*పాలు...ఈశ్వరా !!*
🍁🍁🍁🍁🍁🍁 🍁🍁
🎻🌹🙏ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు.
అప్పుడు పాలు...ఈశ్వరా !!
నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మనసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి భాదపడిందట.
అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి...
- ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు.
- పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు.,
- పెరుగుని చిలికి చల్ల ని చేస్తే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు.
- అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో నెలలు తరబడి బ్రతుకుతావు.
- ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు..
- ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా... అని ఈశ్వరుడు ప్రశ్నించారు..
- దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది...
మానవుడు కూడా అట్లాగే.. ఎవరో తమ మనస్సుని విరిచేసారు అని మనస్సుని పాడుచేసుకుని బాధపడేకంటే.. క్షీరము వలె మనస్సు లో ఆధ్యాత్మికత అనే తోడు వేసి, ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామ స్మరణతో చిలికి , దానిని దైవ చింతనం తో కాచి, దానిలోంచి వచ్చిన జ్ఞానం తో ఎప్పుడు ఎప్పుడా అని ఆ ఈశ్వరుని లో ఏకమవటానికి ఎదురు చూస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి...🌞🙏🌹🎻
🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు 🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు! ఓం నమో భగవతే వాసుదేవాయ
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂🍂🍃🍂🍃🍂🍃
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment