Monday, 26 June 2023

దైవ ప్రార్థన (30-June-23, Enlightenment Story)

 దైవ ప్రార్థన

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥

ఒక శిష్యుడు రామకృష్ణ పరమహంసను భగవంతుడి మీద మనసు ఎలా లగ్నం చెయ్యాలని ప్రశ్నించాడు. దానికాయన ఇలా చెప్పారు:

*ఎల్లప్పుడూ భగవన్నామ సంకీర్తనం, సత్సంగం చేస్తుండాలి. రాత్రి పగలు సంసారంలో మునిగిపోతే భగవంతుడి మీద మనసు లగ్నం కాదు. అప్పుడప్పుడూ ఏకాంత ప్రాంతాలకు వెళ్ళాలి. మొదట్లో భగవంతుడి మీద మనసు లగ్నం చేయడం కష్టమౌతుంది. మొక్క లేతగా ఉన్నప్పుడే చుట్టూ కంచె వేసి ఆవులు, మేకలు తినకుండా కాపాడినట్టు ఏకాంతమనే కంచె వేసి సాధన చేయాలి*


భగవంతుడొక్కడే సత్యమనీ (నిత్య వస్తువు), తక్కినదంతా అసత్యమనీ (అనిత్యం) విభజిస్తూ అనిత్య వస్తువుల నుండి మనస్సును దూరంగా ఉంచాలి.

ధనవంతుల ఇంట్లో పనిమనిషి పని చేస్తున్నా మనసు మాత్రం తన ఇంటి మీదనే ఉంచుకున్నట్టు, యజమాని పిల్లలను తన పిల్లల్లాగా పెంచు తున్నప్పటికీ తన బిడ్డలు కారని అనుకున్నట్టుగానే మనుషులు రోజు వారీ పనులను చేస్తూనే భగవంతుని ధ్యానిస్తుండాలి.

భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉంటూనే, దేవుడు తప్ప మరెవ్వరూ తనవాళ్లు కాదని గుర్తించాలి. తాబేలు నీటిలో తిరుగాడుతున్నప్పటికీ ధ్యాసను గట్టు మీద పెట్టిన గుడ్ల మీదనే ఉంచుకున్నట్టు మనుషులు దేవుడి మీద మనసు నిలపాలి.

చేతికి నూనె రాసుకుని పనస తొనలను ఒలవకపోతే చేతికి జిగురు అంటుకున్నట్టే భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకున్న తర్వా తనే సంసారంలో దిగాలి. లేదంటే సంసార వాసనలు పట్టి పీడిస్తాయి.

వెన్నను తీయాలంటే పాలను తోడు పెట్టి ఒక చోట ఉంచాలి. మాటి మాటికీ కలుపుతుంటే పెరుగు తోడు కోదు. తగినంత సమయమిచ్చిన తరువాతే పెరుగును చిలకాలి. అప్పుడే వెన్న దొరుకుతుంది. అట్లాగే దైవ ప్రార్థనకి కూడా తగినంత సమయం కేటాయించినప్పుడే భక్తి భావం కలుగుతుంది.

సంసారం నీళ్ల వంటిది. మనసు పాలవంటిది. పాలను నీళ్లలో పోస్తే పాలు, నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చేయలేము. అదే పాలను తోడుపెట్టి, పెరుగు చిలికి, వెన్న తీసి, ఆ వెన్నను నీళ్లలో వేస్తే అప్పుడు వెన్న తేలుతుంది. అలాగే ఏకాంత ప్రాంతంలో సాధన చేసినప్పుడే భక్తి జ్ఞానమనే వెన్నను పొందగలుగుతారు. ఆ వెన్నను  నేలలో జారవిడిచినా కలిసి పోదు. తేలుతుంది." ఇలా దేవుడి మీద మనస్సు ఎలా లగ్నం చేయాలో చెప్పారు రామకృష్ణ పరమహంస.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

1 comment:

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...