🪷శ్రీనివాసుడి పెళ్లి భోజనాలు పెళ్లి విందు తయారీ 🍌🍌🍛🍲🍯 🪷
🍁🍁🍁🍁🍁🍁 🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁 🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
🪷స్వామివారి కల్యాణం చదివితే కలియుగంలో మధ్యతరగతి కుటుంబాలలో కల్యాణం చెయ్యడమెంత కష్టమో తెలుస్తుంది .
🙏కుబేరుడు నుండి అప్పు దొరికి,అన్నీ పెళ్లి సరుకులు తెచ్చాక ఇవన్నీ తెచ్చుకోవడం ఒక ఎత్తు , వచ్చేవాడు మనఇంటికి భోజనానికి లేక వస్తాడా ? ఇప్పటి కిప్పుడు ముహూర్తం పెట్టుకుంటే వంట బ్రాహ్మణుడు ఎక్కడ దొరుకుతాడు ? అనుకున్నారు .
🪷స్వామి అగ్నిహోత్రుని వంక చూస్తే “ నేను చేస్తాను స్వామి ! ” అన్నాడు .
🪷కానీ వంటపాత్ర సామానులేవి ? అన్నాడు అగ్నిదేవుడు.
🪷అగ్నిదేవుడు, వంట చేయడానికి పాత్రలు కావాలనడంతో వేంకటాచలం మీదనున్న తీర్ధాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు.
🌺నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం. వందల్లో వస్తే పెద్దపెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది.
🪷కానీ ఈయన పెళ్ళికి సమస్త బ్రహ్మాండం అంతా దిగివస్తుంది.
🪷కొన్ని కోట్ల మంది వస్తారు.
🪷అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి.
🪷పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్ధాలు తిరుమలలో కొలువై ఉన్నాయి.
🪷అగ్నిహోత్రుడు పాపనాశనంలో పైన చింతపండు పిసికి పోసేయండి . కింద నేను పులుసు చేసేస్తాను అన్నాడు .
🪷ఒక్కో తీర్ధంలో / సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు.
🪷స్వామి పుష్కరిణిలో @ అన్నం,
🪷పాపనాశనంలో @ పప్పు,
🪷ఆకాశగంగలో @ బెల్లం పరమాన్నం,
🪷దేవతీర్థంలో @ కూరలు,
🪷తుబురతీర్ధంలో @ పులిహోర,
🪷కుమార తీర్ధంలో @ భక్ష్యాలు (బూరెలు, పూర్ణాలు,బొబ్బట్లు వంటివి),
🪷పాండుతీర్ధంలో @ పులుసు,
🪷ఇతర తీర్ధాల్లో @ లేహ్యాలు మొదలైని తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడిని ఆజ్ఞాపిస్తాడు.
🪷అలన్నిటిలోనూ పప్పులు ,పులుసులు , చక్కెర పొంగళ్లు ,కట్టు పొంగళ్లు , జీలకర్ర పొంగళ్లు , ఎన్నో రకాల పొంగళ్ళు , పులిహోర పొంగళ్ళు చేసారు .
🪷వడ్డన చేయాలి కూర్చోమని అన్నారు.
🌺భోజనాల బంతులు వేంకటాచలం నుండి శ్రీశైలంవరకు వేశారు .
🪷భోజనాలు సిద్ధం అయిన తరువాత నివేదనకు ఏర్పాట్లు చేస్తాడు బ్రహ్మదేవుడు.
🪷నైవేద్యం పెట్టిన తరువాతే అతిథులందరీకి వడ్డన.
🪷"నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిధులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు, అది సంప్రదాయం కాదు" అంటాడు స్వామి.
🪷మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి.
🪷మనకు అది ఎప్పుడు గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలవి.
🪷మరి నివేదన చేయని పదార్ధాలను అతిధులెవ్వరూ ముట్టుకోరు, మరి నివేదన ఎవరికి చేయాలి? అంటాడు బ్రహ్మ.
🪷ఇదే కొండ (శేషాచలం) మీద, అహోబలంలో (ఈనాడు అహోబిలం) నరసింహస్వామికి నివేదన చేసి అందరీకి నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు.
🪷సాక్షాత్తు బ్రహ్మ అహోబల నరసింహస్వామికి నివేదన చేస్తారు.
🌺 తిరుమల కొండ శేషాచలం పర్వతం మీద ఉంది.
🪷 శేషాచలం అంటే సాక్షాత్తు ఆదిశేషుడు.
🪷వీటిని ఆకాశం నుంచి చూసిన పాము ఆకారంలో ఈ కొండలు దట్టమైన అడవులతో కనిప్సితాయి.
🪷 శేషాచలం కొండలు చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లావరకు వ్యాపించి ఉన్నాయి.
🪷ఆదిశేషుడి తలపై శ్రీనివాసుడి, నడుమ భాగాన అహోబిల నృసింహుడు, తోక భాగాన శ్రీశైలంలో మల్లిఖార్జునుడు భ్రమరాంభ సమేతంగా వెలసి ఉన్నారు.
🪷చక్కగా శివుడు అతిధులందరినీ కూర్చోబెట్టే బాధ్యత శివుడు తీసుకున్నాడు.
🪷పాండు తీర్ధం (గోగర్భం డ్యాము నుంచి దక్షిణగా కొద్ది రూరంలో ఉంది.
🪷ఇప్పటికి చూడవచ్చు) నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళను (ఆకులను) ఆశీసులు చేశాక అందరికి ఒకేసారి వడ్డించారు.
🌺 భోజనాలు వడ్డన 🌺
🌺ముందు విస్తళ్ళపై నీరు చల్లి, తుడిచి, పాత్రశుద్ధికి కొంత నెయ్యి వడ్డించి, సంస్కారపూర్వకంగా ఉప్పు,శాస్త్రం ప్రకారం ఇతర పదార్ధాలు వడ్డించారు.
🪷వడ్డన పూర్తి అయ్యాక అగ్నిదేవుడు వడ్డన పూర్తయ్యిందన్న విషయం శ్రీనివాసుడికి చెప్పగా, అందరిని ఉన్నంతలో ఏర్పాట్లు చేసాను,లోటుపాట్లు ఉంటే మన్నించి అందరూ భోజనాలు చేయండి అని వేడుకున్నాడు.
🪷అందరి భోజనాలు ముగిశాకా, అందరికి దక్షిణతామ్మూలాలు శ్రీనివాసుడు ఇచ్చాడని పురాణ వచనం.
🌺అందరూ భోజనాలు చేసి ,బ్రేవుమని త్రేన్చి కూర్చున్నారు .
🪷అందరినీ భోజనమైందా అని పేరు పేరునా అడిగిన తరువాత శ్రీనివాసుడు, వకులమాత, మన్మథుడు, లక్ష్మీదేవి, శివుడు,బ్రహ్మ, గరుత్మంతుడు, ఆదిశేషుడు కలిసి భోజనం చేశారు.
🪷 వీరి భొజనాలు మిగిసేసరికి సూర్యాస్తమయం అయిందని పురాణంలో కనిపిస్తుంది.
🪷అందరి భోజనాలు పూర్తయ్యాక, రాత్రికి అక్కడే గడిపేసి, తెల్లవారుఝామునే మంగళవాయిద్యాల నడుమ మగ పెళ్ళివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది.
గోవిందా గోవిందా.. శ్రీనివాసా గోవిందా....
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
VENKATESA PAHIMAM,
ReplyDeleteSRINIVASA RAKSHAMAM.