Wednesday, 5 June 2024

పంచేంద్రియాలలో ఏది గొప్పది? (06-June-24, Enlightment Story)

 పంచేంద్రియాలలో ఏది గొప్పది?

🌺🌺🌺🍀🌺🍀🌺🌺🌺🍀🌺🍀

*ఘ్రాణం - రసము - చక్షువు - త్వక్ - శ్రోత్రము.*


ఈ ఐదు పంచేంద్రియములు లేదా జ్ఞానేంద్రియములు అంటారు. (ముక్కు - నోరు - కన్నులు - శరీరము - చెవులు) ఈ ఐదింటిలో ఘ్రాణేంద్రియము (ముక్కు) గొప్పదిగా చెప్పవచ్చు. ఎందుకంటే మనిషి మరణానికి చేరువ కాబోతున్నపుడు చెవులు వినిపించవు. కన్నులు దృష్టిని కోల్పోతాయి. శరీరం స్పర్శను పోగొట్టుకొంటుంది. నోరు మాటను కోల్పోతుంది. కాని ముక్కు మాత్రం తన శ్వాసక్రియను కొనసాగిస్తూనే వుంటుంది. మనిషి మరణం పొందేవరకు తోడుగా నిలిచి వుండే ఇంద్రియం ఘ్రాణేంద్రియం ఒక్కటే.  మహిళలు ముక్కును కుట్టించుకోవటంలోని సదుద్దేశ్యం ఇదే!



ఘ్రాణేంద్రియానికి మంచి సువాసన కావాలి. లేకుంటే మిగిలిన ఇంద్రియా లను ప్రేరేపించి మనిషిని దూరంగా నడిపిస్తుంది చివరకు మనిషి తినే ఆహారమైనాసరే, ముందుగా ముక్కుకి నచ్చాలి. తరువాత కళ్ళకు నచ్చాలి. తరువాత నోటికి నచ్చాలి. అందుకే మనం భుజించే ఆహార పదార్థాలలో సువాసనా ద్రవ్యాలను తప్పకుండా వాడుతుంటాం. సువాసన లేని నేతిని ఎవరైనా ఇష్టపడతారా!

మంచి పరిమళం ముక్కుకి తగిలిన వెంటనే నరనాడులు వికసిస్తాయి. శరీరం ప్రశాంతతను అనుభవిస్తుంది. కన్నులు విప్పారుతాయి. మనిషి మొత్తం చైతన్యవంతుడౌతాడు. నాడీమండలమంతా ఉత్తేజితమైపోతుంది. కాబట్టి పంచేంద్రియాలలో ముక్కు గొప్ప ఇంద్రియం. మనిషి అందమంతా ముక్కులోనే వుంటుంది.

ఘ్రాణేంద్రియం ఉల్లాసంగా వుంటే శరీరం మొత్తం హుషారుతో వుంటుంది. అందుకే మనం పరిమళం వుంటే సబ్బులను, పౌడర్లను ఇష్ట పడుతుంటాం. చాలామంది మనస్సుకి మత్తెక్కించే సెంట్లను వాడుతూ వుంటారు.

పంచేంద్రియాలకూ మనస్సుకీ ఎంతో సంబంధం వుంది. మంచి సువాసన తగిలినా, మంచి సంగీతం విన్నా, మంచి సన్నివేశం చూసినా చల్లని గాలి వీచినా, రుచికరమైన పదార్థాలు ఆరగించినా మనస్సుకి ఎంతో సంతోషం కల్గుతుంది. తన్మయత్వం అనుభవిస్తుంది.

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...