Friday, 10 March 2023

నీతి మంతుని తక్కెడ (24-Mar-23, Enlightenment Story)

 🥀*నీతి మంతుని తక్కెడ*🥀

🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺

ఒక పల్లెటూరులో ఒక పాలు అమ్మేవాడు ఉండేవాడు పాలు, పెరుగు,నెయ్యి,అన్నీ అమ్ముకుంటూ తన భార్యతో జీవితం సాగిస్తుండేవాడు. తనకున్న పాలలో కొన్ని పాలని ఊరిలో అమ్మి ఇంకా కొన్ని పాలతో నెయ్యి చేసి వారానికి ఒకసారి దగ్గరలో గల పట్టణంకు వెళ్లి అమ్మేవాడు.

అతని భార్య నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో కిలో చొప్పున వేసి ఇచ్చేది, తాను వాటిని అలాగే తీసుకెళ్లి అంగడిలో అమ్ముకునే వాడు, ఒకరోజు అంగడిలో రోజంతా అమ్మగా కొన్ని మిగలటంతో, తాను నిత్యం రోజువారీ సరుకులు కొనే కొట్టుకు వెళ్ళి అక్కడ ఆ యజమానికి కూడా అమ్మి తనకు కావలసిన ఉప్పు పప్పు బియ్యం అన్నీ సరుకులు తీసుకొని ఇంటికి బయలుదేరాడు, ఆ తర్వాత కొట్టు యజమాని నెయ్యిని తీసిపెడుతూ ఒక బ్యాగ్ ను తూకం వేసి చూశాడు ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఆ నెయ్యి పాకెట్ 1కిలో లేదు కేవలం 900 గ్రాములే ఉంది. దాంతో యజమాని అన్ని ప్యాకెట్లను తూకం చేసి చూస్తే అన్నీ 900gm బ్యాగులే ఉన్నాయి. అది చూసి ఆయన మనస్సుకు చాలా బాధ అనిపించింది

నేను పాలవాడిపై ఇంత నమ్మకం పెట్టుకుంటే, నన్ను మోసం చేశాడే అని వేదనపడ్డాడు..మళ్ళీ ఒక వారం తరువాత పాలు అమ్మేవాడు నెయ్యి అమ్మటానికి వచ్చాడు అప్పుడు యజమాని చెప్పాడు నా కొట్టులో ఇకపై కాలు పెట్టకు నీవు మోసగాడివి నమ్మకద్రోహివి, 

నెయ్యి 1కిలో అని 900గ్రాములు ఇస్తావా ఇకపై నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు, ఇక నీ ముఖం నాకు చూపకు వెంటనే ఇక్కడి నుండి వెళ్లు, నీవెంతో నీతిమంతుడవని నమ్మి నీ వద్ద నెయ్యి కొంటె నన్నే ఇంతలా మోసం చేస్తావా, నమ్మిన వాడిని మోసం చేయాలనుకోవడం సిగ్గుగా లేదూ.

అంటూ దారినపోయే వారందరినీ పిలుస్తూ గొడవ గొడవ చేయసాగాడు..అప్పుడు ఆ పాలవాడు వినయంగా యజమాని తో ఇలా చెప్పాడు, అయ్యా నేను బీదవాడినే కానీ. మోసగాణ్ణి కాదు నా దగ్గర త్రాసు, తూకంరాళ్ళు కొనే అంత డబ్బు లేదు 

మీ దగ్గర తీసుకెళ్లిన 1కిలో చక్కెర ఆధారంగా ఇంట్లో చిన్న కట్టె ముక్క మధ్యలో తాడుకట్టి తక్కెడ లా చేసుకొని ఒకవైపు మీరు అమ్మిన చక్కెర సంచీ వేసి తూకం చేస్తాను అని చెప్పాడు, వెంటనే కొట్టు యజమాని తల వంచుకుని తన తప్పు తనకు తెలిసి సిగ్గు పడ్డాడు, అప్పటివరకు ఇదంతా గమనిస్తున్న వాళ్ళు కొట్టు యజమానిని చీవాట్లు పెట్టి వెల్లసాగారు

మనం వేరేవారికి ఏది చేస్తామో, తిరిగి అదే మనకు మళ్లీ జరుగుతుంది. అది మంచి కావచ్చు చెడు కావచ్చు అది సంతోషమైనా, దుఃఖమైనా తిరిగి మళ్ళీ మనకు జరిగే తీరుతుంది.

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷



No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...