Tuesday, 4 July 2023

ముళ్ళపూడి ముత్యాలు

 ముళ్ళపూడి ముత్యాలు

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥

✍🏿"నేను సిగరెట్లు త్రాగడం మానేసాను తెలుసా? " అన్నారు దర్పంగా ఆరుద్ర. "అదేం పెద్ద గొప్ప ! నేను అలా చాలాసార్లు మానేసాను " అన్నారు ముళ్ళపూడి వారు.✍🏿

✍🏿"ముళ్ళపూడి వారి దగ్గరకు వచ్చాడు. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ ఆ యన రమణగారితో  "మద్రాసులో ఎక్కువగా  అరవ వాళ్ళే వుంటారు కదా ! వాళ్ళ మధ్యలో తెలుగు వాళ్ళను పోల్చుకోవడం ఎలా ? " అనడిగాడు. దానికి రమణగారు తన మార్కు జవాబిచ్చారు.

ఏముందీ ? మీరు పేపర్ కొని చదువుకుంటుంటే, మధ్యలో ఆ పేపర్ని ఎవరు అడిగి తీసుకుంటారో వాడే తెలుగువాడు " అన్నారు.✍🏿"

✍🏿 మీ వ్రాత ఇలా వుంటుంది ? " అన్నాడట ఓసారి ముళ్ళపూడి వారి పుస్తకాన్ని ప్రచురణకు సిద్ధం చేస్తున్న కంపోజిటర్.  అందుకేనయ్యా ! నా రాత ఇలా వుంది అని ముళ్ళపూడి వారి సమాధానం.✍🏿

✍🏿 వాక్య విన్యాసంలో కూడా రమణ మంచి నేర్పరి.

✍🏿అవినీతి కధలు కాదు అవి నీతి కధలు” అనడం,

✍🏿“సిగరెట్టులు తెల్లగాఉంటాయి –అగ రొత్తులు నల్లగాఉంటాయి.

✍🏿 గోడ మీద గుచ్చి కాలుస్తారు, సిగరెట్టులు నోట్లో పెట్టుకు కాలుస్తారు”అని.

✍🏿బాబాయ్ సంజె వారుస్తాడు, బామ్మ గంజి వారుస్తుంది.” ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

నుడికారాలు,సామెతలు వాడుకలో ఉన్నవాటిని ప్రయోగించినప్పుడు వక్త ఒక అర్ధంలో అంటే శ్రోత ఇంకో అర్ధం చేసుకున్నట్టు సృష్టించి సన్నివేశం హాస్యస్ఫూర్తితో తీర్చిదిద్దేవారు.

✍🏿“నా మొహంలా ఉంది అంటే – ఏదో నీ అభిమానం కొద్ది మెచ్చుకుంటావు” అన్న సందర్భాలు.

✍🏿“వీళ్ళు ఎక్కడ్నుంచి వచ్చారండి మన ప్రాణానికి అని వక్త అంటే – అడ్రెస్సు తర్వాత కనుక్కుందాం” అని శ్రోత వ్యంగ్య సమాధానాలు.

✍🏿నువ్వెందుకు పనికొస్తావు అంటే – నేనాండి అని తాను చెయ్యగలిగే పనులు చెప్పడం”. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో….

✍🏿భాషను వాడుకోవడంలో రమణ చూపినలా ఘవం పాఠకులని పరవశుల్ని చేస్తుంది. కాడిలాక్ కారున్నవాడిని కాడిలా కియర్ అని,

✍🏿 బతికే పద్ధతిని అప్పోమానియా అని, సినిమాలు తీసేవారు సినిమా కారులు అని, సినిమాల పిచ్చి ఉండడం సినీమేనియా అని. సినీ జీవులకి సంబంధించిన కొత్త జబ్బుని కూడా కనిపెట్టారు మన రమణ – అదే సెరిబ్రల్ సినేరియా. అంతే కాదండోయ్, రమణ గారు-బాపు గారు

✍🏿అద్దెకుండే ఇంట్లో రాత్రి పూట హాలులో మందు పార్టీ పెట్టుకునేవారట, దానికి రమణగారు పెట్టిన పేరు “ఆల్కహాల్”. ఇలా పదప్రయోగంలో ఎన్నో కొత్తపోకడలు పోయారు రమణ. పదాలతో ఆడుకున్నారు. వాటిలో రెండు వేరు వేరు పదాలను ఏకకాలం లో ప్రయోగించి కొత్త అర్ధాన్ని కల్పించిన ప్రతిభ రమణది.

✍🏿అందులో క్రిటికా తాత్పర్యాలు (క్రిటిక్ టీకా తాత్పర్యాలు అని) లాంటి పదా లు కోకొల్లలు.

✍🏿ఇలా చెప్పుకుంటూపోతే ముళ్ళపూడి వారి రచనలలో పదాలు,సామెతలు,వాక్యాలు కొత్త కొత్తగా మనల్ని నవ్విస్తాయి, కవ్విస్తాయి.హాస్య రచనలలో రమణ గారిది ఫోర్జరీ చెయ్యలేని సంతకం.

✍🏿హాస్యం,వెటకారం,సూటి మాటలు, వేళాకోళాలు,వ్యంగ్యం, చమత్కారం – ఇంత “కలాపోస న” మన ముళ్ళపూడి రమణీయుడికే సాధ్యం !!

మడిసన్నాక కూసింత కలాపోసనుండాలోయ్ !!

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...