🌿 పండ్లబుట్ట కథ 🌿
🍁🍁🍁 🍁🍁🍁
*అరటిపండును తొక్క తీసేసి తింటాం.
*సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.
*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని... పై తొక్కతో పాటు లోపలి గింజలు కూడా వదిలేస్తాం.
*ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.
*జామ పళ్ళని మొత్తం తినేస్తాం.
*ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.
*ఒక్కోటి ఒక్కో రుచి. తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే.
*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే.
*అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.
*కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు... ఒకొక్కరిది ఒక్కో స్వభావం. అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే. అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది.
పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు. వాటి జోలికి పోకుండా వదిలేస్తాం తప్ప..చిరాకుపడo కదా!!?
*పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం. ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.
*కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!! కుటుంబ స్థితిగతులను..అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప..
ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ, శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ..!! 🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment