పక్షి నేర్పిన పాఠం
🌺🍀🌺🍀🌺🌺🍀
అప్పుడు సారసపక్షి పిల్లలతో ఇలా అంది “మేము లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.” అని.
ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయంకాలం గూడుకి చేరుకొంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి. “ఈ రోజు రైతు వచ్చాడు. పొలం చుట్టూ తిరిగాడు. ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది. ఇక కొయ్యాల్సిందే. ఈ రోజే వెళ్లి వూళ్లోని వాళ్లతో నా చేను కోయమని చెప్తాను.”
“అలా ఐతే మీరేమీ భయపడకండి. రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడే హాయిగా వుండొచ్చు” అని పక్షి పిల్లలతో చెప్పింది.
కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడుకి చేరుకొంది. అప్పుడు పిల్లలు బితుకు బితుకుమంటూ ఇలా చెప్పాయి..
“మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్లాలి. ఈ రోజు రైతు మళ్లీ వచ్చాడు. ఊళ్లోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు. నేను నా అన్నతమ్ముల్ని పిలిపించి వాళ్లతో పంట కోయిస్తాను.”
సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది “ఓ.. అయితే ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు. ఇంకో నాలుగైదు రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పొలం విడిచి మరో చోటికి పోవక్కర్లేదు.”
ఇలా మరి కొన్ని రోజులు గడిచి పోయాయి. సారసపక్షి పిల్లలు బాగా ఎగరసాగాయి. వాటికి భయం లేకుండా పోయింది. ఓ సాయంకాలం అవి సారస పక్షితో ఇలా అన్నాయి..
“ఈ రైతు మమ్మల్ని ఇలా ఉత్తుత్తినే భయపెడ్తున్నాడు. ఇతడు పైరు కోసినట్లే, ఈ రోజు కూడా వచ్చాడు. అన్నాడు కదా “నా అన్నతమ్ములు నా మాట వినడం లేదు. ఏదో ఓ నెపంతో తప్పించుకొంటు న్నారు. పైరు బాగా ఎండిపోయి గింజలు నేల రాలిపోతున్నాయి. రేపు పొద్దు పొడవగానే నేనే వచ్చి కోత మొదలు పెడతాను.”
అప్పుడు సారసపక్షి భయపడింది. “అరెరే! వెంటనే బయలుదేరండి. ఇంకా చీకటి పడలేదు. మనం మరో చోటికి వెళ్లి తలదాచుకొందాం. రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని అంది.పిల్లలు ఆదుర్దాగా అడిగారు “ఎందుకు వెళ్లాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?” అని.
సారసపక్షి ఇలా బదులు చెప్పింది
“రైతు గ్రామస్తులను, సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలుగలేదు. తన పని తాను చేయకుండా, ఇతరులు చేసి పెడతారని అనుకున్నంత కాలం ఎవరి పనులూ జరగవు. కాని ఎవరంతట వారు, తమ పనులు చేసుకోవాలని నిర్ణయించుకొన్న ప్పుడు, ఆ పనులు అడ్డంకులు లేకుండా చకచకా సాగిపోతాయి. రైతు తానే రేపు పంట కోస్తానని అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది.” అన్నది.
నీతి: ఎవరి పనులు వారు చేసుకుంటేనే పనులు చక్కగా, సజావుగా సాగుతాయి.సారసపక్షులు పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటికి ఎగిరిపోయాయి.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*