Friday, 30 June 2023

భారతీయ బిలియనీర్ రతన్‌జీ టాటా (14-July-23,Enlightenment Story)

 ఎంత అందమైన ఉపమానం..

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥

 ఇది నాకు కన్నీళ్లు తెప్పించింది.టెలిఫోన్ ఇంటర్వ్యూలో భారతీయ బిలియనీర్ రతన్‌జీ టాటాను రేడియో ప్రెజెంటర్ అడిగినప్పుడు:

సార్, మీరు జీవితంలో అత్యంత సంతోషాన్ని పొందినప్పుడు మీకు ఏమి గుర్తుకు వస్తుంది?రతన్‌జీ టాటా చెప్పారు:

 నేను జీవితంలో సంతోషం యొక్క నాలుగు దశలను దాటాను, చివరకు నిజమైన ఆనందం యొక్క అర్ధాన్ని నేను అర్థం చేసుకున్నాను.

 మొదటి దశ సంపద మరియు వనరులను కూడబెట్టుకోవడం.కానీ ఈ దశలో నేను కోరుకున్నంత ఆనందం లభించలేదు.

రెండవ దశ విలువైన వస్తువులు మరియు వస్తువులను సేకరించడం. కానీ ఈ విషయం యొక్క ప్రభావం కూడా తాత్కాలికమైనదని మరియు విలువైన వస్తువుల మెరుపు ఎక్కువ కాలం ఉండదని నేను గ్రహించాను.

మూడవ దశ పెద్ద ప్రాజెక్ట్ పొందడానికి  వచ్చింది.  అప్పుడే నాకు ఇండియా మరియు ఆఫ్రికాలో 95% డీజిల్ సరఫరా ఉండేది. నేను భారతదేశం మరియు ఆసియాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారానికి యజమానిని కూడా.కానీ ఇక్కడ కూడా నేను ఊహించినంత ఆనందం లభించలేదు.

నాల్గవ అడుగు ఏమిటంటే, కొంతమంది వికలాంగ పిల్లలకు వీల్ చైర్లు కొనమని నా స్నేహితుడు నన్ను అడిగాడు. దాదాపు 200 మంది పిల్లలు. స్నేహితుడి కోరికతో, నేను వెంటనే వీల్ చైర్లు కొన్నాను. కానీ మిత్రుడు నేను అతనితో వెళ్లి పిల్లలకు వీల్ చైర్లు ఇవ్వమని పట్టుబట్టాడు.  నేను రెడీ అయ్యి అతనితో వెళ్ళాను.

అక్కడ ఈ పిల్లలకు నా చేతులతో చక్రాల కుర్చీలు ఇచ్చాను.  ఆ పిల్లల ముఖాల్లో విచిత్రమైన ఆనందం కనిపించింది.  వాళ్లంతా వీల్‌ఛైర్‌లో కూర్చొని అటూ ఇటూ తిరుగుతూ సరదాగా గడపడం చూశాను.వారు ఒక పిక్నిక్ స్పాట్‌కు చేరుకున్నారు, అక్కడ వారు విజేత బహుమతిని పంచుకున్నారు.

 నా లోపల నిజమైన ఆనందాన్ని అనుభవించాను.  నేను బయలుదేరాలని నిర్ణయించుకున్నప్పుడు, పిల్లలలో ఒకడు నా కాలు పట్టుకున్నాడు.

 నేను నెమ్మదిగా నా కాళ్ళను విడిపించడానికి ప్రయత్నించాను, కాని పిల్లవాడు నా ముఖం వైపు చూస్తూ నా కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు.  నేను వంగి పిల్లవాడిని అడిగాను: మీకు ఇంకేమైనా కావాలా? ఈ పిల్లాడు నాకు ఇచ్చిన సమాధానం నన్ను దిగ్భ్రాంతికి గురిచేయడమే కాకుండా జీవితం పట్ల నా దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది

 ఈ పిల్లవాడు ఇలా అన్నాడు:

 "నిన్ను స్వర్గంలో కలిసినప్పుడు నిన్ను గుర్తించి మరోసారి కృతజ్ఞతలు తెలిపేలా నీ ముఖాన్ని గుర్తుంచుకోవాలనుకుంటున్నాను....!!"🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥


పెట్రిశ్రియనారాయణ్

*పెట్రిశ్రియనారాయణ్*

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹

ఆశ్రయం ఇచ్చి ఆదరించాల్సిన భర్త బహిష్కరించడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని కన్నీళ్లమయమైన జీవితాన్ని  కడతేర్చుకుందామని కడలి వైపు నడక సాగించింది..

అలా సముద్రతీరంలో నడుస్తూ ఉండగా‌ అక్కడ పల్లీలు బఠాణీలు అమ్ముతున్న వారిని చూసింది. ' చదువు సంధ్యల్లేని ఈ అమాయకులు కాయకష్టం చేసుకొని జీవించగలుగుతున్నప్పుడు నేను మాత్రం వారిలా ఎందుకు జీవితాన్ని సాగించలేను!'  అన్న ఒక్క ఆలోచన ఆమెలో #ఆశాదీపం వెలిగించింది.  

అప్పటి నుండి తీరంలో బఠాణీలు పల్లీలు అమ్ముతూ కొత్త జీవితం మొదలెట్టింది.మొదటిరోజు సంపాదన కేవలం 50 పైసలు మాత్రమే. కానీ ఓర్పుతో #పట్టుదలతో విశ్వాసంతో అమ్మడం ఆపలేదు. మొదట్లో ఐదు,ఏభై,కొన్ని నెలల తర్వాత ఆదాయం నూరు రూపాయలకు చేరింది.

కొన్నాళ్ళకు సూక్ష్మ ఋణాలను తీసుకుని టీ కొట్టు ప్రారంభించే స్థితికి చేరింది. మరి కొన్ని సంవత్సరాలకు ఒక హోటల్ ప్రారంభించింది. నాణ్యతకు ప్రాధాన్యత నిచ్చి వ్యాపారం సాగించడం వల్ల కొద్ది కాలంలోనే వ్యాపారం పుంజుకొని చెన్నై నగరంలో అనేక ప్రాంతాల్లో హోటల్ బ్రాంచ్ లు నెలకొల్పగలిగింది. 

ప్రస్తుతం "Sandeepa Chain Of Restaurants" అనే సంస్థకు అధిపతిగా ఆమె సంపాదన నెలకు అక్షరాల రు.50 లక్షలు. 1982లో కేవలం 50పైసలతో మొదలుపెట్టి ఆదాయాన్ని నేడు రు.50లక్షలకు చేర్చిన ఆమె విషాదగాథకు 

2010 సంవత్సరంలో అత్యుత్తమ వ్యాపారవేత్త పురస్కారం పొందిన ఆ ధీర వనిత పేరు  '' #పెట్రిశ్రియనారాయణ్ ''.

తినడానికి తిండిలేని నిర్భాగ్యస్థితి నుండి చనిపోవడానికి కూడా సిద్ధమయిపోయిన స్థితి నుండి నేడు కొన్ని వేలమందికి ఉపాధిని కల్పించిన ఇటువంటి వ్యక్తుల జీవితగాథలే కదా మనకు #స్ఫూర్తి!. 

శరీరం నీరసపడితే ఆహారం స్వీకరిస్తాం. అలాగే మనసు నీరసపడితే ఇలాంటి ధీరుల జీవితాలు చదివి స్ఫూర్తి పొందాలి. చిన్నచిన్న వైఫల్యాలకే నీరసించిపోయే స్వభావం గల వారికి అపజయాలకు క్రుంగిపోయేవారికి  ఇటువంటి సజీవగాథలే స్ఫూర్తి!!!.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

52 అక్షరాలు

 52 అక్షరాలు

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥

అ నుంచి ఱ వరకు తో కథ ఎవరు రాశారో గానీ అధ్బుతం. ఈ కింద చూడండి.🌾 అ నుంచి ఱ వరకు తో కథ ఎవరు రాశారో తెలిస్తే బావుండును.

* (అ)మ్మ చేతి గోరుముద్దలు తినిన పిల్లలు

* (ఆ)నందంగా పాఠశాలకు వెళ్లబోతూ,

* (ఇ)ళ్లలోంచి బయట పడుతూనే

* (ఈ)లల గోలల మోతలతో, 

* (ఉ)రుకులు పరుగులతో హడావుడిగా వెళ్లి, బడిలో

* (ఊ)యల, ఉడతల కథలు హాయిగా వింటారు.

* (ఋ)ణ, సంబంధ ఇక్కట్లు తెలియక

* (ౠ) అని తమాషాగా దీర్ఘం తీసుకుంటూ,

* (ఎ)ఱుపు, నలుపు, పసుపు,తెలుపు రంగులు కల

* (ఏ)డు రంగులు కలబోసిన సీతాకోకచిలుకల్లాగా,

* (ఐ)దారుగురు ఆడ,మగ స్నేహితులు కలిసి సరదాగా

* (ఒ)ప్పుల కుప్ప ఒయ్యారి భామా ఆటాడుకుంటూ,

* (ఓ)డల ఒంటెల కథలు ఒకరికొకరు చెప్పుకుంటూ,

* (ఔ)రా నువ్వెంత? నేనే బాగా చెప్పానని విఱ్ఱవీగుతూ, ఇలా

* (అం)దరూ ఎంతగానో సంతోషిస్తూ, ఆనందంగా

* (అః) అః అహహహా అంటూ ముద్దులొలికే నవ్వులతో ఇంటికి వచ్చేస్తారు.

* (క)డుపాత్రం ఎఱిగిన తల్లి అయ్యోపాపమంటూ, అతి ప్రేమగా

* (ఖ)ర్జూరపు పండ్లు నోటిలో దట్టించి పెట్టగా,

* (గ)బ గబా తినేసిన బుజ్జాయిలు, అలా తినిన

* (ఘ)నాహారం జీర్ణమయ్యే వఱకు ఆడుకుంటూ, ఆటల పాటలను

* (జ్ఞ)ప్తికి తెచ్చుకొని, నెమరేసుకుంటూ ఇంటికొచ్చి, తిని, నిద్దరోతారు.

మళ్లీ మరుసటి రోజు యథాప్రకారంగా, అమ్మ పిలుపుతో లేచి,........

* (చ)క చకా తయారై, పాఠశాలకు వెళ్లిపోయి, ప్రార్థన తర్వాత

* (ఛ)లో అనుకుంటూ తరగతుల్లోకి చేరుకోని, 

* (జ)తలు జతలుగా పిల్లలంతా కలసికట్టుగా వెళ్లి

* (ఝ)మ్మని ఎవరి సీట్లలో వాళ్లు సర్దుకొంటుండగా, మాస్టారొచ్చి

* (ఞ) అక్షరాన్ని వ్రాయమంటే, రాక, బిక్కమొహం వేస్తారు.

* (ట)క్కుటమారు విద్యలనారితేరిన, టక్కరి తుంటరి పిల్లలు

* (ఠ)పీ, ఠపీమని బల్లలపై శబ్దాలు చేస్తుంటే,

* (డ)ప్పుల మోతల్ని మించిన శబ్దాలను విన్న మాస్టారు

* (ఢ)క్కాలు బద్దలు కొట్టినట్లుగా ఎవర్రా అది, అని అరుస్తూండగానే,

* (ణ)ణణణణణ ణ, ణ, ణ అని ఇంటి గంట మోగిన క్షణంలోనే...

* (త)లుపులు తోసేసుకుంటూ,

* (థ)పా థపా మనే శబ్దాలు చేసుకుంటూ,

* (ద)బ్బు దబ్బున తరగతిలోని పిల్లలందరూ

* (ధ)న ధనామంటూ కాళ్ల నడకల శబ్దాల ప్రతిధ్వనులతో 

* (న)లువైపులా పరికిస్తూ, గుడి లాంటి బడి గడప దాటిన పిల్లలు,

* (ప)రుగు పరుగున కొందరు,

* (ఫ)స్టు నేనంటే నేనని పోటీపడుతూ ఇంకొందరు,

* (బ)యటకు పూర్తిగా వచ్చేసి,

* (భ)లే భలే, ఎవరు ఇళ్లకు ముందుగా చెరుతారని పందెంతో కొందరు,

* (మ)న స్కూలు, 'చాలా మంచి స్కూలబ్బా' అని, ఇంకొందరు,

* (య)థాలాపంగా, ఏ హావభావాలూ లేకుండా కొందరు,

* (ర)య్ రయ్ మంటూ పిచ్చి శబ్దాలతో ఇంకొందరు,

* (ల)గెత్తుకొని, తోటి పిల్లలను తోసేసుకుంటూ,

* (వ)చ్చి పోయే వ్యక్తులను ఓర కంటితో చూస్తూ, దారిపై వచ్చిపోయే

* (శ)కటములను తమాషాగా తప్పించుకుంటూంటే,

* (ష)రా మామూలే, 'వీళ్లెప్పుడూ మారర్రా' అని కొందరనుకుంటుండగా,

* (స)రదాగా అల్లరి చేసుకుంటూ, ఆనందంతో

* (హ)ర్షాతిరేకాలు మిన్ను ముట్టగా, గందరగో-

* (ళ) కోలాహల కలకలాతో రేపు ఆదివారం, సెలవు అనుకుంటూ

* (క్ష)ణాలలో వారి వారి ఇళ్లకంతా, మన కొ-

* (ఱ)కరాని కొయ్యలందరూ తల్లుల ఒడిలోకి చేరి తరిస్తారు.

🎊ఇలా, తమాషాగా 'అఆ ఇఈ లతో, కఖ గఘ లతో' అందమైన ఒక సంఘటనను వర్ణించి చెప్పుకొని ఆనందించవచ్చు. ఇది చదివిన ఉత్సాహవంతులు, భాష మీది అభిమానంతో, తెలుగు భాష మీది పట్టుతో, అచ్చులతో హల్లులతో ఇంకా ఎన్నెన్నో అర్థవంతమైన, అందమైన కథలను, సంఘటనలను సృష్టించుకొని, వారి ప్రతిభకు సాన పెట్టవచ్చు. అలాగే, మీ మీ పిల్లలకు ఇలా వ్రాయలని మార్గ దర్శకులు కావచ్చు.

🎊అతి సుందరమైన, సుమధురమైన, సౌమ్యమైన, కమ్మదనం కలబోసిన, తేట తేట తెలుగును, మృదుత్వంతో కూడిన తెలుగునే మాట్లాడండి. తెలుగులోనే వ్రాయండి. తెలుగు పుస్తకాలు చదవండి, చదివించండి. తేనె లొలుకు తెలుగు తియ్యందనాన్ని తనివితీరా జుఱ్ఱుకొని, మనస్పూర్తిగా ఆస్వాదించండి, ఆస్వాదింపజేయండి.


అహంకారం వినాశహేతువు

 అహంకారం వినాశహేతువు

[ఈ కథ మహాభారతంలోని ఉద్యోగపర్వం లోనిది]

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥

🪷 యుద్ధాన్ని ఆపడానికి కృష్ణుడు చివరి ప్రయత్నంగా రాయబారానికి వచ్చి తను చెప్పదలచిన హితవు చెప్పాడు♪. అనంతరం అదే సభలో ఉన్న మహర్షి పరశురాముడు దుర్యోధనుడికి చేసిన హితబోధ సందర్భంలో వచ్చే కథ ఇది). 

🪷 "నాయనా! దుర్యోధనా! నీకూ, నీ వారికీ సర్వప్రపంచానికీ మేలు కలిగే విషయం చెబుతున్నాను♪. ఆవేశపడకుండా సావధానంగా విను♪. 

🪷 చాలా రోజుల క్రితం మాట♪. దంభోద్భవుడు అనే పేరు గల రాజు ఉండేవాడు♪. ఆయన ఈ భూమండలం అంతటినీ పాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చే వారు లేరు ఆ రోజుల్లో♪. అంతటి మహా యోధుడాయన♪. ఆయన రోజూ ఉదయం లేచి, కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకుని రత్నకిరీటం ధరించి, కోడెత్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనాన్ని అధిష్టించేవాడు♪. వంది మాగధులు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తుంటే, కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు♪.

🪷 అనంతరం, తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ భూలోకంలో నాతో ఎవడైనా యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గద, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి♪. అంతేకాదు.. మల్లయుద్ధం చేయగల వీరుడు కూడా ఉంటే చెప్పండి♪. వాడినీ క్షణంలో కడతేరుస్తాను♪.' అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగుర వేసేవాడు. ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ ఆయనతో యుద్ధానికి దిగే వారు కాదు.

🪷 అలా, ఆ రాజు అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంత వాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతుండే వాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకు ఆయన అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా♪! వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు♪.

🪷 అలా ఉండగా, ఒకనాడు, ఆయనను చూడటానికి సభా భవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు 'మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలపరాక్రమ సంపన్నులే. అయితే, గంధమాదన పర్వతం మీద నర-నారాయణులని ఇద్దరు తీవ్ర నిష్టతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడు లోకాలలో లేరని విన్నాము♪. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు' అన్నారు♪.

🪷 ఆ మాట వినడంతోనే ఆయన ఆగ్రహంతో మండిపడ్డాడు. కత్తి ఝుళిపించి, నేల మీద పాదంతో గట్టినా తన్ని, 'ఎంత కావరం? నన్ను మించిన యోధులా.. వారు?' అంటూ సేనల్ని సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయల్దేరాడు♪. అలా గంధమాదన పర్వతం చేరాడు.

🪷 ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే రాజు గారు తొడగొట్టి, యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం మెలితిప్పాడు♪. నర, నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకు అతిథి సత్కారాలు జరపబోయారు. మహారాజు ఆ అతిథి సత్కారాలను తిప్పికొట్టాడు.

🪷 'ఇవన్నీ అనవసరం. యుద్ధం.. యుద్ధం మాత్రమే కావాలి' అని అట్టహాసం చేశాడు. అప్పుడు నర-నారాయణులు, 'ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్లు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మేం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు¿' అని ప్రశ్నించారు♪. వారి మాటలు వినిపించుకోలేదు మహారాజు. 'ఈ రోజు నాతో మీరు యుద్ధం చేయాల్సిందే' అని పట్టుబట్టాడు. అలా అంటూనే బాణం తొడుగుతుండగా, అది చూసిన నరుడు నవ్వుతూ, ఒక దర్బపుల్ల తీసి, 'ఇదిగో! ఈ గడ్డిపరక నీ సేనను నిలువరిస్తుంది' అని ఆ దర్భను వదిలాడు.

🪷 ఆ రాజు బాణ వర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది♪. ఈలోగా రాజు సైన్యంలోని వారందరూ ముక్కులూ, చెవులూ ఊడిపోయి రోదనలు చేయడం మొదలుపెట్టారు♪. రాజుకి ఇదంతా చూసి తల తిరిగిపోయింది♪. సేనలు పలాయనం చేస్తున్నాయి♪. అది చూసి రాజుకు గుండె జారింది♪. ఆయుధాలన్నీ కిందపెట్టి, తల వంచి నర-నారాయణుల పాదాల మీద వాలాడు రాజు♪. 

🪷 'ఆర్యా! నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది' అని దీనంగా ప్రార్థించాడు.

🪷 అప్పుడు, నర-నారాయణులు నవ్వుతూ, 'మహారాజా! సిరిసంపదలు కలవారు పేదసాదలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి♪. అలాగే, బల పరాక్రమాలు ఉన్న వారు దుర్మార్గుల బారి నుంచి సజ్జనులను రక్షించడానికి తమ శక్తియుక్తులను వినియోగించాలి♪. అంతేగానీ, అహంకారంతో ఇలా తిరగరాదు♪. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం' అన్నారు♪.

🪷 మహారాజు వారి బోధ విని, ఆనాటి నుంచి అహంకారం విడిచి, అందరి శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు♪. 

🪷 కనుక దుర్యోధనా! అహంకారం, బల గర్వం ఎప్పుడూ పనికిరావు♪. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి' అని చెప్పడం ముగించాడు పరశురాముడు.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు

🚩 హిందువునని గర్వించు🚩 హిందువుగా జీవించు

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥



బంగారు ఆభరణాలతో పూరి జగన్నాథుని

 బంగారు ఆభరణాలతో పూరి జగన్నాథుని దర్శనం - సునా బేషా (సోనా వేష)..!!

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥

 సునా బేషా  ఏకాదశి తిథిలో జరిగే ఆచారం.దశమి నాటికి ప్రదాన ఆలయంకు చేరుకున్న రథంలో ఉన్న దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరించబడతారు దీనినే సునా బేషా అంటారు.

దీనిని రాజధీరాజ భేషా లేదా రాజా బేషా అని కూడా అంటారు. 1430 సంవత్సరంలో ఈ 'సునా బేషా' ను రాజు కపిలేంద్ర దేబ్ పాలనలో ప్రవేశపెట్టబడిందని చరిత్ర చెబుతోంది. 

దేవతలు దాదాపు మూడు క్వింటాళ్ల బరువున్న మెరిసే బంగారు ఆభరణాలను ధరిస్తారు. ఈ ఆభరణాలను శ్రీమందిర్ ఖజానా వద్ద భధ్రపరుస్తారు. దీనిని రత్న భండార్ అని పిలుస్తారు.

సాంప్రదాయం ప్రకారం, సేవకులు రత్న భండార్ నుండి బంగారు మరియు వెండి ఆభరణాలను తెచ్చి, రథాలపై పుస్పాలక మరియు దైతాపతి సేవకులకు అప్పగిస్తారు,

తరువాత చతుర్ధ మురతిని ఆభరణాలతో అలంకరిస్తారు.ముగ్గురు దేవతలను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు, భగవంతుడు జగన్నాథ్ మరియు బలభద్ర బంగారంతో చేసిన చేతులు మరియు కాళ్ళతో కనిపిస్తారు. 

జగన్నాథుడు తన కుడి చేతిలో బంగారు చక్రం మరియు ఎడమ చేతిలో ఒక వెండి శంఖాన్ని కలిగి ఉన్నాడు. బలభద్ర ఎడమ చేతిలో బంగారు నాగలిని, కుడి చేతిలో బంగారు జాపత్రిని పట్టుకొని కనిపిస్తాడు.

సునా బేషంలో ఎవరైతే భగవంతుడిని చూస్తారో అతని చెడ్డ కర్మలన్నిటి నుండి విముక్తి పొందుతారని నమ్ముతారని నమ్మకం...

సునా వేశంలో దేవతలను అలంకరించడానికి ఈ ఆభరణాలు ఉపయోగించబడతాయి:

హస్తా (చేతి), Samjh (అడుగులు), ముకుటా (తలపాగా లేదా పెద్ద కిరీటం), 

మయూర్ చంద్రికా - ఒక నెమలి ఈక రూపకల్పన, దీనిని శ్రీకృష్ణుడు, చులపతి తల అలంకరణగా ఉపయోగించారు, 

ముఖ సౌందర్యం, కుండల్ (చెవి వేలాడదీయడం) రింగులు), రాహురేఖా- దేవత ముఖం మీద అలంకరించబడిన సగం చదరపు ఆకారపు అలంకరణ, 

పద్మం (తామర), సేవతి (చిన్న సూర్య పువ్వు), చంద్రుని పువ్వు ఆకారంలో అగస్తి, వివిధ రకాలైన మాలాలు లేదా కంఠహారాలు. 

బంగారు పూసలు, నెమలి ఈకలు రూపంలో మేయర్, మరియు చంపా- ఒక పసుపు పువ్వు,

దేవతల మూడవ కన్ను సూచించే శ్రీ చితా, చక్ర లేదా చక్రం, గడా లేదా జాపత్రి, పద్మ ఒక తామర పువ్వు, మరియు  శంఖం కొన్ని ప్రత్యేక సందర్భంలో  అలంకరించడానికి ఉపయోగించే బంగారు నమూనాలు.

జై జగన్నాథ్.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః

 🕉️ || ఓం నమో మాత్రేనమః  || 🕉️

🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁

లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు. మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే. ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు.

పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు.

ఇంకే ముంది జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు. పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి సమాలోచన చేశాడు.

వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణు వేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు.

ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణువేడుతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు. ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు.

ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు. నువ్వు దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.

యుధ్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు. ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు.

అనఘా దేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు. అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది.

జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి.

నాట్యమయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు. అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం. మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు.

మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండ వచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా. లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని సద్వినియోగపరచినంత మటుకూ పర్వాలేదు.

కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు. 

తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుంది.

!!!ఓం నమో మాత్రేనమః !!!ఓం నమో మాత్రేనమః !!!ఓం నమో మాత్రేనమః !!!

🙏ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🙏ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🙏

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

శ్రీవారికి సమర్పించే నైవేద్యం (11-July-23,Enlightenment Story)

🌺శ్రీవారికి సమర్పించే నైవేద్యం వివరాలను తెలుసుకుందాం🌺

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥

🌺తిరుమల అంటే అందరికీ లడ్డూ ప్రసాదం గుర్తుకొస్తుంది. ఆయా సేవలను బట్టి.చక్కెర పొంగళి, పెరుగన్నం ప్రసాదాలూ స్వామి వారికి సమర్పిస్తారనీ తెలుసు మరి.

🌺వెంకన్నకు కమ్మని దోసెలు పెడతారని తెలుసా ?  ఘాటైన మిరియాల అన్నం వండి వడ్డిస్తారని తెలుసా ? ఇవి మాత్రమే కాదు.ఏడుకొండల వాడికి పూట పూటకూ ఒక మెనూ! రుతువులను బట్టి ఆహారం! స్వామి వారికి సకల విధమైన నైవేద్యం గురించి ఎంతమందికి తెలుసు.

సర్వజగద్రక్షకుడైన ఏడుకొండలవాడికి నైవేద్యం ఎప్పుడు పెట్టాలి, ఏమి పెట్టాలి, ఏ పదార్థాలు ఏ కొలతలతో ఉండాలి, ఎవరు వండాలి, ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి వంటివన్నీ ఆగమశాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అచ్చంగా దాని ప్రకారమే తిరుమలలో ప్రసాదాల తయారీ, సమర్పణ జరుగుతుంది.

🌺ప్రసాదాల తయారీ కోసం మామిడి, అశ్వత్థ, పలాస వృక్షాల ఎండు కొమ్మలనే ఉపయోగిస్తారు. పాలుగారే చెట్ల కొమ్మలు, ముళ్ల చెట్లుగానీ వంటకు వినియోగించరు.

ప్రసాదం వండేవారు వంట సమయంలోగానీ, తర్వాతగానీ వాసన చూడరు. వాసన సోకకుండా ముక్కు, నోటికీ అడ్డుగా వస్త్రం పెట్టుకుంటారు. ఇక.

శ్రీవారికి సమర్పించేదాకా బయటి వారెవరూ దానిని చూడకూడదు. నేవైద్యం పెట్టేది ఇలా. ప్రసాదం సమర్పించడానికి ముందు గర్భాలయాన్ని నీళ్ళతో శుద్ధి చేస్తారు. 

గాయత్రీ మంత్రం జపిస్తూ నీళ్లు చల్లుతారు. వండిన ప్రసాదాలను మూత పెట్టిన గంగాళాల్లో దేవుడి ముందు ఉంచుతారు. స్వామి, ప్రసాదాలు, నైవేద్యం సమర్పించే అర్చకుడు మాత్రమే గర్భగుడిలో ఉంటారు. గర్భాలయం తలుపులు మూసేస్తారు.

🌺విష్ణు గాయత్రి మంత్రం పఠిస్తూ అర్చకుడు ప్రసాదాల మీద నెయ్యి, తులసి ఆకులు చల్లుతారు. కుడిచేతి గ్రాసముద్రతో ప్రసాదాన్ని తాకిన అర్చకుడు స్వామి కుడి చేతికి దానిని తాకించి, నోటి దగ్గర తాకుతారు. (స్వామికి గోరు ముద్దలు తినిపించడం అన్న మాట.) పవిత్ర మంత్రాలు ఉచ్ఛరిస్తూ అన్నసూక్తం నిర్వర్తిస్తారు.

చరాచర సృష్టికి కర్త అయిన స్వామి నైవేద్యం సమర్పించడం అంటే, సృష్టిలో ఆకలితో ఉన్న సమస్తాన్నీ సంతృప్తి పరచడమే.

ఈ విధంగా స్వామిని వేడుకుంటూ, ముద్ద ముద్దకీ నడుమ ఔషధగుణాలున్న ఆకులు కలిపిన నీటిని సమర్పిస్తారు.

నైవేద్యం సమర్పించేంత వరకూ ఆలయంలో గంట మోగుతూనే ఉంటుంది. ఇది స్వామికి భోజనానికి పిలుపుగా దీనిని భావిస్తారు.

రోజుకు మూడు పూటలా స్వామికి నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం ఆరు, ఆరున్నర గంటల మధ్య బాలభోగం సమర్పిస్తారు.

🌺పది, పదకొండు గంటల మధ్య రాజభోగం, రాత్రి ఏడు - ఎనిమిదింటి మధ్య శయనభోగం సమర్పిస్తారు.

తిరుమల గర్భగుడిలోని స్వామి మూల విగ్రహం ఎత్తు 9.5 అడుగులు. దీనికి అనుగుణంగానే స్వామికి ఏ పూట ఎంత పరిమాణంలో ప్రసాదం సమర్పించాలో కూడా శాస్త్రంలో నిర్దేశించారు.

నైవేద్యం సమర్పించిన తర్వాత భక్తులకు దీనిని పంచుతారు.ప్రత్యేక రోజులలో ప్రత్యేక నైవేద్యాలు కూడా సమర్పిస్తారు.

🌺ఉదయం బాలభోగం

మాత్రాన్నం, నేతి పొంగలి, పులిహోర, దద్యోజనం, చక్కెర పొంగలి, శకాన్నం, రవ్వ కేసరి, మధ్యాహ్నం రాజభోగం, శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గూడాన్నం, దద్యోజనం, శీర లేక చక్కెరన్నం.

🌺రాత్రి శయనభోగం

మరీచ్యఅన్నం (మిరియాల అన్నం) దోసె, లడ్డు, వడ, శాకాన్నం(వివిధ కూరగాయలతో కలిపి వండిన అన్నం)

🌺అల్పాహారాలు 

లడ్డు, వడ, అప్పం, దోసె.స్వామి మెనూ ఇదీ. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన తర్వాత అప్పుడే తీసిన చిక్కని వెన్న నురుగు తేలే ఆవుపాలు సమర్పిస్తారు. తోమాల, సహస్రనామ అర్చన సేవల తరువాత నువ్వులు, సొంఠి కలిపిన బెల్లం నైవేద్యంగా పెడుతారు.

ఆ తరువాత బాలభోగం సమర్పిస్తారు. దీంతో ప్రాతఃకాల ఆరాధన పూర్తవుతుంది. సర్వదర్శనం మొదలవుతుంది. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత రాజభోగం సమర్పణ జరుగుతుంది. మళ్లీ సర్వదర్శనం మొదలవుతుంది.

🌺సాయంకాల ఆరాధన తర్వాత గర్భాలయం శుద్ధి చేసి.స్వామిని తాజా పూలతో అలంకరిస్తారు. అష్టోత్తర శతనామ అర్చన తర్వాత శయనభోగం సమర్పిస్తారు. అంతటితో అయిపోయినట్టు కాదు!అర్ధరాత్రి తిరువీశం పేరుతో బెల్లపు అన్నం (శుద్ధాన్నం, గూడాన్నం) పెడతారు.

ఇక పవళించే సమయం దగ్గరపడుతుంది. ఏకాంత సేవలో భాగంగా నేతిలో వేంచిన బాదం, జీడిపప్పులు వంటివి, కోసిన పండ్ల ముక్కలు, వేడి పాలు స్వామికి సమర్పిస్తారు.

||||||ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః||||||ఓం శ్రీ నమో వెంకటేశాయ నమః||||||

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Thursday, 29 June 2023

6 గురు దొంగలు - శుద్ధ సాత్వికం (10-July-23,Enlightenment Story)

🥙 6 గురు  దొంగలు 🥙

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥

మన లోపల ఒకడు ఉన్నాడు. అసలైన వాడు.కానీ వాడిదగ్గరికి వెళ్ళాలి అంటే 6 గురు  దొంగలు అడ్డుగా ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య అనే 6 గురు  దొంగలు.!

ఈ 6 గురిలో 4 గురు దొంగల నుండి సులభంగా తప్పించు కోవచ్చు, కానీ ఇద్దరు దొంగలనుండి తప్పించు కోవడం చాలా కష్టం..

ఆ ఇద్దరూ పెద్ద రౌడీలు.వాళ్ళే కామం, క్రోధం.ఈ ఇద్దరు రౌడీలు ఎక్కడ దాక్కొని ఉంటారు అంటే రజో గుణం అనే ఇంట్లో.

*కామ ఏష క్రోధ ఏష రజో గుణ సముద్భవహ*

ఈ కామం, క్రోధం అనేవి రజో గుణం నుండి వస్తున్నాయి అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు.కాబట్టి రజో గుణం అనే ఇంట్లో ఈ ఇద్దరు దొంగలు ఉంటారు.

ఈ దొంగలను పట్టుకోవాలి అంటే రజో గుణం అనే ఇంటికి తాళం వేయాలి. అంతే, ఇంక వాళ్ళు బయటికి రాలేరు..అయితే ఈ రజో గుణం అనేది First floor....ఇంకా మనం First floor కు రాలేదు. మనం Ground floor లో ఉన్నాం.

మనలో ఉండే తమో గుణమే ఆ Ground floor. అంటే మనం తమో గుణంలో ఉన్నాం. బద్దకం, అతి నిద్ర, ఆలస్యం, నిర్లక్ష్యం ఇవే తమో గుణం.ఇలాంటి తమో గుణంలో మనం ఉన్నాం.ఇంకా Ground floor లోనే ఉన్నాం.

ఈ Ground floor నుండి పైకి రావాలంటే చాలా కష్టం. అలాటి ఈ Ground floor నుండి పైకి వచ్చి, First floor కు వెళ్లి అక్కడ ఉండే 6 గురు  దొంగలను తప్పించుకొని ఇంకా పైకి వెళ్తే అప్పుడు Second floor వస్తుంది.

ఆ floor పేరు  ‘సత్వ గుణం. ఈ floor చాలా పెద్దగా ఉంటుంది. హాయిగా ఉంటుంది.ఎక్కడ చూసినా వెలుగే ఉంటుంది. అయితే చిన్న సమస్య. ఇక్కడ ఒకే ఒక దొంగుంటాడు. భయపడకండి.

వాడు మంచి దొంగ. వాడు మీకు మంచి మాటలే చెబుతూ  ఉంటాడు   మీకు Third floor కు దారి చూపిస్తాడు. ఆ floor పేరు శుద్ధ సాత్వికం.ఇదే చివరిది.ఇక్కడే మీకు  అఖండమైన వెలుగులో కలిసిపోయింది.ఆ అఖండమైన వెలుగే పరమాత్మ.

అది వెలుగులకు వెలుగు, మహావెలుగు. చివరిగా ఒక good news ఏమిటంటే మనం Ground floor నుండి third floor వరకు వెళ్ళడానికి ఒక  Lift   ఉంది. ఆ Lift పేరే "భగవద్గీత".

గీతను చదువుతూ ఉంటే తమో గుణం నుండి రజో గుణానికి, రజో గుణం నుండి సత్వ గుణానికి, సత్వ గుణం నుండి శుద్ధ సత్వం వరకు మనం ప్రయాణం చేసి, చివరికి శాశ్వతమైన స్థానాన్ని చేరుకోవచ్చు. పునర్జన్మ లేకుండా చేసుకోవచ్చు.

https://suryaa.co.in/that-changes-our-fate/


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
!!కృష్ణం వందే జగద్గురుం!! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!లోకా సమస్తా సుఖినోభవన్తు!!

!!కృష్ణం వందే జగద్గురుం!! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!లోకా సమస్తా సుఖినోభవన్తు!!

!!కృష్ణం వందే జగద్గురుం!! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!!లోకా సమస్తా సుఖినోభవన్తు!!

సాధన గురించి ఒక చిన్ని కథ (09-July-23,Enlightenment Story)

 🥙సాధన గురించి ఒక చిన్ని కథ 🥙

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥

చేతినిండా పని, మనసునిండా తగిన ఆలోచనలు.ఈ రెండూ మనిషి ప్రగతి రథానికి రెండు చక్రాలు. పనిలేక పోవడం వలన నిరాసక్తత ఏర్పడుతుంది. అలాంటివారిలో నిర్లిప్తత చోటు చేసుకుంటుంది. ఆ నిర్లిప్తత వల్ల ఎన్నో అనర్థాలు. అందుకే *పనిలేనివాడి బుర్ర దయ్యాల నిలయం* అనే నానుడి పుట్టింది.

ఎల్లప్పుడూ పని చెయ్యడానికి అలవాటు పడిన శరీరం చురుకుగా ఉంటుంది. మెదడూ ఉత్సాహం పుంజుకొంటుంది. శరీరాన్ని శ్రమ పెట్టకుండా సుఖాలు కల్పిద్దామని విశ్రాంతినిచ్చామో. శరీరం మరియు మనసు రెండూ రోగగ్రస్తం కావడం మొదలుపెడతాయి. 

చైతన్యపురంలో కృషీవలుడు అనే రైతు ఉండేవాడు. అతడికి ఉన్నది కొద్దిపాటి భూమి. అందులోనే నిరంతర కృషితో అత్యధిక ఫలసాయం పొందుతూ ఉండేవాడు. అతడు విశ్రాంతిగా ఒక్కరోజైనా కూర్చునేవాడు కాదు. 

ఒకసారి అతడు పొలం దున్నుతూ ఉండగా అటు వెళుతున్న ఆ ప్రాంత జమీందారు చూశాడు. అది నడివేసవి కాలం. కృషీవలుడి గురించి, అతడి విజయాల గురించి అంతకుముందే విన్నాడతను. ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఎన్నాళ్ళనుంచో అనుకుంటున్నాడు. ఇన్నాళ్ళకు ఇలా అవకాశం దొరికింది అనుకుంటూ- బండి ఆపించి దిగి అతడి దగ్గరకు వెళ్ళాడు. 

పరస్పర పరిచయాలు అయ్యాక 'ఇంత ఎండలో పనిచెయ్యకపోతేనేం?.ఇది పంట పండే కాలం కూడా కాదాయె. ఇప్పుడెందు కింత శ్రమపడి పనిచెయ్యడం?' అన్నాడు జమీందారు. 

ఆ మాటకు జవాబుగా కృషీవలుడు 'పండే కాలం కాదని మనం అనుకుంటున్నాం. భూమికి మాత్రం ఖాళీగా ఉండటం తెలియదు... దానికి తెలిసిందల్లా ఏదో ఒక మొక్కను తనలో నుంచి మొలిపించి పెంచడమే... నేను ఈ రోజు దున్నకపోయినా, విత్తులు వేయకపోయినా భూమి మాత్రం తనపని తాను చేసుకుపోతుంది. తన గర్భంలోనే ఇదివరకటి నుంచి ఉన్న ఏ రకమైన విత్తులనైనా మొలిపిస్తుంది. అలా జరిగితే నేను నిజంగా పంట వేసేవేళకు ఆ కలుపు మొక్కలతో ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది. 

ఆ పొలంలాంటిదే ఈ శరీరమూ... దీనికి పని చెప్పకుండా ఖాళీగా ఉంచితే ఏవో సుఖాలు కోరుతుంది. ఆలోచనలు చెయ్యడమే సహజ గుణమైన మెదడు సైతం అనేకమైన ఇతర ఆలోచనలు చేస్తుంది. ఫలితంగా పనిచెయ్యకుండా వదిలిన పొలంలో కలుపు మొక్కలు పెరిగినట్లే నా మనోక్షేత్రంలోనూ అనవసరమైన ఆలోచనలు సాగవుతాయి. శరీరానికీ, మనసుకూ హాని చేసే ఆలోచనలు నన్ను ఎటు తీసుకెళతాయో తెలియదు. అందుకే ఈ పొలానికి కలుపు మొక్కలు పెరిగే ఆస్కారం, మనసుకు చెడు తలపులు కలిగే ఆస్కారం ఇవ్వకుండా ఈ భూమిని మెత్తగా దున్నుతున్నాను. దీనివల్ల రాబోయే వర్షకాలంలో నా పనులు అతి సులువుగా జరగడానికి ఆస్కారం ఉంటుంది' అన్నాడు. కాబట్టి- ఏ రంగంలోనైనా నైపుణ్యం సాధించాలంటే నిరంతర కృషి, పరిశ్రమ .ఉన్నత స్థానానికి ఎదిగేవారి విజయరహస్యం ఇదే. 

అందరికీ బయటకు కనిపించేది- ఎదుటివారి విజయపరంపరే. బయటకు కనబడని అంశాలు- వారి నిరంతర శ్రమ మరియు సాధన. 

 పియానో వాద్యంలో ప్రపంచ ప్రసిధ్ధి పొందినవాడు పడెర్విస్కీ. అతడు కచేరీ ముగిశాక విశ్రాంతి తీసుకోకుండా మళ్ళీ కనీసం అయిదు గంటలు సాధన చేస్తూండేవాడు. అది చూసిన మిత్రుడొకడు 'నువ్వు ఇంత చక్కగా కచేరీ చేస్తున్నావు. అదీ కాక ఇంచుమించు ప్రతిరోజూ కచేరీ ఉంటూనే ఉంది. అయినా ఇంకా సాధన ఎందుకు?' అని అడిగాడు. 

ఆ మాట విన్న పడెర్విస్కీ 'నేను ఒక్కరోజు సాధన చెయ్యకపోతే నా సంగీత సామర్థ్యం తగ్గిపోయిందని నాకు *తెలిసిపోతుంది. రెండు రోజులు సాధన చెయ్యకపోతే తోటి విద్వాంసులు గుర్తించేస్తారు. వరసగా మూడు రోజులు సాధన చెయ్యకపోతే, నా సంగీత అభిమానులంతా నా సామర్థ్యం తగ్గినట్లు గుర్తిస్తారు. కళ పట్టుబడటం ఒకెత్తు. దాన్ని నిలబెట్టుకోవడం మరొకెత్తు. ఈ రెండింటికీ నిరంతర పరిశ్రమే ప్రధానం. అది లేకపోతే మనసు ఖాళీగా కూర్చోదు. మరొక పనిలోపడుతుంది. అప్పుడు అసలు పని సరిగ్గా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్థితి మనం కోరి తెచ్చుకోకూడదు. దానికోసం నిరంతరం సాధన, కృషి చేస్తూనే ఉండాలి. సాధనతోనే సాఫల్యం కలుగుతుంది' అన్నాడు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

బుద్ధుడు - మరణానుస్మృతి (08-July-23,Enlightenment Story)

 మరణానుస్మృతి

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥

ఒకసారి బుద్ధుడు నాదిక అనే గ్రామానికి వెళ్ళి, అక్కడ ఇటుకలతో నిర్మించిన శాలలో బస చేశాడు. ఆ పరిసర ప్రాంతంలో ఇటుక బట్టీలు ఉన్నాయి. వాటి దగ్గర ఇటుకలు గుట్టగా పోసి ఉన్నాయి. కొందరు భిక్షువులు ఒక గుట్ట పక్కగా వస్తున్నారు. ఇంతలో పెద్ద నాగుపాము ఒకటి ఆ గుట్టలోకి దూరింది. ముందు నడుస్తున్న భిక్షువు పెద్దగా అరిచి, వెనక్కి దూకాడు.


‘‘మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ విష పురుగులు ఎక్కువగా ఉంటాయి. ఏ క్షణంలోనైనా మరణం వచ్చి పడుతుంది’’ అన్నాడు ఇంకొక భిక్షువు.

వారు మాట్లాడుకుంటూ బుద్ధుని దగ్గరకు వెళ్ళారు. ఆయనకు నమస్కరించి కూర్చున్నారు. దారిలో జరిగిన విషయం గురించి చెప్పారు.

అప్పుడు బుద్ధుడు ‘‘భిక్షువులారా! మరణానికి సంబంధించిన స్మృతి కూడా మనకు ఎంతో మేలు చేస్తుంది. మహా ఫలాన్ని ఇస్తుంది. 

మనల్ని ఒక పాము కరవవచ్చు. తేలు కుట్టవచ్చు. మరే విషపు జంతువో పట్టుకోవచ్చు. వీటివల్ల మనకు ప్రాణం పోవచ్చు. అలాగే, నడుస్తూ నడుస్తూ తొలి, రాయిపై పడి, తల పగిలి మరణించవచ్చు. లోయలో పడి చనిపోవచ్చు. ఒక్కొక్కసారి మనం తినే ఆహారమే వికటించవచ్చు. వాత, పిత్త, కఫ దోషాలు ప్రకోపించి ప్రాణాలు తీయవచ్చు. అంతేకాదు, శరీరంలో వేగంగా మార్పులు జరిగి కూడా మృత్యువాత పడవచ్చు. చావు ఏ క్షణంలోనైనా రావచ్చు. రాత్రి పూట కలగవచ్చు, పగటి వేళా జరగవచ్చు. ఇలా మరణం గురించి స్మృతి (మరణానుస్మృతి) కలిగి ఉంటే అది కూడా మనకు మేలు చేస్తుంది. 

👉ఎలాగంటే.ఒక వ్యక్తి రాత్రి పడుకున్నప్పుడు, ఆ స్మృతి ఉన్నట్టయితే- ‘నాకు మరణం ఈ రాత్రే కలగవచ్చు. కాబట్టి నేను వదిలించుకోవలసిన పాప కర్మలు, అకుశల ధర్మాలు ఏవైనా ఉన్నాయా?’ అని ఆలోచించుకోవాలి. తనను తాను పరిశీలించుకోవాలి. 

👉ఇక ఎక్కువ సమయం లేదు కాబట్టి.ఉత్తేజంతో, అలసట చెందకుండా మనసు నుంచి రాగం, ద్వేషం, మోహం, కోపం, పగ లాంటి అకుశల భావాలను తొలగించుకోవాలి. మంచి గుణాలను పెంచుకోవాలి. ఈ విధంగా.మరణ భయం కూడా మనల్ని తీర్చిదిద్దుతుంది.

మనలోని చెడ్డ గుణాలను వదిలించుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ విధంగానే, ఉదయం లేచిన తరువాత అనేక పనుల మీద రకరకాల ప్రాంతాలకు తిరిగేవారికి కూడా మరణం ఏ క్షణాన్నైనా రావచ్చు. కాబట్టి... అప్పుడు కూడా తనను తాను వేగంగా సంస్కరించుకోవాలి. అంటే మరణ భయం మనల్ని పగలైనా, రాతైన్రా... ఏ సమయంలోనైనా సంస్కరిస్తుంది. 

👉అలా సంస్కరించుకున్నవాడు, కుశలధర్మాలు కూడుకున్నవాడు ‘నేను ఈ రాత్రి చనిపోయినా, ఈ పగలు చనిపోయినా నాకు అంతరాయం కలిగించేవి, నేను వదిలిపెట్టాల్సిన దుష్ట కర్మలు, అకుశల ధర్మాలు ఏవీ నాకు లేవు’ అనుకుంటాడు. అలాంటి వాడు పగలూ, రాత్రీ సంతోషంగా, సుఖంగా బతుకుతాడు’’ అని చెప్పాడు.🍁

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

విమానంలోని రౌండ్ కిటికీలు ఎందుకు ఉంటాయి? (07-July-23,Enlightenment Story)

 🍁విమానంలోని కిటికీలు రౌండ్ ఉండే కిటికీలు ఎందుకు ఉంటాయి?

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥

1950 ల వరకు విమానంలోని కిటికీలు చదరపు ఆకారంలో ఉండేవి. రెండు విమానాలు మిడ్-ఫ్లైట్ అక్షరాలా పడిపోయిన తరువాత, డిజైన్ లోపం త్వరగా గుర్తించబడింది. 

ఆ తరువాత ఈ సమస్యని పరిష్కరించారు. విమానాలలో స్క్వేర్ షేప్ లో ఉండే కిటికీలను అమర్చడం ప్రమాదకరం. ఎందుకంటే క్యాబిన్ లోపల మరియు వెలుపల ఉన్న ప్రెజర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

👉స్క్వేర్ షేప్ లో ఉండే కిటికీ కి కార్నర్ లు షార్ప్ గా ఉంటాయి. ఇవి ప్రెజర్ ని తట్టుకోలేవు. దాని వలన ప్రమాదం జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. 

👉అదే రౌండ్ గా ఉండే కిటికీలు అయితే ఈ ప్రెజర్ ని బయటకి డిస్ట్రిబ్యూట్ చేస్తాయి. అందుకే స్క్వేర్ షేప్ లో ఉండే కిటికీల కంటే, రౌండ్ షేప్ లో ఉండే కిటికీలు ఎక్కువ బలం గా ఉంటాయి. అందుకే విమానాలలో కూడా కిటికీలను రౌండ్ షేప్ లో డిజైన్ చేస్తారు.🍁


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Wednesday, 28 June 2023

సుదర్శన జయంతి 28-Jun-23

సుదర్శన జయంతి (28-Jun-23)

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥

శ్రీ సుదర్శన చక్రము యొక్క వార్షిక జయంతి సందర్భంగా ఈరోజు మోక్ష పట్టణం అయిన శ్రీ కాంచీపురం లో ఉన్న శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ సుదర్శన చక్ర అల్వార్ స్వామివారికి విశేష అభిషేక అర్చనలు జరిగిన పిదప తీసిన ఫోటోలు 


మహావిష్ణువు యొక్క శక్తివంతమైన ఆయుధమైన అత్యున్నత దైవిక సుదర్శన చక్రం పుట్టినరోజు. ఈ శక్తివంతమైన ఆయుధం మీ ఎదుగుదలకు మరియు విజయానికి ఆటంకం కలిగించే అన్ని ప్రతికూల శక్తులను ఎదుర్కోగలిగే ధర్మానికి ఒక ఘనమైన కవచంగా, సంరక్షకుడుగా నిలబడుతుంది.

సుదర్శన జయంతి తమిళ నెల ఆది (జూల్ - ఆగస్టు)లో శుక్ల పక్ష దశమి (10వ క్షీణిస్తున్న చంద్రుడు) నాడు వస్తుంది.

పురాణాలలో సుదర్శన చక్రం

రాక్షసుల తల నరికివేసేందుకు విష్ణువు సుదర్శన చక్రాన్ని ఉపయోగించినట్లు పౌరాణిక ప్రస్తావనలు చాలా ఉన్నాయి. కానీ, సుదర్శన చక్రం యొక్క పుట్టుక గురించి కేవలం రెండు పురాణాలు మాత్రమే ఉన్నాయి.

శివుడు విష్ణువు పట్ల తీవ్రమైన తపస్సు చేసిన తర్వాత రాక్షసులను చంపడానికి సుదర్శన చక్రాన్ని ఎలా బహుమతిగా ఇచ్చాడో వివరించడానికి అలాంటి కథ ఒకటి.

ఖగోళ జీవుల యొక్క ప్రధాన వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ సూర్యుని తేజస్సును తగ్గించి సుదర్శన చక్రాన్ని ఎలా సృష్టించాడో మరియు సూర్యుని తేజస్సులోని భాగాలను ఉపయోగించి సుదర్శన చక్రాన్ని ఎలా సృష్టించాడో మరొక కథ వివరిస్తుంది.

సుదర్శన భగవానుడు శత్రువులను తుడిచిపెట్టి ఆత్మను స్వస్థపరుస్తాడు. సుదర్శన భగవానుడు మరెవరో కాదు విష్ణువు. నాశనం చేయలేని సుదర్శన చక్రాన్ని కలిగి ఉన్నందున అతన్ని అలా పిలుస్తారు.

సుదర్శనం అనే పదం 'సు' అనే రెండు పదాల నుండి ఉద్భవించింది , అంటే శుభం మరియు దర్శనం అంటే దర్శనం.

చక్రం అంటే స్థిరంగా గమనంలో ఉండే చక్రం. త్రిమూర్తులు బ్రహ్మ , విష్ణు మరియు శివుల కలయికతో చక్రం సృష్టించబడింది.

పురాణాల ప్రకారం , శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు ఖాండవ వనాన్ని దహనం చేయడంలో అగ్నిదేవునికి సహకరించారు. బదులుగా, అతను కృష్ణుడికి సుదర్శన చక్రం మరియు కౌమోదకి జాపత్రిని బహుమతిగా ఇచ్చాడు.

సుదర్శనచక్రం ఉపయోగించే ఇతర దేవతలు నారాయణి మరియు వైష్ణోదేవి.సుదర్శన జయంతి నాడు మహా సుదర్శన అష్టక హోమం చేస్తారు. వైష్ణవులు ఈ రోజును శుక్ల పక్ష ఆషాడ దశమిగా పాటించి, మరుసటి రోజున తొలి ఏకాదశి వ్రతం చేబడతారు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

ఆ అంతరం అలాగే ఉండిపోయింది (05-July-23,Enlightenment Story)

 ఆ అంతరం అలాగే ఉండిపోయింది ఆ అంతరం - నిరంతరం

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥

 మధ్యతరగతి అంతరంగంలో ఆ  అంతరం అలాగే ఉండిపోయింది🤔                   

1)చిన్నప్పుడు రైల్లో ప్రయాణం చేసేటప్పుడు - తినడానికి , ఇంటినుండి అమ్మ చేసినవి తీసుకెళ్ళేవాళ్ళం. కొంతమంది - రైల్లో కొనుక్కుని తినేవాళ్ళని చూసినపుడు మనమూ అలాగే కొనుక్కుని తినాలనిపించేది!

అప్పుడు నాన్న చెప్పేవాళ్ళు, అది మన స్థాయికి చేయదగ్గది కాదు, డబ్బులున్న గొప్ప వాళ్ళు చేసేది అని! ఇప్పుడు పెద్దయ్యాక - మనం కొనుక్కుని తినే టైంకి. ఆ పెద్ద వాళ్ళు , గొప్పవాళ్ళు ఆరోగ్య రీత్యా ఆహారం ఇంటినుండి తెచ్చుకుని తింటున్నారు.😂 దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది .

2) చిన్నప్పుడు కాటన్ దుస్తులు వేసుకుంటే - కొంతమంది టెర్లిన్ బట్టలు తొడుక్కునే వాళ్ళు. అదిచూసి అటువంటివి కావాలనిపించినపుడు, నాన్న చెప్పే వారు. అది ఖరీదైనది మనం అంత పెట్టగలిగే వాళ్ళంకాదని!*   

పెద్దయ్యాక - మనం టెర్లిన్ వాడటం మొదలు పెడితే , వాళ్ళు  కాటన్ కు దిగారు. ఇప్పుడు, కాటన్ దుస్తులధరేఎక్కువ 🤪 దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ..😒🤔

3)చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్న కాటన్ ప్యాంటుకే - మోకాళ్ళ దగ్గర చినిగితే , పారేసెందుకు మనసొప్పక అమ్మ లేదా టైలర్ తమ పనితనం చూపి నీట్ గా రఫ్ చేసి ఇస్తే ..మళ్ళీ హ్యాపీగా వేసుకునేవాళ్ళం!

పెద్దయ్యాక చూస్తే - జనం ఆ మోకాళ్ళదగ్గర చిరుగులు ఉన్నవాటిని.... ఫ్యాషన్ పేరుతో అధికధరలకు కొంటున్నారు ! దాంతో ఆ అంతరం అలాగే ఉండిపోయింది ...*🤔😒

4) ఓ వయసులో మనకు - సైకిల్ కొనగలగడమే కష్టం. అదీ సాధించేసరికి - వాళ్ళు స్కూటర్ నడిపించేవాళ్ళు. మనం - స్కూటర్ కొనే సమయానికి. వాళ్ళు కార్లలో తిరిగేవారు. మనం కొంచెం ఎదిగి - మారుతి 800 కొనే సమయానికి. వాళ్ళు BMW ల్లో తిరిగారు.

మనం రిటైర్మెంట్ వయసుకి  వచ్చిన కూడబెట్టుకున్న వాటితో  - కొంచెం పెద్ద కారు కోనేసమయానికి.వాళ్ళు ఆరోగ్యావసరాలతో సైక్లింగ్ చేస్తున్నారు! దాంతో ఇప్పటికి ఆ అంతరం అలాగే ఉండిపోయింది . .🤔😒

ప్రతి దశలో, ప్రతి సమయాన ,విభిన్న మనుషుల మధ్య - స్థాయి అంతరం ఉండనే ఉంటుంది.ఆ అంతరం - నిరంతరం ఎప్పటికి ఉండి తీరుతుంది. రేపటిఆలోచనతో ఇవాళ్టిది వదులుకుని. 😢

మళ్ళీ రేపటిరోజున - గతించిన  ఇవాళ్టి గురించి ,చింతించేకంటే. ఇవాళ అందినదానితో ఆనందించు.. ఆస్వాదించు.. జీవితం కూడా సంతోషంగా ఉంటుంది

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

తొలిఏకాదశి (శయనఏకాదశి) - 29-06-2023 (29-July-23, Enlightenment Story)

 తొలిఏకాదశి (శయనఏకాదశి)  - 29-06-2023

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥

ఆషాడ శుద్ధ ఏకాదశిని “తొలి ఏకాద‌శి” అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశులు (ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి , శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెండు ఏకాదశులు వస్తాయి.) ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్నటువంటి ఐదు జ్ఞానేంద్రియాలు , ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేంద్రియం అయిన మనసు కలిపితే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముకంగా పనిచేసే సమయమే ఏకాదశి.

🔸 తొలి ఏకాదశి – విశిష్టత

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. దీనినే “శయన ఏకాదశి , ప్రధమ ఏకాదశి”, “హరివాసరం” అని కూడా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే , ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు (పంచ భూతాలు , సూర్య చంద్రులు , గ్రహాలు పరస్పర సంబంధాన్నీ , వాటి గమనాన్ని బట్టి) సంకేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుండి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తాడు ( సూర్యుడు దక్షణం వైపుకు మరలినట్లు , ఈ రోజు నుంచి దక్షణాయన ప్రారంభాన్ని సూచిస్తుంది). అంతేగాక చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభమౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని , కార్తీక మాస శుక్ల పక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించవలెనని పురాణాలు చెబుతున్నాయి.

🔸 తొలి ఏకాదశి జరుపుకొను విధానం, నియమాలు

మహిమాన్వితమైన ఈ ఏకాదశి పర్వదినాన వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచంద్ర గ్రహణములలో భూమి దానాలిచ్చినంత , అశ్వమేధ యాగం చేసినంత , అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది. వ్రతంలోని ప్రధాన నియమాలు.

🔸 ఉపవాస ఫలితాలు:

ఈ వ్రతాన్ని ఆచరించదలచినవారు దశమి నాడు రాత్రి నిహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు , దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి. అన్నదానం చేయడం చాలా మంచిది. 

🔸 ఏకాదశి వ్రతమాచరించేవారు ఇవి తినరాదు.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి , శుచిగా స్నానమాచరించి , శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణుమూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు , కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించుకోవాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు కాల్చి వండినవి , మాంసాహారం , పుచ్చకాయ , గుమ్మడి కాయ , చింతపండు , ఉసిరి , ఉలవలు ,  మినుములు తీసుకోకూడదు. అదేవిధంగా మంచంపై శయనించడం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురాణంలో వివరించారు. అష్టకష్టాలతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ , ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు సమస్త వ్యధల నుంచీ విముక్తి పొందగలరనీ , మరణానంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుందనీ పద్మ పురాణంలో పేర్కొన్నారని చెప్తుంటారు.

ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు ‘చాతుర్మాస్య వ్రతం’ అవలంబిస్తారు. శాకాహారులై ఉపవాస వ్రతం ఆచరించాలన్నది , ఈ చాతుర్మాస్య వ్రత నియమం. ఏకాదశినాడు ఉపవసించి , మర్నాడు పారణ చేసి , ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తారు. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి , అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని , పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని , ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్కజొన్న పేలాలను మెత్తటి పొడిగా దంచి , అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి , ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశినాడు ఈ పేలపిండిని తప్పకుండా తినాలని విశ్వసిస్తారు. 

🔸 తొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తే..

ప్ర‌తినెలా వచ్చే ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు , పశుపూజ , శకట ఆరాధనలు చేస్తారు.

🔸 ప్రాశస్త్యం

ముఖ్యంగా ఆషాఢమాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి , శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన మవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

🔸 ఏకాదశి నియమాలు..

దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండి ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందుగా కాల కృత్యాలు తీర్చుకుని శ్రీహరిని పూజించాలి.

❀ ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

❀ అసత్య మాడరాదు.

❀ కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.

❀ ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.

❀ మర్నాడు అనగా ద్వాదశినాడు ఉదయాన్నే కాలకృత్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్య తాంబూలాలు సమర్పించి భోజనం చేయాలి.

❀ అన్నదానం చేయడం చాలా మంచిది.

uఈ వ్రతం చేసుకున్నవారికి సూర్య చంద్ర గ్రహణములలో భూరి దానాలిచ్చినంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేల సంవత్సరాలు తపస్సు చేసినంత పుణ్యం లభిస్తుందని ఏకాదశి వ్రత మహత్యాన్ని గురించి మన పురాణాలు వివరిస్తున్నాయి.


💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥
26 ఏకాదశుల నామాలు, కేవలం ఏకాదశి నామాలను వింటే చాలా పాపాలు తొలగిపోతాయి.వారి పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
 1. ఉత్పన ఏకాదశి
 2. మోక్షద / వైకుంఠ/ ముక్కోటి/ గీతా ఏకాదశి
 3. సఫల ఏకాదశి
 4. పుత్రదా ఏకాదశి
 5. సత్తిల ఏకాదశి
 6. జయ / భీష్మ ఏకాదశి
 7. విజయ ఏకాదశి
 8. అమలకీ ఏకాదశి
 9. పాప్మోచని ఏకాదశి
 10. కామద ఏకాదశి
 11. వరుటిని ఏకాదశి
 12. మోహినీ ఏకాదశి
 13. అపర ఏకాదశి
 14. నిర్జల ఏకాదశి
 15. యోగిని ఏకాదశి
 16. దేవ-శయన / పద్మ ఏకాదశి
 17. కామిక ఏకాదశి
 18. పుత్రదా / పవిత్రోపణ ఏకాదశి
 19. అజ / అన్నద ఏకాదశి
 20. పర్వర్తిని / పార్శ్వ /వామన ఏకాదశి
 21. ఇందిరా ఏకాదశి
 22. పాపాంకుశ ఏకాదశి
 23. రామ ఏకాదశి
 24. హరిభోదిని / ఉత్థాన ఏకాదశి
 25. ఆదిక మాసం – పద్మిని ఏకాదశి
 26. అధిక మాసం – పరమ ఏకాదశి
పేరు వినడం మరియు చదవడం ఫలాలను ఇస్తుంది.

పి వి నరసింహారావు జయంతి -28-Jun-23 (19-July-23, Enlightenment Story)

 శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి 102 వ జయంతి (పి వి నరసింహారావు) - 28th Jun'23

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥

క్రీస్తుపూర్వం 4వ శతాపి వి నరసింహారావు.బ్దంలో చంద్రగుప్తుల కాలంలో ‘చాణుక్యుడు వ్రాసిన అర్థశాస్త్రమే నేటి రాజకీయ పరిపాలనా విధానాలకు మూలం. ఎన్నో శతాబ్దాలుగా ఎంతో మంది రాజులు ఈ అర్థశాస్త్రాన్ని అవపోసనపట్టి తమ రాజ్యాలను ఎంతో జనరంజకంగా పరిపాలించారు. కాలానుగుణంగా ఆ పరిపాలనా విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ మూలం మాత్రం అట్లాగే వుంది.


20 వ శతాబ్దంలో అటువంటి చాణుక్యుడే మన తెలుగునాట జన్మించి భారతదేశ ఆర్ధికరంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొనివచ్చి, అంతర్జాతీయంగా భారతదేశ ఎగుమతుల దిగుమతుల వాణిజ్యవిధానాలలో పెనుమార్పులకు ఆద్యుడయ్యాడు. అతనే తెలుగువాడైన మొట్టమొదటి ప్రధానమంత్రి, ప్రపంచం గుర్తించాకా గానీ భారతీయులు గుర్తించని జాతి వజ్రం! భారతదేశానికి ఆర్ధిక సంస్కరణల పితామహుడు, ప్రపంచ భాషాకోవిదుడిగా పొరుగుదేశాల మన్ననలు పొందిన మన పాములపర్తి వెంకట నరసింహారావు మనందరం గౌరవంగా పిలిచే పి వి నరసింహారావు.

ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ జిల్లా, లక్నేపల్లి గ్రామంలో జూన్ 28, 1921 న జన్మించిన పి వి, ప్రాధమిక విద్య వరంగల్ జిల్లాలోనే పూర్తిచేశారు. పిమ్మట కరీంనగర్ జిల్లా వాసులైన పాములపర్తి రంగారావు దంపతులు ఆయనను దత్తత తీసుకోవడంతో ఆయన పాములపర్తి నరసింహారావు అయ్యారు..

స్వయంగా బహుభాషావేత్త అయిన నరసింహారావు గారు ఏ విషయంలోనూ తడబడే మనస్తత్వం కాదు. ఆయన మనసులోని మాటను తను చెప్తేనే గ్రహించగలం. చట్ట సభలలో ఆయన వాగ్ధాటికి నిలిచి ఆయనను ప్రశ్నలతో భయపెట్టేవారు ఎవరూ దాదాపు లేనట్టే. ప్రతివిషయంలోనూ ఎంతో పరిజ్ఞానంతో వుండేవారు.

పివి నరసింహారావుగారు 17 భాషలలో పండితుడు. ఆయన ఏ దేశానికి వెళ్ళినా అక్కడి భాషలో మాట్లాడి అనువాదకుల అవసరం లేకుండా చేసేవారు. పాత్రికేయ వృత్తిని కూడా చేసిన ఈ బహుభాషా పండితుని లో ఒక కవి కూడా దాగివున్నాడు. కవి సామ్రాట్ విశ్వనాధ సత్యన్నారాయణ గారి "వేయి పడగలు" ని హిందీ లోకి ‘సహస్రఫణ్’ పేరుతో అనువదించారు. 

పి వి నరసింహారావు భారతదేశ ఆర్థిక చరిత్రను మార్చారు. కానీ ఆయన పొందవలసిన గౌరవం ఎంతో వుంది. ఈ భారతదేశం ఆయనకు ఎంతో రుణపడివుంది. ఆయన అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ బిరుదునిచ్చి సత్కరించవలసిన సమయం ఇప్పుడైనా వస్తే ఎంతో సంతోషిస్తాను అని ప్రముఖ పాత్రికేయుడు, బిజినెస్ స్టాండర్డ్ ఎడిటర్ మరియు మన్మోహన్ సింగ్ గారికి ఆర్ధిక సలహాదారుగా పనిచేసిన శ్రీ సంజయబారు తన పుస్తకం ‘1991’ వ్రాసిన తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూ లో వ్యక్తీకరించారు. .

మన దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారత రత్న’ కు ఆయన అన్ని విధాల అర్హుడు. ఆ పురస్కారం ఆయనకు లభించాలని మనందరం కోరుకుందాం.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

Tuesday, 27 June 2023

సూర్యభగవానుని మెప్పించిన ఆంజనేయుడు (02-July-23, Enlightenment Story)

 🌹🙏సూర్యభగవానుని మెప్పించిన ఆంజనేయుడు..!!

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥

🌿 ఆంజనేయుని చరిత్రను పఠించిన వారికి ఆయుర్ధాయుము సంపూర్ణంగా ఉంటుంది. ఆంజనేయుడు సూర్యభగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసించి నవ వ్యాకరణ పండితుడు అయ్యాడు.

🌸గురుదక్షిణ చెల్లించుకుందామనుకున్న ఆంజనేయునితో సూర్య భగవానుడు ఇలా అంటాడు. ఆంజనేయా! నీవు కారణ జన్ముడివి. నీ వల్ల జరగాల్సిన మహత్కార్యాలు ఎన్నో ఉన్నాయి.

🌸 లోకోత్తరుడైన శ్రీరామచంద్రునికి బంటుగా నీవు చరిత్ర సృష్టిస్తావు. స్వామి భక్తి అంటే ఏమిటో నీవు నిరూపిస్తావు. నీ వల్ల పది మంది ఉపకారం పొందుతారు.

🌿శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీరామచంద్రుణ్ణి సేవించే భాగ్యం నీకు కలుగుతుంది. తద్వారా లోకానికి కూడా నీ వల్ల మంచి జరుగుతుంది. నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వలేదని బాధపడకు. సూర్య వంశజుడైన శ్రీరామచంద్రునికి సేవ చేయడం ద్వారా నీవు గురుదక్షిణ చెల్లించినట్టే.

🌸 అంతే కాక లోకంలో ఆరోగ్య, ఈతిబాధలు అనుభవించేవారిని కాపాడేందుకు నీవు ఈ లోకంలోకి వచ్చావు. నిన్ను నమ్ముకున్న వారికి ఈతిబాధలు,ఆరోగ్య సమస్యలు ఉండవు.

🌿 ఏ కార్యం తలపెట్టినా అతి అవలీలగా పూర్తి అవుతుంది అని అంటాడు. సూర్యభగవానుని మాటలు ఆంజనేయుణ్ణి రంజింపజేసాయి. సూర్య భగవానుడు ఇదే రీతిలో ఆంజనేయుని తల్లి అంజనాదేవికి కూడా చెబుతాడు.

🌸 ఆంజనేయుడు సకల గుణోపేతుడు, సర్వకార్య సిద్ధి కలిగించే అనుగ్రహ ప్రదాత. నీకు వరప్రసాదంగా ఆంజనేయుడు ఉద్భవించాడు. అతడిని తక్కువగా అంచనా వేయవద్దు. అతడు అమోఘమైన బలపరాక్రమాలు కలిగినవాడు.

🌿 ఎవరికి సాధ్యం కాని పనులు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించగల ధీమంతుడు. అతడి వల్ల నీకు మంచి పేరు వస్తుంది. అమె కూడా సూర్య భగవానుని మాటలకు ఎంతో ఆనందిస్తుంది.

🌸 సూర్యో పాసన చేసే వారు ఆంజనేయుణ్ణి కూడా ఆరాధిస్తారు. ఇద్దరినీ ఆరాధించేవారికి ఎటువంటి లోటు కలగదు. వారు చేపట్టే పనులన్నీ పూర్తి అవుతాయి.

🌿 జటిలమైన సమస్యలను సైతం ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పేరుప్రతిష్ఠలు కోసం కాక ఎదుటివారికి మంచి చేయాలనే సద్బుద్ధితో పనులు చేపడతారు.

🌸 భూత, ప్రేత ,పిశాచాది వంటి దుష్టశక్తులు. గాలి, ధూళి వంటి వాటి నుంచి కాపాడేవాడు ఆంజనేయుడే. అందుకే పూర్వాకాలం నుంచి పిల్లలకు ఎటువంటి గాలి సోకకుండా ఆంజనేయుని యంత్రాలను మెడలో హారంగానో , మొలకో కట్టడం ఆనవాయితీ.

🌿 అంతే కాక ఆంజనేయునికి అత్యంత ప్రీతికరమైన సింధూరాన్ని తిలకంగా నుదుట ధరించే వారికి ఎటువంటి గ్రహపీడలు ఉండవు. దిష్టి తగలదు. ఆంజనేయుణ్ణి ఆరాధించేవారికి సకల శుభాలు కలుగుతాయి.

🌸 అంతటి మహిమాన్వితుడైన ఆంజనేయుణ్ణి మనమంతా ఆరాధించి సకల శుభాలను పొందుదాం.🙏🌹

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

భగవంతునికి దగ్గర కావాలన్నా (01-July-23, Enlightenment Story)

 భగవంతునికి దగ్గర కావాలన్నా, భగవద్ అనుగ్రహం పొందాలన్నా - మనోనిగ్రహం కావాలన్నా ఏమి చేయాలి ?ఎలా సాధ్యం ?

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥🔥🌹🔥🌹🔥🌹🔥

పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు, అలాగే భగవదాకాంక్ష, ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు, అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి.

*కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం*

శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు.

"ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది, జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేము.

ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే. కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం."

నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా మనలోపల ఎల్లప్పుడూ కోరికలు అనేటివి దాగి ఉంటాయి. 

ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది, పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు. నెయ్యి లేదని ఇతడన్నాడు, అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా అని చెప్పాడు,

ఎండలో ఉంచిన కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది. ఆ విధంగానే కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి.

వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి. 

కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొ౦టే సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి.ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి. 

కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి. 

రామకృష్ణ పరమహంస వారు వారి సాధనలో ని అనుభవం గూర్చి ఇలా వివరించారు. ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి. 

ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు, ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను.

నా మనస్సును ఇలా ప్రశ్నించాను.. 'నీకు ఏం కావాలి.. వీటిలో దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్పు. అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు, భగవంతుడి పాద పద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది."

ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు, ఈ శత్రువును తుదిముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి.  వాటిలో కొన్ని త్యాగాగ్ని, జ్ఞానాగ్ని, యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు..

రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు."ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి..

హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడుగు.

'ఓ ఈశ్వరా.. ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు." ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటాడు.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

🌴🏵🙏జై శ్రీమన్నారాయణ🙏🏵🌴🙏🕉ఓం అస్మత్ గురుభ్యోనమః🕉🙏

🙏శ్రీమతే రామానుజయా నమః 🙏  🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹🍀🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🍀

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉

Monday, 26 June 2023

దైవ ప్రార్థన (30-June-23, Enlightenment Story)

 దైవ ప్రార్థన

🔥🌹🔥🌹🔥🌹🔥🌹🔥🌹🌹🔥🌹🔥🌹🔥🌹🔥

ఒక శిష్యుడు రామకృష్ణ పరమహంసను భగవంతుడి మీద మనసు ఎలా లగ్నం చెయ్యాలని ప్రశ్నించాడు. దానికాయన ఇలా చెప్పారు:

*ఎల్లప్పుడూ భగవన్నామ సంకీర్తనం, సత్సంగం చేస్తుండాలి. రాత్రి పగలు సంసారంలో మునిగిపోతే భగవంతుడి మీద మనసు లగ్నం కాదు. అప్పుడప్పుడూ ఏకాంత ప్రాంతాలకు వెళ్ళాలి. మొదట్లో భగవంతుడి మీద మనసు లగ్నం చేయడం కష్టమౌతుంది. మొక్క లేతగా ఉన్నప్పుడే చుట్టూ కంచె వేసి ఆవులు, మేకలు తినకుండా కాపాడినట్టు ఏకాంతమనే కంచె వేసి సాధన చేయాలి*


భగవంతుడొక్కడే సత్యమనీ (నిత్య వస్తువు), తక్కినదంతా అసత్యమనీ (అనిత్యం) విభజిస్తూ అనిత్య వస్తువుల నుండి మనస్సును దూరంగా ఉంచాలి.

ధనవంతుల ఇంట్లో పనిమనిషి పని చేస్తున్నా మనసు మాత్రం తన ఇంటి మీదనే ఉంచుకున్నట్టు, యజమాని పిల్లలను తన పిల్లల్లాగా పెంచు తున్నప్పటికీ తన బిడ్డలు కారని అనుకున్నట్టుగానే మనుషులు రోజు వారీ పనులను చేస్తూనే భగవంతుని ధ్యానిస్తుండాలి.

భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉంటూనే, దేవుడు తప్ప మరెవ్వరూ తనవాళ్లు కాదని గుర్తించాలి. తాబేలు నీటిలో తిరుగాడుతున్నప్పటికీ ధ్యాసను గట్టు మీద పెట్టిన గుడ్ల మీదనే ఉంచుకున్నట్టు మనుషులు దేవుడి మీద మనసు నిలపాలి.

చేతికి నూనె రాసుకుని పనస తొనలను ఒలవకపోతే చేతికి జిగురు అంటుకున్నట్టే భగవంతుని పట్ల భక్తి రూపమైన నూనె రాసుకున్న తర్వా తనే సంసారంలో దిగాలి. లేదంటే సంసార వాసనలు పట్టి పీడిస్తాయి.

వెన్నను తీయాలంటే పాలను తోడు పెట్టి ఒక చోట ఉంచాలి. మాటి మాటికీ కలుపుతుంటే పెరుగు తోడు కోదు. తగినంత సమయమిచ్చిన తరువాతే పెరుగును చిలకాలి. అప్పుడే వెన్న దొరుకుతుంది. అట్లాగే దైవ ప్రార్థనకి కూడా తగినంత సమయం కేటాయించినప్పుడే భక్తి భావం కలుగుతుంది.

సంసారం నీళ్ల వంటిది. మనసు పాలవంటిది. పాలను నీళ్లలో పోస్తే పాలు, నీళ్లు కలిసి ఏకమైపోతాయి. అప్పుడు పాలను వేరు చేయలేము. అదే పాలను తోడుపెట్టి, పెరుగు చిలికి, వెన్న తీసి, ఆ వెన్నను నీళ్లలో వేస్తే అప్పుడు వెన్న తేలుతుంది. అలాగే ఏకాంత ప్రాంతంలో సాధన చేసినప్పుడే భక్తి జ్ఞానమనే వెన్నను పొందగలుగుతారు. ఆ వెన్నను  నేలలో జారవిడిచినా కలిసి పోదు. తేలుతుంది." ఇలా దేవుడి మీద మనస్సు ఎలా లగ్నం చేయాలో చెప్పారు రామకృష్ణ పరమహంస.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...