Saturday, 17 February 2024

పుణ్యం వెల చాలా బాగుంటుంది చదవండి (18-Feb-24, Enlightenment Story)

 *పుణ్యం వెల చాలా బాగుంటుంది చదవండి* 

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

కాశీ పట్టణంలో ధనవంతుడు అయిన ఒక భక్తుడు వుండేవాడు. అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.

ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో  కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి. పక్క ఊరిలో ఒక పెద్ద వ్యాపారస్థుడు నివసిస్తున్నాడని  అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని భక్తుడి  భార్య అతనికి చెప్పి  వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును అని సలహా ఇస్తుంది.


భక్తుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధపడక తప్పలేదు. దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.

అతను నడుచుకుంటూ అడవిలో నుండి పోయేవేళ ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.

భక్తుడికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి,  తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు. కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ  ఇంకా ఆకలితో ఉండటంతో భక్తుడి వైపు చూపసాగింది.

భక్తుడు జాలిపడి  రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా  మొత్తం రొట్టెలు కుక్కకు వేసి  తను మాత్రం కేవలం నీరు త్రాగి వ్యాపారస్థుడు వున్న వూరికి చేరుకొంటాడు. భక్తుడు వ్యాపారస్థుడుతో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.

అప్పుడు వ్యాపారస్థుడు నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను! అని అంటాడు. మధ్యాహ్నం వ్యాపారస్థుడు తన ఇంటికి భోజనానికి వెళ్లి  తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక భక్తుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు!’ అని సలహా అడుగుతాడు.

వ్యాపారస్థుడు భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ.  ఈరోజు భక్తుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది. కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యాన్ని భక్తుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.

సాయంత్రం భక్తుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు వ్యాపారస్థుడు  ఇలా అంటాడు. ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనుకొంటున్నాను.

భక్తుడు నవ్వి ఇలా అంటాడు… ’నా దగ్గర యజ్ఞానికి సరిపడ  ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా?’ అని. ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకు ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు. అదే యజ్ఞం!’ అని వ్యాపారస్థుడు అంటాడు.

నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని అనుకొంటున్నాను!’ అని అంటాడు. భక్తుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు. దానికి బదులుగా  నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని వ్యాపారస్థుడు అనటం దానికి  భక్తుడు కూడ అంగీకరించడం జరిగిపోతాయి.

నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో  కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి. రెండవ దానిలో, వ్యాపారస్థుడు ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు. రెండవ సంచీ ఉంచినాకూడా కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి వ్యాపారస్థుడు తన దగ్గర వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు ఆశ్చర్య పోతారు.*

అప్పుడు భక్తుడు వ్యాపారస్థుడుతో, "నేను నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు!” అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి, దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు  నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.

ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు. ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి  ఆగలేక, భర్త వెళ్లగానే ఆ  మూట  తెరిచి చూస్తుంది.  ఆ మూట  నిండా వజ్రాలు, నగలు ఉండటంతో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.

భక్తుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది. మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి? అంటుంది.

వజ్రాలు, నగలా ? ఎక్కడ ఉన్నాయో చూపించు!” అని అంటాడు భక్తుడుభార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో భక్తుడు కూడా ఆశ్చర్యపోతాడు.*

అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.విపత్తు సమయంలో తన పుణ్యంను  విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.*


*ఇదీ కథ…!*
*నిజానికి ఇది కథ కాదు. జీవితం!  ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి.  ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే.మీ  డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు.*

అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా  మార్చుకోండి. పరలోక ప్రయాణానికి    పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి .దేవుడు మనల్ని పరీక్షిస్తాడు! మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే,  మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు!


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...