Tuesday, 13 June 2023

నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా (16-June-23, Enlightenment Story)

 *రెండు సందర్భాల్లో దేవుడు మనిషి అజ్ఞానాన్ని చూసి నవ్వుతాడట*

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥

💕 1) కాసేపటిలో చనిపోయే వాడికి వైద్యంచేస్తూ వైద్యుడు వాళ్ళోళ్లతో *ఏమీ భయపడకండి. నేను బతికిస్తాను అన్నప్పుడు.*

💕 2) అన్నదమ్ములు భూమిని పంచుకొని *ఇదిగో ఈభూమి నాది ,అదిగో అటువైపు వున్నది నా తమ్మునిది అన్నప్పుడు.*

🌺 వీడి  తండ్రి, తాత, ఇదే మాట అన్నారు పోయారు. ఇప్పుడు వీడు అదే అంటున్నాడు. రేపు వీడూ పోతాడు. అయినా *ఇది నాది* అనే భ్రమలో, మాయలో, అజ్ఞానంలో బతుకుతున్నాడు అని నవ్వుకుంటాడట.

❤️ ఏదీ శాశ్వతం కాదు. మనం, మన పిల్లలు, మనం సంపాదించుకున్న ఇళ్ళు, భూమి, మన బ్యాంకు బాలన్స్ ఏవీ మనవెంట రావు.ఈ విషయం మనకందరికీ తెలుసు. అయినా “నాది, నావి “ అనే మాయలోనే ఉండిపోతున్నాము.*

💕 ఇక్కడ పుట్టేదంతా ఒకనాటికి తప్పక నశించేదే అయినప్పుడు ఈ దుఃఖం దేనికి? ఈ ఆరాటం దేనికి? మనలో ఏర్పడి ఉన్న ఈ “నాది - నావి - నావాళ్ళు” అనే భ్రమంతా  మనకు ఎక్కడినుంచి వచ్చింది? ఈ జీవితమే మూన్నాళ్ళ ముచ్చటని  తెలుస్తూనే ఉన్నప్పటికీ మరి  మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం..?

💕 మనలో మనం ప్రశ్నించుకోవాలి.ఈ శరీరం పుట్టేటప్పుడు, ఈ శరీరం పెరిగేటప్పుడు,  ఈ శరీరం పోయేటప్పుడు ఏదయితే మార్పు అనేదే లేకుండా ఈ శరీరంలో ఉందో అదే ఆత్మ. ఆ ఆత్మే  నేను' అన్న ఎరుక  కలిగిననాడు ఆత్మజ్ఞానం మనలో వుద్భవిస్తుంది..!* 

జ్ఞానం కలిగిన తరువాత వైరాగ్యం, దాని తరువాత భక్తి , భక్తికి పరాకాష్ట  భగవంతుని దర్శనభాగ్యం, చివరిగా ముక్తి..!

🌺 ముక్తిని పొందడానికే  దైవం మనకు మానవజన్మ ప్రసాదించాడని  తెలుసుకున్న తరవాత  సాధన చెయ్యాలి..!

మనం కోరుకునే జ్ఞానం, ముక్తి మరెక్కడో లేదు మన మనస్సులోనే ఉంది.

❤️ మనిషి దేవుణ్ణి కోరుకోవలసిన వరాలు:~

💕 అనాయాసేన మరణం - బాధలేని సుఖమరణం..!

💕 వినా దైన్యేన జీవనం - ఒకరిపై ఆధారపడని జీవితం..!

💕 దేహాంతే తవ సాన్నిధ్యం - మృత్యువు నావద్దకు వచ్చినపుడు నేను నీ దర్శనం చేసుకునేలా దీవించు..! దేహిమాం పరమేశ్వర  ప్రసాదించు పరమాత్మా..! " అని కోరుకోవాలి..!

ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..

ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..

ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..ఆనందోబ్రహ్మ..

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...