*తులసీదళం*
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀ఒక వ్యక్తి రోజూ అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు.
అది చూసి చాలా ముచ్చటపడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్లి ఆ భక్తుడికి ఇద్దాం అని అనుకున్నాడు.
కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నింది. ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన భక్తుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజ నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నారు.
ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ భక్తుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో నాయనా నేను చెప్పేవరకు ఈ తట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.
రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహువు ఆ భక్తుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మొస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను, అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు.
ఈ విషయం వినగానే భక్తుడికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావడంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు, అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లైతే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే, భక్తుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ పాము మాయమైంది.*
ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడడమా మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా.
*భక్తుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆపదను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆ దేవదేవుని కమల చరణాలపై తులసీదళం పెట్టాలన్న ఆలోచనే ప్రాణాన్ని కాపాడునది. భగవంతుడే భగవద్గీతలో పలికాడు.*
*పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి |*
*తదహం భక్త్యుప్రహృత్మశ్నామి ప్రయతాత్మనః ||*
*ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రంమైనను, పుష్పంమైనను, ఫలమైనను చివరికి కొన్ని మంచి నీళ్ళు భక్తితో సమర్పించినా, నేను ప్రీతితో స్వీకరించెదను అంటున్నాడు. ఈ కలియుగంలో మానవుడు అశాశ్వితమని తెలిసి కూడా మానవులు తీరిక లేకుండా భౌతిక సుఖాలకోసం వెంపర్లాడుతూ జీవితమును వృధాగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు.*
సర్వేజనా సుఖినోభవంతు
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment