*భక్తియోగం*
🍁🍁🍁🍁
భక్తియోగంలో భక్తుల గురించి, వారికి ఉండవలసిన లక్షణముల గురించి పరమాత్మ వివరించాడు. వాటిని ఒక్కసారి పరిశీలిద్దాము.
- ఎవరినీ ద్వేషించకూడదు.
- అతి మమకారము పనికిరాదు
- అహంకారము అసలు పనికిరాదు.
- అందరి పట్ల కరుణ దయ కలిగి ఉండాలి.
- నుఖదుఃఖములు సమంగా చూడాలి.
- అన్ని సందర్భములలో ఓరుకలిగి ఉండాలి..
- ఎప్పుడూ సంతోషంగా, సంతుష్టిగా ఉండాలి.
- మనసును అదుపులో ఉంచుకోవాలి.
- చంచల స్వభావం కాకుండా ధృఢమైన నిశ్చయం కలిగి ఉండాలి.
- మనసును, బుద్ధిని ఆత్మలో ఉంచాలి.
- భయం అనేది వదిలిపెట్టాలి. తాను ఎవరికీ భయపడకూడదు, ఇతరులను భయపెట్టకూడదు.
- కోపం వదిలిపెట్టాలి, ఎక్కువ ఆనందము, ఎక్కువగా భయపడకూడదు.
- దేని మీద ఎక్కువగా మమకారము. అపేక్ష కలిగి ఉండకూడదు.
- ఎల్లప్పుడూ శరీరమును, మనసును శుభ్రంగా ఉంచుకోవాలి.
- ప్రతి కార్యమును శ్రద్ధతో సమర్థతతో చేయాలి, చెయ్యాల్సివచ్చిందే అని చేయకూడదు.
- దేని మీద అత్యధికమైన ప్రేమ, పక్షపాతము చూపకుండా తటస్థంగా ఉండాలి.
- మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఏ వ్యాకులత చెందకూడదు.
- ఏ పని చేసినా ఫలితం ఆశించకుండా చేయాలి. ఆ ఫలితమును పరమాత్మకు అర్పించాలి.
- తనకు సుఖం కలిగి నపుడు పొంగి పోయి నా అంతవాడు లేడనకూడదు.
- ఇతరులమీద ఎట్టి పరిస్తితుల మీద అసూయ పడకూడదు. ద్వేషించకూడదు.
- అన్ని కాలాలలో చిరునవ్వుతో ఉండాలి ఏడుస్తూ ఉండకూడదు.
- కోరికలను అదుపులో ఉంచుకోవాలి, కోరికలను విడిచిపెడితే మరి మంచిది.
- శుభము, అశుభము రెండింటినీ సమానంగా అనుభవించాలి.
- శత్రువులు మిత్రులను సమానంగా ఆదరించాలి.
- మానము అవమానము రెండింటినీ చిరునవ్వుతో భరించాలి.
- ఒకప్పుడు పొంగి పోవడం మరుక్షణం కుంగి పోవడం పనికిరాదు.
- అనవసరమైన విషయాలలో ఆసక్తిని వదిలిపెట్టాలి.
- కాలానుగుణంగా వచ్చే ఎండ చలి వర్షము వీటిని సమత్వభావంతో భరించాలి..
- ఎవరు మనలను నిందించినా, పొగిడినా చిరునవ్వుతో స్వీకరించాలి.
- సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి.
- ఏదొరికితే దానితో తృప్తి చెందాలి, లేని దాని కోసం పాకులాడకూడదు.
- ఉన్న స్థలము శుభ్రంగా ఉంచుకోవాలి.
- ఎల్లప్పుడూ స్థిరమైన బుద్ధి కలిగి ఉండాటి చంచలత్వము పనికిరాదు.
- ఈ అనంత విశ్వానికి అధిపతి అయిన పరమాత్మ ఎడల భక్తి కలిగి ఉండాలి. ఇవి కేవలం భక్తులకే కాదు సాధారణమానవులుకూడా ఆచరించవలసిన లక్షణములు. భక్తులు ప్రతిరోజూ పరమాత్మను పూజిస్తారు. దానికి పత్రం, పుష్పం, ఫలం, తోయం సరిపోతాయి అని చెప్పాడు పరమాత్మ.
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/@Enlight66
*మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃
No comments:
Post a Comment