🥀 ఆశను అరికట్టాలి 🥀
🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏
ఈ ప్రపంచంలో ఎంతో ధాన్యం ఉంది, బంగారం ఉంది. అలాగే ఆభరణాలు ఉన్నాయి, ఇళ్ళు, మేడలు ఉన్నాయి, ఎంతయో పశుసంపద కూడా ఉంది. వీటన్నిటిని కలిపి ఒకడికి ఇచ్చినప్పటికీ, 'నాకు చాలదు, ఇంకా కొంత ఇవ్వండి' అంటాడు. ఇది అని యొక్క లక్షణం. ఆశకు అంతం లేదు.
సముద్రంలోనికి ఎన్నియో నదుల యొక్క నీరు వచ్చి పడుతుంది, కాని సముద్రం ' చాలును' అని అనదు. ఎంత జలాన్నయినా స్వీకరిస్తూనే ఉంటుంది.
ఆశ చాలా చెడ్డ గుణం. అది గనుక ఉంటే మానవుడికి అసలు తృప్తి అనేది యుండదు. ప్రాపంచిక విషయాలను కోరుతూనే ఉంటాడు. తత్ఫలితంగా అతడు శాంతిని నోచుకోలేడు. ఎప్పుడూ ఏదో మనస్తాపన అతడిని బాధిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కోరిక అతన్ని వేధిస్తూనే యుంటుంది.
'ప్రపంచంలో దరిద్రుడెవడు?' అను ప్రశ్నకు... 'ఎక్కువ ఆశగలవాడే' అని సద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఆనతి ఇచ్చియున్నారు.
'ధనవంతుడు ఎవరు?' అను ప్రశ్నకు 'తృప్తిగలవాడే' అని సెలవిచ్చారు. కనుక ఎక్కడో ఒకచోట ఆశను అంతమొందించి సంతుష్టికి హృదయమందు చోటివ్వాలి.
'భగవంతుడు ఇచ్చిన ఈ పదార్థం నాకు చాలు. దీనితో పరితృప్తినొందుతాను' అను నిశ్చయం కలిగియుండాలి.
జీవితంలో శాంతి, సుఖములను అభిలషించేవాడు ఆశకు ఏమాత్రం చోటు, గంధం ఇవ్వకుండా యదృచ్ఛాలాభసంతుష్డుడై మెలగాలి. తనకు శక్తియున్నంత వరకు ఇతరులకు సాయపడాలే కాని ఇతరుల సొత్తును అపేక్షింపరాదు.
భోగాశను వదలి పెట్టి, విషయతృష్ణను వదలి వైచి దైవచింతనలో కాలం గడుపుతూ నిరంతర సంతుష్టుడై పరమశాంతిని, ఆనందాన్ని అనుభవిస్తూ జీవించాలి. ఇదే విజ్ఞుని లక్షణం. తరించాలని అభిలషించేవాడు విజ్ఞానివలె మెలగవలెనే కాని అజ్ఞానివలె కాదు.
యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః
ఏకస్యాపి న పర్యాప్తం తస్మాతృష్ణాం పరిత్యజేత్|
🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🚩 హిందువునని గర్వించు 🚩 హిందువుగా జీవించు
🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏🌺🌺🌺🌺🕉️🌺🌺🌺🌺🙏
No comments:
Post a Comment