🥀*పరమాత్మ*🥀
🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏
ఈ చరాచర జగత్తు అంతా పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. కాబట్టి పరమాత్మ ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్న లేదు.
మట్టి నుండి కుండ వచ్చింది. మట్టి ఎక్కడ ఉంది అంటే కుండ అంతటా మట్టి ఉంది. కాని మనకు కనపడేది కుండ మాత్రమే. అలాగే బంగారు ఆభరణంలో అంతటా బంగారం ఉంటుంది కాని మనకు అది ఒక ఆభరణం రూపంలో కనపడుతూ ఉంది. బంగారం తీసేస్తే ఆభరణం లేదు. మట్టి లేకపోతే కుండ లేదు. అలాగే ఈ జగత్తు అంతా పరమాత్మ అంతర్లీనంగా వ్యాపించి ఉన్నాడు. కంటికి కనిపించని పరమాత్మ లేకపోతే ఈ మన కంటికి కనిపించే ఈ జగత్తు లేదు.
మణులతో కూర్చిన మాలలో కనపడకుండా దారం ఉంటుంది. అలాగే పూలమాలలో కూడా కనపడకుండా దారం ఉంటుంది. మణులు, పూలు బయటకు కనపడుతుంటాయి. వాటిని అన్నిటినీ కూర్చి ఒకటిగా చేసిన దారం బయటకు కనపడదు. అలాగే ఈ సృష్టికి మూలకారణమైన పరమాత్మ ఎవరికీ కనిపించడు. దారం లేకపోతే మణులు కానీ పూలు కానీ నిలువవు. ఎన్ని రకాల మణులు ఉన్నా, ఎన్నిరకాల పూలు ఉన్నా అందులో ఉండే దారం ఒక్కటే. ఆ దారమే మణులకు, పూలకు ఆధారము.
అలాగే జీవులలో ఆత్మ స్వరూపుడుగా ఉండే పరమాత్మ ఒక్కడే. భేదభావము మనం కల్పించుకుంటున్నాము. పూలలో దారం లేకపోతే పూలు నిలువవు, అలాగే మణిమాలలో దారం లేకపోతే మణిమాల నిలువదు అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానము. ఆ దృష్టితో అంటే జ్ఞానదృష్టితో చూస్తేనే పరమాత్మ ఉనికి మనకు గోచరిస్తుంది కానీ మామూలు కళ్లకు కనపడదు.
కాని కొందరు మానవులు.. *దేవుడు ఏడీ! ఉంటే మాకు ఎందుకు కనిపించడు! కాబట్టి దేవుడు లేడు!" అని వితండంగా వాదిస్తుంటారు.
పూలలో దారం లేదు అని అంటే వాడిని పిచ్చివాడంటారు కానీ ప్రస్తుత సమాజంలో దేవుడు లేడు అనే వాడు గొప్పవాడు, శాస్త్రవేత్త. ఇదే మన భావదౌర్భాగ్యం, అజ్ఞానం.
కాబట్టి పరమాత్మ ఈ అనంత విశ్వం అంతా చైతన్యరూపంలో ఆవరించి ఉన్నా, మన కంటికి కనిపించడు కాబట్టి దేవుడు లేడు అనడం అజ్ఞానం.
||కృష్ణం వందే జగద్గురుమ్||
🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏
Excellent naration.
ReplyDelete