*బ్రహ్మము గురించి బ్రహ్మమై చెప్పాలి*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
మనం పూజగదిలోనే దేవుడికి పరిమితమై ఉంటాం. బయటికి వచ్చాక దేవుడితో సంబంధం లేకుండా ఉంటాం. అలా భౌతికం, ఆధ్యాత్మికం అని రమణమహర్షిగారు విడదీయరు. నువ్వు ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తున్నా దేవుడికి చేస్తున్నావని తెలుసుకోవాలి. నీ పని నువ్వు చేస్తున్నప్పుడు కూడా అది నీ సొంతం అనుకోకుండా దేవుడు నీకు పురమాయించిన పనినే నువ్వు చేస్తున్నావు అని తెలుసుకోవాలి.
Everything happens in its own time.
భౌతికమైనా, ఆధ్యాత్మికమైనా నువ్వు ఆత్రుత పడినంతమాత్రాన జ్ఞానం రాదు. మామిడికాయను సరైన సమయానికి అంటే పక్వానికి వచ్చినప్పుడు మగ్గేస్తే పరవాలేదు. ఈ లోపు కంగారుపడి మగ్గేస్తే ముగ్గదు సరికదా కుళ్ళిపోతుంది. భౌతికమైన విషయాలైనా, ఆధ్యాత్మికమైన విషయాలైనా అంతే. నీ చేతిలో ఉన్నపని నువ్వు చేస్తూ జ్ఞానానికి కూడా కంగారు పడకూడదు. నీకెప్పుడు తెలియబడాలో ఆ సద్వస్తువు నిర్ణయించుకుంటుంది. మనకు రేపు మరణం రావాలని ఉంటే రేపే వస్తుంది గాని ఇవాళ రాదు కదా!
భౌతికమైన సంఘటనలు అయినా, ఆధ్యాత్మికమైన అనుభవాలు అయినా ఏవి ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలో అలా జరుగుతాయి. ఇక్కడ రహస్యం ఏమిటంటే, నువ్వు Deserve అయితే నీకు Desire అక్కర్లేదు. యోగ్యత కలిగినప్పుడు కోరికతో సంబంధం లేకుండా భగవంతుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు యోగ్యత లేనప్పుడు కోరిక ఉన్నా అది నీకు లభించదు అనేది సూత్రం.
☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment