*మాయ యొక్క ప్రభావమును తప్పించుకోవడం*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
పరమాత్మ పాదాలు ఆశ్రయిస్తే మనం ఎలా రక్షింపబడతాము. ఆ స్వామి పాదాలచెంతకు మనం చేరగలిగితే మనకిక ఏచింతా వుండదు.
అది ఎలానో వివరిస్తాను....
ఒక బెస్తవాడు చెరువులో చేపలు పట్టడానికి…. వలను చెరువులోనికి విసురుతూవుంటాడు. ఆ వలలో చిక్కుకొని ఎన్నో చేపలు ప్రాణాలు కోల్పోతుంటాయి. ప్రతిరోజు అదే విధంగా జరుగుతూ వుంటుంది రోజురోజుకూ చేపలసంఖ్య తగ్గిపోతూవుంటుంది. అప్పుడు ఆ చేపలకు ఒక ఆలోచన వచ్చింది….
ఆ బెస్తవాడికి దూరంగా మనము వుంటున్నాము కనుకనే వలలో చిక్కుతున్నాము. అదే అతని పాదాలచెంత చేరామంటే వలలో పడబోము!’అనుకొని అన్నీ అతని పాదాలచెంతకు చేరుకున్నాయి.
ఆరోజునుండి ఏచేపకూడా వలలో చిక్కుకోలేదు! వాటి ప్రాణాలను కాపాడుకోగలిగాయి. మనకు వచ్చే కలతలు కష్టాలు కూడా ఆ వలలాంటివే!
కాలం ఎప్పుడూ మనపై ఏదో ఒక మాయ అనే వల విసురుతూనే వుంటుంది! వాటికి భయపడకుండా మనము ఆ పరమాత్మ పాదాలు ఆశ్రయిస్తే మనకు తప్పక రక్షణ దొరుకుతుంది.
’మన భారం అంతా ఆ తండ్రే చూసుకుంటాడు !’ అనే నమ్మకంతో వుండగలగాలి! అంతే... భగవంతుని పాదాలు ఆశ్రయించినవారికి మాయ దారి ఇస్తుంది! అంటే వారి పై మాయ యొక్క ప్రభావం పని చేయదు.✍️
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
Excellent sir.
ReplyDelete