అనుభూతి - జీవిత భాగస్వామిని కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞుడను
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁
మనలో మార్పును సృష్టించేది ప్రేమ; మార్పు అనేది మంచి కోసం జరగాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం మనం మారడానికి సిద్ధంగా ఉన్నామా?
తమ వివాహ వార్షికోత్సవ సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూర్చుని టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట. నిజానికి వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.
వారి సంభాషణలో, భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను.
ఈ సంవత్సరం మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి ఉన్న వాటిని వీటిలో రాద్దాం.
వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని సరిదిద్దుకోడానికి కలిసి ప్రయత్నిద్దాం,” ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు.
ఇద్దరూ తమ తమ డైరీలు తీసుకున్నారు.
ఒక సంవత్సరం వేగంగా గడిచిపోయింది. మరుసటి సంవత్సరం వివాహవార్షికోత్సవం సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ ముందుగా నిర్ణయించుకున్న విధంగా తమ డైరీలను మార్చుకున్నారు.
మొదట, భార్య తనను ఉద్దేశించి వ్రాసిన డైరీని భర్త చదవడం ప్రారంభించాడు.మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం. మీరు నాకు మంచి బహుమతి ఇవ్వలేదు" అని,
రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్కి తీసుకెళ్లలేదు."
మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."
" నా తరఫు బంధువులు వచ్చారు కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."
"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"
ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.
భర్త, “ఓ ప్రియా, నన్ను క్షమించు! ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు. భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.
ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు.
మొదటి పేజీ - ఖాళీ
రెండవ పేజీ - ఖాళీ
మూడవ పేజీ - ఖాళీ
ఖాళీ
భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి! భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు. నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.
భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు. భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది.
అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.
అలాగని నీలో ఏమి లేవని కాదు, నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.
నాలో లెక్కలేనన్ని క్షమించరాని తప్పులు ఉన్నప్పటికీ, నా జీవితంలోని ప్రతి దశలో నాకు నీడలా ఉన్నావు. నా నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.
అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..
మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!
వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి , ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది. మనం ప్రయాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 💌
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment