Saturday, 30 September 2023

🐘బుద్ధి బలం🦊 (01-Oct-23, Enlightenment Story)

🐘బుద్ధి బలం🦊

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

పూర్వం బ్రహ్మపుత్ర నదీతీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలివస్తుంటే చిన్న కొండ నడిచివస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయముతో గజగజలాడేవి. పొడుగైన దాని దంతాలు తగిలీ, దాని అడుగుల కింద పడీ చిన్న జంతువులు చాలా వరకు నశించాయి. కొన్ని అడవిని వదిలి వేరే చోటికి వలసవెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువయింది. ఒకటొకటిగా మరణించసాగాయి. తమజాతి అంతరించిపోతుందేమోననే భయముతో ఒక రోజు నక్కలన్నీ సమావేశం అయ్యాయి.

ఈ ఏనుగు చస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపునిండా భోజనం దొరుకుతుంది" అన్నది ఒక కుంటి నక్క. "నేను చంపుతా" అంటూ లేచింది ఒక పిల్లనక్క దాని మాటలు విని నక్కలన్నీ ఫక్కున నవ్వాయి. "ఇది ఆడుకొనే ఏనుగు అనుకొన్నావా? కాదు. దీన్ని చంపడం మాకే చేతకాదు. నీవేం చేస్తావు? వెళ్ళి ఆడుకో" అన్నది మరొక నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్క పిల్లకు కోపం వచ్చింది. అయినా బయటపడకుండా "వయసును, శరీరాన్ని చూసి మీరు తెలివితేటల్ని లెక్కించడం సరి కాదు. నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా" అంది నక్కపిల్ల. ఆ మాటలు విన్న ముసలి నక్క "సరే! చూద్దాం! కానీ!" అన్నాయి.

మరునాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరకు వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసి "మహారాజుకు జయము! జయము! అంటూ వినయంగా నిలుచుంది. మహారాజు అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది. "ఎవరు నువ్వు" అంది బిగ్గరుగా. "ప్రభూ నేను నక్క పిల్లను. అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలనపడి ఉంటోంది. మహారాజు గుణాలన్ని మీలో ఉన్నాయి, కాబట్టి మహారాజా! అని పిలిచాను. ఈ అడవికి మిమ్ముల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయి. బయల్దేరండి" అంది నక్క పిల్ల.

ఏనుగుకు ఎక్కడలేని సంతోషం కలిగింది. "ఎంతదూరం వెళ్ళాలి మనం" అని గర్వంగా అడిగింది. "దగ్గరే. నాతోరండి స్వామీ!" అంటూ జిత్తులమారి నక్కపిల్ల ఒక ఊబి వైపుగా ముందు నడవసాగింది. దాని వెనకే రాచఠీవితో మాతంగం నడవసాగింది. రాజునవుతాననే ఆనందంతో కలులు కంటూ అడుగులేస్తున్న ద్విరదం హఠాత్తుగా ఊబిలో దిగబడింది. తెలివి తెచ్చుకొని "కాపాడండి! కాపాడండి" అని అరవసాగింది.

"ప్రభూ! జిత్తులమారినైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకిది ఫలితం. ఇప్పుడు పశ్చాత్తాపపడి ప్రయోజనం లేదు" అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని అక్కడకు జంతువులు చేరే సరికే ఏనుగు పూర్తిగా ఊబిలో మునిగిపోయింది. అన్నీ నక్క పిల్ల తెలివితేటల్ని మెచ్చుకున్నాయి. 

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃

Friday, 29 September 2023

మనిషిలో అపార శక్తి (30-Sep-23, Enlightenment Story)

 *మనిషిలో అపార శక్తి*

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

ప్రతి మనిషిలోనూ అపార శక్తి దాగి ఉంటుంది. ఒక్క మరణం తప్ప మనిషికి అసాధ్యం అనేది లేదని ఎన్నో రంగాల్లో రుజువైంది. తమలో అనంత శక్తి దాగున్న విషయం చాలా మందికి తెలియదు. ప్రాచీన కాలంలో మహర్షులు తమ అలౌకిక అనుభవ బలంతో మనిషి మనసు నిజస్వరూపాన్ని కనుగొన్నారు. నేడు దూరదర్శిని, సూక్ష్మదర్శిని, మరెంతో సాంకేతిక అభివృద్ధి ద్వారా అనేక విశ్వ రహస్యాలను శాస్త్రవేత్తలు ఛేదిస్తున్నారు.

భగవంతుడు ప్రతి మనిషినీ ప్రత్యేక నైపుణ్యాలతో సృష్టించాడు. రూపం, గాత్రం, చిత్రకళ, వాక్చాతుర్యం, రచన, క్రీడలు... ఇలా ప్రతివారిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ప్రత్యేకతా లేని మనిషి అంటూ ఉండడు. వాటిని గుర్తించి మెరుగులు దిద్దుకునే ప్రయత్నం చేసేవారే ప్రత్యేక గుర్తింపు పొందుతారు. తనను వేధిస్తున్న మరణ భయాన్ని ప్రత్యక్షంగా పిన్న వయసులోనే అనుభవించి, తానెవరో తెలుసుకున్నారు రమణ మహర్షి. ప్రతి మనిషి ‘నేను ఎవరు?’ అనేది తెలుసుకోవాలని ప్రపంచానికి తెలియజెప్పారు.

సీతాన్వేషణలో సముద్రం దాటాల్సిన అవసరం వచ్చింది. జాంబవంతుడు హనుమంతుడి అసలు శక్తిని ఆయనకు తెలియబరుస్తాడు. హనుమ తన విశ్వరూపం చూపి రామకార్యం సఫలం చేశాడు.

ప్రతిభ ఒక వంతు ఉంటే కృషి మూడు వంతులు ఉన్నప్పుడే లోపల దాగున్న ప్రత్యేకతలు వెలుగు చూస్తాయి. స్వీయ సామర్థ్యం గురించి మనకు తెలియకపోతే వెనకబడిపోతాం. అన్నీ ఉన్న అశక్తులుగా జీవితకాలమంతా మిగిలిపోతాం. అన్ని అంగాలూ ఉండి సోమరితనంతో యాచన చేస్తూ జీవిస్తున్న ఎంతోమందికి నిక్‌ వుజిసిక్‌ ఎంతో ఆదర్శప్రాయుడు. ఆయన కాళ్లు చేతులు లేకుండా పూర్తి అంగవైకల్యంతో పుట్టాడు. తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజం ప్రోత్సాహాలతో ఎన్నో రంగాల్లో ప్రత్యేకంగా రాణించాడు.

మనిషిలో దాగి ఉండే ఆధ్యాత్మిక శక్తి అంతవరకు ఏ నావా ప్రయాణం చేయని సముద్రం వంటిది. ఎవరూ సంచరించని అంతరిక్షం వంటిది. కాబట్టి ఎవరి మార్గం వారిది. భగవంతుడి అనుగ్రహం పొందడం కోసం అనేకమంది అనేక రకాలుగా ప్రయత్నించారు. శ్రవణ మార్గాన్ని పరీక్షిత్తు మహారాజు ఆచరించాడు. కీర్తన మార్గాన్ని వాల్మీకి, రామదాసులు ఎంచుకున్నారు. స్మరణ మార్గాన్ని ప్రహ్లాదుడు, తులసీదాస్‌ పాటించారు. పాదసేవన మార్గాన్ని భరతుడు ఆచరించాడు. వందన మార్గాన్ని కృష్ణ పరమాత్మ బోధించాడు. దాస్య భక్తికి హనుమ అంకితమయ్యాడు. సఖ్య భక్తిలో అర్జునుడు, సుగ్రీవుడు తరించారు. ఆత్మ నివేదన భక్తిని ద్రౌపది పాటించింది. అర్చన భక్తిని ప్రస్తుతం మానవులు ఆచరిస్తున్నారు.

తల్లిదండ్రులు పిల్లల్లోని ప్రత్యేకతలను గుర్తించి ప్రోత్సహించాలి. అభిరుచిని బట్టి ప్రోత్సహిస్తే వారిలో మరో బుద్ధుడు, వివేకానందుడు, అబ్దుల్‌ కలాం వంటివారు సమాజానికి దిశానిర్దేశం చేసే ప్రత్యేక వ్యక్తులుగా ఉద్భవిస్తారు.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃 

Thursday, 28 September 2023

సౌండ్ ఆఫ్ నాకింగ్ (29-Sep-23, Enlightenment Story)

 *వార్తాపత్రిక డెలివరీ బాయ్ చెప్పిన కధ హృదయాన్ని హత్తుకుని నా మనస్సుని కదిలించింది*

 *సౌండ్ ఆఫ్ నాకింగ్ -  పేపర్ బాయ్*

 నేను వార్తాపత్రికను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక ఇంటి మెయిల్‌బాక్స్ తాళం వేసి ఉంది, అందువలన నేను వారి తలుపు తట్టాను. మిస్టర్ ప్రసాద్ రావు, అస్థిరమైన అడుగులతో నడుస్తున్న వృద్ధుడు, నెమ్మదిగా తలుపు తెరిచాడు.  నేను అడిగాను, "సార్,  మీ మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది?" ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ చేశాను ’ అని బదులిచ్చారు.

ప్రసాదరావు చిరునవ్వుతో  ఇలా చెప్పారు , "మీరు ప్రతిరోజూ వార్తాపత్రికను నాకు చేతికి అందించాలని నేను కోరుకుంటున్నాను ... దయచేసి తలుపు తట్టండి లేదా బెల్ కొట్టి నాకు స్వయంగా ఇవ్వండి."

నేను అయోమయంలో పడ్డాను అలాగే అన్నాను, కానీ అది మా ఇద్దరికీ అసౌకర్యంగా మరియు సమయం వృధాగా అనిపిస్తుంది" అని జవాబిచ్చాను.

 "అదేమీ ఫర్వాలేదు... ప్రతి నెలా మీకు రూ. 500/- అదనంగా ఇస్తాను" అన్నారు .

 "మీరు తలుపు తడితే నేను తలుపు తీయలేని పరిస్థితిలో ఉండే రోజు ఎప్పుడైనా వస్తే, దయచేసి పోలీసులను పిలవండి!"

 నేను షాక్ అయ్యి "ఎందుకు?" అని అడిగాను. నా భార్య చనిపోయింది, నా కొడుకు విదేశాల్లో  భార్య పిల్లలతో స్థిరపడ్డాడు.మా కన్నా మా పిల్లలు పైకి ఎదగాలని కష్టపడి పై చదువులు విదేశాల్లో చదివవించాము.

ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా  జీవిస్తున్నాను, నాకు సమయం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు?  ఆలా చెబుతున్నపుడు నేను తేమతో చమర్చిన వృద్దుడి కళ్ళుని చూశాను.

ఆయన ఇంకా ఇలా అన్నారు , "నేను వార్తాపత్రికను  చదవలేను......నాకు చూపు మందగించింది .........తలుపు చప్పుడు లేదా డోర్‌బెల్ మోగిన శబ్దం వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను . తెలిసిన వ్యక్తిని చూడటానికి మరియు కొన్ని మాటలు వారి నోటి వెంట విని ఆ రోజు గడపడాని ప్రయత్నం చేస్తూ ఉంటాను !"

అతను చేతులు జోడించి, "చిన్నా , దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయి ! ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ ఫోన్ నంబర్. ఒకరోజు మీరు తలుపు తట్టినపుడు నా నుండి ఎటువంటి సమాధానం రాకపోతే , దయచేసి నా కొడుకుకు ఫోన్ చేసి అతనికి తెలియజేయండి..." అన్నాడు.

ఇది చదివిన తరువాత నాకు నా కర్తవ్యం అర్ధం అయ్యింది , మా స్నేహితుల సర్కిల్‌లో కూడా చాలా మంది ఇళ్లలో ఒంటరిగా ఉన్న వృద్ధులు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వారు ప్రతి రోజు గుడ్ మార్నింగ్ మెసేజెస్ , వాట్సాప్‌లో  ఉదయం 4గంటల నుండే గుడ్ మార్నింగ్ మెస్సేజ్ పెడతారు అనుకుంటూ ఉంటాము. వాస్తవానికి, ఈ ఉదయం మరియు సాయంత్రం శుభాకాంక్షల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే. ఇది భూమి మీద తమ ఉనికిని తెలియజేసే నిశ్శబ్ద సందేశ ఈ రోజుకి మేము ఉన్నాము అని తెలియజేసే చేదు నిజం.

దయచేసి పెద్ద వాళ్ల గుడ్ మార్నింగ్ మెస్సేజ్ లను ఇబ్బందిగా తీసుకోవద్దు. మనం కూడా అదే స్థితికి ఏదో ఒక రోజు వస్తాము. ఒకరోజు, మీరు వారి మార్నింగ్ గ్రీటింగ్‌లు లేదా షేర్ చేసిన కథనాలను అందుకోకపోతే, వారు అనారోగ్యంతో ఉండవచ్చు లేదా వారికి ఏదైనా జరిగి ఉండవచ్చు.

 దయచేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించండి.  ఇది చదివాక నా కళ్లలో నీళ్లు తిరిగాయి. మనస్సు బరువెక్కింది !!!  🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃 

Wednesday, 27 September 2023

🌿 పండ్లబుట్ట కథ .🌿 (28-Sep-23, Enlightenment Story)

🌿 పండ్లబుట్ట కథ  🌿

🍁🍁🍁 🍁🍁🍁

*అరటిపండును తొక్క తీసేసి తింటాం.

*సపోటాను తొక్క, గింజ తీసేసి తింటాం.

*సీతాఫలం మధ్యలో ఉన్న గుజ్జు తిని... పై తొక్కతో పాటు లోపలి గింజలు కూడా వదిలేస్తాం.

*ఆపిల్ లో గింజలు తీసేసి, మొత్తం తింటాం.

*జామ పళ్ళని మొత్తం తినేస్తాం.

*ఇలాగ మనం ఒక పండులో టెంకని, ఒక పండులో గింజని, ఇంకోదాంట్లో తొక్కని కాదనుకుంటాం.

*ఒక్కోటి ఒక్కో రుచి. తీపి, పులుపు, వగరు కొంచం తేడాలతో ఎన్నో రుచులు. అన్ని ఇష్టమే, ఏది తిన్నా మనకు ఆరోగ్యమే. 



*అయితే పళ్ళు తింటునప్పుడు మంచి మాత్రమే గుర్తుంటుంది కానీ చెడు గుర్తుండదు. మనకు కావాల్సింది తీసుకొని అక్కర్లేనిది పారేస్తాం అoతే. 

*అలాగే మనుషులు కూడా పళ్ళలాంటివారు.

*కుటుంబంలో భార్య భర్త , అమ్మ నాన్న ,అక్క చెల్లి,అన్న తమ్ముడు, అందరు ఒక్కో రకం పండు లాంటివారు... ఒకొక్కరిది ఒక్కో స్వభావం. అయితే అందరూ, పళ్ళ లాగా మనకు మంచి చేసేవాళ్ళే. అయినా కానీ మనిషి స్వభావం విషయంలో వాళ్ళు మనకోసం చేసిన మంచి కంటే , వాళ్ళు అప్పుడప్పుడూ మనమీద చూపించిన కోపమో, చిరాకో ఎక్కువ గుర్తుంటుంది

పండులో అక్కర్లేని గింజ, తొక్క,తొడిమ కూడా ఒక భాగమే అనుకుంటాం కానీ పండుని ద్వేషించం కదా!!?కొన్నిపండ్లు మనకు నచ్చనివి కూడా ఉండొచ్చు. వాటి జోలికి పోకుండా వదిలేస్తాం తప్ప..చిరాకుపడo కదా!!?

*పండులాగే కోపతాపాలు, ప్రేమపాశాలు కలిస్తేనే మనిషి స్వభావం. ఇది గుర్తించగలిగితే, వాళ్ళని ద్వేషించకుండా ప్రేమిస్తాం.

*కుటుంబమంటే - అన్ని రకాల పండ్లతో నింపిన పండ్లబుట్ట!! కుటుంబ స్థితిగతులను..అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ, కలిసిమెలిసి ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఎవరికివారే ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ సున్నితంగా కుటుంబాన్ని manage చేసుకోవాలి తప్ప..

ఓకే ఇంట్లో ఉంటూ రాగద్వేషాలకు తావిస్తూ, శత్రువుల్లా మారకూడదు ఎప్పటికీ..!! 🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃 

Tuesday, 26 September 2023

ప్రతిఫలం (27-Sep-23, Enlightenment Story)

 *ప్రతిఫలం*

🍁🍁🍁 🍁🍁🍁

అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయన ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. కానీ ఆ రాజ్యంలో ప్రజలు ఎక్కువమంది సోమరులుగా తయారయ్యారు. కనీసం వారి పనిని కూడా వారుచేసుకొనే వారు కాదు. చిన్న చిన్న పనులను కూడా రాజుగారి భటులే చేయలనుకోనేవారు. ఎవరికి వారు మనకెందుకులే! అనుకొనేవారు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలని రాజు ఆ నగరంలో నాలుగు రోడ్ల కూడలిలో ఒక పెద్ద రాయిని రాత్రికి రాత్రి పెట్టించాడు. 

మర్నాడు ఉదయం ఒక వ్యాపారి తన మిత్రుడితో కలిసి బండి మీద వెళుతున్నాడు. ఆ నాల్గు రోడ్ల కూడలిలో రాయి ఉండటం చేత బండి అతి కష్టం మీద రాతిని ఆనుకొని మలుపు తిరిగింది. "బండివాడి చేత ఆ రాయిని పక్కకు నెట్టించక పోయావా?" అన్నాడు మిత్రుడు. "నాకేం పని అది ప్రభుత్వం వారు చూసుకోవాలి" అని సమాధానం చెప్పాడు వ్యాపారి. 

ఇంతలో ఒక గుఱ్ఱపు రౌతు ఆ రాయిని దాటుతుండగా గుఱ్ఱం కాలుకు దెబ్బ తగిలింది. రౌతు రాజుగారిని తిడుతూ గుఱ్ఱాన్ని ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు

కొంతసేపటికి ఒక రైతు భుజం మీద నాగలితో అక్కడికి వచాడు. దారికి అడ్డంగా ఉన్న రాయిని చూసి నాగలి దించి దాన్ని పక్కకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ అది జరగలేదు. సాయంగా ఆ వెళ్తున్న మరొక వ్యక్తిని పిలిచాడు. అతడు"నేను గురువును. కూలి పనివానిని కాదు. అయినా నేను బుద్ధిబలం చూపిస్తాగానీ భుజబలం చూపించను" అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. ఎవరిని పిలిచినా ఇంతేనని ఎలాగైనా ఆ రాతిని పక్కకు దోర్లించాలని నడుం బిగించి పూర్తి నమ్మకంతో అతి కష్టం మీద రాయిని ఓ మూలకు దొర్లించాడు. 

ఆ రాయి కింద డబ్బు సంచి దొరికింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూశాడు రైతు. అందులో "రాయిని తొలగించిన వారికి రాజుగారి బహుమతి" అని ఉత్తరం కూడా ఉంది. రైతు ఎంతో ఆనందించాడు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా దేశం అంతా వ్యాపించింది. రాజ్యంలోని ప్రతి వ్యక్తి తన వంతుగా సహాయ సహకారాలు అందజేయటం మొదలు పెట్టారు. కొంతకాలం గడిచేసరికి ఎవరిపని వాళ్ళు చేసుకోవటంలో తృప్తి ఏమిటో వాళ్ళకు తెలిసింది

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Monday, 25 September 2023

ధర్మ విజయం (26-Sep-23, Enlightenment Story)

*ధర్మవిజయం*

🍁🍁🍁 🍁🍁🍁

ఒక ఊరిలో రాజమ్మ అనే ఒక వృద్ధ వితంతువు ఉండేది. ఆమె వద్ద నూరు బంగారు నాణాలు ఉండేవి. వయసు మీద పడుతుండడంతో రాజమ్మ తీర్ధయాత్రలకు బయల్దేరాలనుకుంది. 

ఆమె తన దగ్గరున్న బంగారు నాణాలను ఒక సంచిలో వేసి లక్కతో కట్టేసింది. ఆ నాణాల సంచిని పొరుగింటి రాజయ్యకు దాచమని ఇస్తూ "అయ్యా ఒకవేళ నేను తిరిగి వచ్చినట్లయితే నా నాణాల సంచిని తీసుకుని నీ సేవకు ప్రతి ఫలంగా పది బంగారు నాణెములు ఇస్తాను. నేను రాకపోయినట్లయితే ఈ సంచి నీదే అని చెప్పింది.



రాజమ్మ వెళ్ళిన వెంటనే రాజయ్యసంచిలోని నూరు బంగారు నాణాలను లెక్కపెట్టాడు. ఆ నాణాలను దక్కించుకోవాలని ఒక పన్నాగం పన్నాడు.

రాజమ్మ తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చి తన బంగారు నాణాల సంచిని ఇవ్వమని కోరగా రాజయ్య సంచిని ఆమెకు అందించాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, రాజమ్మ రాజయ్యకు మాట ఇచ్చినట్లు పది బంగారు నాణాలు ఇవ్వడానికి సంచి బిరడా తొలగించి చూడగా, సంచిలో బంగారు నాణాలకు బదులుగా ఇనప నాణాలు ఉన్నాయి. ఆమె ఆ సంచి తీసుకుని రాజయ్య దగ్గరకెళ్లి జరిగినదంతా వివరించింది. కాని రాజయ్య తనకేమీ తెలియదని బుకాయిస్తూ, తనకు రావలసిన పది బంగారు నాణాలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.

రాజమ్మ న్యాయం కోసం రాజు వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పింది. రాజు రాజయ్యను న్యాయస్థానానికి రప్పించి ఏం "ఈ విషయంపై నీవేమి చెప్పాలనుకుంటున్నావు?" అనడిగాడు.

అప్పుడు రాజయ్య "నాకేమీ తెలియదు మహారాజా! ఈ అవ్వ నాకు ఒక లక్కతో బిగించిన సంచిని భద్రపరచమని ఇచ్చింది. నేను తిరిగి భద్రంగా అప్పగించాను, ఇంతవరకు నాకు రావలసిన రుసుము అందలేదు" అన్నాడు.

ఇద్దరి వాదనలు విన్న రాజు సంచిని సునిశితంగా పరిశీలించాడు. సంచికి చేసిన రంధ్రం దానిని నిపుణతతో కుట్టిన క్రమం రాజును ఆలోచించేలా చేసింది. రాజు రాజమ్మను, రాజయ్యను రెండు రోజుల తర్వాత న్యాయస్థానంలో హాజరుకావాలని ఆదేశించాడు.

ఈ క్రమంలో, రాజు పట్టణంలోని నిపుణులైన కుట్టుపని వారిని తన ఆస్థానానికి రప్పించి వారికి ఆ సంచిని చూపించాడు. వారిలో ఒకడు ఆ సంచిని రాజయ్య అడిగితే కుట్టించానని చెప్పాడు.

రెండు రోజులు గడిచిన తరవాత, రాజమ్మ, రాజయ్య రాజుగారి ఆస్థానంలో హాజరయ్యారు. రాజు రాజమ్మకు అనుకూలంగా తీర్పు ఇచ్చాడు.

రాజయ్య తను తప్పు చేయలేదని వాదించాడు. అప్పుడు రాజు ఆ కుట్టుపనివాడిని చూపించాడు. అంతే! రాజయ్య తప్పు ఒప్పుకున్నాడు.

మొత్తం బంగారు నాణాలు రాజమ్మకి ఇవ్వవలసిందిగా రాజయ్యను రాజు ఆదేశించాడు. రాజయ్య తనకి రావలసిన పది బంగారు నాణాలను కూడా జరిమానా రూపంలో కోల్పోయాడు. రాజమ్మ కోరిక మేరకు రాజు రాజయ్యకు జైలుశిక్ష విధించలేదు.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Friday, 22 September 2023

నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు - బిల్ గేట్స్ (25-Sep-23, Enlightenment Story)

 నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు - బిల్ గేట్స్

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁 

మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు.“ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు.

నేను డబ్బు, పేరు  సంపాదించక ముందు ఒకరోజులలో ఒక నాడు న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను. దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.

“పర్లేదు.మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు.


మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.

ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు.

ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు. 

“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.

“మీరు తెలుసు.బిల్ గేట్స్..ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను” 

“ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది  ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “

“సర్. మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది? అతడు ప్రశ్నించాడు.

“ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.

“నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను. ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?

అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును. నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు.  అప్పుడు నాకు అనిపించింది-

కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే.ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం. ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

సత్యాన్వేషణ (24-Sep-23, Enlightenment Story)

 సత్యాన్వేషణ

🍁🍁🍁 🍁🍁🍁 

సత్యాన్ని తెలుసుకోవడానికి సగుణమా లేక నిర్గుణమా అన్న మీమాంస సదా సాగుతూనే ఉంటుంది. మీమాంస వదిలి సాధనా మార్గంలో పయనిస్తేగాని సత్యదర్శనం కలగదంటారు దార్శనికులు. 

ఈ భూమి మీద కళ్లు తెరవగానే కనిపించేది వస్తు ప్రపంచం. ఆకాశం, నక్షత్రాలు, గ్రహాలు; జలమయమైన సముద్రం, నదులు, కొలనులు, బావులు; అంబరాన్ని సంబరంగా తాకడానికి చేతులు చాచే వృక్షాలు; వాటిని నడిపించే కనిపించని వాయువు, నేలపై ఉన్నా నింగికి ఎగసిపడే నిప్పు, రగిలే నాల్కలు; కొండలు, కోనలతో నిండిన నేల- పంచభూతాలను మనిషి ఎలా కాదనగలడు? అంపశయ్య పైన ఉన్న భీష్మాచార్యులకు మొదట విశ్వం, తరవాత విష్ణువు కనిపించారు. సర్వ వ్యాపకమైన విష్ణుత్వాన్ని కురుపితామహుడు కృష్ణుడిలోనే చూడగలిగాడు. తెలిసినదాన్నిబట్టి తెలియనిదాన్ని పట్టుకోవడం సులభం. ఉట్టి కొట్టగలిగితే, స్వర్గం ఎక్కగలనన్న ధైర్యం, ఉత్సాహం ముందుకు నడిపిస్తాయి. ఈ సృష్టిలో ప్రతి జీవి పుట్టి, పెరిగి, గిట్టడం ప్రకృతి సహజమైన మార్పు. 

విశ్వరహస్యాన్ని తెలుసుకోవడానికి మూడురకాల ప్రామాణికాల్ని విజ్ఞులు నిర్దేశించారు. ప్రత్యక్ష, అనుమాన, శబ్దప్రమాణాలు మూడూ సత్యాన్వేషణకు తగిన ఉపకరణాలు. కళ్లతో చూడాలి, మనసుతో తెలుసుకోవాలి, జ్ఞానసంపదతో కూడిన వేదమంత్రం ఉపాసించాలి. ఈ మూడింటికీ లొంగని మహత్త్వం యోగసమాధిలో హృదయనేత్రానికే అవగతం అవుతుంది. ఎవరికి వారే అనుభవం ద్వారా అనుభూతి చెందినప్పుడే సత్యసాక్షాత్కారం సాధ్యమవుతుందంటారు యోగీ శ్వరులు. చూపు, చూడదగినది, చూడగలవాడు (దృష్టి, దృశ్యం, ద్రష్ట) మూడూ ఒకటి అయితే నిత్యం, నిఖిలమైన సత్యస్వరూపం విశ్వవ్యాప్తమై విష్ణుసహస్ర నామమై ధ్వనిస్తుంది.

జ్ఞానమార్గంలో కొనసాగేవారికి నిర్గుణధ్యానం, కర్మ మార్గంలో పయనించేవారికి సగుణధ్యానం కలిసివస్తాయని, గురువులు శిష్యుల స్థాయినిబట్టి మార్గనిర్దేశం చేసేవారు. నేను సర్వజ్ఞుడిని అన్న అహంకారంతో అగ్నికార్యాలు మానివేసిన జ్ఞానికన్నా నిష్కామకర్మ చేసే యోగి మిన్న- అంటున్నది భగవాన్‌ ఉవాచ. విష్ణు సహస్రనామాలు వల్లెవేస్తూ, పాపపు పనులకు ఒడిగట్టేవాడిని నామాపరాధి అంటున్నది శ్రీభాగవతం. సగుణ, నిర్గుణమనే విభేదం కేవలం తాత్కాలికం. ఏరు దాటడానికి తెప్ప అవసరం. 

ఏరు దాటాక తెప్పను వదలకపోవడం అవివేకం. ఇహపర సాధన జీవిత పరమార్థం. జ్ఞానం, కర్మ, యోగం, భోగం- అన్నీ సత్యశిఖరానికి చేర్చే సోపానాలు. అంచెలంచెలుగా నిచ్చెనమెట్లు ఎక్కినప్పుడే నింపాదిగా చేరవలసిన చోటుకు చేరుకోవచ్చు. నేలవిడిచి చేసే సాముగరిడీలను నమ్ముకుంటే వైకుంఠపాళి పాము నోట్లో పడ్డ పాచికవలె జారిపడతారు. వైకుంఠానికి బదులు వైతరణికి తరలిపోగలరు. 

లోకంలో ఒకరి సహాయం లేకుండా జీవించడంగాని, కార్యసిద్ధి పొందడంగాని సాధ్యం కాదు. పొట్టు సాయంలేకుండా బియ్యపు గింజ మొలవదు. తోడూ నీడా లోకసహజమైన జోడుగుర్రాలు. సగుణం కాదని నిర్గుణం కోసం వెంపర్లాడితే గాడితప్పి బండి బోల్తా కొట్టవచ్చు. సాధన, ఉపాసన జోడుగుర్రాల్లాంటివి. ఈ రహస్యం తెలుసుకున్నప్పుడు నాణేనికి బొమ్మ-బొరుసు లాంటివే సగుణ నిర్గుణ సాధనామార్గాలన్న సమరస భావన కలుగుతుంది. సాధన వేగవంతమై యోగం వరిస్తుంది. సచ్చిదానందం అంటే అచ్యుతానంద గోవిందుడేనన్న సత్యం బోధపడుతుంది.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


కృషి విశ్వాసం (23-Sep-23, Enlightenment Story)

 కృషి విశ్వాసం

🍁🍁🍁 🍁🍁🍁 🍁  

వాని ముక్తి లేక దర్శన భాగ్యానికో పూజించేవారే భక్తులు కారు. కార్యార్థులూ భక్తులే. ఇహపరాలు ఆయన అధీనమని భక్తులు నమ్ముతారు. దైవంపై నమ్మకంతో గట్టి ప్రయత్నం చేస్తే కార్యం సఫలమవుతుందని వారి విశ్వాసం. కృషి, విశ్వాసం. రెండూ ఉండాలన్నమాట. దైవానుగ్రహం అనేది పక్కన పెట్టి, వాస్తవ దృక్పథం చూస్తే మనిషి చేసే కార్యాలన్నీ కృషితోనే నెరవేరుతున్నాయి. 

దైవానుగ్రహం అనేది ఒక విశ్వాసం. ఇది అవసరమా అన్నది ప్రశ్న. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సూక్తి మనకు తెలిసిందే. కృషితోనే ఏదైనా సాధించగలమని చెప్పే ఈ సూక్తి మనిషికి కొండంత ఆత్మబలాన్నిస్తుంది. తన కృషితోనే ఎదిగాననే భావన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తే మంచిదే. కాని, దాని వెనక అహం బలంగా ఉంటుంది. ఇది మోతాదు మించితే సమస్య మొదలవుతుంది.

కృషితో ఎదిగినవారున్నారు. అంతకుమించి కృషి చేసినా ఓడినవారెందరో ఉన్నారు. గెలుపునకు కృషి అత్యావశ్యకమైనా పరిస్థితులు అనుకూలించాలి. ఇదే దైవానుగ్రహం. పరిస్థితులు అన్నివేళలా సానుకూలంగా ఉంటాయనుకోవడం అవివేకం. వాటిని దాటగలమని అనుకోవడం అంతకన్నా అవివేకం. ఎంతో శ్రమించి సాధించినా అది దైవకవేనని భావించకపోతే మనిషి జీవితం పరాజయమవుతుంది. 

గెలుపునుంచి పుట్టే ఆహం ఎన్నో అనర్థాలకు మూలం. ఎవరినీ లక్ష్య పెట్టకపోవడం, మాట తూలడం, ఎవరు చెప్పినా వినకపోవడం, తాను అనుకున్నదే సరైనదని భావించడం, వ్యతిరేక భావాలను సహించ లేకపోవడం, చిన్న పొరపాటుకే తీవ్రంగా స్పందించడం. ఇలా ఎన్నో దుర్గుణాలను అహం తెచ్చి పెడుతుంది. వాదనలో తనదే పైచేయి కావాలనుకోవడం, తెలియని మొండి తనం, పంతాలు పట్టింపులకు అహం ముడిపదార్థం. మిత్రులు, సహోదరులు, సహోద్యోగులు, జీవిత భాగస్వామి మనసులో కొంచెమైనా మంచి స్థానం పొందలేనప్పుడు మనిషి ఏది సాధించినా ఎంత సంపాదించినా ఏమీ ప్రయోజనం ఉండదు.

తనను తాను నియంత్రించుకోలేని వ్యక్తి ప్రపంచ నియంత అయినా నిష్ప్రయోజకమే. ఏదో ఒక రోజు అన్నీ కోల్పోతాడు. అహాన్ని ఆదిలోనే తుంచాలంటే గెలుపును దైవకృపగాభావించాలంటారు పెద్దలు. దైవానుగ్రహంతో తన కృషి ఫలించింది అంటే సరిపోదు. అనుకున్నా సరిపోదు. దృఢంగా విశ్వసించాలి. ఆహానికి విరుగుడు దైవభావనని గుర్తించి, మన పెద్దలు బాల్యం నుంచే దీన్ని అలవరచేవారు.

తరగతిలోకి వెళ్ళేముందు, బడిపిల్లలందరిచేతా గురుభక్తి, దైవభక్తి, దేశభక్తి శ్లోకాలను గతంలో ప్రార్ధన చేయించేవారు. ధార్మిక వాతావరణంలో పిల్లలను పెంచేవారు. పసి మనసులు పసిడి మనసులు. అవి ఎంతో విలువైనవి. సద్భావనలు అనే విత్తనాలు లేత మనసులో నాటాలి. నీరు ఎండి బీటలువేసిన నేలలో విత్తనాలు మొలకెత్తవు. అలాగే కొత్త సంస్కారాలు ఎదిగిన మనసులో పుట్టవు. ఎదిగిన బుద్ధి తర్కాన్ని ఇష్టపడుతుంది. ఆశక్తుడే దైవాన్ని పట్టుకుంటాడు అనే మాటలు ప్రభావితం చేస్తాయి. భక్తిరహితమైన తార్కికభావాలు నాస్తికుణ్ని చేస్తాయి. 

తార్కిక భావాలు భక్తికి తోడైతే జ్ఞానం పుడుతుంది. పెరిగే జాజితీగను కర్రకు జోడించి, అది పాకే దిశను నిర్దేశిస్తారు. అలాగే దైవమనే కర్రను కృషికి జతచేస్తే మనిషి సవ్యంగా ఎదుగుతాడు. అహం అదుపులో ఉంటుంది. దైవభావన నుంచి మొదట పుట్టేది. పాపభీతి. 

ఇది నిష్ఠ, నియమం, నీతి, నిబద్ధత, నియంత్రణ అనే అయిదు ఆణిముత్యాలను మనిషికి ఆభరణంగా ఇస్తుంది.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Thursday, 21 September 2023

అమ్మక్షమ - అమ్మ హక్కు! (22-Sep-23, Enlightenment Story)

 అమ్మక్షమ -  అమ్మ హక్కు!

🍁🍁🍁 🍁🍁🍁 🍁  🍁🍁

అది ఆమె హక్కు!  ఎవరైనా అమాయక పుత్రుడు క్షమ ఆమె బాధ్యత అనుకుంటే, విధి అనుకుంటే, ఆమె బలహీనత అనుకుంటే. అది అతడి అమాయకత్వాన్ని తెలియజేస్తుంది. ఆమె ప్రేమను, ఉదాత్తమైన ఆమె హక్కును అంతలా తీసిపడేస్తే, తీసికట్టుగా భావిస్తే. అతడు నిజంగా దురదృష్టవంతుడనే చెప్పాలి. 

ఎందుకంటే అమ్మ క్షమలో ఏముందో  ఆ అమాయక చక్రవర్తికి అర్ధం కాదు. అందులోని ప్రయోజనాలు అతడి అవగాహనలోకి రావు. 

అమ్మ క్షమను చిన్నచూపు చూస్తే ఆమె ఆత్మ గౌరవాన్ని కించపరచినట్లే, ఆమె సహనాన్ని, నిబ్బరాన్ని దెబ్బతీసినట్లే, తనకు చెందవలసిన ప్రయోజనాలను తానే భంగపరచుకున్నట్లే. గర్భంలో ఎడాపెడా పల్టీలు కొడుతూ సుకుమారమైన కడుపంతా తన్నేసే దున్నేసే గర్భస్థ శిశువును, ఆ నొప్పిని భరిస్తూ బిడ్డ కదలికలకు అనుగుణంగా కష్టపడి తన శరీరాన్ని అమర్చుకునే ‘అమ్మ క్షమ’ ఎంతటిదో ఆ బిడ్డకెన్నటికీ అర్ధం కాదు.

'ఎందుకంటే బిడ్డ అమ్మ కాదు. కాబట్టి, పిల్లల్లో కొందరు. అందరూ కాదు.వృద్ధాశ్రమాలను అన్వేషిస్తూ అందులో చేర్చే పథకాలను రచిస్తున్నారు! గర్భంతో నరకాన్ని భరిస్తూ కూడా బిడ్డ అన్ని విధాలా అందంగా,  ఆరోగ్యంగా  ఈ లోకంలోకి రావాలని పూజలు చేసిన తల్లికి, పారాయణాలు చేసిన తల్లికి కడుపులో ఇబ్బంది పెడుతున్న బిడ్డను నెలలప్పుడే తీసి అవతల పారేసే అవకాశాలు లేకనా? వసతులు దొరకకనా? ఈ లోకంలో తల్లికి అన్నింటికంటే, తన ప్రాణాలకంటే కూడా బిడ్డ ఎక్కువ బిడ్డే ఎక్కువ! 


తల్లికి బిడ్డ ఒక అమృతపు మొలక వెన్నెల తునక! కోకిల తన గూట్లో గుడ్లు పెట్టిపోతే కాళ్లతో, ముక్కుతో కిందికి దొర్లించక పొదిగి పిల్లలయ్యేదాకా, రెక్కలొచ్చి ఎగిరిపోయ్యేదాకా రక్షించే కాకి తల్లిని ఏమనాలి?  ఆమెలోని తల్లి మనసుకు ఎన్ని చేతులెత్తి మొక్కాల?. అదే అమ్మ మనసు! ప్రతి అమ్మ మనసు.! 

అన్నింటికంటే మనం గ్రహించవలసింది అమ్మ ఉదార హృదయం; క్షమాగుణం. అది పిల్లల దృష్టిలో ఆమె బలహీనత! తమ ప్రేమను, భద్రతను కోల్పోవలసివస్తుందనే భయంతో ఆమె తీసుకునే ముందుజాగ్రత్త. 

కానీ అది తప్పు.. నిజానికి అది పిల్లల ప్రేమకు దూరమై బతకలేని మధురమైన బలహీనత. దానికంటే ముఖ్యంగా వారిని ప్రేమించకుండా, వారికి ప్రేమను అందించకుండా ఉండలేని అత్యంత సున్నితమైన నాజూకు బలహీనత.

ఇంత సూక్ష్మ భానం ఎవరికి అర్ధమవుతుంది?  అది అత్యంత కఠినమైన శిల మధ్యలో ఉన్న శీతల సలిలంలాంటిది. ఆది ఆమెకు తప్ప మరొకరికి అర్ధం కానిది. పైకి కనిపిస్తున్న క్షమ ఆమె బలహీత కాదు.హక్కు, గంభీరమైన, హుందా అయిన హక్కు.

నిజానికి పిల్లలకు వారి తల్లిదండ్రుల ఆస్తికంటే వారి క్షమే నిజమైన ఆస్తి హక్కు. దురదృష్టం ఏమిటంటే ఆ హక్కు అప్రయత్నంగానే, ఆనాయాసంగానే, ఉదారంగానే పిల్లలకు అందుతోంది. చెందుతోంది. ఈ లోకంలో ఆయాచితంగా.వచ్చే దానంత చవకబారు వస్తువు మరొకటి ఉండదు.

తేనెటీగలకు బహుశా నోట్లో రుచి మొగ్గలుండవేమో. ఉంటే అంత మధురమైన తేనెను కనీసం రుచి కూడా చూడకుండా పట్టులోనే నిక్షిప్తం చేస్తూ నెలల తరబడి అలా ఉండిపోయేవి కావేమో.

అయితే అమ్మకు రుచి మొగ్గలున్నాయి. తేనె రుచీ తెలుసు... అమ్మకూ ఓ అమ్మ ఉంటుంది కాబట్టి, అయినా అమ్మ ప్రేమ అనే స్వయంసిద్ధ మాధుర్యాన్ని గుండె పట్టులో పెట్టుకుని, బిడ్డకై పెంచుకుని, పెంచుకుని, పెంచుకుని. ఈ అమ్మ అనే తేనెటీగ బిడ్డ కోసమే దాస్తుంది. బిడ్డకే పంచుతుంది!✍️ 

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Wednesday, 20 September 2023

అమ్మాయికి కాన్సర్ - రామారావు సాయం (21-Sep-23, Enlightenment Story)

 *అమ్మాయికి కాన్సర్ - రామారావు సాయం*

🍁🍁🍁 🍁🍁🍁 🍁  🍁🍁🍁 🍁🍁🍁 🍁 

ఒక మహానగరంలో ఒక కుటుంబం జీవిస్తోంది. ఆ కుటుంబంలో ఇంటి యజమాని రామారావు, అతని భార్య, ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. రామారావు ఒక సామాన్య ఉద్యోగి. అయినా వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నదాంతో జీవిస్తున్నారు. ఇలా కొంతకాలం గడిచింది. 

ఒక రోజున రామారావు ఆఫీసుకు వెళ్లుతుంటే పిల్లలు బయటకు షికారు తీసుకు వెళతావా నాన్నా అని అడిగారు. అప్పుడు రామారావు కొంచెం ఆలోచించి సరే అని ఈరోజు నాకు బోనస్ వస్తుంది, అది తీసుకొని ఇంటి తొందరగా వస్తాను, మీరు రెడిగా ఉండండి అని పిల్లలకు , భార్యకు చెప్పి ఆఫీసుకి వెళ్ళాడు. చూస్తుండగా సాయంత్రం అయ్యింది. ఇంటి దగ్గర పిల్లలు స్కూలు నుంచి వచ్చి నాన్న ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు.  


రామారావు ఆఫీసులో బోనస్ తీసుకొని ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో రైల్వేస్టేషన్ దగ్గర ఒక కుటుంబం ఏడస్తూ అందరిని ఏదో అడుగుతున్నారు. ఆ విషయం  ఏమిటో తెలుసుకుందామని రామారావు వాళ్ల దగ్గరకు వెళ్ళి ఎందుకు మీరు ఇలా భాధపడుతూ అందరిని ఏమి అడుగుతున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్లు మా అమ్మాయికి కాన్సర్, ఆపరేషన్ చేయాలి అన్నారు. కాని అంత డబ్బులేదు. అందుకని ఎవరైనా సాయం చేస్తారేమో అని అందరిని అడుగుతున్నాము

దయచేసి మాకు మీరు డబ్బు సాయం చేసి మా పిల్లని బతికించండి అని పిల్ల తండ్రి ప్రాథేయపడ్డాడు. అది విని రామారావు మనసు కరిగి పిల్లలని ఈరోజు కాకపోతే వేరే ఎప్పుడైనా బయటకు తీసుకువెళ్ళవచ్చు. అదే ఇప్పుడు ఈ కుటుంబానికి నా బోనస్  డబ్బులు సాయం చేస్తే వాళ్ల అమ్మాయి ఆపరేషన్ కి డబ్బు సాయం చేస్తే ఆ అమ్మాయి బతుకుతుంది. ఆ కుటుంబం ఆనందంగా ఉంటారు. ఈ డబ్బు వాళ్లకి అవసరం. నా కుటంబం విలాసం కన్నా వాళ్ల అవసరం చాలా ముఖ్యం అని ఆలోచించి రామారావు తన దగ్గర ఉన్న బోనస్ ఆ అమ్మాయి వాళ్ల నాన్నకు ఇచ్చాడు. వాళ్ళు చాలా ఆనందించి అక్కడ నుండి వెళ్ళిపోయారు. 

తరువాత రామారావు కూడా ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన రామారావుని చూసి పిల్లలు ఆనందంగా నాన్న మేము రెడీగా ఉన్నాం, షికారుకు వెళదామా అన్నారు. రామారావు పిల్లలకి ఏ సమాధానం చెప్పాలో తెలియక సాఫాలో కూర్చుండి పోయాడు. ఇంతలో రామారావు భార్య వచ్చి ఏమయ్యింది అలా కూర్చున్నారు, ఆఫీసులో ఏమయినా ప్రోబ్లమా అని అడిగింది. అప్పుడు రామారావు మంచి నీళ్లు తాగి అదేమి లేదు. నేను ఆఫీసునుంచి బోనస్ తీసుకుని వస్తుంటే రైల్వేస్టేషను దగ్గర ఒక కుటుంబం వాళ్ల అమ్మాయి ఆపరేషన్ కి డబ్బులు  లేవని అందరిని అడుగుతున్నారు. కాని ఎవరు సాయం చేయలేదు. నాకు మాత్రం వాళ్ల పాపని చూస్తే జాలేసింది. అందకని ఆ డబ్బులు పాప ఆపరేషన్ కి సాయం చేసాను. 

అంతే  ఈ మాట పిల్లలు విని అంటే మనం ఇప్పుడు బయటకు వెళ్లమా నాన్న అని జాలిగా అడిగారు. అప్పుడు రామారావు భార్య పిల్లలకు నచ్చచెపుతూ పాపం ఆ పాపకి ఆరోగ్యం బాగోలేదు కదా! అందుకే  నాన్న వాళ్లకు డబ్బు సాయం చేసారు. మనం మళ్లీ ఎప్పుడైనా బయటకు వెళదాము అని పిల్లలకు నచ్చచెప్పింది. 

దాంతో రామారావు కూడా పిల్లలతో ఇలా అన్నాడు. పిల్లలు ఇవాళ వెళ్లకపోయినా రేపు ఆదివారం మిమ్మల్ని తప్పకుండా బయటకు తీసుకువెళతాను అని ప్రామిస్ చేసాడు. దాంతో పిల్లలు కూడా బెట్టు చేయకుండా ఆడుకోవడానికి వెళ్లారు. ఇలా కొంత కాలం గడిచింది. 

ఒక రోజు రామారావు భార్య వార్తలు చూద్దామని టీవీ పెట్టింది. ఒక వార్త విని రామారావు భార్య ఖంగుతింది. అదేంటంటే కొంతమంది  కుటుంబంలో వాళ్లకి ఆరోగ్యాలు బాగాలేదని, కేన్సర్ అని ఇలా రకరకాలు కారణాలతో అందరి దగ్గర నటిస్తు డబ్బులు తీసుకుంటూ మోసం చేస్తున్నారని అందుకని ప్రజలు అప్రమత్తంగా ఉండండి, మోసపోవద్దు అని వార్త చెప్పారు. ఇది విని రామారావు భార్య చూసారా మీరు జాలితోవాళ్లని నమ్మి డబ్బులు ఇచ్చారు. కాని వాళ్ళు మిమ్మల్ని ఎంత  మోసంచేసారు. అనవసరంగా వాళ్లకి డబ్బులు ఇచ్చి అటు పిల్లలకి ఆనందం లేకుండా చేసారు. ఇపుడు ఏమయింది అని భార్య చిరు కోపంతో అంది. పిల్లలు కూడా నాన్న చూసావా. ఏంజరిగందో అనవసరంగా షికారు లేకుండా అయ్యింది అని అన్నాడు. 

అపుడు రామారావు,  పోనీలే నేను మోసపోయినా ఆ పాపకు కేన్సర్ లేదు. ఆనందంగా ఉంది. అంతే చాలు అన్నాడు.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Tuesday, 19 September 2023

నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో అర్థం, పరమార్థం ఉంది (20-Sep-23, Enlightenment Story)

*నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో అర్థం, పరమార్థం ఉంది*

🍁🍁🍁 🍁🍁🍁 🍁  🍁🍁🍁 🍁🍁🍁 🍁 🍁🍁 🍁🍁🍁 🍁 

కొద్ది గంటల్లో రోదనధ్వనులన్నీ పూర్తిగా సద్దుమణుగుతాయి. కుటుంబసభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో  నిమగ్నమవుతారు. 

మనవలు, మనవరాళ్లు ఆటపాటల్లో మునిగి పోతారు. ఓ యువతీ యువకుల జంట రొమాంటిక్ గా ముసిముసినవ్వులు నవ్వుకుంటూ, పరస్పరం ఫోన్ నెంబర్లు ఎక్స్ఛేంజ్ చేసుకుంటారు. మరికొందరు దగ్గర్లో ఉన్న టీషాపులో బాతాఖానీకి బయల్దేరుతారు. 

అప్పటివరకూ ఆప్యాయత ఒలకబోసిన పక్కింటాయన - శ్రాద్ధకర్మల సందర్భంగా వదిలిన  పిండోదకం, విస్తరాకులు తన ఇంటి ముంగిట పడ్డాయని చిర్రుబుర్రులాడుతాడు. 

ఈ లోగా నీ దగ్గరి బంధువు ఒకాయన - ఆఫీసులో శెలవు దొరకని కారణంగా నీ అంత్యక్రియలకు హాజరవ్వలేక పోయానని నీ భార్యతో మొక్కుబడిగా వాపోతాడు. 

మరునాడు వెళ్ళిపోయినవాళ్ళు  వెళ్ళిపోగా - మిగిలిన వాళ్ళల్లో ఒకాయన మధ్యాహ్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు. మరొకాయన దానికి వంత పాడుతాడు.

నువ్వు జీవితాంతం ఒళ్ళు హూనం చేసుకొని, కడుపు కట్టుకుని  కూడబెట్టిన కోట్లు విలువ జేసే ఆస్తుల్ని పంచుకొనే విషయంలో నీ పుత్రరత్నాలు పేచీ పడతారు. నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అణాపైసలతో లెక్కలేసి వాటాలు తేల్చేసుకుంటారు. అప్పటికింకా నువ్వు పోయి నిండా నాల్రోజులు కూడా కాలేదు సుమా!  మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కక్కళ్ళుగా జారుకొంటారు. విదేశాల నుండి వచ్చిన బంధువులైతే, పదకొండో రోజు తరువాత వెళ్ళబోయే విహారయాత్రకు ఇప్నట్నించే రహస్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. 

నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబరుకు వచ్చే ఫోన్లని నీ కొడుకో, కూతురో విసుగ్గా ఆన్సర్ చేస్తారు. కుదిరితే నీ ఆస్తిపాస్తులు, రావలసిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు. 

అంతలో, తమ ఎమర్జెన్సీ లీవు అయిపోవడంతో కొడుకులు, కూతుళ్ళు నీ భార్యని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు. 

నెల తిరగక ముందే, మీ అర్థాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడి నవ్వుతుంది. అంతకుముందే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు యథాతథంగా సినిమాలు, షికార్లు చుట్టబెట్టేస్తుంటారు. 

మొత్తంగా, నెల లోపే నీ చుట్టూ ఉన్నవారు, నీకు అత్యంత ఆత్మీయులు, నువ్వు లేకుండా బతకలేమన్నవాళ్ళు - అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే - నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నావనే విషయమే మర్చిపోయేంతగా!! ఒక  పండుటాకు ఓ మహావృక్షాన్నుంచి ఎంత సునాయాసంగా, ఎంత వేగంగా రాలిపోతుందో, అంతే వేగంగా 'నీవారు' అనుకున్న అందరి స్మృతిపథం లోంచి నువ్వు కనుమరుగై పోతావు. 

నీ మరణానంతరం కుడా - అవే వర్షాలు, అవే రాజకీయాలు, బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు. పండుగలు ఒకదానివెంట మరోటి వస్తూనే ఉంటాయి. సినిమాతారలకి రెండు, మూడు, నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ పెంపుడు కుక్క మరో యజమానిని వెతుక్కుంటుంది.

అంతలో, నీ సంవత్సరీకాలు రానే వస్తాయి. నీ పెళ్ళి కంటే ఆడంబరంగా జరిగే ఆ తంతును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా! నీ గ్జ్నాపకార్థం అతిథులకి పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయో అన్న విషయంపై కొడుకులు, కోడళ్ళ మధ్య పెద్ద చర్చే జరుగుతుంది. 

ఈ కార్యక్రమంతో నీకు, ఈ లోకానికి పూర్తిగా సంబంధం తెగిపోయినట్లే. నీ గురించి మాట్లాడుకునే వారు గానీ, నిన్ను తలచుకునే వారు గానీ దాదాపుగా ఉండరు.

ఇప్పుడు చెప్పండి !!

ఇన్నాళ్ళూ మీరు పాకులాడింది ఎవరికోసం?  దేనికోసం తెగ హైరానా పడిపోయావు? నువ్వు కట్టించిన భవనంలో నివసించే వారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే, నీ తపనకూ, తాపత్రయానికీ ఏమన్నా అర్థం ఉందా?

జీవితంలో ముప్పాతిక భాగం నీవాళ్ళనుకునే వాళ్ళకోసం, వారి మెప్పు పొందటం కోసం, వారి భవిష్యత్తు కోసం బతికావు కదా! వాళ్ళకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా? 

ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి, నీ కోసం నువ్వు సంతృప్తిగా బతకటంలో   అర్థం, పరమార్థం ఉంది కదూ!!!

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


Monday, 18 September 2023

ఋషి పంచమి - ఋషి పంచమి వ్రతం - కథ (19-Sep-23, Enlightenment Story)

 ఋషిపంచమి - ఋషిపంచమి వ్రతం - కథ

🍁🍁🍁 🍁🍁🍁 🍁  🍁🍁🍁 🍁🍁🍁 🍁 

వ్రతాలన్నింటిలోనూ అత్యుత్తమైనది ఏదో చెప్పమని ధర్మరాజు కోరినప్పుడు , అందుకు సమాధానంగా శ్రీ కృష్ణుడు చెప్పినదే 'ఋషి పంచమి' వ్రతం. స్త్రీ దోషాలకు పరిహారంగా జరుపుకునే ఈ వ్రతాన్ని 'భాద్రపద మాసం' లో 'శుక్ల పక్ష పంచమి' రోజున ఆచరించాలి. ఈ రోజున నదీ తీరానికి వెళ్లి దంతావధానం. పరిమళ ద్రవ్యాలతో మంత్ర పూర్వకంగా స్నానం చేయాలి. ఆ తరువాత ఆ నదీ జలాన్ని తీర్థంగా తీసుకుని , అక్కడ హోమం చేయాలి.

ఇంటికి చేరుకున్న తరువాత వ్రతానికి సంబంధించిన వేదికను పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మట్టితో గాని రాగితో గాని కలశం పెట్టుకుని అందులో నీటిని పంచ రత్నాలను ఉంచాలి. అష్టదళ పద్మం వేశాక సంకల్పం చెప్పుకోవాలి. 

అత్రి,భరద్వాజ,గౌతమ మహర్షి, జమదగ్ని, కశ్యప,వసిష్ఠ,విశ్వామిత్ర



సప్తర్షి: విశ్వామిత్ర (ఎడమ ఎగువ), జమదగ్ని (ఎగువ మధ్య), గౌతమ (కుడి పైన),వసిష్ఠ (మధ్యల,గడ్డం లేని),కశ్యప (ఎడమవైపు),భరద్వాజ(క్రింద మధ్య,యోగఆసనంలో, తలక్రిందులుగా), అత్రి (కుడివైపు). పహారి , బాండ్రాల్టా 

గణపతిని పూజించి గంగా యమున కృష్ణ తుంగభద్ర తదితర నదుల నామాలను  మహర్షుల నామాలను స్మరించుకోవాలి. సప్తరుషులను అరుంధతిని పూజించాలి. ఆ తరువాత కథ చెప్పుకుని వాయనదానాలు ఇవ్వాలి. ఇలా 7 సంవత్సరాల పాటు క్రమం తప్పక ఈ వ్రతాన్ని చేసుకుని ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవాలి. 

 ఇక ఈ వ్రతం జరుపుకోవడానికి కారణంగా చెప్పబడుతోన్న కథ గురించి తెలుసుకుందాం

పూర్వం విదర్భ దేశంలో సుమిత్రుడు - జయశ్రీ అనే దంపతులు నివసించేవారు. వేదశాస్త్ర పండితుడైన సుమిత్రుడు భార్యా విధేయుడు. అందువలన ఆమె రుతు దోషాలను పట్టించుకోకుండా నడచుకుంటున్నా చూస్తూ ఊరుకునే వాడు. 'సుమతి' అనే కుమారుడు జన్మించిన కొంత కాలానికి వాళ్లు కాలం చేశారు.

సుమతికి చంద్రావతితో వివాహం జరిగింది. నియమ నిష్టలను పాటిస్తూ వాళ్లు అన్యోన్యంగా కాలం గడపసాగారు. అలాంటి పరిస్థితుల్లో రుతుదోషానికి పాల్పడిన కారణంగా కుక్కగా జయశ్రీ , ఆ విషయంలో అడ్డు చెప్పనందుకు ఆమె భర్త సుమిత్రుడు ఎద్దుగా జన్మించారు. కొడుకు పట్ల తీరని ప్రేమానురాగాల కారణంగా వాళ్లు సుమతి ఇంటికి చేరుకున్నారు.

 ఒక రోజున సుమతి తన ఇంట్లో పితృ కార్యాన్ని నిర్వహిస్తూ వుండగా , ఒక పాము వచ్చి పాయసం తాగేసి అదే పాత్రలో విషంకక్కి వెళ్లిపోయింది. కుక్క రూపంలో ఉన్న జయశ్రీ ఈ దృశ్యం చూసి , మిగిలిన పాయసాన్ని బ్రాహ్మణులకు వడ్డిస్తే ప్రమాదమని భావించి , చంద్రావతి చూస్తుండగా వాటిని తాకింది. 

 ఆవేశంతో ఆమె కర్రతో ఆ కుక్కను కొట్టి మళ్లీ పాయసాన్ని సిద్ధం చేసింది. ఇక సుమతి ఒకవైపున పితృ కార్యాన్ని శ్రద్ధగా నిర్వహిస్తూనే , మరో వైపున బాగా పొద్దుపోయేదాకా ఎద్దుతో పొలం పనులు చేయించాడు.

 ఆ రాత్రి ఎద్దు. కుక్క రెండూ కూడా తమకి ఎదురైన అనుభవాన్ని గురించి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నాయి. నియమ నిష్టల కారణంగా తనకి సంక్రమించిన కొద్దిపాటి శక్తితో , ఆ ఎద్దు  కుక్కల ఆవేదనను సుమతి అర్ధం చేసుకున్నాడు. 

 తపోబల సంపన్నులను కలుసుకుని విషయాన్ని వివరించాడు. పూర్వ జన్మ పాప ఫలితంగానే తల్లిదండ్రులు అలా జన్మించి అవస్తలు పడుతున్నారనీ , పాప విముక్తి కోసం 'ఋషి పంచమి' వ్రతం చేయాలని తెలుసుకున్నాడు.

 సుమతి ఈ వ్రతం ఆచరించగానే కుక్క - ఎద్దు రూపాలలో ఉన్న ఆయన తల్లి దండ్రులు తమ దేహాలను వదలి పుణ్య లోకాలకు తరలి పోయారు. ఆనాటి నుంచి ఈ వ్రతాన్ని ఎందరో ఆచరించి తగిన ఫలితాలను పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Friday, 15 September 2023

అందరినీ మెప్పించడం సాధ్యం కాదు !! (17-Sep-23, Enlightenment Story)

 అందరినీ మెప్పించడం సాధ్యం కాదు !!

  🍁🍁🍁 🍁🍁🍁 🍁  🍁🍁🍁 🍁🍁🍁 🍁 

 రాము 40 ఏళ్ల వ్యక్తి బట్టల వ్యాపారి. అతను సమీపంలోని పట్టణాలు మరియు గ్రామాలలో వివిధ రకాల బట్టలు అమ్మేవాడు. అతను తన గాడిద పైన బట్టల సంచులను మోస్తూ ఉండేవాడు.


👉 అతను తన 15 ఏళ్ల కొడుకును తనతో పాటు సమీపంలోని పట్టణానికి తీసుకెళ్లాడు. గాడిద రెండు సంచులు మోస్తుంది మరియు బట్టలన్నీ అమ్ముడయ్యాయి. 

👉తండ్రీ కొడుకులిద్దరూ సంతోషించారు. భారీ వ్యాపారం మరియు ఏకమొత్తంలో లాభం పొందిన తరువాత, రాము తన కొడుకు మరియు తన గాడిదతో సంతోషంగా ఇంటికి తిరిగి వస్తున్నాడు.

👉 వారు చాలా అలసిపోయారు మరియు వారి స్థలానికి చేరుకోవడం చాలా కష్టంగా ఉంది. ముగ్గురూ మెల్లగా నడిచి ఇంటికి తిరిగి వచ్చారు.

👉 అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు, తండ్రి, కొడుకులు బాగా అలసిపోయి ఉండడం చూశారు. వారు తమలో తాము మాట్లాడుకున్నారు, చూడండి, వారు చాలా అలసిపోయారు. 

👉 వాళ్ల దగ్గర ఒక గాడిద ఉంది, వాళ్లలో ఒక్కరు కూడా ఆ గాడిద మీద ఎందుకు కూర్చోలేదు? మూర్ఖులారా, వారు నడవడం కష్టంగా ఉన్నప్పటికీ గాడిదను ఉపయోగించలేదు.

👉ఇద్దరు వ్యక్తులు తమ గురించి మాట్లాడుకోవడం తండ్రి మరియు కొడుకు విన్నారు మరియు కొడుకు తన తండ్రిని గాడిదపై కూర్చోమని అడిగాడు.

👉 అందుకు అంగీకరించి గాడిదపై కూర్చున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత, ఒక వృద్ధుడు గాడిద పైన రాముని చూసి, ఏయ్ మీ అబ్బాయిని చూడు. వాడు బాగా అలసిపోయాడు నీవు ఎందుకు గాడిద మీద కూర్చున్నావు. నీ కొడుకుని గాడిదపై కూర్చోనివ్వండి మరియు మీరు నడవండి అని చెప్పాడు.

👉 రాము తన కొడుకును గాడిదపై కూర్చోబెట్టాడు మరియు వారు కాసేపు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. మరొక అపరిచితుడు రాము కొడుకును అరిచాడు, హే మీరు చాలా చిన్నవారు, మీరు నడవలేదా? మీ తండ్రిని మీ వెనుక నడిచేలా చేశారా? ఇప్పుడే దిగు.

👉రాము మరియు అతని కొడుకు ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఇద్దరూ గాడిదపై కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. గాడిద తన వీపుపై అధిక బరువును మోస్తూ నడవలేకపోయింది.

👉 మరో వ్యక్తి దూరంగా వారిని చూసి పరుగెత్తాడు. అతను రాము మరియు అతని కొడుకుపై అరిచాడు, గాడిద మీ ఇద్దరినీ ఎలా మోసుకుపోతుంది? మీరు నడవలేరా? ఈ జంతువును ఎందుకు బాధపెడుతున్నారు? అని అరిచాడు. 

👉 రాము మరియు బాలుడు నిశ్చేష్టులయ్యారు మరియు కాసేపు మౌనంగా ఉండిపోయారు.

👉 అందరినీ మెప్పించడం సాధ్యం కాదు. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. అందరినీ మెప్పించడం లేదా అనుసరించడం చాలా కష్టం. కొన్నిసార్లు, మనం మన మనస్సు చెప్పేదానిని అనుసరించాలి.

అందరినీ మెప్పించడం అసాద్యం!! ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం.అందరి అభిప్రాయాలు విని, చివరకు తన మనసు చెప్పిన విధంగా నడచుకోవడం సర్వధా శ్రేయస్కరం!!

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂



Wednesday, 13 September 2023

రెండు గొప్ప శత్రువులు (16-Sep-23, Enlightenment Story)

 రెండు గొప్ప శత్రువులు 

  🍁🍁🍁 🍁🍁🍁 🍁           

మనిషికి ఇద్దరు శత్రువులు వున్నారు. ఒకటి ' అహంకారం' మరి యొకటి 'మమకారం'. 

అహంకారం ' నేను, నేను ' అంటే మమకారం ' నాది, నాది' అంటూ ఉంటుంది.

ఎప్పుడైనా ఏదైనా ఒక వస్తువును స్వీకరించినప్పుడు 'ఇది నాది' అని మమకారం వల్ల వస్తుంది. అదేవిదంగా ఏదైనా పని చేసినప్పుడు 'ఇది నేను చేసినాను' అనే భావన అహంకారం వలన కలుగుతుంది.

దీనికి చక్కని తార్కాణం ఈసంఘటన… జగద్గురువుల వారు ఒకసారి ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తున్నప్పుడు వారు ఒక క్షేత్రాన్ని సందర్శించినారు. ఆ ప్రదేశం ఎంతో పుణ్య క్షేత్రం అయినప్పటికీ చాలా మంది యాత్రికులను అది ఆకర్షించుటలేదు. ఎందుకంటే ప్రయాణ సౌకర్యాలు సరిగ్గా లేవు అక్కడ. ఒక అధికారి దీనిని సరిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టి ఎన్నో ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత యాత్రికులు పెద్ద సంఖ్యలో ఆ క్షేత్రాన్ని సందర్శించడం ప్రారంభించినారు. 

జగద్గురువుల వారు అచ్చటికి వెళ్ళినప్పుడు ఆ అధికారి అక్కడి విషయాలు చూపిస్తూ ఇది అంతా తన కృషివలననే అని ప్రగల్భాలు పలికినాడు. 

అదివింటూ జగద్గురువుల వారు మౌనంగా ఉండిపోయారు. ఆలయ ప్రధాన ద్వారం వద్దకు వచ్చినప్పుడు జగద్గురువులు ఆగిపోయినారు. 

గోపురాన్ని చూసి ఆ వ్యక్తిని అడిగినారు. 

జగద్గురువులు  - మీరు ఈ గోపురాన్ని చూస్తున్నారా"..?

అధికారి :  ‘’అవును చూస్తున్నాను.”

 జగద్గురువులు: “దీని ఎత్తు ఎంత..?”

 అధికారి    : “చాలా ఎక్కువ.”

 జగద్గురువులు: దానితో పోలిస్తే మనం ఎక్కడ వున్నాము..?”

 అధికారి: “చాలా తక్కువ స్థాయిలో.”

జగద్గురువులు : ఇలాంటి గోపురాలు ఎందుకు నిర్మించారో మీకు తెలుసా?  ఇది మన అహంకారాన్ని వదిలించుకోవటానికి. మనం ఎంతటి అజ్ఞానమైన హీన స్థితిలో వున్నామో తెలియపరచేలా చేస్తుంది. 

ఈ అద్భుతమైన విశ్వ సృష్టికర్త అయిన విశ్వనాధుని గురుంచి ఆలోచించినప్పుడు వారి అద్భుతమైన పనులతో పోలిస్తే వారి ముందు మనం సాధించినది ఏమంత ముఖ్యమైనది కాదని తెలుసు కుంటాము. 

అందువల్ల "నేను దీన్ని చేసాను!" వంటి ఆలోచనలు కలిగివుండటం చాలా అర్ధ రహితం.”✍️

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

నిన్ను నువ్వు మలచుకో! (18-Sep-23, Enlightenment Story)

 నిన్ను నువ్వు మలచుకో!      

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁 

శాంతం, సహనం, ప్రేమ, అనురాగం, ఆనందం, సహకారం, ఉపకారం’  అనే తత్వాలు కలిగినవారిని ఉత్తములుగా పరిగణిస్తారు.  వీటికి వ్యతిరేక గుణాలు కలుపు మొక్కల్లా మనిషి మదిలో మొలకెత్తుతూ ఉంటాయి. 

వెలుగు వెనకాలే చీకటి, సుఖం వెనక దుఃఖం, శాంతికి అశాంతి, ప్రేమకు ద్వేషం, అనురాగానికి అహంకారం, ఆనందానికి విషాదం. ఇలా ఎన్నో వ్యతిరేక లక్షణాలు మదిని చొరబడి చోటు చేసుకొంటాయి. మెల్లిగా పెత్తనం చలాయిస్తాయి. 


వివేకం, విచక్షణాజ్ఞానం కలిగిన వ్యక్తి తనలో పుట్టిన ఈ వ్యతిరేక లక్షణాలను ఎప్పటికప్పుడు పంట పొలంలోని కలుపు మొక్కల్లా ఏరి పడేస్తాడు. తెలివిగా ముందుకెళ్తాడు. బలహీనుడు దాసోహం అంటూ ఆ వికారాలకు లొంగిపోతాడు.

మనిషి మనసు కురుక్షేత్రం లాంటిది. అందులో దైవగుణ సంపద కలిగినవారు పాండవులు, అసురగుణం కలిగినవారు కౌరవులు.     

క్షీరసాగర మథనం సమయంలో విషం, అమృతం రెండూ పుట్టినట్లు- మానవ మానస సాగరంలో ఈ రెండు గుణాలూ మిళితమై ఉంటాయి. అలజడులు లేపడమే చెడుగుణ స్వభావం. మనం మంచికి చోటివ్వాలి. చెడును తరిమికొట్టాలి.

అరిషడ్వర్గాలు మన అంతఃశ్శత్రువులు. 

వాటిలో మొదటిది కామం. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉండటమన్నది సహజం. అనుకొన్నది తీరింది లెమ్మనుకొని హాయిగా ఊపిరి పీల్చుకొంటూండగానే దాని వెనకాలే మరో కోరిక పుట్టుకొస్తూనే ఉంటుంది. అది తీర్చుకొనేందుకు చేయరాని పనులు చేయాల్సివస్తుంది. కోర్కెల కోరల్లో చిక్కుకొన్నవారికి మనశ్శాంతి ఉండదు.

రెండోది క్రోధం. దీన్ని క్రోధాగ్నిగా ఉదాహరించారు. నిప్పు లక్షణాలన్నీ దీనికున్నాయి. ఇది తాను ఆవహించిన యజమానిని కాల్చి బూడిద చేస్తుంది. అటుపై ఎదుటివారిని తాకుతుంది. వెంటనే వాళ్ల నెత్తురును వేడెక్కించేస్తుంది. దీని మొదటి లక్షణమే అది. ఆ ప్రభావం గుండెమీద, మెదడుమీద చూపుతుంది. క్రోధంతో మనిషి వివేకం కోల్పోతాడు.

పీనాసితనమే లోభం. లోభి తాను తినడు. ఇతరులకు ఇవ్వడు. 

పరమాత్ముడు జీవులను భ్రమింపజేయడానికి పుట్టించిన మనోదశ మోహం. లేనిది ఉన్నట్లు, కానిది అవునన్నట్లు తోచేలా చేస్తుంది. బుద్ధిహీనతకు కారణం అవుతుంది.

మదం ఆవహించిన వ్యక్తి అంతటా- అన్నింటా తానే గొప్ప అంటాడు. తనంతటివాడు మరెవ్వడూ లేడని గొప్పలు చెప్పుకొంటాడు. మదం ఆవహించిన వ్యక్తి గుడ్డివాడితో సమానం అంటుంది నీతిశాస్త్రం.

మాత్సర్యానికి మరోపేరు అసూయ. సహించలేకపోవడం, ఓర్వలేకపోవడం వంటి లక్షణాలు దీనికున్నాయి. నరంమీద లేచిన నారికురుపులాగ ఇది మనిషిని ఓ చోట నిలకడగా నిలబడనివ్వదు. లోలోపలే సలుపుతూ ఉంటుంది.

ఈ అరిషడ్వర్గ మూకను వాటి మానాన అలా వదిలేసే బదులు మనకు అనుకూలమైన హితషడ్వర్గంగా మలచుకోవచ్చు.

దేన్నయినా కోరుకోవడం మానవ లక్షణం. చెడును కోరుకోకుండా ‘సద్గతి’ని ఇచ్చే మోక్షాన్ని కోరుకోవడం మంచిది. దానికి కావాల్సిన చిత్తశుద్ధిని కోరుకోవడం ఉత్తమం. మంచి జరిగేది ఏది కోరినా ఫలితం మధురంగానే ఉంటుంది. చెడు అన్న ప్రతి విషయంపై కోపగించుకోవడం తప్పుకాదు. మంచికి ఊతమిచ్చే కోపం మనిషికి ఉత్తమ స్థితిని కలగచేస్తుంది. 

సద్గుణ సంపదల్ని అధికంగా కూడబెట్టుకోవడంలో లోభిగా ఉన్నా ఫర్వాలేదు. ఆత్మచింతన కావాల్సినంత పెంచుకోవడంలో తప్పేలేదు. 

భగవత్‌ చింతనపై మోహం పెంచుకోవాలి. సద్గ్రంథ పఠనంపై మోహం చూపవచ్చు. ఆత్మజ్ఞానం, జీవన్ముక్తిపై మోహం ఉత్తమం.

ఆత్మజ్ఞానం కలిగి అహంబ్రహ్మాస్మి అన్న దర్పం కలిగి ఉండటం తప్పుకాదు.

లౌకిక సుఖ దుఃఖాలపై మాత్సర్యం మంచిదే. అరిషడ్వర్గాలకు బుద్ధి చెప్పేలా ఆ ఆరింటినీ హితషడ్వర్గంగా మలచుకొంటే- జీవితం. ఆనందో బ్రహ్మ!

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

Tuesday, 12 September 2023

రెండు డైరీలు (15-Sep-23, Enlightenment Story)

 అనుభూతి - జీవిత భాగస్వామిని కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞుడను 

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 

మనలో మార్పును సృష్టించేది ప్రేమ;  మార్పు అనేది మంచి కోసం జరగాలి. మన చుట్టూ ఉన్న వ్యక్తుల కోసం మనం మారడానికి సిద్ధంగా ఉన్నామా?

తమ వివాహ వార్షికోత్సవ  సందర్భాన, భార్యాభర్తలు ఇద్దరూ  కలిసి  కూర్చుని  టీ  తాగుతూ  కబుర్లు చెప్పుకుంటున్నారు.  ప్రపంచానికి, వారొక ఆదర్శమైన జంట.  నిజానికి  వారిద్దరి మధ్య చాలా ప్రేమ ఉండేది, కానీ కాలక్రమేణా వారిద్దరి మధ్య సమస్యలు మొదలయ్యాయి.

వారి సంభాషణలో, భార్య ఒక ప్రతిపాదన చేసింది, “నేను మీతో చాలా చెప్పాలి, కానీ మనకు ఒకరి కోసమొకరికి సమయం దొరకడం లేదు. అందుకే నేను రెండు డైరీలు కొన్నాను. 

ఈ సంవత్సరం  మొత్తం మన మనసులో ఒకరి మీద ఒకరికి  ఉన్న వాటిని వీటిలో రాద్దాం. 

వచ్చే ఏడాది పెళ్లి రోజున, మన లోపాలను తెలుసుకోవడం కోసం ఒకరి డైరీని మరొకరు చదువుదాం, వాటిని  సరిదిద్దుకోడానికి  కలిసి  ప్రయత్నిద్దాం,”  ఆలోచన నచ్చి భర్త వెంటనే దానికి అంగీకరించాడు. 

 ఇద్దరూ తమ తమ డైరీలు  తీసుకున్నారు.

 ఒక  సంవత్సరం వేగంగా  గడిచిపోయింది.  మరుసటి  సంవత్సరం  వివాహవార్షికోత్సవం  సందర్భంగా, భార్యాభర్తలిద్దరూ  ముందుగా నిర్ణయించుకున్న విధంగా  తమ  డైరీలను  మార్చుకున్నారు.

మొదట,  భార్య  తనను  ఉద్దేశించి  వ్రాసిన  డైరీని భర్త  చదవడం  ప్రారంభించాడు.మొదటి పేజీలో, "ఈ రోజు మన వివాహ వార్షికోత్సవం.  మీరు  నాకు  మంచి బహుమతి ఇవ్వలేదు" అని,

రెండవ పేజీలో - "మీరు నన్ను భోజనానికి రెస్టారెంట్కి తీసుకెళ్లలేదు."

మూడవ పేజీలో - "నన్ను సినిమాకి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు, కానీ అలసిపోయానని చెప్పి చివరి క్షణంలో రద్దు చేసారు."

 " నా తరఫు బంధువులు వచ్చారు  కానీ మీరు వారితో సరిగ్గా మాట్లాడలేదు."

"చాలా ఏళ్ళ తర్వాత ఈరోజు మీరు నా కొక డ్రెస్ కొన్నారు, కానీ అది చాలా పాత ఫ్యాషన్ ది !"

 ఇలా భర్త మీద ఎన్నో పనికిమాలిన ఫిర్యాదులు  ఆమె తన డైరీలో రాసుకుంది. అది చదవడం పూర్తికాగానే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.

 భర్త, “ఓ  ప్రియా, నన్ను క్షమించు!  ఇప్పటి వరకు నా తప్పుల గురించి నాకు తెలియదు.  భవిష్యత్తులో వాటిని పునరావృతం కాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తాను.” అని చెప్పాడు.

 ఇప్పుడు తన కోసం భర్త రాసిన డైరీని చదివడం భార్య వంతు.

 మొదటి పేజీ - ఖాళీ

 రెండవ పేజీ - ఖాళీ

 మూడవ పేజీ - ఖాళీ

 ఖాళీ

భార్య 50-60 పేజీలు తిరిగేసింది, కానీ అన్నీ ఖాళీగానే ఉన్నాయి!  భార్య కలత చెంది, “నా ఈ చిన్న కోరిక కూడా మీరు తీర్చలేరని నాకు తెలుసు.  నా మనసులో ఉన్నదంతా వ్రాయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఈ సంవత్సర కాలంలో నేను పడిన బాధ అంతా మీకు తెలియాలని నేను కోరుకున్నాను, కానీ మీరు నా కోసం ఇంత కూడా చేయలేకపోయారు!" అని వాపోయింది.

భర్త చిరునవ్వు నవ్వి, “చివరి పేజీలో అంతా రాశాను ప్రియా” అన్నాడు. భార్య ఆత్రంగా చివరి పేజీ తెరిచింది. 

అందులో ఇలా ఉంది - “ ఎదురుగా ఉండి ఎంత  కసురుకున్నా, ఇన్నాళ్లూ నువ్వు నాకు, నా కుటుంబానికి అందించిన అపరిమితమైన ప్రేమ ముందు, ఈ డైరీలో వ్రాయడానికి నీలోని ఏ లోపాన్ని నేను గుర్తించలేకపోయాను.  

అలాగని నీలో ఏమి లేవని కాదు, నీప్రేమ, అంకితభావం, మా కోసం నీ త్యాగం ఆ బలహీనమైన లోపాలన్నింటినీ అధిగమించేలా చేశాయి.  

నాలో లెక్కలేనన్ని క్షమించరాని  తప్పులు  ఉన్నప్పటికీ, నా  జీవితంలోని  ప్రతి దశలో నాకు నీడలా  ఉన్నావు.  నా నీడలో లోపాన్ని ఎలా కనుగొనగలను?!" అని వ్రాసాడు.

అది చదివిన భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి.  ఆమె తన భర్త చేతిలో నుండి తన డైరీని తీసుకొని, రెండు డైరీల తో పాటు తన విభేదాలు , ఫిర్యాదులను మంటల్లో కాల్చివేసింది..  

మళ్లీ వారి జీవితాలు కొత్తగా పెళ్లయిన జంటలా ప్రేమతో వికసించాయి!

వివాహం మనందరికీ ఎదగడానికి, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి , ప్రేమించడం నేర్చుకోడానికి అవకాశం ఇస్తుంది.  మనం ప్రయాణానికి కట్టుబడి ఉంటే, మరింత ఎక్కువగా ఇవ్వడం గురించి వివాహం మనకు నేర్పుతుంది. 💌 

🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!  ఓం నమో భగవతే వాసుదేవాయ 

🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂


అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...