🌞*అద్భుత క్షణాలు*🌞
🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏
మనిషి తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు జీవించే ప్రతిక్షణం అద్భుతమే. అనుక్షణం ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలగడం మహాద్భుతం.
భగవంతుడు మనిషి జీవన ప్రాంగణంలోకి అద్భుత క్షణాలను వర్తమానం ద్వారా నిరంతరం పంపుతూ ఉంటాడు. అవి అనుక్షణం మనిషి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే మనిషి వర్తమానంతో అనుసంధానం కావాలి. అంతర్లీనంగా ఉన్న అనంత శక్తిని వెలికి తీయడానికి అద్భుత క్షణాలు సదా సంసిద్ధంగా ఉంటాయి. వాటిని గుర్తించడానికి ఒక్క క్షణం, రోజు, నెల, సంవత్సరం, దశాబ్దం, ఒక జీవితకాలం కూడా పట్టవచ్చు. దాన్ని సరైన సమయంలో గుర్తించి సద్వినియోగం చేసుకున్నవారే చరిత్ర సృష్టిస్తారు.
*అద్భుత క్షణాలు*
రమణ మహర్షి చిరుప్రాయంలోనే మరణానుభవం పొందిన అద్భుతమైన క్షణం నుంచీ ఆయన మరణ భయం నుంచి విముక్తులయ్యారు. అక్షరం రాని కాళిదాసు అచంచల భక్తి విశ్వాసాలు ప్రదర్శించి కాళికాదేవి అనుగ్రహం పొందాడు. ఆమెతోనే నాలుకపై బీజాక్షరాలు రాయించుకున్న క్షణం అద్భుతం. వెంటనే లోపల దాగి ఉన్న కవితాధార గంగాప్రవాహంలా ఉప్పొంగింది. మహాకావ్యాలను సృజించి కవికుల గురువుగా ప్రసిద్ధిచెందారు.
ఆల్చిప్పలో సరైన సమయంలో నీటి బిందువు పడటం అద్భుతం. తరవాత అది ముత్యంగా మారడం మరో అద్భుతం. నవమాసాలు మోసి ప్రసవ వేదనతో మరణపుటంచుల వరకు వెళ్ళి, బిడ్డను ప్రసవించిన క్షణం- మాతృమూర్తికి మరువలేని అద్భుతం. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఏడు కొండలూ ఎక్కి, ఎన్నో కోరికలతో శ్రీవారిని దర్శించుకున్న క్షణంలో మనసు స్తబ్ధమవుతుంది. అప్పుడు కలిగే వాంఛారహిత శూన్య స్థితి అత్యద్భుతం. మొలకెత్తే లక్షణం ఉన్న విత్తనం భూమిని చేరిన తక్షణం అంకురించే దశ ఉద్దీపన కావడం అద్భుతం. తద్వారా వందల నందన వనాలు రూపొందుతాయి.
వ్యక్తి తనలో ఉండే సానుకూల శక్తిని వెలికి తీసే క్షణాన్ని గుర్తించినప్పుడే వందలాది సత్సమాజాలకు సృష్టికర్త కాగలుగుతాడు. గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, మహాత్మా గాంధీ వంటి మహోన్నత వ్యక్తులు చేసిందదే. హృదయ కుహరంలో దాగి ఉన్న శక్తి గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. అవధులు లేని సంద్రంలా మీలో అనంత శక్తి విస్తరించి ఉంది. దాని దివ్యత్వాన్ని జాగృతపరచే అద్భుత క్షణాన్ని మీరు గుర్తించగలగాలి. అప్పుడే ఆ అనంత శక్తి మిమ్మల్ని విశ్వ విజేతల్ని చేస్తుంది అన్నారు యువతను ఉద్దేశించి స్వామి వివేకానంద. అలాగే అద్భుత క్షణాల్ని ఒక్కసారి చేజార్చుకుంటే మరోసారి అవి తిరిగివచ్చే అవకాశం రాదు. ఎందుకంటే మరుక్షణమే అది గతంగా మారిపోతుంది. ఎంతోమంది క్రీడాకారులు కఠోర పరిశ్రమ అనంతరం పోటీల్లో పాల్గొంటారు. గెలుపును అందుకునే తరుణంలో లక్ష్యం క్షణంలో వెయ్యోవంతు గురి తప్పినా పసిడి పతకం పరాధీనమవుతుంది.
అదృష్టం తరచూ వచ్చిపోతూ ఉంటుంది. కానీ అద్భుత క్షణాలు జీవితంలో ఒక్కసారే తలుపు తడతాయి. ఒక్కసారి ఆహ్వానించాక ఆపై ప్రవేశించే క్షణాలు ఉండవు. ఆహ్వానించే వ్యక్తీ ఉండరు. తొలి అడుగే తుది అడుగు... అదే అసలైన ఆధ్యాత్మికత అన్నారు జిడ్డు కృష్ణమూర్తి.
🙏 సర్వేజనా సృజనో భవంతు 🙏🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌷🙏🌷🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷
No comments:
Post a Comment