*మాఘ శుద్ధ పంచమి, వసంత పంచమి, శ్రీ పంచమి*
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀వసంతోత్సవ పర్వదినం ఈ సంవత్సరం పిబ్రవరి 14 న వచ్చింది.ఈ పండుగను ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు.మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది.వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపు కుంటారు.
జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.
జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ, రజ, స్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది.
సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.
శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు.
చదువులతల్లి సరస్వతి పుట్టిన రోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో వెలసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. శారదాంబను ప్రసన్నం చేసుకున్న వ్యాస భగవానుడు, గోదావరీ తీరాన సైకత మూర్తిగా ఆ దేవి విగ్రహాన్ని రూపొందిస్తాడు. ఆ మహాశక్తి అందులో సుప్రతిష్ఠితురాలై భక్తుల్ని అనుగ్రహించిందని, ఆ క్షేత్రమే వ్యాసపురి (బాసర)గా భాసిల్లుతోందని పెద్దలంటారు. ఇక్కడ వేకువజాము నుండే మంగళవాద్యసేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీవాహనం, వేదపారాయణం, అమ్మవారికి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు.
వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివస్తారు.
సరస్వతి శబ్దానికి ‘ప్రవాహ రూపంలో ఉండే జ్ఞానం’ అని అర్థముంది. ప్రవాహం చైతన్యానికి సంకేతం. వసంతరుతు శోభలకు వసంత పంచమి స్వాగతం పలుకుతుంది.
శుద్ధ సత్వ గుణ శోభిత సరస్వతి- శ్వేత వస్త్రాలతో అలంకృతయై, హంస వాహినిగా తామర పుష్పం మీద కొలువుతీరి ఉంటుంది. ఆమె అక్షరమాల, గ్రంథం ధరించడంతో పాటు వీణావాదనం చేస్తుంటుంది. వేదాలు సరస్వతి నుంచే ఆవిర్భవించాయని ‘గాయత్రీ హృదయం’ గ్రంథం పేర్కొంది. శ్రీ పంచమి పర్వదినాన శ్రీవాణిని పలు రకాలుగా ఆరాధిస్తారు. బ్రాహ్మణి సన్నిధిలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేస్తారు.
ఈ వసంత పంచమి రోజున అందరూ ఆతల్లిని తప్పక ఆరాధించాలి. పుస్తకాలను గ్రంధాలను,కలాన్ని ( Pen) అమ్మవారి వద్ద పెట్టి పూజించాలి. బ్రహ్మాది దేవతలు కూడా ఆ శారదాంబను ఈరోజున పూజిస్తారట.
ఈరోజున అమ్మవారిని ఆరాధించడం వలన విద్యాబుద్దులే కాదు మేధా శక్తి వృద్ది చెందుతుంది. ఆ తల్లి కృపవల్లనే జ్ఞాన విజ్ఞానాలు వృద్ధి చెందుతాయి, లౌకికమైన చదువులు, పరమమైన బ్రహ్మవిద్య రెండు లభిస్తాయి.
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment