Thursday, 6 June 2024

ఓంకారం విశిష్ట‌త‌ (07-June-24, Enlightment Story)

ఓంకారం విశిష్ట‌త‌

🌺🌺🌺🍀🌺🍀

మ‌న‌లో చాలామంది ప్ర‌శాంత‌త కోసం నిశ్శ‌బ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎంద‌రో శ్ర‌వ‌ణానందం క‌లిగించే శ‌బ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు. పంచ‌భూతాల్లో శ‌బ్దం అన్నింటిక‌ంటే ముందు ఉంటుంద‌ని పండితులు చెబుతారు. ఆ శ‌బ్దం ఆకాశం నుంచి వ‌స్తుంది. శ‌బ్దానికి ఆధారం ఓంకారం.

నిజానికి ఓంకారం ప్ర‌తి దేహంలో ఉంటుంది. ‘ఓం’ అని శబ్దం చేయగానే, ఆ తరంగాలతో దేహం  పులకితం అవుతుంది. ఓం’ అన్న‌ది మంత్రం కాదు ! మ‌త సంబంధ‌మైన‌ది అస‌లే కాదు.వేదాల‌లో నిక్షిప్త‌మైన ఓంకార నాదం మానవ ఆరోగ్య ర‌హ‌స్యానికి ఒక సూత్రం.



ప్రాచీన కాలంలో ఋషులు వాత‌వార‌ణ ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను త‌ట్టుకుని ఉప‌వాస దీక్ష‌ల‌లో కూడా ఆరోగ్య‌వంతంగా ఉండ‌టం వెనుక ఓంకార నాద‌మే ర‌హ‌స్యం. విదేశాల్లోని విశ్వ‌విద్యాల‌యాల్లో జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో సైతం ఓంకారం మృత్యుంజ‌య జ‌పం అని బ‌య‌ట‌ప‌డింది.

ఓంకారాన్ని, మ‌తాన్ని ముడిపెట్ట‌డం వ‌ల్ల ఓంకారం చేసే మేలు ప‌రిమితం ‌ అవుతుంది. ఓంకారం ఉచ్ఛ‌రించ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు. నాభిలోంచి ల‌య‌బ‌ద్ధంగా ఓంకార ప‌దాన్ని ప‌ల‌క‌గ‌లిగితే మాన‌వుడి ఆరోగ్యం ప‌రిపూర్ణంగా ఉంటుంది.

ఓంకారం ప‌దిహేను నిమిషాల పాటు ఉచ్చ‌రించ‌గ‌లిగితే 

  • ర‌క్త‌పోటు త‌గ్గుతుంది.
  • ర‌క్త‌ ప్ర‌స‌ర‌ణ స‌క్ర‌మంగా జ‌రిగి గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. 
  • మాన‌సిక అల‌స‌ట‌, అల‌జ‌డి త‌గ్గి ప్ర‌శాంతత క‌లుగుతుంది.ఊపిరితిత్తుల ప‌నితీరు మెరుగుప‌డుతుంది. 
  • జీర్ణ ప్ర‌క్రియ స‌వ్యంగా సాగుతుంది. 
  • కిడ్నీ వ్య‌వ‌స్థ క్ర‌మ‌బ‌ద్ధంగా ప‌నిచేస్తుంది. థైరాయిడ్ ప‌నితీరును క్ర‌మ‌బ‌ద్ధం చేస్తుంది. 
  • ఓంకారంలో ఉన్న మ‌హ‌త్యం ఇదే


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...