Tuesday, 18 June 2024

మనిషి సంఘజీవి (19-June-24, Enlightment Story)

మనిషి సంఘజీవి

🌺🍀🌺🍀🌺

మనిషికి ఇతరుల సహకారమవసరము, తప్పదు.

మనిషి సంఘజీవి.తానొక్కడే కూచుని తినకూడదని పూర్వము అతిథి లేందే భోజనం చేయకూడదని నియమం వుండేది.కొన్ని ఊర్లలో మధ్యాహ్నం,రాత్రీ  ఆఖరి రైలూ,బస్సూ వెళ్ళిపోయే వరకూ భోజనం చేసేవారుకారు.(అప్పుడు యిన్ని రైళ్ళూ.బస్సులూ ఉండేవి కావు) అందులో ఎవరైనా దిగి యింటికి భోజనానినికి వస్తారేమో నని ఎదురు చూసి మరీ భోజనం చేసేవారు.ఇద్దరు యజమానులు అతిథుల కోసం వీధిలో తిరుగుతూ ఒకరు కనబడితే మీరు మాయింటికి రావాలంటే మాయింటికి రావాలని దెబ్బలాడు కున్నారట.


ఈ విధానాన్ననుసరించే వనభోజనాలు ఏర్పడ్డాయి.కార్తీక మాసాలు వనభోజనం చెయ్యాలని అందరూ కలిసి వనభోజనానికి వెళ్తారు.అది యిప్పటికీ కొనసాగుతూంది.అందరూ కలిసి వనానికి వెళ్లి అక్కడే వండుకొని అక్కడే భోజనాలు చేస్తారు.దినమంతా ఆటపాటలతో సరదాగా గడుపుతారు.అదొక ఆనందం.సంతోషాల సరాగాల్ని నంజుకుంటూ తిన్న భోజనం ముందు ఒక్కడే త్రాగిన అమృతం కూడా బలాదూరే.

అందుకే "విందు భోజనం పసందు భోజనం ఏటి ఒడ్డు తోటలోన మేటి భోజనం అంటూ 'బాలభారతం' చిత్రం లో చిన్ననాటి కురు,పాండవుల్ని వనభోజనానికి పంపిస్తూ కమ్మటి పాటను వండి వార్చారు ఆరుద్రగారు.నేతిగారెలు,నేతిబూరెలు,జాతివడ్ల పులిహోర, పరవాన్నాలు,  అప్పడాలు, దప్పళాలు ,ఆవకూరలు,పేరు చెప్పగానే నోరూరే పిండివంటలు,బొబ్బట్లు,మినపట్లు ,నంజుళ్ళు,దబ్బకాయ లంతేసి పెద్ద లడ్డుండలు,

పులుపు తీపి కారాలు ముక్కు దాకా బాగా కలిపి కొట్టి తిన్నదే కమ్మని విందు,"అంటూ నోరూరేలా, నోరూరించేలా  వర్ణించిన కవి, సహపంక్తి భోజనానం లోని సందేశాన్ని

అభిరుచుల మేళవింపే నిండుభోజనం, అన్నదమ్ములారగించు దండి భోజనం,ఒంటిపిల్లి రాసాసిది ఉత్త భోజనం, అన్న బంతిలోన భోజనం పండగౌను పంక్తి  భోజనం,సహపంక్తి భోజనం. అని తేటతెల్లం చేశారు.

ఈనాటి వురుకూ పరుగుల జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి వనభోజనాలు,సహపంక్తి భోజనాలు లాంటి ఆటవిడుపు అవసరం. కొన్నిచోట్ల సమారాధనలు,సంతర్పణలు జరుగుతున్నాయి. మా చిన్నప్పుడు మేమంతా కలిసి యింట్లో  పులుసన్నం,పెరుగన్నం,అప్పడాలు,వడియాలు,చేసుకొని
ఎడ్లబళ్ళు కట్టుకొని మావూరి ఏటి ఒడ్డుకు వెళ్ళేవాళ్ళం.

అరటి ఆకుల్లో భోజనం శ్రేష్టం. 

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...