకొని, ఆయన “తన సమక్షంలో ‘రాచరిక మర్యాదలు పాటించనక్కరలేదని, తానే టోపీ తీసి హెడ్మాస్టారుని గౌరవిస్తానని”జవాబిచ్చాడు రాజు.

అలాగే చేసాడు కూడా,  గ్రేట్. కింగ్!

ఎక్కడ గురువు మాట శాసనం అవుతుందో…

ఎక్కడ గురువు బాట శాశ్వతం అవుతుందో…

ఎక్కడ చదువు మనిషికి నిత్యం అవుతుందో…

ఎక్కడ చదువు మనసుకి సత్వం అవుతుందో…

ఎక్కడ పరీక్షలు ప్రతిభకు పదును పెడతాయో…

ఎక్కడ శిక్షలు క్రమశిక్షణకు అదను అవుతాయో…

ఎక్కడ జ్ఞానం సంపదలా భావించబడుతుందో…

ఎక్కడ సంపద జ్ఞానం ముందు మోకరిల్లుతుందో…

ఎక్కడ తెల్ల తెరపై రంగుల బొమ్మలకంటే నల్లబల్ల పై అక్షరాలు శక్తివంతమౌతాయో…

అక్కడ ఒక్కరోజైనా గురువుగా నిలబడటానికి నా జీవితాన్ని చెల్లిస్తాను!!!✍️

HAPPY TEACHERS DAY TO ALL THE WONDERFUL TEACHERS🙏

ఇలాంటి ఉదాహరణల నుంచి నేటి పాలకులు ఎంతో కొంత  నేర్చుకోవాల్సి ఉంది. హెడ్మాస్టర్ లని ఏకవచన సంబోధనతో పిలిచే అధికార/అనధికారులకు ఇలాంటి విషయాలు కనీసం కొద్దిగా అన్నా.అర్ధం అవుతాయా? ఎక్కడైతే. గురువులు పూజింపబడతారో. అక్కడ   ఉన్నత విద్యా ప్రమాణాలు పరిఢవిల్లి - దేశం సుభిక్షంగా ఉంటుంది!✍️

  🙏గురు బ్రహ్మ, 🙏🙏గురుర్విష్ణుః, 🙏

  🙏గురుర్దేవో మహేశ్వరహః🙏🙏గురు సాక్షాత్ పరబ్రహ్మ!🙏🙏తస్మై శ్రీగురవే నమః🙏

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...