Wednesday, 28 June 2023

పి వి నరసింహారావు జయంతి -28-Jun-23 (19-July-23, Enlightenment Story)

 శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి 102 వ జయంతి (పి వి నరసింహారావు) - 28th Jun'23

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥

క్రీస్తుపూర్వం 4వ శతాపి వి నరసింహారావు.బ్దంలో చంద్రగుప్తుల కాలంలో ‘చాణుక్యుడు వ్రాసిన అర్థశాస్త్రమే నేటి రాజకీయ పరిపాలనా విధానాలకు మూలం. ఎన్నో శతాబ్దాలుగా ఎంతో మంది రాజులు ఈ అర్థశాస్త్రాన్ని అవపోసనపట్టి తమ రాజ్యాలను ఎంతో జనరంజకంగా పరిపాలించారు. కాలానుగుణంగా ఆ పరిపాలనా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ మూలం మాత్రం అట్లాగే వుంది.


20 వ శతాబ్దంలో అటువంటి చాణుక్యుడే మన తెలుగునాట జన్మించి భారతదేశ ఆర్ధికరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొనివచ్చి, అంతర్జాతీయంగా భారతదేశ ఎగుమతుల దిగుమతుల వాణిజ్యవిధానాలలో పెనుమార్పులకు ఆద్యుడయ్యాడు. అతనే తెలుగువాడైన మొట్టమొదటి ప్రధానమంత్రి, ప్రపంచం గుర్తించాకా గానీ భారతీయులు గుర్తించని జాతి వజ్రం! భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు, ప్రపంచ భాషాకోవిదుడిగా పొరుగుదేశాల మన్ననలు పొందిన మన పాములపర్తి వెంకట నరసింహారావు మనందరం గౌరవంగా పిలిచే పి వి నరసింహారావు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా, లక్నేపల్లి గ్రామంలో జూన్ 28, 1921 న జన్మించిన పి వి, ప్రాధమిక విద్య వరంగల్ జిల్లాలోనే పూర్తిచేశారు. పిమ్మట కరీంనగర్ జిల్లా వాసులైన పాములపర్తి రంగారావు దంపతులు ఆయనను దత్తత తీసుకోవడంతో ఆయన పాములపర్తి నరసింహారావు అయ్యారు..

స్వయంగా బహుభాషావేత్త అయిన నరసింహారావు గారు ఏ విషయంలోనూ తడబడే మనస్తత్వం కాదు. ఆయన మనసులోని మాటను తను చెప్తేనే గ్రహించగలం. చట్ట సభలలో ఆయన వాగ్ధాటికి నిలిచి ఆయనను ప్రశ్నలతో భయపెట్టేవారు ఎవరూ దాదాపు లేనట్టే. ప్రతివిషయంలోనూ ఎంతో పరిజ్ఞానంతో వుండేవారు.

పివి నరసింహారావుగారు 17 భాషలలో పండితుడు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా అక్కడి భాషలో మాట్లాడి అనువాదకుల అవసరం లేకుండా చేసేవారు. పాత్రికేయ వృత్తిని కూడా చేసిన ఈ బహుభాషా పండితుని లో ఒక కవి కూడా దాగివున్నాడు. కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారి "వేయి పడగలు" ని హిందీ లోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించారు. 

పి వి నరసింహారావు భారతదేశ ఆర్థిక చరిత్రను మార్చారు. కానీ ఆయన పొందవలసిన గౌరవం ఎంతో వుంది. ఈ భారతదేశం ఆయనకు ఎంతో రుణపడివుంది. ఆయన అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ బిరుదునిచ్చి సత్కరించవలసిన సమయం ఇప్పుడైనా వస్తే ఎంతో సంతోషిస్తాను అని ప్రముఖ పాత్రికేయుడు, బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మరియు మన్మోహన్ సింగ్ గారికి ఆర్ధిక సలహాదారుగా పనిచేసిన శ్రీ సంజయబారు తన పుస్తకం ‘1991’ వ్రాసిన తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూ లో వ్యక్తీకరించారు. .

మన దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ కు ఆయన అన్ని విధాల అర్హుడు. ఆ పురస్కారం ఆయనకు లభించాలని మనందరం కోరుకుందాం.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...