జ్ఞానంవల్లనే దుఃఖనాశనం
🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺మన దోషాల నెత్తి చూపినవారిపై మనకుసామాన్యంగా కోపం వస్తుంది. నిజానికి మన దోషాన్నింటినీ వారెరుగరు. ఎరిగివుంటే మరీ నిందిస్తారు. ఎవరి దోషాలు వారికే బాగా తెలుస్తవి. కనుక ఎవరిని వారే నిందించుకొని, సరిదిద్దుకోవలసి వుంటుంది. అలా చేయక, మన దోషాలను కప్పి పెట్టుకొంటాము. తప్పుచేసినపుడు పశ్చాత్తాపము చెంది, ఆ తప్పును పరిహరించుకోవాలి గాని, దాచిపెట్టుకుంటే ఏమి ప్రయోజనం? ఏనాటి కానాడు నిజదోషములను పారజూచుకుంటే ఆత్మ పరిశుద్ధికి మార్గ మేర్పడుతుంది. అలా నిజదోషాలను గ్రహించి సరిదిద్దుకొనే శక్తిని జగదంబ మన కనుగ్రహించుగాక అని వేడుకొందాము.
పాపాచరణం చేసేవాణ్ణి సంస్కృతంలో పతితుడు అంటారు. జారిణిని తమిళంలో నరుక్కి అంటారు. ఈ రెంటికి కాలుజారి పడటమనే అర్థం. కాలుజారి పడటమనేది ఎవరికైనా వస్తుంది. పడిపోవటానికి పెద్ద ప్రయత్న మేమీ అక్కరలేదు. అలాపడిపోకుండా నిబ్బరించుక నిలువద్రొక్కుకునే వారు నూటి కొక్కరున్నా అట్టివారి సచ్చీలం లోకానికి మార్గదర్శక మవుతుంది. అట్టి సచ్చరిత్రులను లోకం కొనియాడుతుంది.
కష్టాలు అందరికీ కలుగుతవి. కష్టాలు కలిగినపుడు భగవంతుణ్ణి నిందిస్తాము - మన కష్టాలను పట్టించుకొనుటలేదని. భగవదనుగ్రహం వల్లనే మనకన్న వస్త్రాలు, నిలువనీడా లభిస్తున్న వనేమాట అప్పుడు మరచిపోతాము. ఆ సుఖాలను కల్గించినందుకు సంతోషించడం మాని, కష్టాలువచ్చేసరికి వాటినిభరించలేక నిందిస్తాము. ఈ కష్టాలు గూడ మన మేలుకే వచ్చినవని గ్రహించలేము. మన్నుదినే బిడ్డచేతులను తల్లి కట్టివేస్తుంది. కట్టివేసినందుకు బిడ్డ ఏడుస్తుంది. తల్లి నవ్వుకొంటుంది. మనకు కలిగే మేళ్లు ఈశ్వరుని నిర్హేతుక కటాక్షంవల్లనే లభిస్తున్నవి. కష్టాలుకూడా ఏదో కారణంవల్లనే కల్పిస్తాడు భగవంతుడు. మన కా కష్టాలే కనిపిస్తవికాని కారణం కనిపించదు.

మనం వర్తమానాన్నే చూస్తాముగాని భూతమును, భవిష్యత్తును చూడలేము కనుక వర్తమానం కోసం దుఃఖిస్తాము. మనమేలు కోసమే కష్ఠాలనుకల్పించడమనేది ఈశ్వరవిలాసం. వెనుకముందులు పారజూచుకొనే నేర్పేవుంటే మనజీవితంలోకష్టాలకంటే సుఖములే మనపాలి కధికంగా వచ్చినపని స్పష్టపడుతుంది. ఈ కష్టాలనేవి మనలోవున్న పాపమనే రోగాని కౌషధంవంటివనీ దుఃఖానుభవమువల్ల పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుందనీ అపుడు తెలిసికొంటాము. జ్ఞానవైరాగ్యముల సహాయ్యంతో దుఃఖములనుభవించే శక్తిని ప్రసాదింపుమని ఈశ్వరుని ప్రార్ధించుదాము. భక్తులైనవారు దుఃఖములచే కుంగిపోరు.
దుఃఖహరణానికి జ్ఞానమే పరమౌషధం. తనకు వచ్చిన కష్టాలు మరియెవరికి రాలేదని యెవరికివారే అనుకొంటారు. ధనవంతులకు, ఉన్నతపదస్థులకు దుఃఖాలు లేవని మన మనుకొంటాము. వారినే అడిగి చూడండి, తమ కష్టాలొక్కొక్కటే ఏకరువు పెట్టుతారు. మనమున్న ఉనికితో తృప్తిచెందము. అంతకంటే అధికపదవిలో సౌఖ్యమున్నదనుకొంటాము. తీరా ఆ పదవిని పొందిన పిమ్మట తెలుస్తుంది. అదికూడా కంటకమయమే అని. యథార్థమేమటంటే-మన మేస్తితిలో వున్నా కష్ఠాలనేవి తప్పవు. అవి పూర్వజన్మములందు మనమార్జించుకొన్నవి. పూర్వభవకర్మల నుండి మన చిట్టాల కెక్కినవుతారు. (బ్రాటోవరు) లవి అవి. మనలను వెంటాడుతవి. అనుభవం వల్ల తప్ప అవి నశింపవు.
ఉన్మత్తులకు, జడులకు మనకున్నట్లు దఃఖానుభవం ఉండదు. జ్ఞానులకుకూడా దుఃఖము లంటవు. ఉన్నాదము, జడత్వము పూర్వకృత పాపంవల్లనే కలుగుతవి. అనుభవం వల్ల ఆ పాపఫలం నశించగానే జడత్వం వదలిపోతుంది. అంతట వానికిగూడా మనకందరకువలెనే దుఃఖానుభవం కలుగుతుంది.
గాఢసుషుప్తియందు మనకు దుఃఖానుభవం ఉండదు. అట్టి నిద్రనుండి లేచి ''ఆహా! ఎంతసుఖంగా నిద్రపోయాను!'' అనుకుంటాము. జ్ఞానులు మేలుకొనివున్నా వారికి దుఃఖ మంటదు కనుక వారి కా మెలుకువ సుషుప్తివంటిదే అనాలి. దుఃఖములు చుట్టుకున్నా జ్ఞానులు, మనం సుషుప్తిలోపొందే సుఖాన్నే పొందుతూవుంటారు. అంటే - వారి శరీరములకు బాధ కలుగదని కాదు, ఆ బాధ వారి మనస్సునంటదు. దుఃఖములచే వారు వ్యధచెందరు. ఆ భారముచే మనవలె క్రుంగిపోరు. బరువైన దారుఖండం పదిమంది పట్టితేకాని కదలదు. దానినే నీటిలోవేస్తే పసివాడుకూడా దాని నిట్టే కదిలించగలడు. కాబట్టి మన దుఃఖాలను జ్ఞానజలమందు ముంచితే చాలు, అవి ఇట్టే తేలికైపోతవి.

సశేషం పార్ట్ -2 రేపటి కథలో
*జై శ్రీ రామ్*
🍀🌺🍀🌺 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🍀🌺🍀🌺 లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️
No comments:
Post a Comment