Wednesday, 1 March 2023

నవవిధ భక్తి మార్గాలు & మోక్షమార్గం (02-Mar-23, Enlightenment Story)

🌺 నవవిధ భక్తి మార్గాలు 🌺

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏🌷🌷🙏

 జీవితం యొక్క ఉద్దేశ్యం ఆత్మను శక్తివంతం చేయడం, మెరుగుపరచడం. రెగ్యులర్ లైఫ్‌తో పాటు, మనం నాణ్యమైన సమయాన్ని భగవంతుడి,అవసరమైన వారి సేవకి మరియు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం,నవవిధ భక్తి మార్గాలకి  వెచ్చించాలి


1. శ్రవణం(వినడం) భక్తి చేత పరిక్షిత్ మహరాజు తరించాడు.
2. కీర్తనం(పాడడం) చేత నారద మహర్షి తరించాడు.
3 స్మరణం (నోటితో ఎల్లప్పుడు పలకడం) చేత ప్రహ్లదుడు తరించాడు.
4 పాదసేవనంతో లక్ష్మణుడు తరించాడు.
5 అర్చణంతో పృధు చక్రవర్తి తరించాడు
6 వందనం చేత అక్రూరుడు తరించాడు.
7 దాస్య భక్తి (సేవ )చేత గరుత్మంతుడు, హనుమంతుడు తరించాడు.
8 సఖ్యం భక్తి చేత అర్జునుడు తరించాడు.
9 ఆత్మనివేదనంతో బలిచక్రవర్తి తరించారు.

యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం

మనిషి మహనీయుడు కావాలంటే ఈ క్రింది లక్షణాలు కలిగి ఉండాలి.
1) జీవితంలో దైవనామాన్ని నిరంతరం తరించాలి.
2) జీవితంలో నీ అంతఃరాత్మకు లోబడి జీవించి తరించు.
3) జీవితంలో శాస్త్రం ను అనుసరించి జీవించి తరించు.
4) తత్వ విచారణ చేసి జీవించి తరించు.
5) యోగ మార్గంలో ఆత్మ విచారణ చేసి జన్మ రాహిత్యం చేసుకోని తరించు.
6) పూజ పారామార్దం:-పూజ అర్చన జపం.
7) స్తోత్రం. ధ్యానం. దీక్ష. అభిషేకం. మంత్రం. ఆసనం. తర్పణం. గంధం. అక్షితలు. పుష్పం. ధూపం. దీపం. నైవేద్యం. ఆచమనీయం. అవాహనం. స్వాగతం. పాద్యం మధుపర్కం. స్నానం. వందనం. ఉద్వాసన.... పూజ-పరమార్థాలు:
8) పూజ అనగా పూర్వజన్మ వాసనలను తొలగింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణ ఫలాన్నిచ్చేది.
9) అర్చన అనగా అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది. దేవతలను సంతోషపెట్టేది.
10) జపం అనగా అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పర దేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
11) స్తోత్రం అనగా మెళ్ళ మెళ్ళగా మనస్సునకు ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
12) ధ్యానం అనగా ఇంద్రియ నిగ్రహాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్ట దేవతను తపింపచేసేది ధ్యానం.
13)దీక్ష అనగా దివ్య భావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాల నుండి విముక్తిని కల్గించేది దీక్ష.

*మోక్షమార్గం*

ధర్మార్థకామమోక్షములు అనే చతుర్విధ పురుషార్థములలో చివరిదైన మోక్షమును ఉత్తమ పురుషార్థముగా మన శాస్త్రగ్రంథాలు, పూర్వులైన పెద్దలు ధృవపరచడం జరిగినది. ఉత్తమ పురుషార్థమైన మోక్షమును పొందుటకు కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తులు అనేవి నాలుగు శాస్త్ర సమ్మతమైన మోక్షమార్గాలు.

జనక చక్రవర్తి మొదలైనవారు కర్మమార్గం ననుసరిస్తూ మోక్షమును పొందినారు. కర్మణైవ హి సంసిద్ధిం ఆసితా జనకాదయః అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో పేర్కొనెను. కాని వేదపూర్వభాగంలో చెప్పబడిన రీతిలో వైదిక కర్మాచరణ అంత సులభం కాదు.

రెండవదైన జ్ఞానమార్గము మరింత క్లిష్టమైనది. ఎందుకంటే అనంత శాన్త్రం బహుళా చ విద్యాః అన్నట్లు వేదవేదాంగములు, పురాణేతిహాసములు, దర్శనములు, ఉపాంగములు మొదలైనవాటితో అతి విస్తృతమైనది వాఙ్మయము. ఇంకా మరెన్నో విద్యలు కలవు. కళలేమో అరవై నాలుగు. వీటన్నింటిని అభ్యసించుటకు మానవులకున్న ఆయుర్దాయమేమో తక్కువ. పైగా జీవితంలో బరువు బాధ్యతలు ఎన్నో. బంధాలు, ఎన్నెన్నో అనుబంధాలు, అనేక విఘ్నాలు అల్పోహి కాలః బహవశ్చ విఘ్నాః అని చెప్పబడినది.

మూడవదైన భక్తి మార్గాన్ని అనుసరించినవారు ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, శుక, శౌనకాది మహానుభావులు. వీరివలె సర్వ కాలములయందు సర్వ అవస్థలయందు భగవంతునిపై ప్రేమను (భక్తిని) కలిగియుండుట అత్యంత దుర్లభము.
చివరిది ప్రపత్తి మార్గము. ఇది సులభమే. కాని ఈ మార్గానుయాయులకు అవసరమైనది విశ్వాసము. షడ్విధ శరణాగతిలో ్ర్ఙరక్షిష్యతీతి విశ్వాసః - పరమాత్మ తప్పక రక్షిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అనే విశ్వాసం అత్యంత ప్రధానం.


ఈ కర్మజ్ఞాన భక్తి ప్రపత్తి మార్గాలే కాక, జ్ఞానానుష్ఠాన సంపన్నులైన సదాచార్యుని ఆశ్రయించి, ఆచార్యుని ఆచరణను, ఉపదేశములను అనుసరించుట వల్ల కూడా మోక్షము తథ్యమని మన పూర్వుల అభిప్రాయం. ఆచార్యాభిమానం కూడా మోక్షమార్గమని తెలియజేసి రి. దీనికే అంతిమోపాయనిష్ఠ అని పేరు. ఈ మార్గాన్ని పంచమోపాయ నిష్ఠ అని కూడా వ్యవహరిస్తారు. ఉత్తమ పురుషార్థమైన మోక్షమును పొందుటకు తగిన మార్గాన్ని ఎంపిక చేసుకుని త్రికరణ శుద్ధితో ఆ మార్గంలో పయనించే ప్రయత్నం చేద్దాం.

💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి

https://www.youtube.com/@Enlight66

 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)
💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...