Thursday, 6 July 2023

దొంగతనంగా దానం చేసేవాళ్ళు (12-July-23, Enlightenment Story)

దొంగతనంగా దానం చేసేవాళ్ళు 

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥

దొంగతనంగా మందు తాగేవాళ్ళను చూసుంటారు, దొంగతనంగా పేకాడే వాళ్ళని చూసి ఉంటారు, దొంగతనంగా ఎన్నో రకాల పనులు చేసే వాళ్ళని కూడా చూసి ఉంటారు కానీ దొంగతనంగా దానం చేసేవాళ్ళు మాత్రం చాలా అరుదుగా ఉంటారు వాళ్ళల్లో రాళ్ళపల్లి గారు ఒకరు...

మహానటి సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది కదా గురూజీ, Yes Exactly, సావిత్రి గారి లాగే రాళ్ళపల్లి గారు కూడా ఇంట్లో సామాన్లు అమ్మి మరీ దానం చేసేవారు, జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా వచ్చి మా అమ్మకు బాలేదనో, నా భార్యకు బాలేదనో చెప్తే చాలుఆయన మనసు కరిగిపోతుంది, సార్ నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటే చాలు ఆయన కరిగి ముద్దయిపోతాడు, అది ఆయన వ్యక్తిత్వం, అదే ఆయన అసలు గుణం... 

ఊటీలో షూటింగ్, రాళ్ళపల్లి గారికి పదివేలు రెమ్యూనరేషన్, ఆయనకు ఒక రూం ఇచ్చారు, ఆ రూమ్ కిటికీ దగ్గర నిలబడి టీ తాగుతుంటే కింద జూనియర్ ఆర్టిస్ట్ చలికి వణుకుతూ కనిపించాడు, అంతే... ఆయనకు రావాల్సిన రెమ్యునరేషన్ ముందే తీసుకుని, అప్పటికప్పుడు బయటకు వెళ్ళి వంద శాలువాలు కొనుక్కుని తెచ్చి జూనియర్ ఆర్టిస్టులందరికీ పంచిపెట్టాడు...

రాళ్ళపల్లి గారు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు మాత్రమే కాదు గొప్ప క్యారెక్టర్ ఉన్న మంచి మనిషి, తన కుటుంబాన్ని ఎంతప్రేమించాడో, సాటి మనిషిని, సమాజాన్ని కూడా అంతే ప్రేమించాడు, చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది ఇది....

సాటి ఆర్టిస్ట్ కు కష్టాలున్నాయని తెలిసి ఇంట్లో వస్తువులు అమ్మి, బంగారు నగలు తాకట్టు పెట్టిమరీ, ఆ వచ్చిన డబ్బు దానం చేసేవారు, ఐదారు సినిమాలు వస్తే వాటి రెమ్యునరేషన్ లో కుంటుంబానికి సగం, సమాజానికి సగం ఖర్చు చేసేవారు...

మీరేమయినా అనుకోండి గురూజీ... 

నేనొక్కటి నమ్ముతాను, ఏ రంగంలోనూ లేని గొప్ప మానవతావాదులు ఒక్క సినిమా రంగంలోనే ఉన్నారు, వాళ్ళకు కన్నీళ్ళు తెలుసు, కష్టాలు తెలుసు, సాటి మనిషికి సాయం చేయాలనే మనసున్న మానవతామూర్తులు సినిమా వాళ్ళు. నన్ను ఒకాయన ఇలా కామెంట్ రూపంలో అన్నాడు

"సినిమా వాళ్ళను దేవుళ్ళను చేస్తూ పోస్టులు పెడతావు కదరా నువ్వు, నీకేం తెలుసు" అనిఅవును నాకేమీ తెలియదు, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా, కానీ అందరూ కాకపోవచ్చు, కొందరు సినిమా వాళ్ళు నిజంగా దేవుళ్ళే...

మహానటి సినిమా‌ అంత పెద్ద హిట్ అయిందంటే 

సావిత్రి గారి లోని వ్యక్తిత్వం, దానగుణం, గొప్పదనమే సాక్ష్యం, ఆమెను కేవలం ఒక హీరోయిన్ గా మాత్రమే చూసి ఉంటే మిగతా హీరోయిన్ల లాగా ఎప్పుడో మరిచిపోయేవాళ్ళం, కానీ ఆమెకు ఒక కథ ఉంది, ఆ కథలో కన్నీళ్ళు ఉన్నాయి, ఆమె More than Hero, రాళ్ళపల్లి గారు కూడా హీరోలకు ఏమాత్రం తీసిపోని రియల్ హీరో..!! 

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...