గోముఖం.. గంగానది జన్మస్థానం..🙏🕉💦🌊
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️
*దయచేసి గోముక గంగా నది వీడియో చూడండి*
https://youtube.com/shorts/HuNHWNld_Ag
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️
మన దేశంలో ఉన్న నదులన్నింటిలో గంగానది పరమ పవిత్రమైన నది. ఈ నది స్వచ్ఛతకు నిదర్శనం. మనం చేసిన పాపాలను ఈ నది ప్రక్షాళనం చేస్తుంది. భగీరథుడి తీవ్ర తపశ్శక్తి ద్వారా గంగ ఉద్బవించింది. అయితే శివజటాజూటల్లో నుండి విముక్తి పొందిన గంగా మొట్టమొదటిసారిగా భూమిపైనా పొంగి పొరలి ప్రవహించిన ప్రదేశం ఇదేనని పురాణాలూ చెబుతున్నాయి. మరి గంగానది జన్మస్థలం ఎక్కడ? ఈ పవిత్రస్థలంలో దాగి ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాంచల్ రాష్ట్రం, హిమగిరి కొండల్లో, సముద్రమట్టానికి సుమారు 4000 మీటర్ల ఎత్తులో 24 కి.మీ. పొడవు, నాలుగు కిలోమీటర్ల వెడల్పుతో బల్లపరుపు ఆకారంలో ఉన్న కొండని గంగోత్రి గ్లేసియర్ అని పిలుస్తారు. ఈ మంచుకొండ మీద ఉన్న ప్రదేశాన్ని గోముఖి అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం, గోముఖం గంగానదికి జన్మస్థలం అని తెలియుచున్నది. ఇక్కడే శివలింగ పర్వతం, మేరుగిరి వంటి శిఖరాలు ఉన్నవి. ఇక్కడి నుండి చుస్తే, కేదార్నాథ్ పర్వతాలు, శివలింగ పర్వతం చాలా స్పష్టంగా కనిపిస్తాయి.
గోముఖం నుండి గంగోత్రి వరకు ప్రవహిస్తున్న వచ్చిన ఈ గంగానది ప్రవాహం తల్లి గర్భంలో నుంచి అప్పుడే భూమి మీద పడిన శిశువు వంటిది. అంటే గోముఖం నుండి ఈ గంగోత్రి చేరేవరకు ఈ ప్రవాహంలో నీటికి ఎక్కడ మానవ స్పర్శ అంటదు. అందువల్ల రామేశ్వరంలోని రామేశ్వరస్వామికి చేసే నిత్యాభిషేకం ఈ గంగోత్రి నుండి తీసుకువచ్చిన నీటితోనే చేస్తారు. ఇక స్నానఘట్టాలకు పైన అంటే నది ఒడ్డున ఉన్న ప్రధాన విధి చివరగా గంగామాత పవిత్ర ఆలయం ఉంది.
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment