Wednesday, 19 June 2024

మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే (20-June-24, Enlightment Story)

మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺

భగవంతుడికి ఎవరి మీద శ్రద్ధ గాని, ద్వేషము గాని ఉండదు. అందరి పట్ల సమభావనతో ఉంటారు. మనం చేసుకున్న కర్మలకు ఆయన సాక్షిభూతుడుగా ఉంటారు .మన జన్మలకి మనమే కారణము.మనం చేసిన కర్మను బట్టి తల్లిదండ్రులు అన్నదమ్ములు ,అక్కచెల్లెళ్ళు, స్నేహితులు, చుట్టుపక్కల సమాజము ఇవన్నీ కూడా ముందే నిర్ణయించబడి ఉంటాయి.


ఇవన్నీ కూడా మనం చేసుకున్నవే అంటే మన కర్మను బట్టి ఇవన్నీ వస్తాయి. విత్తనము మొలకెత్తాలంటే నేల బాగుండాలి నీరు పోసేవారు ఉండాలి వాటిని పరిరక్షించేవారు ఉండాలి. ఇవన్నీ కూడా ఉంటే విత్తనము మొలకెత్తలేదు అంటే కాలము దానికి సహకరించలేదు అని అర్థము. అంటే కాలము ఇక్కడ భగవంతుని స్వరూపం ఆయన ఆజ్ఞ లేనిదే ఆ విత్తనము మొలకెత్తదు.


మనము భక్తి చేత గాని, ధ్యానం చేత గాని ,కర్మ చేత గాని ఈశ్వరుని ఆరాధిస్తున్నప్పటికీ మన మొర భగవంతుడు ఆలకించలేదు అంటే మన పాపపు కర్మ ఇంకా ఉంది అని అర్థము. భగవంతునికి దగ్గర కాలేదు అని అర్థం. కాబట్టి మనం ఇంకా ప్రయత్నము ఎక్కువ చేయాలి అంటే కాలము కలిసి వచ్చేదాకా ప్రయత్నం చేస్తూ ఉండాలి .

సహనముతో సాధించుకోవాలి. ఓకే కాలంలో ఒకే చెట్టుకి వచ్చిన పండ్లన్నీ ఒకే రుచిని కలిగి ఉండవు. అలాగే ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించరు వారి వారి కర్మలను బట్టి వారి బుద్ధి ఆధారపడి ఉంటుంది.

ఎవ్వరిని ఏమీ అనక్కర్లేదు మనం చేసుకున్నదే మనం అనుభవిస్తున్నాను పుణ్యం చేస్తే పాపం అనేది తానంతగా తన పోతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తూ ఉండండి. గోవులకు, కుక్కలకు వాటికి కూడా ఏమన్నా పెడుతు ఉండండి. ఇవన్నీ చేస్తూ ఉంటే భగవంతుడు మన విన్నపాన్ని తప్పకుండా ఆలకిస్తాడు. ఆ సమయం కోసం మనం వేచి ఉండాలి.

మన పాపమంతా పోయి భగవంతుడు మన మొర ఆలకించిన రోజు మనము ఏమి కోరుకుంటే అది జరుగుతుంది. మనము అనుకున్నవి జరగటం లేదు అంటే మన పాపం పోలేదని మనం అర్థం చేసుకోవాలి.

కాబట్టి సాధన అనేది మనం ఇంకా పెంచుతూ వెళ్లాలి మీరు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతూ ఉంటే మీరు తప్పకుండా భగవంతుడితో సంబంధం ఏర్పడింది అని అర్థము. మానవ జన్మ పరమార్థము భగవంతుడితో సంబంధం కొరకే.

ఆత్మ దర్శనం
 🪴🪴🪴🪴
సహజముగా మనమంతా ఆత్మ-స్వరూపులము,ఆనందస్వరూపులము. కానీ ఈ విషయం మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఆనందం గురించి బయట ఎక్కడో వెతుక్కుంటున్నాము. అంటే మన గురించి మనమే వెతుక్కుంటున్నాం. ఇదే ఆశ్చర్యం.

ఆధ్యాత్మిక విద్య కేవలం వినడం తోనే సరిపోదు. దానిని ఆచరణలో పెట్టినపుడే పూర్తిగా అవగతమౌతుంది. తెల్లటి బట్టకు ఏ రంగు వేసినా చక్కగా అంటుతుంది. అలాగే సారవంతమైన భూమిలో ఏ విత్తనమైనా మొలకెత్తుతుంది. సాత్వికమైన హృదయంలో ఆధ్యాత్మికత తొందరగా నాటుకుంటుంది.

ఆత్మ అనేది అవ్యక్తము. కనపడదు. వినపడదు. తాకబడదు. ఇంద్రియములకు, మనసుకు అతీతమైనది. సూక్ష్మమైనది.

ఆత్మ దర్శనం కావాలంటే ముందు హృదయం నిర్మలంగా ఉండాలి. ఆత్మ గురించి విచారణ చేయాలి. పురాణేతిహాసాలను, గ్రంధములను చదవాలి సద్గురువును ఆశ్రయించాలి. సరైన సాధనలు చేయాలి. తద్వారా ఆత్మ స్వరూపాన్ని గుర్తించాలి. అపుడే నిజమైన మనశ్శాంతి, ఆత్మానందము


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...