✨*మానవత్వం అంటే ఏమిటో ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం*
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
సుధాకర్ నేను ఒక ప్రయివేట్ ఆఫీస్ లో పనిచేస్తాం. త్వరలో ఇచ్చే ప్రమోషన్ కి మా ఇద్దరికీ అన్ని అర్హతలు ఉన్నాయి. సోమవారమే ఇంటర్వ్యూ.
ఈ ప్రమోషన్ తో జీతం, హోదా రెండు పెరుగుతాయి. దీని వలన నా అహం తృప్తి పడితే సుధాకర్ కి అవసరం తృప్తి పడుతుంది. అవును వాళ్లది మధ్యతరగతి కుటుంబం. ఆర్ధిక అవసరాలు ఎక్కువ. నాకు డబ్బు కంటే హోదా ముఖ్యం. తండ్రి ఇచ్చిన ఇల్లు, పొలం ఉండడం వలన పెద్దగా డబ్బు అవసరాలు లేవు. అయినా ఈ ప్రమోషన్ నాకే రావాలి. లేకపోతే తన కింద సబార్టినేట్ గా ఉండాలి.
ఆ ఊహే భరించడానికి ఇబ్బందిగా ఉంది. ఎలా? ఏం చేస్తే ఈ ప్రమోషన్ నాకే వస్తుంది?..నా ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు. చటుక్కున ఒక అలోచన వచ్చింది..అసలు సుధాకర్ ఇంటర్వ్యూకి హాజరు అవ్వకపోతే!! ఈ ఐడియా నాకు బ్రహ్మాండంగా నచ్చేసింది.
ఏం చేసి సుధాకర్ ని ఆపాలి? ఆలోచనలలో మునిగిపోయాను. ఇంతలో 'ఇదిగో మిమ్మల్నే..ఎన్నిసార్లు పిలిచినా పలకరేం? మీ సుపుత్రుడు ఏం ఘనకార్యం చేసుకొచ్చాడో తెలుసా' అని నా శ్రీమతి అరిచేసరికి ఉలిక్కిపడ్డాను.
ఏం చేసాడు నా బంగారుతండ్రి?'శారదతోపాటు వచ్చిన కృష్ణని దగ్గరకు తీసుకుని అడిగాను. పదేళ్ల కృష్ణ తలవంచుకున్నాడు. 'నేనే చెప్తాను లెండి' అంది శారద.
నిన్న జరిగిన జిల్లా స్థాయి వ్యాస రచన పోటీలో సరిగ్గా రాయకుండా వచ్చాడట. కావాలనే..వాళ్ల మేడమ్ నాకు ఫోన్ చేసి చెప్పింది. బహుమతి ఐదు వేలు. అ వంశీకి వచ్చిందిట'.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కృష్ణ చాలా బ్రిలియంట్. అన్నింటిలోనూ ముందుంటాడు.'ఏంటి కన్నా..ఒంట్లో బాగోలేదా? ఆదుర్దాగా అడిగాను.
'అదేం లేదు డాడి..'మెల్లిగా అన్నాడు.
మరి..నీకు తెలియని టాపిక్ ఇచ్చారా?'
లేదు..చాలా ఈజీదే..'మరి..నాకు క్రమంగా కోపం వచ్చేస్తోంది.
డాడీ . వంశీ వాళ్లు చాలా పూర్..వాడు ప్రతీ సారి స్కూల్ ఫీజు కట్టడానికి కూడా ఇబ్బంది పడతాడు..లేటుగా కడతాడని మేడమ్ బయట నిలబెడతారు కూడా..నేను హెల్ప్ చేద్దామంటే వాడు ఒప్పుకోడు..అందుకని ...అందుకనీ..పొటీలో మేమిద్దరం ఫైనల్ లో ఉన్నాం. ఒక వేళ నేను సరిగ్గా రాయకపోతే తప్పకుండా వాడికే ఫస్ట్ వస్తుంది. ఆ డబ్బుతో వాడు ఫీజ్ కడితే బయట నిలబడనక్కరలేదు కదా....నేను చేసింది కరెక్టే కదా డాడీ.?
నా బుర్ర ఎపుడో పని చేయడం మానేసింది. పదేళ్లు లేని నా కొడుక్కి ఉన్న పాటి మంచి ఆలోచన నాకు రాలేదు..వాడి పెద్ద మనసు ముందు నేను మరుగుజ్జుని అయిపోయిన భావన నన్ను తలదించు కునేలా చేసింది. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేశాను.
కన్నా.. చాలా మంచి పని చేశావురా(.ఒకటి కాదు రెండుసార్లు మనసులో అనుకున్నాను.) నీకు మంచి గిఫ్ట్ ఇద్దామనుకుటున్నాను. ఎప్పటి నుండో అడుగుతున్నావుగా మనం ఊటీ ట్రిప్ కి వెళ్తున్నాం.'
మా వాడి ఆనందానికి అవధుల్లేవు. థాంక్యూ.. డాడీ అంటూ నన్ను వాటేసుకుని ముద్దులు కురిపించాడు. ఇపుడే మా ఫ్రెండ్స్ కి చెప్తాను అని పరుగు తీస్తున్న వాడిని ఆపి ఇంతకీ టాపిక్ ఏంట్రా అని అడిగాను. 'మానవత్వం' అని చెప్పి తుర్రుమన్నాడు.
నిజానికి పసిపాపలే మనకు అసలు సిసలైన గురువులు. ప్రతి ఇంటికి తన కానుకగా ఆ దైవం ఇచ్చింది భగవద్గీత లాంటి అపసి పిల్లలే. అందుకే బడి పాఠాలు వాళ్లకు మనం నేర్పితే బ్రతుకు పాఠాలు వాళ్లే మనకు నేర్పుతారు. అందుకే మన వొడిలోని దైవాన్ని వదిలి గుడిలో వెతకకండి మిత్రులారా!
🌻🌹🪷🏵️🦚🌈🌻🌹🪷🏵️🦚🌈🌻🌹🪷🏵️🦚🌈🌻🌹🪷🏵️🦚🌈🌻🌹🪷🏵️🦚🌈
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment