తొమ్మిది ఋణాలు
🌷🙏🌷🌷🙏🌷🌷
మానవులు ఎల్లప్పుడూ పితృఋణం, మాతృఋణం, పుత్రికాఋణం, స్త్రీఋణం, సోదరఋణం, దైవఋణం, ఋషిరుణం, దానఋణం, గురుఋణం ఈ తొమ్మిది ఋణాలను తెలిసి కానీ తెలియక కానీ తీర్చకపోతే ఎల్లప్పుడూ ఋణబాధలు వేధిస్తూ ఉంటాయి. ఉన్నత స్థితి కలుగదు.
1. తల్లి ఋణం :- తల్లితో విభేదాలుంటాయి. వీరు తల్లిని బాధించకూడదు. పేదవారికి పాలు, బియ్యం, దానం చేయుట వల్ల మేలు జరుగుతుంది.
2. పితృఋణం :- తల్లితండ్రులు గతించినచో వారికి చేయవలసిన కర్మలను సకాలంలో ఆచరించక పోవటం వల్ల విద్య, ఉద్యోగం. వ్యాపార అభివృద్ధి ఉండదు.
3. పుత్రికాఋణం :- పుత్రికను బాధించటం, కూతురు ఆస్తిని అనుభవించటం వల్ల అవమానాలు, ధననష్టం, ఒంటరి జీవితం కలుగుతాయి.
4. స్త్రీ ఋణాలు :- పరస్త్రీలను వ్యామోహించి బాధించటం, సంగమించటం, వారిని వదిలివెయ్యటం, తరచు గుర్తుచేసి దుర్మార్గంగా బాధించటం, భార్యను బాధించటం, కొట్టడం, ఆమెను పస్తులుంచటం, ఆమెను బయటకు గెంటివేయుట, నిందలు ప్రచారం చేయుట, పరస్త్రీలను బల్కారించటం, కామవాంఛలకు గురిచేయటం, మధ్య వయసునుండి అకాల మరణ భయం, దారిద్ర్యం కలుగుతాయి. గర్భవతులను కూడా బాధించరాదు.
5. సోదర ఋణం :- తన రక్త సంబంధీకుల ధనం వాడుకోవటం వారిని బాధించటం, వారి ఆస్తులను సక్రమంగా పంచక తాననుభవించుట మోసం చేయుట వీటివల్ల కొంత కాలానికి తన పిల్లలు దరిద్రం అనుభవిస్తారు. మనఃశ్శాంతి ఉండదు. జీవిత చరమాంకంలో దీనస్థితి కలుగుతుంది. వంశక్షయం కలుగుతుంది.
6. దైవ ఋణం :- దైవాన్ని నిందించుట, జంతుహింస చేయుట, దేవాలయ ఆస్తులను అనుభవించుట వీటివల్ల సంతాననష్టం ఉంటుంది. అంగవైకల్యం కలిగిన సంతానం కలుగుతారు. శారీరక బలహీనత కలుగుతుంది.
7. ఋషి ఋణం :- తమ వంశఋషిని సేవించ లేకపోవటం, సాధు సన్యాసుల పట్ల తెలిసో తెలియక అమర్యాదగా ప్రవర్తించుట, ఋషిప్రోక్తమైన మంత్రాలను అవహేళన చేయుట వల్ల కలుగుతుంది. దీనివల్ల మూర్ఖత్వం, ఆవేశం, సౌఖ్యలేమి కలుగుతుంది.
8. దాన ఋణం :- ఒకరికి దానం చేస్తానని చేయక పోవుట, దానం చేసి ప్రతిఫలం కోరుట, చేసిన దానిని తిరిగి తీసుకొనుట వల్ల ఈ ఋణం ఏర్పడుతుంది. ఇటువంటి వారు తరచు వివాదాలకు గురవుతూ ఉంటారు. వ్యసన పీడ కలుగుతూ అపకీర్తి కలుగుతుంది.
9. గురు ఋణం :- గురువులను దూషించుట, అంతకు సమానమైన వారిని నిందించుట. దీనివల్ల మిత్రభేదం, ఉపాధి కోల్పోవుట, ఋణ బాధలు కలుగుతాయి.
ప్రతినిత్యము తల్లితండ్రుల సేవ చేయుట వల్ల సమస్త గ్రహబాధలు తొలగిపోతాయి.🙏
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment