*శివైఖ్యం - కళాతపస్వీ కాశీనాధుని విశ్వనాధ్*
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
భీష్మాచార్యులు ఇచ్ఛామరణం పొందాడంటారు...ఇవాళ కాశీనాథుని విశ్వనాథుడూ అంతే... తాను చేయాలనుకున్న పనులన్నీ చేసి దివి పథాన మేఘాల పల్లకిలో గర్వంగా ఊరేగుతూ పోయాడు...
భీష్ముడు విష్ణు దివ్య సహస్రనామామృతాన్ని, అర్జునుడికే కాదు - నిఖిల జగతికీ రుచిచూపి ఆచార్యుడయ్యాడు...
విశ్వనాథుడు ఓంకారనాద అనుసంధానమైన శంకరాభరణ గానాన్ని వినిపించి, పాశ్చాత్య మెదళ్ల బూజుదులిపి, మన సంస్కృతి నాడుల్ని తట్టి లేపాడు... విష్ణు సహస్ర నామాల అమృతం మనకు అందింది మాఘ శుద్ధ ఏకాదశి పర్వదినాన...!
శంకరాభరణం ఓ గొప్ప వరంగా మనకు అందిన రోజే కాక - దాన్ని మనకు అందించి కళాతపస్వి విశ్వనాథుడు దివికేగిన రోజుకూడా భీష్మ ఏకాదశి - ద్వాదశి సంధి ఘడియల్లోనే...!! ఎంత యాదృచ్ఛికం...
"ఓం నమశ్శివాయ..ఓం నమశ్శివాయ.. చంద్రకళాధర సహృదయా..చంద్రకళాధర సహృదయా.. సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా!! ఓం నమశ్శివాయ..ఓం నమశ్శివాయ.. పంచభూతములు ముఖ పంచకమై..ఆరు ఋతువులు ఆహార్యములై.. పంచభూతములు ముఖ పంచకమై..ఆరు ఋతువులు ఆహార్యములై.. ప్రకృతి,పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై"
ఫక్తు వ్యాపార మాధ్యమమైన సినిమాను ఓ కళగా ఆరాధించాడు... సినిమానే ఉపాసించాడు... తపస్సులా చేశాడు ఆ పనిని... అలా ఆ నిరంతర కళాతపస్సులో ఆయనకు సాక్షాత్కరించిన ఓ అజరామరమైన దృశ్య రూపమే శంకరాభరణం...!!!
అలా ఆ విశ్వనాథుని నిరంతర తపస్సులో ఆయన పొందుతూ వచ్చిన దివ్యానుభూతులెన్నో ఓ శుభలేఖగా, ఓ స్వాతిముత్యంగా, ఓ సాగరసంగమంగా, ఓ స్వర్ణకమలంగా, ఓ స్వాతికిరణంగా, ఓ స్వయంకృషిగా ఇలా ఎన్నెన్ని శాశ్వత దృశ్యరూపాలై మనకూ, మన పిల్లల తరాలకూ అదృష్టంగా దక్కాయని..!!!
92 ఏళ్ల వయసులో కూడా సినీకళ గురించే పలవరిస్తూ వెళ్లిపోయాడంటే ఆయనది ఎట్లాంటి కళారాధనో అర్థంమౌతుంది....
అందుకే ఆయన కళాతపస్వి విశ్వనాథుడయ్యాడు
ఇవాళ PAN INDIA అని తెగ చెప్పుకుంటున్నాం కాని - విశ్వనాథ్ ఇవాల్టికి 43 ఏళ్ల క్రిందటే Pan india నే కాదు Pan World స్థాయిలో గర్వంగా నిలబెట్టాడు శంకరాభరణం తో తెలుగు సినిమాని..!
స్థాయిల గురించిన ఆలోచనే లేదాయనకు... సినిమానే శ్వాసిస్తూ, అదే జీవితంగా తపిస్తూ, జ్వలిస్తూ, ఆరాధిస్తూ ఆలోచనల్ని అందమైన ఫ్రేముల్లో బంధిస్తూ పోవడమే తప్ప ఆయన ఏ అవార్డుల్నీ, రివార్డుల్నీ మనసులో పెట్టుకొని తీయలేదు... ప్రపంచమే ఆయన్ని గుర్తించి, ఆయన దగ్గరికే నడుకుంటూ వచ్చింది...
విశ్వనాథుని గురించి రాయడమంటే గంగవెల్లువను కమండలంలో ఇమడ్చడమే... వేనవేల అక్షరాలు ఆయన గరిమను ఇముడ్చుకోవడానికి వెల్లువలా ముంచెత్తుతాయి...
విశ్వనాథ్ గారు మన భక్తబంధుకోటికి కూడా ఆత్మీయులే అని భావిస్తూ, దివిలో కచ్చితంగా ఆయన శంకరుని గళసీమలో ఆభరణంగా అలంకృతుడయ్యే వుంటారని, అలా వుండాలని వారికి ఘనంగా నివాళి అర్పిస్తున్నాం...🙏
విశ్వనాథ్ సినిమాల ప్రత్యేకత విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసాడు. కెరీర్ చివర్లో దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరించాడు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం-శంకరాభరణం 1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం - సప్తపది 1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు సాగరసంగమం 1986 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు - స్వాతిముత్యం 1988 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు శృతిలయలు 2004 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు స్వరాభిషేకం 1992 - రఘుపతి వెంకయ్య పురస్కారం 1992 - పద్మశ్రీ పురస్కారం 2016 : దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. కె. విశ్వనాథ్ వృధ్యాప సమస్యలతో బాధపడుతూ అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందినారు
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
No comments:
Post a Comment