ఆ అంతరం అలాగే ఉండిపోయింది ఆ అంతరం - నిరంతరం
🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥
మధ్యతరగతి అంతరంగంలో ఆ అంతరం అలాగే ఉండిపోయింది🤔
1)చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు - తినడానికి , ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం. కొంతమంది - రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!
అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని! ఇప్పుడు పెద్దయ్యాక - మనం కొనుక్కుని తినే టైంకి. ఆ పెద్ద వాళ్ళు , గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.😂 దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .
2) చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే - కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు. అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు. అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగే వాళ్ళంకాదని!*
పెద్దయ్యాక - మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే , వాళ్ళు కాటన్ కు దిగారు. ఇప్పుడు, కాటన్ దుస్తులధరేఎక్కువ 🤪 దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..😒🤔
3)చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే - మోకాళ్ళ దగ్గర చినిగితే , పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా రఫ్ చేసి ఇస్తే ..మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!
పెద్దయ్యాక చూస్తే - జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని.... ఫ్యాషన్ పేరుతో అధికధరలకు కొంటున్నారు ! దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*🤔😒
4) ఓ వయసులో మనకు - సైకిల్ కొనగలగడమే కష్టం. అదీ సాధించేసరికి - వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు. మనం - స్కూటర్ కొనే సమయానికి. వాళ్ళు కార్లలో తిరిగేవారు. మనం కొంచెం ఎదిగి - మారుతి 800 కొనే సమయానికి. వాళ్ళు BMW ల్లో తిరిగారు.
మనం రిటైర్మెంట్ వయసుకి వచ్చిన కూడబెట్టుకున్న వాటితో - కొంచెం పెద్ద కారు కోనేసమయానికి.వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు! దాంతో ఇప్పటికి ఆ అంతరం అలాగే ఉండిపోయింది . .🤔😒
ప్రతి దశలో, ప్రతి సమయాన ,విభిన్న మనుషుల మధ్య - స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.ఆ అంతరం - నిరంతరం ఎప్పటికి ఉండి తీరుతుంది. రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని. 😢
మళ్ళీ రేపటిరోజున - గతించిన ఇవాళ్టి గురించి ,చింతించేకంటే. ఇవాళ అందినదానితో ఆనందించు.. ఆస్వాదించు.. జీవితం కూడా సంతోషంగా ఉంటుంది
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment