Monday, 1 May 2023

బామ్మ- తాతల బంధం (09-May-23, Enlightenment Story)

 బామ్మ- తాతల బంధం

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️   

కాఫీ మూత తీయమనడంలో ఎంత చక్కని విషయం చెప్పింది ఈ బామ్మ చూడండి…

చుట్టూ అన్నీ పళ్ళ చెట్లు, పూలచెట్లు మధ్యలో అందమైన ఇల్లు. అందులో ఇద్దరే బామ్మ తాతయ్య ఉన్నారు. రోజూ సంధ్యవేళ ఆరు బయట ఆ తోటలో కాఫీ తాగుతూ కాసేపు గడుపుతారు.

పక్కింటిలోకి ఓ పెళ్ళైన కొత్త జంట దిగారు. వారు ఇరువురు ఉద్యోగం చేస్తారు.  వారం చివరిలో ఈ బామ్మ తాతయ్యతో కాసేపు గడిపేవాళ్లు. వీరికి వారం అంతా పడ్డ శ్రమ ఆ ఒక్క సాయంత్రం అక్కడ గడిపేస్తే చాలా ప్రశాంతంగా ఉంటారు. బాగా అలవాటైంది - బామ్మ చేతి కాఫీ కూడా అందుకు ఒక కారణం!

బామ్మ కాఫీ డబ్బా తీసుకొచ్చి కాస్త మూత తీసిపెట్టబ్బా అని తాతయ్యను అడగడం, ఆయన తన మీసం మెలేసి మూతను తీసివ్వడం బామ్మ నవ్వుతూ వెళ్ళి నలుగురికీ కాఫీ కలుపుకు వచ్చి ఇవ్వడం జరిగింది.

ఇలా రెండు వారాలు చూసిన జంట బామ్మకు కాఫీ మూత సులభంగా తీయగల సాధనాన్ని తెచ్చి ఇచ్చారు. అయినా కూడా బామ్మ అదే తంతు తాతయ్య దగ్గరకు తేవడం మూత తీసివ్వమనడం, ఇది చూసిన ఆ అమ్మాయి బామ్మతో పాటు వెళ్ళి  ‘బామ్మా నేను ఇచ్చిన సాధనం వాడలేదా?’ అని అడిగింది.

అందుకు బామ్మ చెప్పిన విషయం నిజంగా అర్థం చేసుకుని నడుచుకుంటే జీవితం ఇంత ఆనందంగా గడపవచ్చా అని అనిపిస్తుంది.

’మూత తీయడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా! నేను తీయగలను కానీ నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళలో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది.

నా భార్యకు అన్నీ నేనే! నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది. వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది.

ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది.అందుకే ప్రతిరోజు ఇలా చేస్తాను అని చెప్పింది బామ్మ .

నిజమే కదండీ మనిషి నావల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంతవరకు సంతోషంగా ఉంచొచ్చుకదా!

వయసు మీదపడ్డవారు ఏదైనా చేస్తాను అన్నప్పుడు అడ్డుపడకండి     మీ వల్ల కాదు అని నిరాశను వారికి ఇవ్వకండి!✍️

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...