🌞*8 (అష్ట) శివరూపాలు* 🌞
🕉️⚜️🔱⚜️🔱✳️🔱⚜️🔱⚜️🕉️
||శర్వోభవః తథా రుద్రో ఉగ్రో భీమః పశోః పతిః! ||ఈశానశ్చ మహాదేవో మూర్తయశ్చాష్ట విశ్రుతాః!! ||
⚜️ శివుడు సర్వవ్యాపి. ఈ జగత్తు అంతటా శివచైతన్యమే నిండి ఉంది. అయితే, అంతటా నిండివున్న శివుణ్ణి ఎలా గుర్తుపట్టాలి? అని సనత్కుమారుడు ఒక పర్యాయం నందీశ్వరుని అడిగాడు. అప్పుడు...,
🔱 "ఓ సనత్కుమారా! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, జీవాత్మ, సూర్యుడు, చంద్రుడు - మొదలైన వాటన్నింటిలో తన ఎనిమిది స్వరూపాల్లో శివుడే అధిష్టించి ఉన్నాడు. ఆయన అష్టమూర్తి తత్త్వాన్ని తెలుసుకుంటే ఆయనను తెలుసుకోవడం తేలికవుతుంది.
⚜️ శివుని అష్టమూర్తులు ఇవి....
1 .శర్వుడు: 🙏
🔱 స్థావర జంగమాత్మక మైన ప్రాణికోటినంతటినీ భరించే భూమిని శర్వుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. ప్రళయకాలంలో ప్రాణులను లయం చేసే శివస్వరూపమే శర్వుడు. ఓం శర్వాయ క్షితి మూర్తయే నమః అని స్మరిస్తూ భూమిపై నడచినా, భూమిని స్పర్శించినా ధ్యానపారవశ్యం కలిగి పాపనాశనమవుతుంది.
2. భవుడు: 🙏
⚜️ సర్వజగత్తులో సకలప్రాణులను జీవింపజేసే జలమును భవుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. నీటిని స్పర్శించినప్పుడు, త్రాగినప్పుడు ఓం భవాయ జలమూర్తయే నమః అని స్మరించాలి.
3. రుద్రుడు: 🙏
🔱 ఈ జగత్తును ప్రకాశింపజేసే అగ్నిని రుద్రుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. అగ్నిని దర్శిస్తూ, ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అని స్మరిస్తే మనస్సు అంతర్ముఖమై పుణ్యం చేకూరుతుంది.
4. ఉగ్రుడు: 🙏
⚜️ ప్రాణుల బాహ్యమందు, లోపల చలించే వాయువును ఉగ్రుడు అనే మూర్తి రూపంలో శివుడు ఉంటాడు. వాయువు వీస్తుంటే, ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః అని స్మరిస్తే శాంతి, సౌఖ్యం, సద్గుణాలు లభిస్తాయి.
5. భీముడు: 🙏
🔱 జీవులందరికీ అవకాశాన్ని కలిగిస్తూ, సర్వాన్ని వ్యాపించే ఆకాశాన్ని, భీముడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. ఆకాశాన్ని దర్శిస్తూ, ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః అని స్మరిస్తే శీఘ్రంగా ఆత్మానందం కలుగుతుంది.
6. పశుపతి: 🙏
⚜️ సర్వదేహాలలోని జీవులందరిలో పశుపతి అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. జీవుల అజ్ఞానమోహాలను నశింపజేసే శివస్వరూపమే పశుపతి. ఏ ప్రాణిని దర్శించినా ఓం పశుపతయే యజమాన మూర్తయే నమః అని స్మరిస్తే మోహం నశించిపోతుంది.
7. ఈశానుడు: 🙏
⚜️ సర్వజగత్తును ప్రకాశింపజేసి జీవశక్తిని ప్రసాదించే సూర్యుని ఈశానుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. సూర్యుని దర్శిస్తూ, ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః అని స్మరిస్తే వారికి ఆరోగ్యం, జ్ఞానం, ధ్యానం సిద్ధిస్తాయి.
8. మహాదేవుడు: 🙏
⚜️ సర్వ జగత్తుకు అమృతకిరణాలను వెదజల్లుతూ వెలుగును ప్రసాదించే చంద్రునిలో మహాదేవుడు అనే మూర్తి రూపంలో శివుడు ఉంటాడు. చంద్రుని దర్శిస్తూ, ఓం మహాదేవాయ సోమ మూర్తయే నమ: అని స్మరిస్తే ఆనందం చేకూరుతుంది....
✅ అని నందీశ్వరుడు సనత్కుమారునికి చెప్పాడు.
🙏 సర్వే జనాః సుఖినోభవంతు 🚩 హిందువునని గర్వించు 🚩 హిందువుగా జీవించు
🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷
AUM NAMAH SIVAYA
ReplyDelete