భోజనం చేసేటపుడు మీ ఇష్టాయిష్టములను చూడరాదు
🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹
ఎంత గొప్ప అతిధి వచ్చినా ఆ అతిధి కోసం పంక్తిలో కూర్చున్న వ్యక్తిని లేపి మరొకచోట కూర్చోమని అనరాదు. రాహువు రాక్షుసుడైనా మోహిని రూపంలోని శ్రీ మహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తి నుంచి లేవమని అనలేదు.
అలా లేచి మరొకచోట కూర్చోమనడం పరమ దోషం. ఏ భేదము చెప్పి కూడా పంక్తిలో కూర్చున్న వాళ్ళని ఎంత బలవత్తరమైన కారణము మీదనైనా లేచి మరొకచోట కూర్చోమని అనకూడదు. పంక్తియందు ఒకసారి కూర్చుంటే వారికి వడ్డించనని కానీ, పెట్టనని కానీ మీరు అనడానికి వీలులేదు.
పంక్తిలో కూర్చున్న వానిని మీరు ఈశ్వర స్వరూపంగా భావించాలి. భేదమును చూపడం శాస్త్రమునందు మహా దోషము. అక్కడ దేవతల వరుసలో కూర్చున్నవాడు రాహువే అని శ్రీమన్నారాయనునికి తెలుసు. ఐనా అతనికి అమృతమును పోశాడు. ఇపుడు రాహువు అమృతమును త్రాగాడు.
అతడు త్రాగిన అమృతము క్రిందకి దిగిందంటే రాక్షస శరీరము అమృతత్వమును పొందేస్తుంది. అతనిది రాక్షస ప్రవృత్తి. మంచి ప్రవృత్తి కాదు. వెంటనే సుదర్శన చక్రము ప్రయోగించి.
*పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. *
అమృతంతో కూడినందువలన తల నిర్జీవం కాలేదు. మొండెం మాత్రం కింద పడిపోయింది. పంక్తియందు కూర్చున్నవాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం.
*అమృతత్వాన్ని పొందాడు. శిరస్సు అమృతం తాగిందని బ్రహ్మగారు నవగ్రహాలలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. *
ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య, చంద్రులను ఇప్పటికీ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు.✍️
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
సర్వేజనాసుఖినోభవంతు🙏
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment