Sunday, 31 March 2024

ప్రారబ్ధం - పుణ్యఫలం (01- Apr-24, Enlightenment Story)

 ప్రారబ్ధం - పుణ్యఫలం

🌺🍀🌺🍀🌺🌺🍀

పరమాచార్య స్వామివారు కర్నాటక రాష్ట్రంలో బెల్గాం జిల్లాలోని ఉగార్ ఖుర్ద్ లొ మకాం చేస్తున్నారు. జెమిని గణేశన్ భార్య శ్రీమతి అలమేలు మహాస్వామి వారి దర్శనానికి వచ్చారు. అదే సమయంలో ఒక పేద బ్రాహ్మణుడు కుమార్తెను వెంటబెట్టుకుని మహాస్వామి వారి వద్దకు వచ్చాడు.

అతను మహాస్వామి వారితో, “పెరియవ, మా అమ్మాయి వివాహం నిశ్చయం అయ్యింది. మి ఆశిస్సులు కావాలి. అలాగే ఈ పేద బ్రాహ్మణుడికి మీనుండి ధన సహాయం కూడా కావాలి. అనుగ్రహించండి పెరియవ” అని వేడుకున్నాడు.



వెంటనే స్వామివారు అలమేలు వైపు తిరిగి “నువ్వు ఇవ్వగలిగింది, నీ వద్ద ఉన్నదేదైనా ఈ బ్రాహ్మణుడికి ఇవ్వు” అని ఆదేశించారు. తక్షణమే ఆవిడ తన చేతికి వేసుకున్న రెండు బంగారు గాజులను తీసి అమిత సంతోషంతో సమర్పించింది.

అప్పుడు స్వామివారు, “ఆగు. ఇప్పుడు ఇవ్వకు. అతని కుమార్తె పెళ్ళికి నాలుగు రోజులు ముందు ఇస్తే సరిపోతుంది” అని చెప్పారు. ఎందుకు మహాస్వామి వారు అలా చెప్పారు? అంతేకాదు అక్కడే ఉన్న ఒక బ్యాంకు మేనేజరుతో “మీ బ్యాంకులోని లాకరులో ఇప్పుడు ఈ గాజులను ఉంచు. వాటిని తరువాత బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు” అని కూడా చెప్పారు.

రెండు రోజుల తరువాత ఆ బ్రాహ్మణుడు ఏడుస్తూ స్వామివారి వద్దకు వచ్చాడు. “ఇంట్లో మాకు సబంధించిన వస్తువులన్నీ తస్కరింపబడ్డాయి. ఇప్పుడు నా కుమార్తె వివాహం ఎలా చేయాలి పెరియవ? మిరే నన్ను కాపాడాలి” అని భోరున విలపించాడు.

“బాధపడకు. ఏమి జరగాలో అది జరిగింది. కాని మీ అమ్మాయి పెళ్లి చక్కగా జరుగుతుంది. తను చల్లగా ఉంటుంది” అని ఊరడించారు. “ఇప్పుడు అలమేలు గారు ఇచ్చిన గాజులు మాత్రమె మిగిలాయి. స్వామీ వారి అనుగ్రహంతో అవైనా నాకు మిగిలాయి“ అని అన్నాడు.

పరమాచార్య స్వామివారు నవ్వుతూ, “గొడ్డలితో పోవాల్సినది గోటితో పోయింది. బాధపడకు, ఆ గాజులను తీసుకుని వాటితో నీ కుమార్తె పెళ్లి జరిపించు” అని అతణ్ణి ఆశీర్వదించి, ప్రసాదం ఇచ్చి పంపించారు. అప్పట్లో ఆ గాజుల విలువ షుమారు ఇరవై వేల రూపాయలు. అప్పటికి అది చాలా పెద్ద మొత్తం.

ఇది చదివిన తరువాత మీకు కొన్ని సందేహాలు కలగొచ్చు. నిజంగా పరమాచార్య స్వామివారు తలచుకుంటే ఆ దొంగతనం జరగకుండా ఆపొచ్చు కదా? కనీసం ఆ బ్రాహ్మణున్ని హెచ్చరించి ఉండవచ్చు కదా? అని.

ఎంతటి మహాత్ములైనా మన ప్రారబ్దాన్ని(అంటే గత జన్మలలో చేసుకున్న పాప పుణ్యముల వల్ల కలిగే కష్ట సుఖాలు) మార్చలేరు. గత జన్మ కర్మల ఫలితాలను(మంచి/చెడు) మహాత్ములతో సహా ప్రతి ఒక్క జీవి అనుభవించవలసిందే.

కాని మనం శరణువేడితే మహాత్ముల కరుణ వలన ఆ ఫలితముల తీవ్రత తగ్గుతుంది. నిజంగా కలగాల్సిన పెద్ద కష్టం పోయి చిన్న కష్టంతో పోతుంది. పరమాచార్య స్వామిపై మన భక్తి పెరుగుతోంటే మన ప్రారబ్ధ ఫలితముల తీవ్రత కూడా తగ్గుతుంది.

[ప్రారబ్ధం ఎంతటివారైనా అనుభవించాలి. భగవాన్ రమణులకు సర్కోమా వ్యాధి వచ్చింది. రామకృష్ణ పరమహంసకు గొంతులో రాచపుండు వేసింది. పరమాచార్య స్వామివారికి కళ్ళ సమస్య, పేగుల సమస్య ఉన్నింది. కాని వీటితో సంబంధం లేకుండా ఎప్పుడూ బ్రహ్మము నందు రమిస్తుంటారు. కాని మనం సుఖానికి పొంగిపోయి, కష్టానికి కృంగిపోతుంటాము. అదే వారికి మనకు తేడా]


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Saturday, 30 March 2024

ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు (31- Mar-24, Enlightenment Story)

ఆదివారం అత్యంత శక్తివంతమైన రోజు

🌺🍀🌺🍀🌺🌺 🌺🍀🌺🍀🌺🌺

అప్పట్లో మన దేశములో ఆది వారం సెలవు దినం కాదు.నెలలో పున్నమి, అమావాస్య రోజుల్లో మాత్రమే సెలవులు ఇచ్చేవారట. ఇదే  తరువాత రోజుల్లో నానుడి అయింది. అమావాస్యకో పున్నమికో అంటుంటాము కదా? ఇక పోతే  నేడు మనం సెలవు దినంగా  భావించే ఆదివారము ఆంగ్లేయుల కాలం నుండి మొదలయింది. ఆదివారం మనకి చాలా శక్తివంతమైన దినం. ఈ ఆదివారము మనకు సూర్యారాధన దినము, చాలామంది అప్పట్లో సూర్యారాధన చేసేవాళ్ళు . భారతీయులు యొక్క మేధస్సుకు, శక్తికి ఈ ఆదివార దీక్ష కారణం అని తెలుసుకున్న తెల్లవారు బలవంతంగా మనకి ఆదివారం సెలవును పులిమారు. ఇపుడు ఆది వారం అంటే సెలవు దినం, మందు మాంసాల దినం అయింది కానీ అంతకు ముందు అదో సుదినం మనకు.


అప్పటిలో ఉన్న వృత్తి విద్యల్లో ఉన్నవాళ్ళకి సెలవులు అంటూ  ప్రత్యేకంగా ఏమి ఉండేవి కావు. విద్యార్థులకు     మాత్రం  గురుకులా ల్లో పక్షానికి నాలుగు దినాలు- పాడ్యమి, ఆష్టమి, చతుర్దశి, పూర్ణీమ- అమావాస్య  రోజులు  అవిద్య దినాలని విద్య నేర్పే వారు కాదు. మనం వాల్మీకి రామాయణములో  అశోకవనంలో ఉన్న  సీతమ్మను "ప్రతిపద్ పాఠశిలస్య విద్యేవ తనుతాంగతా" అని వర్ణించాడు మహర్షి. పాడ్యమినాడు పాఠాలు చదివే వాడి చదువులాగ సన్నగా  చిక్కిపోయిందట సీతమ్మ. కనుక, పాడ్యమినాడు అయితే  చదువుగాని, చింతనం గాని ససేమిరా ఉండేవి కావు. చింతన మంటే జరిగినపాఠాన్ని మరొకరితో పాటు చదువుతూ పరిశీలించడం కూడా అసలు ఉండేవి కావు. ఆదివారం నాడు  విధిగా సూర్య ఉపాసన చేసేవారు

మనకు ప్రపంచములో ఉన్న ఇతర నాగరికతలో కూడా సూర్యారాధన ఉన్న విషయం తెలిసిందే. మన నుండే ఈ సూర్యారాధన ఇతర దేశాలకు కూడా వెళ్ళింది . అప్పట్లో దుకాణాలు కూడా పౌర్ణమి, అమావాస్యలకు మూసేసేవారు. ఆదివారం నాడు నేడు జల్సాలు చేస్తున్నట్టు చేయకూడదని మనకు మన వేదాలలోనే కాదు  "స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి" అంటూ మన సూర్యాష్టకంలో ఉంది . మన కర్మ వశాత్తు మానవుడు ఏమి ఆ రోజు చేయకూడదని చెప్పారో నేడు అదే  దారిలో మనం ఆచరిస్తూ ములిగిపోతున్నాము. అందరికి చెప్పడానికి  శక్తీ సరిపోదు. వందమందితో ఒకరిద్దరు గుర్తించినా ఈ పోస్ట్ సార్ధకత పొందినట్టే. 

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Friday, 29 March 2024

మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి (30- Mar-24, Enlightenment Story)

 మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి.

 🌺🍀🌺🍀🌺🌺 🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺

మనిషికి మనస్సు అనేది ఒకటుంది.ఒక కారుంటే తృప్తిలేదు. నాలుగు కార్లు కావాలి.తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది. తృప్తి లేకపోతే అత్యధిక ఆనందం లభిస్తుంది.

ఈ సృష్టిలో రకరకాల జీవులున్నాయి. మనిషి తప్ప ఇతర జీవులన్నీ తృప్తిగానే జీవిస్తుంటాయి. ఎందుకంటే అవన్నీ జీవించటానికి తమ శరీరాలను నిలుపుకోవటానికి త్యత ఆవశ్యకమైనవి ఏవో అవి లభిస్తే చాలు. మనిషికి కూడా శారీరక అవసరాల విషయంలో ఒక హద్దు ఉంటుంది. దప్పిక కలుగుతుంది. తగినంత నీరు తాగితే తృప్తి లభిస్తుంది. ఆకలి అవుతుంది. కడుపునిండా ఆహారం లభిస్తే చాలు తృప్తి కలుగుతుంది. ఇంకాస్త తినండి ని అంటే వద్దు, వద్దు, ఇక చాలు అని అంటాడు. నిద్ర విషయమూ అంతే. రాత్రంతా గాఢంగా నిద్రపోతే, ఉదయాన్నే సంతోషంగా లేచి పనిచేయటాని ఉపక్రమిస్తాడు. అయితే మనిషికి మనస్సు అనేది ఒకటుంది. దాన్ని తృప్తి పరచేది కష్టముతో కూడుకున్న పని. కోరికలు పుట్టేది అక్కడే. అవి అనంతములు. ఒక్క కోర్కెను తీరిస్తే వంద కోరికలు పుట్టుకొస్తాయి.


ఒక భిక్షగాడు రాజభవనం ముందు నిలబడి భిక్ష వేయనమి కోరాడు. రాజే స్వయంగా వచ్చి ఏమి ఇవ్వమంటావు? అన్నాడు. ఏమి ఇచ్చినా పర్వాలేదు గానీ ఈ పాత్ర నిండే వరకు ఇవ్వాలి అని తన భిక్షాపాత్రను రాజుకు చూపాడు ఆ భిక్షగాడు. అదేమంత కష్టం, ఒరే ఈ పాత్ర నిండా వజ్రాలు, మణులు, మాణిక్యాలు వేయండ్రా అన్నాడు భటులతో. వారు ఆ భిక్షాపాత్రలో ఎన్ని వేసినా నిండలేదు. అద్భుతం!

ఈ పాత్ర ఏమిటితో తయారుచేయబడింది? అని ప్రశ్నించాడు రాజు. ఓ రాజా! ఈ పాత్ర మనిషి పుర్రె అన్నాడు భిక్షగాడు. అసలు విషయం అర్ధమవుతుంది. అంతులేని కోరికలతో నిండిన మనిషి తల అది. ఎంతిచ్చినా తృప్తి చెందదు, ఏమిచ్చినా తృప్తి చెందదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటాడు మనిషి. ఒక ఇల్లు ఉంటే తృప్తిలేదు. నాలుగిండ్లు కావాలి అంటాడు మనిషి. ఒక ఇల్లు ఉంటే తృప్తిలేదు. నాలుగిండ్లు కావాలి. ఒక కారుంటే తృప్తిలేదు. నాలుగు కార్లు కావాలి. లక్షరూపాయలుంటే తృప్తి లేదు, కోటి రూపాయలు కావాలి. రెండు తరాలకు సరిపడే ఆస్తి 
ఉంటే తృప్తిలేదు,

పది తరాలకు సరిపడే ఆస్తిని కూడబెట్టాలి. ఇక శాంతి ఎక్కడుంటుంది? జీవితమంతా ఆరాటము, పోరాటమే, ఆందోళన, అలసటే. అందుకే ఉన్నదానితో తృప్తి పడు అంటారు పెద్దలు. అయితే కొన్ని విషయాల్లో తృప్తి పడరాదట.

సంతోషస్త్రిషు కర్తవ్యః స్వాధ్యాయే జపదానయోః
త్రిషు చైవన న కర్తవ్యః స్వాధ్యాయే జపదాన యోః

దీని భావం ఏమంటే తనకు ప్రాప్తించిన భార్య, భోజనము, ధనము ఈ మూడింటి విషయంలో తృప్తి ఉండాలి.
 భార్య, భోజనము, ధనము విషయంలో తృప్తి ఉంటే ఆనందము దక్కుతుంది.  వేదాధ్యనము, జపము, దానము ఈ మూడింటి విషయంలో చేసినది చాలు అను తృప్తి ఉండరాదు, తృప్తి లేకపోతే అత్యధిక ఆనందం లభిస్తుంది.
త విషయాన్ని ఏ వ్యక్తి అయినా అనుభవ పూర్వకంగా గ్రహించవచ్చు. వివేకవంతుడు సరైన విషయాలను సరైన విధంగా ఎంపిక చేసుకుని తృప్తి చెందుతాడు, లాభపడతాడు. ఆనందాన్ని అనుభవిస్తాడు.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Thursday, 28 March 2024

నిశ్శబ్ద మార్గం (29- Mar-24, Enlightenment Story)

 *నిశ్శబ్ద మార్గం*

 🌺🍀🌺🍀🌺🌺

ఒక పౌర్ణమి రోజున బుద్ధుడికి జ్ఞానోదయమైంది. ఆ వారమంతా ఆయన మౌనంలోనే ఉన్నారంటారు. ఒక్క మాటైనా మాట్లాడలేదు. పురాణగాథల ప్రకారం స్వర్గంలో దేవతలు భయపడిపోయారట. వాళ్లకు తెలుసు- కొన్ని లక్షల సంవత్సరాలకోసారి ఎవరో బుద్ధుడిలా వికసించడం జరుగుతుందని. ఇప్పుడు ఆయన మౌనంలో ఉన్నాడు.



దేవతలు ఏదైనా మాట్లాడమని ఆయనను కోరారు. అప్పుడాయన- ‘తెలిసినవారికి అర్థమవుతుంది నేనేం చెప్పకపోయినా... తెలియనివారికి నేనేం చెప్పినా బోధపడదు. ఇది అంధుడి ముందు వెలుగును వర్ణించడంలాంటిది. జీవితంలోని అమృతాన్ని రుచిచూడని వారితో నేనేం మాట్లాడినా వ్యర్థం. అందుకే ఈ మౌనం. పవిత్ర గ్రంథాలు ఏనాడో చెప్పాయి- ఎక్కడ మాటలు ఆగిపోతాయో, అక్కడ సత్యం మొదలవుతుంది’ అన్నాడు.

బుద్ధుడి మాటలు కచ్చితంగా నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే ఆయన నిశ్శబ్దానికి ప్రతిరూపం. అదే జీవానికి మూలం, అన్ని రుగ్మతలకూ ఔషధం. మనుషులు కోపంగా ఉంటే మౌనాన్ని పాటిస్తారు. ముందు అరుస్తారు, తరవాత నిశ్శబ్దం ఆవరిస్తుంది. తెలివైన వారూ చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతారు.

మాటల ఉద్దేశం నిశ్శబ్దాన్ని సృష్టించడానికే. మాటలు శబ్దానికి కారణమైతే వారు లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని అర్థం. ‘శబ్దాలు, మాటలు ఏదైనా వ్యక్తపరచడానికే. అవి అనుబంధోత్పత్తి మాత్రమే. దానికంటూ అస్తిత్వం లేదు. ఆలోచనను వ్యక్తపరచేందుకు వాహకనాళం. ఒక మట్టికుండలాంటిది... మట్టికాదు... ఓంకారం అసలైనది’ అంటారు ఆది శంకరాచార్య మాండూక్యోపనిషత్తులో.

మనసులోని రొద దేని గురించి? ధనం, కీర్తిప్రతిష్ఠలు, సంబంధబాంధవ్యాలు... శబ్దం ఏదో ఒక దాని గురించి. దేని గురించీ కానిది నిశ్శబ్దం. నిశ్శబ్దం మూలం... శబ్దం ఉపరితలం.

మొదటినుంచీ బుద్ధుడిది సంతృప్తికరమైన జీవితం. ఏ సుఖమైనా కావాలనుకుంటే చాలు- ఆయన పాదాల దగ్గరుండేది. వెళ్ళి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు. తనకు తానుగా యథార్థం తెలుసుకోవాలనుకున్నాడు. తన స్థానాన్ని, భార్యను, కొడుకును వదిలిపెట్టాడు. నిశ్శబ్దం ఎంత దృఢంగా ఉంటే లోపలి నుంచి తలెత్తే ప్రశ్నలు అంత శక్తిమంతంగా ఉంటాయి. ఆయనను ఏదీ ఆపలేదు.

ఎటువంటి మనిషైనా జీవితంలో కొన్నిసార్లైనా మౌనంగా ఉండే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఎందుకంటే మనసులో, హృదయంలో జరుగుతున్నదాన్ని సంపూర్ణంగా ఏ మాటలూ వివరించలేవు. మౌనం శక్తిమంతమైన సందేశాలను అందిస్తుంది. సహనం, మౌనం- రెండూ బలమైన శక్తులు. సహనం మానసికంగాను, మౌనం భావోద్వేగాలపరంగానూ అని అర్థం చేసుకోవాలి. మనిషి తన సహజ స్వభావాన్ని తెలుసుకోవాలి. 

సహజ లక్షణాలుగా భావించే శాంతి, కరుణ, ప్రేమ, స్నేహం, సంతోషం... ఇవన్నీ నిశ్శబ్దం నుంచి పుట్టేవే. నిశ్శబ్దం బాధను, అపరాధాన్ని, దుఃఖాన్ని మింగేస్తుంది. వివేకంతో ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరూ కష్టాలసాగరం దాటవచ్చు. సుఖాల తీరం చేరుకోవచ్చు. ఎవరైనా మౌనంగా ఉండిపోయారంటే వారు మాట్లాడలేకపోయారని, ఓడిపోయారని కాదు. అర్థం చేసుకోలేనివారితో వాదించడం ఇష్టంలేక అలా ఉండిపోయారనుకోవాలి.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday, 26 March 2024

చాలా విషయాలను మనం వదిలేయాలి ! (28- Mar-24, Enlightenment Story)

 చాలా విషయాలను మనం వదిలేయాలి

 🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺🍀🌺🌺

*వయసు పెరిగితే మనకేమీ కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.*

*”చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి.*

*చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు. అప్పడు చలం…  “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ?” అన్నారు.     ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో  కొంత విజయం సాధించాలి.*

*వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం మనకు అబ్బడంలేదు.*

*ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ? మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా.*

*కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా   ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు. శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి.*



*మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ ? ఏం వదిలివేయాలో చూద్దాం :*

*”అమ్మాయీ గ్యాసు కట్టేసావా !! గీజర్ ఆఫ్ చేసావా ??* ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది..*
*పాలు ఫ్రిజ్ లో పెట్టావా ??* లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం.*

*”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు. వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..కష్టనష్టాలు కూడా వాళ్ళవే !!*

*ఎవరితో ఏపనీ చేయించుకోకుండా, ‘ప్రతీపనీ’ “మన పనే” అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా !*

*”నా అభిప్రాయం ఏమిటంటే…  అని అనటం తగ్గించి.. నీ ఇష్టం, నువ్వు చెప్పు" అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ.*

*’నాకూ తెలుసు'తో పాటు “నాకు మాత్రమే తెలుసు” అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ  ‘నాకంటే ఎక్కువ తెలుసు' కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు.*

*మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. “వాళ్ళు మనకోసం రాలేదు” అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి.*

*పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు “ఆరోగ్యం బాగుంది కదా" అని. దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, ~షుగర్.., కీళ్ళనొప్పులు, ~నిద్ర పట్టకపోవటం.., నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. “బాబోయ్ ! ఎందుకు అడిగామా" అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.*

*కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం ??*

*పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను.*

*అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ‘జిహ్వచాపల్యం’  తగ్గించుకుని.. అన్నింటికంటే ముఖ్యమైన విషయం "నన్ను ఎవరూ గౌరవించటంలేదు" అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి...*

*భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.*

*ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.*

*హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి.*

*రోజూ అనుకుందాం ఇలా :~*
*_"I love my self.._*
*_I respect my self "_*

*~మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది.*

*మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా ?*

*మనం దిగుతుంటే వారి ముఖాల్లో 'హమ్మయ్య' అనే  భావం కనిపించాలో లేక 'అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా' అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది..*


*పెద్దతనం మనకో వరం. అది మన 'అహం' తగ్గించి మనకి జీవితం అంటే ఏమిటో, మన నిజమైన విలువ ఏమిటో సరియైన అవగాహన కల్పిస్తుంది.*

*నస అనిపించుకునే కంటే నైస్ అనిపించుకోవడం మంచిది కదా ! “సర్వకాల సర్వావస్తేషు”…ఘంటాపథంగా చెప్పగలను. మన గౌరవం మన చేతుల్లోనే ఉంది.*

*మనం చేయగలిగినంత చేయాలి. కానీ ఇతరులను… కొడుకూ కోడళ్లనైనా, కూతురూ అల్లుళ్లనైనా సరే “చేయలేదు,” “చేయడంలేదు” అనవద్దు. అంటే విలువ తగ్గడం ఖాయం.*

*విలువను పెంచుకోవడమైనా, ఉంచుకోవడమైనా, తుంచుకోవడమైనా మన చేతుల్లోనే ఉన్నదనేది మాత్రం నిష్ఠురసత్యం !!*✍️

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

వేములవాడ శ్రీ రాజన్న కళ్యాణం (27- Mar-24, Enlightenment Story)

వేములవాడ శ్రీ రాజన్న ఆలయం

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🌺

 *మార్చి 28 గురువారం వేములవాడ శ్రీ రాజన్న కళ్యాణం సందర్భంగా...*

కరీంనగర్‌ జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతోంది. కోరిన కోరికలు తీర్చే వేములవాడ రాజన్న ఆలయం ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగినది. పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. దానిప్రకారం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు ఆధారాలున్నాయి.


ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడు రాజుగా ఉండేవారు. ఆయనకు ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉండేది. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయం అని పేరు వచ్చింది.

చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రం. ఈ ఆలయం చుట్టూ వున్న దేవాలయాలను నిర్మించడానికి సుమారు 220 సంవత్సరాల కాలం పట్టింది. ఈ ఆలయ లింగ ప్రతిష్ట వెనుక కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పూర్వం అర్జునుడి మునిమనవడయిన నరేంద్రుడు ఒక మునిని చంపడం వల్ల అతనికి బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుంది. దాని నుండి విమోచన పొందడం కోసం నరేంద్రుడు దేశాటన చేస్తూ వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే వున్న ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తూ కాలాన్ని గడిపాడు. అలా ఆవిధంగా జపం చేస్తున్న నరేంద్రునికి ఒకరోజు కొలనులో ఒక శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని అతను ఇప్పుడున్న వేములవాడ ప్రాంతంలో ప్రతిష్టించి భక్తితో పూజించడం మొదలుపెట్టాడు. శివుడు అతడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరేంద్రుడు తనని బ్రహ్మ హత్యాపాతకం నుండి విమోచనం చేయవలసిందని కోరగా… శివుడు అతడికి విముక్తి ప్రసాదిస్తాడు. ఇలా ఈవిధంగా ఏర్పడిన ఈ క్షేత్రం ‘లేంబాల వాటిక’గా, ‘భాస్కర క్షేత్రం’, ‘హరిహర క్షేత్రం’గా పిలవబడింది. ఈ రాజేశ్వర ఖండంకు సంబంధించిన కథ భవిష్కోత్తర పురాణంలో వివరంగా చెప్పబడి వుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది.

ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమకం. ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది. 

ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తూ ఉండేవాడట. అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది.

ఆధ్యాత్మికం ఆనందం

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday, 24 March 2024

లక్ష్మీదేవి జయంతి (25- Mar-24, Enlightenment Story)

లక్ష్మీదేవి జయంతి

🌺🍀🌺🍀🌺🌺 

*లక్ష్మి దేవి హిందూ దేవతల్లో ప్రధాన దేవత.*

ఈమె త్రిమూర్తులలో ఒకరైన విష్ణువు భార్య. పార్వతి, సరస్వతితో పాటు ఈమె త్రిదేవతలలో ఒకరు. లక్ష్మీదేవత డబ్బు, సంపద, శాంతి, శ్రేయస్సు, అదృష్టాలకు దేవతగా పరిగణిస్తారు. అయితే ప్రతి ఏడాది లక్ష్మీ జయంతిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు లక్ష్మీ దేవిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. వ్యాపార వర్గాల్లో కూడా లక్ష్మీ జయంతిని చాలా ప్రత్యేకంగా భావిస్తారు. వ్యాపార పరిశ్రమలలో, సంపద, వ్యాపార శ్రేయస్సు ఈ రోజున కోరుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవి కోసం ఉపవాసం కూడా చేస్తారు.

లక్ష్మీ జయంతి ప్రాముఖ్యత (లక్ష్మీ జయంతి ప్రాముఖ్యత)

హిందూ క్యాలెండర్ ప్రకారం లక్ష్మీ జయంతిని ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సముద్ర మథనం జరిగిన రోజు ఫాల్గుణ మాసం పౌర్ణమి అని, అందుకే దీనిని లక్ష్మీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఐశ్వర్యానికి అధిదేవతగా ఉన్న లక్ష్మీదేవిని పూజిస్తే ఆ భక్తుల జీవితంలో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదని నమ్ముతారు. అయితే ఈ లక్ష్మీ జయంతి పండుగ దక్షిణ భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. మరి ఈ రోజున ఏ విధంగా దేవిని పూజిస్తారో, దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. లక్ష్మీ జయంతి నాడు భక్తులు తమకు ఐశ్వర్యాన్ని ఇవ్వాలని లక్ష్మీ దేవిని పూజిస్తారు. 




లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీ దేవిని పూజించడం సంపదను పొందడానికి, పేదరికం నుంచి బయట పడేందుకు ముఖ్యమైన రోజుగా భావిస్తారు. ఈ రోజున, చాలా మంది లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి హవన, యాగం కూడా చేస్తారు. అంతే కాకుండా 1000 లక్ష్మీ నామాలు, శ్రీ సూక్తాలను పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు వేగంగా లభిస్తాయి. ఈ శుభ సందర్భంలో దేవిని ప్రసన్నం చేసుకోవడానికి తేనెలో ముంచిన తామర పువ్వులను నైవేద్యంగా ఉపయోగిస్తారు.

లక్ష్మీ జయంతి పూజ విధానం..
బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజామందిరంలోని లక్ష్మీ దేవి విగ్రహాన్ని, పటాన్ని చెక్క పీట పై ఎర్రటి వస్త్రాన్ని పరచి ప్రతిష్టించాలి. తర్వాత లక్ష్మీదేవికి గంగాజలం, పూలు, పండ్లు, స్వీట్లు, దీపాలు సమర్పించాలి. ఆ తర్వాత లక్ష్మీ దేవికి హారతిని ఇవ్వాలి. ఈ సమయంలో "ఓం శ్రీ లక్ష్మీ నమః" అనే మంత్రాన్ని జపించాలి. లక్ష్మీ జయంతి రోజున పేదలకు దానధర్మాలు చేయాలి. పూజ సమయంలో కింద ఉన్న మంత్రాన్ని జపించాలి..

ఈశ్వరీ కమలా లక్ష్మీశ్చ ల భూతిర్ హరిప్రియ ।
పద్మా పద్మాలయా సమ్పద్ రామ శ్రీ: పద్మ ధారిణీ.
ద్వాదశైతాని నామాని లక్ష్మీ సంపూజ్య యః ప్థేత్.
స్థిరా లక్ష్మీభర్వేత్తస్య పుత్రదారాదిభిషః ।



.🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...