*హృదయ సాక్షి*
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
ఆచార్య సద్బోధన:
"సత్యంవద, ధర్మంచర" అని శృతి బోధించింది.
సత్యము చెప్పు, ధర్మంగా ఉండు. ఏమిటీ ధర్మ మార్గము?
మన హృదయ సాక్షిగా ప్రవర్తించడమే నిజమైన ధర్మము.హృదయం (Conscience ) లో ఆవిర్భవించిన భావాలు వాక్కులో ఉచ్ఛరించాలి, వాక్కులో ఉచ్ఛరించినది హస్తము తో ఆచరించాలి, ఇదియే నిజమైన ధర్మము.
సత్యము, ధర్మము, ప్రేమ, ఇవన్నీ హృదయానికి సంబంధించిన గుణములు.
క్రోధము, ద్వేషము, అసూయ, ఇవన్నీ మనస్సునకు సంబంధించిన గుణములు.
కనుక మనస్సును అనుసరింపకుండ హృదయాన్ని అనుసరించడమే నిజమైన సాధన.
అంతే కాని, జపమాల త్రిప్పు కోవడం సాధన కాదు.ఇట్టి సాధనలు తాత్కాలిక మైన తృప్తినే ఇస్తాయి. కాని, శాశ్వత మైన ఆనందాన్ని అనుభవించాలంటే హృదయాన్ని అనుసరించాలి!
హృదయ మనగా, అశాశ్వతమైన గుండె కాదు, ఇది దివ్యమైన చైతన్యమే! ఇది దేహానికి మాత్రమే పరిమితము కాదు. లోపల వెలుపల సర్వత్రా ఎప్పుడు ఉంటుంది,
దీనినే శృతి…
"అంతర్బహిశ్చ తత్సర్వవ్యాప్య నారాయణ స్థితః" అన్నది.✍️
!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!
!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!
!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!!
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment