Thursday, 29 February 2024

గురుదక్షిణ (01-Mar-24, Enlightenment Story)

 *గురుదక్షిణ!*

🌺🍀🌺🍀🌺🌺🍀

కష్టాల్లో కుంగిపోకుండా, సుఖాల్లో పొంగిపోకుండా సంయమనం పాటించాలంటుంది బౌద్ధం. అంతే కాదు, కష్టాలు వచ్చినప్పుడు కలవరపడితే మన మానసిక శక్తులు కుంచించుకుపోతాయి. సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని చూపలేవు. మరింత లోతున పడేస్తాయి.

అదే మనం దిగాలు పడకుండా దిటవుగా నిలబడితే... కష్టాలను తొలగించుకొనే మార్గాలు కనిపిస్తాయి. అలాంటి మార్గాన్వేషణలో మనిషి తన ఉపాయ కుశలతను.. ప్రదర్శించాలంటాడు బుద్ధుడు. అటువంటి ఒక ఉపాయశాలి గురించి ఆయన చెప్పిన కథ ఇది…*


*పూర్వం జంబూద్వీపంలో, ఒక నిరుపేద కుటుంబంలో  ‘బోధిధరుడు’ పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. అతని మిత్రులందరూ తక్షశిలకు వెళ్ళి, విద్యలు నేర్చుకొనేవారు. తాను కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకున్నాడు. కానీ ఆ స్తోమత లేదు. అయినా తల్లితండ్రులకు నచ్చజెప్పి తక్షశిలకు వెళ్ళాడు. అక్కడే ఒక గురువును కలిసి, తన పేదరికం గురించి చెప్పుకున్నాడు….*

*”గురువర్యా! గురుదక్షిణ లేకుండా విద్యను అభ్యసించడం మంచిది కాదు. నేను తమకు ఇప్పుడు ఏమీ సమర్పించలేను. కానీ విద్య ముగిశాక యాచించి, ధనాన్ని తెచ్చి, మీకు సమర్పిస్తాను!” అని చెప్పాడు.*

*గురువు సంతోషించి “సరే!” అన్నాడు. గురుదక్షిణ కన్నా బోధిధరుడిలో దక్షతను ఆ గురువు చూడగలిగాడు. అందుకే అతను అడిగిన వెంటనే తన శిష్యుడిగా చేర్చుకోవడానికి అంగీరకించాడు.*

*కొన్నాళ్ళకు బోధిధరుడి విద్యాభ్యాసం పూర్తయింది. “గురుదేవా! నా మాట ప్రకారం యాచించి, దక్షిణ తెచ్చి ఇస్తాను. అనుమతి ఇవ్వండి!” అని కోరాడు.*

*”అలాగే...వెళ్ళి రా!” అన్నాడు గురువు.*

*బోధిధరుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. తన గురించి చెప్పాడు ఎందరో కాదనకుండా, లేదనకుండా శక్తి కొలదీ సహాయాన్ని అందించారు. ఇలా వచ్చిన వాటన్నిటినీ బంగారు నాణేలుగా మార్చుకున్నాడు. గురుదక్షిణ సమర్పించడం కోసం తక్షశిలకు బయలుదేరాడు.*

దారిలో ఒక నది అడ్డుగా ఉండడంతో... పడవ మీద ప్రయాణం సాగించాడు. మార్గమధ్యంలో గాలి వీచింది. సుడి రేగింది. పడవ కొద్దిగా పక్కకు ఒరిగింది. అతని జేబులోని బంగారు నాణేల మూట నదిలో పడిపోయింది. నావికుడు పడవను జాగ్రత్తగా  ఒడ్డుకు చేర్చాడు.  కానీ... గురుదక్షిణ మొత్తం గంగపాలైంది.

*ఈ విషయం తెలిసి అక్కడున్న వారందరూ విచారపడ్డారు. “మళ్ళీ గ్రామాలకు పోయి యాచించు” అని సలహా ఇచ్చారు.*

కానీ ఆ సొమ్మును రాజు దగ్గర నుంచి సంపాదించాలనుకున్నాడు…బోధిధరుడువెంటనే తన బుద్ధికుశలతను ఉపయోగించాడు. ఆ నదీ తీరంలో... ఇసుకలో కూర్చొని మౌనవ్రతం పట్టాడు. తిండి మానేశాడు. అలా రోజంతా గడిచింది. అక్కడి నుంచి బోధిధరుడు కదల్లేదు.*

సమీప గ్రామాల ప్రజలు ఎందరో వచ్చి అతణ్ణి పలకరించారు. “ఎందుకిలా చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.”ఆహారం తీసుకోండి” అని అర్థించారు. బోధిధరుడి నుంచి వారికి ఎలాంటి సమాధానం రాలేదు.*

*రెండు రోజులు గడిచాయి. ఈ వార్త దేశమంతా పాకింది. రాజుగారికి చేరడంతో, తన మంత్రులను పంపాడు. వారు ప్రశ్నించినా బోధిధరుడు ఉలకలేదు, పలకలేదు.*

*చివరకు రాజే తరలివచ్చాడు. “ఎవరు నీవు? ఇక్కడ ఎందుకు నిరాహారంగా, మౌనంగా కూర్చున్నావు?” అని అడిగాడు.*

*అప్పుడు బోధిధరుడు నోరు తెరచి మాట్లాడాడు, తన చరిత్ర చెప్పాడు.*

*రాజు ఆశ్చర్యపడి “ఈ విషయం నాతోనే ఎందుకు చెప్పావు? మిగిలినవారికి ఎందుకు చెప్పలేదు?” అని అడిగాడు.*

*”రాజా! మనం సమయా సమయాలు ఎరిగి సహాయాన్ని అర్థించాలి! ఎవరు మన కష్టాలను తీర్చగలరో వారికే చెప్పుకోవాలి. అలాకాని వారికి చెప్పడం వల్ల మన కష్టం తీరదు సరికదా... హేళనకూ, అవమానానికీ గురవుతాం. మనిషి కష్టం రాగానే కలతపడి, కనబడిన ప్రతివారితో చెప్పుకోకూడదు. తీర్చగలవారు దొరికేవరకూ ఆ కష్టాన్ని దిగమింగుకొని భరించాలి. చాలా రోజులపాటు ఎన్నో గ్రామాలు తిరిగి, ఎందరెందరి నుంచో తీసుకున్న డబ్బు గంగపాలైంది. అంత సహాయాన్ని అందించగలవారు మీరొక్కరే. అందుకే మీతోనే మాట్లాడాను!” అన్నాడు.*

*బోధిధరుడి ఆలోచనలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే గురుదక్షిణకు కావలసినన్ని బంగారు నాణేలు ఇచ్చాడు. అతణ్ణి తన కొలువులో ఆస్థాన పండితుడిగానే కాదు, తన ఆంతరంగికుడిగానూ నియమించుకున్నాడు.*✍️

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Wednesday, 28 February 2024

పక్షి నేర్పిన పాఠం (29-Feb-24, Enlightenment Story)

 పక్షి నేర్పిన పాఠం 

🌺🍀🌺🍀🌺🌺🍀         


ఓ వూరి దగ్గరి పొలంలో సారసపక్షుల జంట నివసిస్తూ వుండేది. ఆడ సారసపక్షి గుడ్లు పెట్టింది. కొంత కాలానికి గుడ్లలో నుంచి పిల్లలు బయటికి వచ్చాయి. వాటికి రెక్కలు వచ్చి, అవి ఎగరటానికి ముందే పంట కోతకు వచ్చింది. సారస పక్షులకు దిగులు చుట్టు కొనింది. రైతు పంటను కోయటానికి ముందే, పిల్లలతో పాటు మరో సురక్షితమైన చోటుకి ఎగిరి వెళ్లాలి. కాని పిల్లలు ఎగరలేవే? అప్పుడు సారసపక్షి పిల్లలతో ఇలా అంది - 'మేం లేనప్పుడు ఎవరైనా పొలం వద్ద ఏమైనా మాట్లాడుకొంటే విని మాకు చెప్పండి.'



ఓ రోజు సారసపక్షి మేత తీసుకొని సాయం కాలం గూడు చేరుకొంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి - “ఈ రోజు రైతు వచ్చాడు. పొలం చుట్టూ తిరిగాడు. ఒకటి, రెండు, చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూసాడు. చేను కోతకు వచ్చింది. ఇక కొయ్యాల్సిందే. ఈ రోజే వెళ్లి వూళ్లోని వాళ్లతో నా చేను కోయమని చెప్తాను.” అన్నాడు.

“మీరేమీ భయపడకండి. రైతు ఇప్పుడిప్పుడే చేను కొయ్యడు. ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడే హాయిగా వుండొచ్చు” అని పక్షి పిల్లలతో చెప్పింది.

కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు సారసపక్షి సాయంకాలం గూడు చేరుకొంది. అప్పుడు
పిల్లలు బితుకు బితుకుమంటూ ఇలా చెప్పాయి.

“మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్లాలి. ఈ రోజు రైతు మళ్లీ వచ్చాడు. ఊళ్లోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు రాలేదు. నేను నా అన్నతమ్ముల్ని పిలిపించి వాళ్లతో పంట కోయిస్తాను.”

సారసపక్షి హాయిగా, నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది “ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు. నాలుగైదు రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు. ఇప్పుడిప్పుడే మనం పాలం విడిచి మరో చోటికి పోనక్కర్లేదు.”

“అన్నతమ్ములు నా మాట వినడం లేదు. ఏదో ఓ నేపంతో తప్పించుకొంటున్నారు. పైరు బాగా ఎండిపోయి గింజలు నేల రాలిపోతు న్నాయి. రేపు పొద్దు పొడవగానే నేనే వచ్చి కోత మొదలెడ్తాను.”

అప్పుడు సారసపక్షి భయపడింది. “అరరే! వెంటనే బయలుదేరండి. ఇంకా చీకటి పడలేదు. మరో చోటికి వెళ్లి తలదాచుకొందాం. రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు.” అని.

పిల్లలు ఆదుర్దాగా అడిగారు “ఎందుకు వెళ్లాలి? రైతు రేపు పంట కోస్తాడన్న నమ్మకం ఏంటి?”


సారసపక్షి ఇలా బదులు చెప్పింది.  “రైతు గ్రామస్తులను, సోదరులను నమ్ముకొన్నంత కాలం పంట కోస్తాడన్న నమ్మకం కలుగలేదు. తన పని తాను చేయకుండా, ఇతరులు చేసి పెడ్తారని అనుకున్నంత కాలం ఎవరి పనులు జరగవు. కాని ఎవరంతట వారు, తమ పనులు చేసుకోవాలని నిర్ణయించుకొన్నప్పు డు, అవి చకచకా సాగిపోతాయి. రైతు తానే రేపు పంట కోస్తానని అన్నప్పుడు, ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది.” అన్నది.

సారసపక్షులు పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటికి ఎగిరిపోయ్యాయి.
ఆ మరుసటి రోజు రైతు తానే పనిముట్లు తెచ్చుకుని పంట కోత మొదలుపెట్టాడు.

నీతి: ఒకరి మీద ఆధారపడకుండా పనులు మొదలుపెడితేనే పనులు సజావుగా, చక్కగా సాగుతాయి.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday, 27 February 2024

తులసీదళం (28-Feb-24, Enlightenment Story)

 *తులసీదళం*

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

ఒక వ్యక్తి రోజూ అడవిలోకి వెళ్లి కూరాకులు కోసుకొచ్చి అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అలా అతను రోజూ అడవికి వెళ్లే దారిలో ఒక గుడిసె ముందు ఒక ముసలాయన ఏడుకొండల స్వామి విగ్రహం చిన్నది పెట్టుకుని తులసి ఆకులతో అర్చన చేసేవారు.


అది చూసి చాలా ముచ్చటపడేవాడు మనం కూడా ఇలా చేయాలి అని అనుకున్నాడు కాని చేయలేకపోయేవాడు అతను అడవిలో కూరాకులు కోస్తుంటే తులసి చెట్టు కనిపించింది. వెంటనే ఆ వ్యక్తి మనం ఎలాగూ పూజ చేయలేము ఇవి కోసుకెళ్లి ఆ భక్తుడికి ఇద్దాం అని అనుకున్నాడు.

కోసిన కూరాకులతో పాటు తులసి దళాలను కట్ట కట్టి నెత్తిన పెట్టుకుని వచ్చాడు. అతడికి తెలియని విషయం ఏంటంటే నల్లనాగు ఒకటి అందులో ఉన్నింది. ఇతను వెళ్లి గుడిసె ముందు నిలబడగానే ఎవరో వచ్చి నిలబడ్డారని తల తిప్పి చూసిన భక్తుడితో అయ్యా తులసి దళాలు తెచ్చాను పూజ నేను చేయలేను అందుకే మీకు ఇస్తున్నాను అని అన్నారు.

ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్న ఆ భక్తుడికి తన దివ్యదృష్టితో తులసి దళాలను తెచ్చిన వ్యక్తి  వెనుక రాహువు నిలబడి ఉండడం గమనించాడు. అతడితో నాయనా నేను చెప్పేవరకు ఈ తట్టను నీ తలపై నుండి దించకు అని చెప్పి గుడిసె వెనుకకు వెళ్ళి ఒక మంత్రం జపించగానే రాహువు వచ్చాడు.

రాహువుకు నమస్కరించి ఎందుకు అతడి వెనుక వచ్చావని అడగగా రాహువు ఆ భక్తుడికి నమస్కరించి నేను ఈరోజు అతడికి హాని  చేయాల్సి ఉంది అదే విధి రాత కాని అతను తన తలపైన తులసి దళాలను మొస్తున్నాడు అందుకే నా పని చేయలేకపోయాను, అతను అది దించగానే నేను కాటేసి వెళ్ళిపోతాను అని అన్నాడు.

ఈ విషయం వినగానే భక్తుడికి చాలా జాలేసింది ఎప్పుడూ రానివాడు ఈరోజు పూజకు దళాన్ని తీసుకురావడంతో ఇతడిని ఈ గండం నుండి తప్పించాలంటే ఏదైనా పరిష్కారం ఉందా అని అడిగినప్పుడు రాహువు, అయ్యా మీరు ఇన్ని రోజులు పూజ చేసిన పుణ్యాఫలాన్ని అతడికి దానం ఇచ్చినట్లైతే ఈ గండం నుండి తప్పించవచ్చు అని రాహువు చెప్పగానే, భక్తుల వారు ఏమీ ఆలోచించకుండా అతడికి దానం ఇస్తున్నాను అని చెప్పడంతో రాహువు ఆశ్చర్యపోయి సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ పాము మాయమైంది.*

ఒక్క తులసి దళం చేత ఇంత అద్భుతమా ఒక దానం ఇవ్వడం వల్ల ఒక్క ప్రాణం నిలబడడమా మనం సంపాదించుకున్న పుణ్య ఫలం ఇంత శక్తి గలదా  దేవతా గ్రహాలని బ్రహ్మ రాతను మార్చేంత శక్తి గలదా.

*భక్తుడు ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి ఇక నుండి రోజూ నాకు తులసి దళాలను తెచ్చి ఇవ్వాలి అని చెప్పాడు. సంతోషించిన ఆ వ్యక్తి అలాగే అని ఒప్పుకున్నాడు. ఆపదను తప్పించుకోవడానికి ఆస్తులే కూడబెట్టక్కరలేదు ఆ దేవదేవుని కమల చరణాలపై తులసీదళం పెట్టాలన్న ఆలోచనే ప్రాణాన్ని కాపాడునది. భగవంతుడే భగవద్గీతలో పలికాడు.*

*పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చతి |*
*తదహం భక్త్యుప్రహృత్మశ్నామి ప్రయతాత్మనః ||*


*ప్రేమతో భక్తితో ఎవడేని నాకు పత్రంమైనను, పుష్పంమైనను, ఫలమైనను చివరికి కొన్ని మంచి నీళ్ళు భక్తితో సమర్పించినా, నేను ప్రీతితో స్వీకరించెదను అంటున్నాడు. ఈ కలియుగంలో మానవుడు అశాశ్వితమని తెలిసి కూడా  మానవులు తీరిక లేకుండా భౌతిక సుఖాలకోసం వెంపర్లాడుతూ జీవితమును వృధాగా కాలక్షేపం చేస్తూ గడుపుతున్నారు.*

🚩సర్వేజనా సుఖినోభవంతు🚩

🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Monday, 26 February 2024

మనం ఏది చేస్తామో, అది పదింతలై మనకే చేరుతుంది (27-Feb-24, Enlightenment Story)

 మనం ఏది చేస్తామో, అది పదింతలై మనకే చేరుతుంది!

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀          

కారు ఆగిపోయింది. అందులోంచి దిగిన ఆమెకు 40 సంవత్సరాలు ఉంటాయి. దిగి చూసింది టైర్ పంక్చర్ అయ్యింది . స్టెఫినీ ఉందికానీ తనకు వెయ్యడంరాదు. రోడ్డు పక్కకు తీసి సహాయం కోసం చూస్తోంది. ఒక్కరూ ఆగడం లేదు.

సమయం చూస్తే,సాయంత్రం 6 దాటుతోంది. నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటున్నాయి . మనసులో ఆందోళన. ఒక్కతే ఉంది. తోడు ఎవరూ లేరు. చీకటి పడితే ఎలా? దగ్గరలో ఇళ్ళు లేవు. సెల్ పనిచెయ్యడం లేదు( సిగ్నల్స్ లేవు ). ఎవరూ కారునూ, పక్కనే నిలబడిన ఆమెనూ చూసినా ఆపడం లేదు. అప్పటికే దాదాపు ఒక గంట గడిచింది. ఎలారా దేవుడా అనుకుంటూ భయపడడం మొదలయ్యింది. చలి కూడా పెరుగుతోంది.*


అటుగా వెడుతున్న ఒక బైకు ముందుకు వెళ్లి పక్కకు తిప్పి వెనక్కు వచ్చింది. ఒక వ్యక్తి బైకు స్టాండ్ వేసి, ఈమె దగ్గరకు వస్తుండటంతో ... ఆమె సహజంగా భయపడింది.. ఎవరతను?  ఎందుకు వస్తున్నాడు? ఏమి చేస్తాడు?ఆందోళన !

అతను దగ్గరకి నవ్వుతూ వచ్చాడు. టైర్ లో గాలి లేదని చూశాడు. ఆమె బెదిరిపోతోందని గ్రహించాడు. భయపడకండి. నేను మీకు సహాయం చెయ్యడానికి వచ్చాను. బాగా చలిగా ఉంది కదా! మీరు కారులో కూర్చోండి. నేను స్టేఫినీ మారుస్తాను అన్నాడు.

ఆమె భయపడుతూనే ఉంది. నా పేరు రాముడు.  ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ లో పని చేస్తాను అన్నాడు.అతను డిక్కీ తెరిచి కావలసిన సామాను తీసుకుని ...కారు కిందకి దూరి జాకీ బిగించాడు.తారు రోడ్డు గీసుకొన్న రక్తపు చారాల చేతులతో జాకీ బిగించి టైరు తీసి టైర్ మార్చాడు. సామాను తిరిగి కారులో పెట్టాడు. ఆమె డబ్బులు తీసి ఇవ్వబొయింది . వద్దు అన్నాడు.

మీరు కాదనకండి. మీరు ఈ సహాయం చెయ్యక పోతే, నా పరిస్థితిని తలుచుకుంటే ... నాకు భయం వేస్తోంది అంది.
నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరు సహాయ పడ్డారు. మీకు సహాయం చెయ్యాలనిపిస్తే ... "ఎవరైనా కష్టాల్లో ఉన్నారనిపిస్తే నా పేరు తలచుకుని వారికి సహాయం చెయ్యండి" అని వెళ్లి పోయాడు.*

మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ ... ఆమె కారు నడుపుకుంటూ వెడుతోంది. అప్పుడు ఆమెకు ఆకలి గుర్తుకు వచ్చింది.తను వెళ్ళ వలసిన దూరం చాలా ఉంది. ఆకలి, చలీ ఆమెను రోడ్డుపక్కన ఉన్న హోటల్ కి వెళ్ళేలా చేశాయి.

అదొక చిన్న హోటల్. కస్టమర్ల టేబుల్స్ దగ్గరకి ఒక గర్భిణీ మహిళ సర్వ్ చేస్తోంది. ఆమెను చూస్తుంటే నిండు గర్భిణీ అనిపించింది. డెలివరీ రోజులు దగ్గరకి వచ్చేసి ఉంటాయి అనిపించింది. బరువుగా నడుస్తోంది. అన్ని టేబుల్స్ దగ్గరకీ వెళ్ళి కావలసిన ఆర్డర్ తీసుకోవడం, సర్వ్ చెయ్యడం బిల్ తీసుకుని ... చిల్లర ఇవ్వడం అన్నీ తనే చేస్తోంది. ఆమె ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వు.

ఆమె తన టేబుల్ దగ్గరకి వచ్చింది. చిరునవ్వుతో “ఏమి కావాలండి?” అని అడిగింది.అంత శ్రమ పడుతూ కూడా ... చెరిగిపోని చిరునవ్వు ఆమె ముఖంలో ఎలా ఉందో? అని, ఆశ్చర్య పడుతోంది, తను తన మనసులో. భోజనం ఆర్డర్ ఇచ్చింది. భోజనం చేసి ఆమెకు ... 2000 రూపాయల నోటు ఇచ్చింది.*

ఆమె చిల్లర తేవడానికి వెళ్ళింది. తిరిగి వచ్చేటప్పటికి ఈమె కనబడలేదు .. ఈమె కూర్చున్న టేబుల్ మీద ఉన్న గ్లాసు క్రింద ఒక కాగితమూ దానికింద ... నాలుగు 2000 నోట్లూ ఉన్నాయి.

ఆ కాగితం చదివిన హోటల్ మెయిడ్ కి కన్నీళ్లు ఆగలేదు. అందులో ఇలా ఉంది. చిరునవ్వుతో ఉన్న నీ ముఖం నీకు బాధలు లేవేమో అన్నట్టు ఉంది. నువ్వు నిండు నెలలతో పని చేస్తున్నావు అంటే ...*

*నీకు డబ్బు అవసరం అని అనిపిస్తోంది. నాకు ఒక మిత్రుడు సహాయ పడినట్టే అతడిని తలచుకుంటూ ...*
*నేను నీకు సహాయపడుతున్నాను. నువ్వూ ఇలాగే ఇతరులకు సహాయపడు." అని రాసి ఉంది..*
*హోటల్ మూసేశాక ఇంటికి వచ్చింది. అప్పుడే ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న భర్త చేతి కేసి చూసింది.  గీసుకు పోయిన చేతులు రక్తపు చారలతో ఉంది.*

*అతడి పక్కన మంచం మీదకు చేరుతూ, మనం దిగులుపడుతున్నాం కదా ... డెలివరీకి డబ్బులెలాగా అని…*
*ఇక ఆ బెంగ తీరిపోయిందిలే, రాముడు!  భగవంతుడే మనకు సహాయం చేశాడు. ఆయనకి కృతజ్ఞతలు” అంది ప్రశాంతంగా.*

*మనం ఎవరికయినా మనస్పూర్తిగా సహాయం చేస్తే అది ఎక్కడికీ వెళ్ళదు. మనం ఆపదల్లో ఉన్నపుడు తిరిగి మన దగ్గరకే ఏదోలా చేరుతుంది.”అన్నది ఆ కధ యొక్క పరమార్థం..!!*


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Sunday, 25 February 2024

మన పూర్వుల వైభవం (26-Feb-24, Enlightenment Story)

 *మన పూర్వుల వైభవం *

🌺🍀🌺🍀🌺🌺🍀🌺🍀

  • విమానం: రైట్ బ్రదర్ లు కనిపెట్టారు అని చెప్పిన వాడు. నీకు అంతకు ముందే పుష్పకవిమానం వుందని చెప్పలేదు
  • టెస్ట్ ట్యూబ్ బేబీ పుట్టిందని పండగ చేసినవాడు. 101 మంది కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీలే అని చెప్పలేదు3rd house అని మురిసిపోయే నీతో తరాల క్రితం మయసభ వుందని చెప్పలేదు.
  • చదువు విజ్ఞానం అని గొప్పలు పోయె నీకు. మొట్టమొదటి విశ్వ విద్యాలయం భారతదేశం లోదే అని తెలియదు.
  • ఆదిమానవుడి గీతలు ఆశ్చర్యంగా చూసే నీకు. అంతకు మునుపే తాళపత్ర గ్రంథాలను రాశారు అని తెలియదు.
  • లేజర్ సర్జరీ అని డప్పు కొట్టుకొనే నీకు. సుశ్రుడు చేసిన వైద్యం తెలియదు. గండు చీమలతో చరకుడు చేసిన శస్త్ర చికిత్సలు తెలియదు. ఎందుకంటే, ఇలాంటి ఎన్నో నీకు తెలియకుండా చేశారు. నీ దేశపు గర్వాన్ని నీ చేతితోనే తుడిపించారు.

  • గండు చీమలతో చరకుడు చేసిన శస్త్ర చికిత్సలు తెలియదు 

  • ఓ మేధావి నీకు నిజంగా స్పృహ వుంటే ఒక్కటే తెలుసుకో. ఆ బ్రిటీష్ వాళ్ళు పూర్వీకులు గాడిదల మీద తిరగటం కూడా రాక మునుపే, నీ తాత ముత్తాతలు గుర్రాలు పూన్చిన రథం మీద బంగారు నగలు ధరించి తిరిగే వారు.

  • వాళకి స్నానం తెలియక తోలు చుట్టుకు తిరగక ముందే నీ తాత ముత్తాతలు సుగంధ ద్రవ్యాలతో స్నానాలు చేసేవారు.


🚩🕉️🚩 *జై శ్రీ రామ్*🚩🕉️🚩


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...