భగవంతుడికి తెలుసు
🌺🍀🌺🍀🌺🌺🍀🌺సరైన అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వరు. వయసు, సద్గుణాలు, పోషించే సమర్థత చూడకుండా కన్యాదానం చేయరు. నమ్మకం పొందని వ్యక్తికి రుణం ఇవ్వరు. పాత్రత లేకుండా మంత్రోపదేశం చేయరు. సాధారణ విషయాల్లోనూ చాలా సందర్భాల్లో ఏదైనా పొందాలంటే పాత్రత ఉండాలి.
సరైన అర్హత లేకుండా ఉద్యోగం ఇవ్వరు. వయసు, సద్గుణాలు, పోషించే సమర్థత చూడకుండా కన్యాదానం చేయరు. నమ్మకం పొందని వ్యక్తికి రుణం ఇవ్వరు. పాత్రత లేకుండా మంత్రోపదేశం చేయరు. సాధారణ విషయాల్లోనూ చాలా సందర్భాల్లో ఏదైనా పొందాలంటే పాత్రత ఉండాలి. నిత్యజీవితంలో అందరి ఆదరాభిమానాలు పొందాలన్నా కూడా అర్హత సంపాదించాలి. దానికి ఒక క్రమబద్ధమైన జీవనశైలిని అనుసరించాలి. వ్యక్తులతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఇతరుల తప్పులను ఎంచడం మానాలి. నీ తప్పును తెలుసుకొని, ఇతరుల గొప్పను నిజాయతీగా ఒప్పుకోవాలి. సంకోచమే మరణం, వ్యాకోచమే జీవితం అంటారు. మానసిక పరిధిని విస్తృతపరచుకొని విశ్వ మానవుడు కావాలి. నిస్వార్థంగా ఇతరులకు ఏమి ఇవ్వగలమో అవి ముందు ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే పొందే అర్హత కలుగుతుంది.
భగవంతుడి అనుగ్రహం లభించాలన్నా అర్హత కావాలి. ఈర్ష్య అసూయ ద్వేషాలకు దూరంగా ఉండగలగాలి. ఆయన మీద భక్తి విశ్వాసాలు ఉండాలి, మానసిక అనుబంధాన్ని పెంచుకోవాలి. చేసే ప్రతి పని తాలూకు ఫలితాన్ని ఆయనకు సమర్పణ భావంతో చేయగలగాలి. నిజానికి భగవంతుడి సన్నిధికి వెళ్ళాల్సింది భౌతిక విషయాలకు దూరంగా, కాసేపు ప్రశాంతమైన మనసుతో ఎవరికివారు స్వామితో మౌనంగా సంభాషించు కునేందుకు. ఆయన కరుణాకటాక్ష వీక్షణాలు తమపై ప్రసరింప చేస్తున్నందుకు, జీవితంలో సుఖ సంతోషాలను నింపుతూ ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పుకోవడానికి. కోర్కెల చిట్టా విప్పడానికి కాదు. ఎవరికి ఏది కావాలో ఆయనకు తెలుసు. మాతృగర్భం నుంచి బయటకు వచ్చేసరికి ఆహారాన్ని మాతృస్తన్యంగా ఏర్పాటు చేసిన భగవంతుడు ఎవరికి ఏది ఏ సమయంలో ప్రసాదించాలో ఆ సమయంలో అనుగ్రహిస్తాడు. పూజామందిరంలో దేవుడి ముందు అగరొత్తులు వెలిగించడంతో పాటు ప్రేమానురాగ కుసుమ పరిమళాలతో ఇంటిని పరిసరాలను నింపుకోవాలి. దీపం వెలిగించడంతోపాటు అజ్ఞానాంధకారాన్ని పారదోలాలి. భగవంతుడికి నివేదించిన ప్రసాదాన్ని నలుగురితో పంచుకోవాలి. భగవంతుడి ముందు వినయంగా శిరస్సు వంచడంతోపాటు తోటివారిపట్ల నమ్రతతో నడుచుకోవాలి. హాని తలపెట్టిన వారినీ హృదయపూర్వకంగా క్షమించగలగాలి.
దేవుణ్ని ఏం కోరుకోవాలి? నీలోని బలహీనతలను విన్నవించి వాటిని అధిగమించే శక్తిని, కష్టాలను అధిగమించే మానసిక స్థైర్యాన్ని కలిగించమని అర్థించాలి. ఆ దైవం ప్రసాదించిన తెలివితేటలు, సంపద దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసే బుద్ధి కలిగించమని కోరుకోవాలి. తల ఎత్తుకొని నిర్భయంగా స్వయం శక్తితో స్వతంత్రంగా ఆత్మగౌరవంతో నిజాయతీగా జీవించే లక్షణాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. లభించిన దానితో తృప్తిపడే మనసునిమ్మని కోరుకోవాలి. అంతకు మించిన ధనం లేదు.
అర్హతను చూసి ఎవరికి ఏమి కావాలో ఎంతవరకు ఇవ్వాలో అది ఏదో రకంగా భగవంతుడు కలగజేస్తాడు. అర్హత లేకుండా దైవాన్ని ప్రార్థించడం ఇతరులను అర్థించడం కేవలం అవివేకం, అత్యాశ.
*సర్వేజనా సుఖినోభవంతు*
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*