ధర్మో రక్షతి రక్షితః
🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥
ధర్మో రక్షతి రక్షితః అనే వాక్యం వాల్మీకి రచించిన రామాయణంలోని ఒక శ్లోకంలోనిది.ఈ వాక్యం అర్ధం "ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది".
ధర్మం వైపు ఉన్నవారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని మన ఇతిహాసాల్లో అనేక ఉదాహరణలున్నాయి. రామాయణంలో రావ ణుని తమ్ముడు విభీషణుడు రాముని పక్షం వహించినట్లే... | మహాభారతంలో కౌరవుల నుంచి ఒకడు పాండవ పక్షం వహిం చాడు. మహాభారత యుద్ధం ముగిసేనాటికి బతికిబట్టగట్టిన 11 మందిలో అతడూ ఒకడు. అతడే యుయుత్సుడు. కౌరవులలో మిగిలిన ఏకైక వ్యక్తి.
ధృతరాష్ట్రుడు, పాండురాజుల పుట్టుకకు కారకుడైన వేద వ్యాసుడు మహాభారతాన్ని రచించాడు. అతడు ఒకరోజు హస్తినాపురాన్ని సందర్శించాడు. ధృతరాష్ట్రుని భార్య గాంధారి ఆయనకు భక్తిశ్రద్ధలతో అతిథి మర్యాదలు చేసింది. ఆమె సేవలకు మెచ్చి వ్యాసుడు వరం కోరుకోమన్నాడు. 'నాకు వందమంది సంతానం కావాల'ని గాంధారి అంది. వ్యాసుడు ఆ వరమిచ్చి వెళ్ళిపోయాడు.
వరాన్ని పొందిన రెండేళ్ల తర్వాత గాంధారి కౌరవులతోపాటు 'దుస్సల' అనే పుత్రికనూ కన్నది. కౌరవులు అనగానే దుర్మార్గత్వం. దుష్టత్వం గుర్తుకొస్తుంది కదా! కానీ కురు వంశం లోనే ధర్మాన్ని ఆచరించే యుయుత్సుడు అనేవాడు కూడా జన్మిం చాడు. ఇతడు గాంధారికి పుట్టిన వాడు కాదు. 'సుగధ' అనే వైశ్య దాసి ద్వారా ధృతరాష్ట్రుడు కన్న పుత్రుడు. గాంధారికి సంతానం కలగడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆందోళన చెందిన ధృతరాష్ట్రుడు సుగధను చేరదీశాడు. దుర్యోధ నుడు, ఇతర కౌరవులు పుట్టిన రోజే యుయుత్సుడు కూడా జన్మిం చాడు. అయితే చిన్నప్పటి నుంచి దాసి పుత్రునిగా అతడికి అవమా నాలు ఎదురయ్యాయి. అయినా వాటిని పట్టించుకోకుండా సకల విద్యలూ అభ్యసించాడు. 60 వేల మందిని ఒక్కసారిగా ఎదుర్కొన గలిగిన 'అతిరథు'ని హోదా అతడిది. కౌరవుల వైపు ఉన్న అతి రథుల్లో అతడు ఒకడు. అటువంటి యుయుత్సుడు మొదటి నుంచీ వారి చేతుల్లో అవమానాలు పడుతున్నందువల్లా, వారి దుష్టత్వం తెలిసినందు వల్లా కురుక్షేత్ర మహా సంగ్రామంలో పాండవుల పక్షం వహించాడు. కౌరవులకు సంబంధించిన రహస్యాలు పాండవులకు
చెప్పి వారి విజయానికి తోడ్పడ్డాడు.. కలియుగం ప్రారంభం అవ్వడంతో పాండవులు అర్జునుని కుమారుడైన పరీక్షిత్తుకు సింహాసనం అప్పగించి యుయుత్సుని అతడికి సంరక్షకునిగా నియమించి హిమాలయాలకు వెళ్లి. పోయారు. ఆ విధంగా ధర్మం వైపు నిలిచిన యుయుత్సునికి మేలు చేకూరింది.
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
పరీక్షిత్తు ఉత్తర, అభిమన్యుల కొడుకు. పాండవుల మనుమడు.
ReplyDelete