స్థిత ప్రజ్ఞత.
🌺🍀🌺🍀🌺🌺🍀🌺
పాలల్లో నెయ్యి ఉంది. పాలల్లో నెయ్యి మూలకాలు ఉన్నాయి, అంటే మన శరీరంలో అనంత విశ్వ చైతన్య మూలకాలు ఉన్నాయి.మన శరీరం అనంత విశ్వాత్మగ తయారు అవ్వాలి. పాలు నెయ్యిగా తయారు అవ్వాలంటే పాలు బాగా వేడి అవ్వాలి. మన శరీరం కూడా వేడి లేదా ఉష్ణం అవ్వాలి, శరీరం చెమటలు పట్టాలి, పట్టాలి అంటే వేడి నీళ్లు లేదా గోరు వెచ్చని నీళ్లు తాగాలి, సూర్యుడి కాంతి కిరణాలు బాగా తాకాలి, చాలా సేపు నిలబడాలి.మనం తిన్న ఆహారం ద్వారా ఎన్నో మలినాలు, టాక్సిన్స్, ఇంకా నీళ్ళ ద్వారా ఫ్లోరైడ్ శరీరం నుండి చెమట రూపం లో బయటకు వెళ్లి పోవాలి. ఈ వ్యర్థ పదార్థాలు పినియల్ గ్లాండ్ ను నివారిస్తుంది. ఈ పినియల్ గ్లాండ్, తల వెనుక భాగం లో వెన్ను ముఖానికి మొదలు భాగం, అన్ని కణాలను పాలిస్తుంది, అదియే దివ్య చక్షువు ను ప్రస్ఫుటం చేస్తుంది. ముందు ఈ శరీరం శుద్ధి కావాలి, శాఖాహార లకు, ఫలాహరులకు, జలాహారులకు త్వరగా శుద్ధి అవుతుంది.
శరీరం చెమటలు తర్వాత ఉష్ణం నుండి శీతలం అవుతుంది. చాలా తేలికవుతుంది. పాలు వేడి అయ్యాక చల్లారిన తరువాత గోరువెచ్చని పాలలో తోడు వెయ్యాలి. ఆ తరువాత చాలా గంటలు ఏకాంతముగా కదపకుండా ఉండాలి, అప్పుడు అది పెరుగు అవుతుంది.
అలానే మనం కూడా చాలా తేలిక అయ్యాక, చాలా సేపు ఏకాంతముగా కదలకుండా కూర్చోవాలి, ఈ శరీరానీకి, ప్రాణం మరియు విశ్వ మయ ప్రాణశక్తి అనే తొడు కావాలి, అంటే ప్రాణాని గమనించాలి అప్పుడు మనస్సు శుద్ధి అవుతుంది ఆ తరువాత విశ్వ మయ ప్రాణ శక్తి తల మధ్యలో నుండి ప్రవహించి పినియల్ గ్లాండ్ ను తాకి వెన్నుముక నుండి ప్రవహించి వెన్నుముక చివరి భాగంలో అంతం అవుతుంది. వెన్నుముక చివరి భాగం,అదియే కుండలినీ. మూలాధార చక్రం.
మూడున్నర చుట్ల ఉన్న కుండలినీ జాగృతం అవుతుంది. అంటే పెరుగు కు సంకేతం. పెరుగు ద్వారా మీగడ వస్తుంది, ఆ మీగడ ను కొన్ని రోజులు బద్ర పరచి, చిలికి వెన్న తీయాలి. మూలాధార కుండలినీ జాగృతం అన్ని చక్రాల గుండా ప్రయాణించి సహస్రారం లో కలుస్తుంది, అంటే కొన్ని రోజులు ధ్యాన సాధనలో నిమగ్నం కావాలి. మండలి ధ్యానం చెయ్యాలి(40 రోజులు). ఇదే చిలకడం అంటే.
- ఉపస్థితం -సుఖాసనం లో కూర్చవడం (ఆసనం),
- ప్రాణ గమనం (ప్రాణాయామం),
- అంతర ప్రయాణం (ప్రత్యాహరం),
- నిరీక్షణ - తదేక గమనం (ధారణ)
- ధ్యానం - సూక్ష్మ శరీర సముదాయం
ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరం అవుతుంది మండల ధ్యానంలో. వెన్నను చక్కగా వేడి చేయాలి అప్పుడు అది నెయ్యి అవుతుంది.
ధ్యానం నుండి సమాధి స్థితి.
సమాధి అంటే అన్ని సమాధానాలు దొరికిన స్థితి, అదియే స్థిత ప్రజ్ఞత, అదియే జ్ఞానోదయం(Enlightenment)
నెయ్యి అంటే సమాధి స్థితి, స్థిత ప్రజ్ఞత.అప్పుడు యమ, నియమాలు అనే సిద్ధులు వస్తాయి
సమాధి అంటే అన్ని సమాధానాలు దొరికిన స్థితి, అదియే స్థిత ప్రజ్ఞత, అదియే జ్ఞానోదయం(Enlightenment)
నెయ్యి అంటే సమాధి స్థితి, స్థిత ప్రజ్ఞత.అప్పుడు యమ, నియమాలు అనే సిద్ధులు వస్తాయి
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment