Thursday, 13 June 2024

శ్రీ శ్రీ భాషా చమత్కారాలు (14-June-24, Enlightment Story)

శ్రీ శ్రీ భాషా చమత్కారాలు

🌺🍀🌺🍀🌺🌺🍀🌺

మహాకవి శ్రీశ్రీ మద్రాసులో ఓ చిన్న హోటల్ కెళ్ళాడు. "టిఫినేముంది?" అనడిగాడు.
"దోసై" అన్నాడు హోటల్ వాడు. "సరే వేసై" అన్నాడు శ్రీ శ్రీ. (
శ్రీరంగం శ్రీనివాసరావు )

మరోసారి వైజాగ్ లో ఓ హోటల్ కి వెళ్లి టిఫినేముంది ఆని అడిగాడు. "అట్లు" తప్ప
మరేం లేవు సర్ అన్నాడు వాడు. "సరే అట్లే కానీ" అన్నాడు శ్రీ శ్రీ 

ఇంకోసారి ఓ మిత్రుడు ఊరెళ్తూంటే వీడ్కోలివ్వటానికి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ కెళ్ళాడు.
ప్లాట్ ఫాం పై ఓ పరిచయస్తుడు కనిపించి "ఊరికేనా?" అనడిగాడు. "లేదు ఊరికే" అని
బదులిచ్చాడు శ్రీ శ్రీ.



ఒక ఊరిలో ఒక చోట ఒక బోర్డ్ పై "ఇక్కడ వేడి తేనీరు దొరుకును" అని వ్రాసి
ఉండటంతో "అరే ! ఇక్కడ వేడితే కాని నీరు దొరకదా?" అనడిగాడు.
శ్రీ శ్రీ.

ఓ ఇంటి ముందు "కుక్కలున్నవి జాగ్రత్త" అనే బోర్డ్ చూసి, ఆశ్చర్యం నటిస్తూ "అరే
ఇంతకుముందిక్కడ మనుషులుండే వారే" అనన్నాడు. 
శ్రీ శ్రీ.

ఓ కుర్రాడు ఒక పద్యం వల్లె వేస్తున్నాడు "ఎవడు రాత్రి లోకకంఠకుడు,"అని వల్లె
వేయటం విని "ఒరే ! మొద్దబ్బాయ్ ! అలాకాదురా ! అది 'ఎవడురా త్రిలోక
కంటకుడు" అని సరి చేశాడు.

ఓ హరిదాసు విశ్వనాథ సత్య నారాయణ గార్ని కలిసి ఓ హరికథ ఏర్పాటు చేయటానికి
సహకరించమని అడిగాడు.

"మీ ఊరిలోనే చెప్ప కూడదటయ్యా" అనన్నాడు సత్యనారాయణగారు . మా ఊరి వారు చెప్పిచ్చు కోరండి" అనన్నాడా హరిదాసు.మా ఊరి వారు చెప్పుచ్చు కుంటారే" అనన్నాడు సత్యనారాయణగారు*

"దోసె," ; "పూరీ"; " వడ" ; "సాంబారు" పదాలతో శివపార్వతుల కల్యాణం గురించిన
పద్యం :


జడలో దోసెడు మల్లె పూలు తురిమెన్ సౌందర్యమొప్పారగన్
నడయాడెన్ ఘలుఘల్లనన్ హొయలు చిందంజాజి పూరీతి;పా
వడ యట్టిట్టుల చిందులాడి పడగా భవ్యాత్మ యైనట్టి యా
పడతిన్ బార్వతి బెండ్లియాడితివి సాంబా! రుద్ర! సర్వేశ్వరా!


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...