Friday, 3 March 2023

ధ్యానం అంటే ఏమిటి? (08-Mar-23, Enlightenment Story)

 *ధ్యానం అంటే ఏమిటి?

🙏🙏🙏🙏🙏🙏🙏

ఈ ప్రశ్న ఒక పిల్లాడిని వెంటాడుతూ ఉంది. ఆ కుర్రవాడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో ఎలా వివరించాలో ఎంత ఆలోచించినా అతని తల్లిదండ్రులకు తెలియలేదు.

ఒకసారి వారు కుటుంబ సమేతంగా రమణ మహర్షి దర్శనానికి వెళ్లారు.బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షి ముందుంచాడు.

"ధ్యానం   అంటే   ఏమిటి గురువుగారూ?" అని ఆ అబ్బాయి అడిగాడు.

శ్రీ రమణమహర్షి తనలో తానే నవ్వుకున్నాడు. అప్పుడు చిరునవ్వుతో తన భక్తుడిని పిలిచి, వంటగదిలోంచి దోసె తీసుకొచ్చి ఆ అబ్బాయికి వడ్డించమని  చెప్పాడు.

ఒక అరిటాకుపై, ఒక దోసె వడ్డించారు.  రమణమహర్షి ఆ కుర్రాడి వైపు చూసి, "ఇప్పుడు నేను  ‘మ్మ్’  అంటాను. అప్పుడే నువ్వు తినడం మొదలు పెట్టాలి.   మళ్ళీ  ‘మ్మ్’ అంటాను.  ఆ తర్వాత నీ ఆకులో చిన్న దోసె ముక్క కూడా మిగలకూడదు." అని అన్నారు.

ఆ కుర్రాడు  చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. అందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు.

ఇప్పుడు ఆ కుర్రాడు రమణమహర్షి ముఖంలోకి చూస్తూ, సంకేతం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. "మ్మ్" అని సంకేతం ఇవ్వగానే ఆ కుర్రాడు తినడం మొదలుపెట్టాడు.

ఇప్పుడు   అతని  దృష్టి  అంతా రమణమహర్షి పైనే ఉంది. సంకేతం ఇచ్చే ముందే  దోసె పూర్తి చేయాలనుకుని, అతను హడావిడిగా దోసెను పెద్ద పెద్ద ముక్కలుగా చింపి తింటున్నాడు కానీ, ఆ సమయమంతా అతని దృష్టి రమణమహర్షి పైనే ఉంది.

దోసె పరిమాణం క్రమంగా తగ్గుతూ వచ్చింది.   ఒక చిన్న ముక్క మాత్రమే మిగిలి ఉంది.  రెండో సంకేతం కోసం అతను రమణమహర్షి వైపు ఆత్రుతగా చూశాడు. 

సంకేతం ఇచ్చిన క్షణం, ఆ కుర్రాడు వెంటనే చివరి దోసె ముక్కను నోటిలో పెట్టేసుకున్నాడు.

ఇప్పుడు రమణమహర్షి అతనిని…    "ఇప్పటి వరకు నీ దృష్టి ఎక్కడ ఉంది? నాపైనా    లేక   దోసెపైనా     లేక ఇతరులపైనా?" అని అడిగారు.

"నా దృష్టి   మీ మీదా,    దోసె మీదా మాత్రమే ఉంది, ఇంక దేనిమీదా లేదు”, అని ఆ అబ్బాయి బదులిచ్చాడు.

రమణమహర్షి, "అవును... నువ్వు నా మీదే శ్రద్ధ పెట్టి, దోసె పూర్తి చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యావు.    నువ్వు అస్సలు పరధ్యానంగా లేవు.

అదే విధంగా,   నీవు   నీ దృష్టిని  లేదా ఆలోచనలను భగవంతునిపై నిల్పి, నీ రోజువారీ కార్యకలాపాలను చేసినప్పుడు, దానిని ‘ధ్యానం’ అంటారు."

"మ్మ్" అన్న రెండు సంకేతాలు పుట్టుక - మరణం. ఈ రెండు సంఘటనల నడుమ, శ్రీ రమణ మహర్షి చూపించిన విధంగా…  ‘ధ్యానం’ లో నిమగ్నమవ్వవచ్చు. అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి, మనమందరం పరిపక్వమై, పరిణతి చెందాలి, దీనికి ‘దైవానుగ్రహం’ కూడా అవసరం.

మనమందరం ఒకరికొకరు భిన్నంగా ఉంటాం, కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పట్టే సమయం కూడా వివిధరకాలుగా ఉంటుంది.✍️

*ధ్యానం చేసినప్పుడు, మనం ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకుంటాం.  ఇది మన చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది. *

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...