Tuesday, 28 February 2023

మౌనంగానే ఎదగాలి (01-Mar-23, Enlightenment Story)

 🙏🌺 మౌనంగానే ఎదగాలి 🌺🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏🌷🌷🙏

🌺వాక్కును నియంత్రించడమే మౌనం. ఇదొక అద్భుతమైన తపస్సు. మాటలను వృథాగా వినియోగించకుండా అవసరం మేరకే వినేవారికి ఇంపుగా, హితంగా, మితంగా మాట్లాడాలని, అలా చేతకానప్పుడు మౌనమే మేలని విదురనీతి వివరిస్తోంది.🌺

🌺అయిదు ‘శాంతి’లలో మౌనం ముఖ్యమైనదిగా చెబుతారు.

‘మాట వెండి, మౌనం బంగారం’ అని సామెత. ‘మాట్లాడటం ద్వారా శక్తిని వృధా చేసుకునేకంటే మౌనంగా ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవచ్చు’ అన్నారు స్వామి వివేకానంద.🌺

🌺మౌనం మూడు రకాలు.🌺

🌺1. ఒకటవది: వాక్‌మౌనం. వాక్కును నిరోధించడమే వాక్‌మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. ఇలాంటి మౌనం వల్ల పరుష వచనాలు పలకడం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పడం, అసందర్భ ప్రలాపాలు అనే నాలుగు వాగ్దోషాలు హరిస్తాయి.

2. రెండోది అక్షమౌనం. అంటే ఇంద్రియాలను నిగ్రహించడం.

3. మూడోది కాష్ఠమౌనం. దీనినే ‘మానసిక మౌనం’ అంటారు. మౌనధారణలోనూ మనసు అనేక మార్గాల్లో పయనిస్తుంది. దాన్నీ అరికట్టినప్పుడే కాష్ఠమౌనం సాధ్యపడుతుంది.🌺

🌺మౌనం ఆరోగ్య వృద్ధికి తోడ్పడుతుంది. దీనివల్ల దివ్యశక్తి ఆవిర్భవిస్తుంది. బాహ్య, అంతర సౌందర్యాలను పెంచుతుంది. మనోశక్తులు వికసిస్తాయి. ఎదుటివారిలో  పరివర్తన  తెస్తుంది. ఆధ్యాత్మిక శక్తి ఉత్పన్నమై ఆత్మకు శాంతి లభిస్తుంది. సమయం సద్వినియోగ మవుతుంది. పతంజలి మహర్షి తన యోగ సిద్ధాంతంలో మౌనానికి ప్రాధాన్యమిచ్చారు.

మౌనాన్ని అవలంబించిన మహాత్ముల్లో రమణ మహర్షి, శ్రీరామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ వంటి వారెందరో ఉన్నారు.🌺

🌺ధ్యానానికి మౌనమే పునాది. బహిర్గతంగానే కాదు, అంతర్గతంగానూ మౌనం పాటించనిదే ధ్యానం చేయడం అసాధ్యం. నిరంతర యోగసాధకులైన మహర్షులు మౌనంగా ధ్యానం కొనసాగిస్తారు.

రోజూ అరగంట మౌనంగా ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యం సిద్ధించడంతో పాటు ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు నెరవేరతాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  టీవీ కార్యక్రమాలు చూస్తూ, కంప్యూటర్‌ ముందు కూర్చుని అంతర్జాలం చూడటం కాదు. కళ్లు మూసుకుని మాటను, మనసును మౌనంలోకి జార్చేస్తే మనసు తేలిగ్గా ఉంటుంది. ఎంతో మంది అనుభవపూర్వకంగా చెబుతున్న విలువైన మాట ఇది.

ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును అది తెలియజేస్తుంది. ‘చేజారిన కాలం, పెదవి దాటిన పలుకు’ వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి.🌺

🌺ప్రతి రోజూ ఎన్నో రకాల ఆలోచనలు మనల్ని పట్టి పీడిస్తుంటాయి. వాటి ప్రభావం మన మాటలపై, చేతలపై పడుతుంది. అవి ఓ చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. ఆ చక్రాన్ని ఆపే శక్తే…‘మౌనం’.

ఏ సాధన అయినా మౌనం వల్లనే సాధ్యమవుతుంది.   భగవంతుడి సాన్నిధ్యానికి చేర్చే అసలైన సాధనం మౌనమే. మనందరం మౌనంగానే ఎదుగుదాం!🌺

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Friday, 24 February 2023

పెద్దల మాటలు అమృతంతో సమానం (28-Feb-23,Enlightenment Story)

  🌞*పెద్దల మాటలు అమృతంతో సమానం* 🌞

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏🌷🌷🙏

పెద్దలు, అనుభవజ్ఞులైనవారి హితవచనాలు మంచి పనులకు ప్రేరణ కలిగిస్తాయి. మనిషిని మంచి మార్గంలో నడిపిస్తాయి. 'వినదగునెవ్వరు చెప్పిన' అని బోధిస్తాడు. శతకకర్త వేమన. పెద్దరికం అంటే అనుభవం, జ్ఞానం అనే సంపదలతో తులతూగే వ్యక్తిత్వం. సంస్కారం కలవారు పెద్దలు ఎదురుపడగానే నమస్కరిస్తారు. మనిషి దేన్ని సాధించాలన్నా అనుభవజ్ఞులైనవారి సలహాలు, సూచనలు తప్పనిసరి.. పెద్దలు చెప్పే సూక్తులు మనసులో నిక్షిప్తమై మనిషిని సరైన మార్గంలో ప్రయాణించేలా చేస్తాయి. మనిషి బతుకును తీర్చిదిద్దుతాయి.

రామాయణంలో ఆదర్శ పురుషుడు, పితృభక్తుడు అయిన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞలను పాటించడమే ధర్మాచరణగా భావించాడు. ఎవరి మాటనైనా శ్రద్ధగా వినేవాడు. తనవారిని సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకునేవాడు కాదు. భారతంలో ధర్మరాజు చక్కని శ్రోత, కనిపించిన ప్రతి పెద్దమనిషినీ మంచిమాటలు చెప్పమనేవాడు. వారు చెప్పిన హితోక్తుల్ని తన ప్రవర్తనలో ఇముడ్చుకునేవాడు.

పుస్తక జ్ఞానంకన్నా అనుభవ జ్ఞానం గొప్పది. అనుభవం పాఠాలను నేర్పుతుంది. పెద్దలు తమతమ జీవితానుభవాలు రంగరించి పిన్నలకు సలహాలు, సూచనలు ఇస్తారు. వాటిని పాటించి వారు దర్శమార్గంలో నడవాలి.

పూర్వం మహారాజులు, చక్రవర్తులు కూడా తమ పాలనను, ప్రవర్తనను సమీక్షించుకునేందుకు విడిగా గురువులు, మహర్షుల వద్దకు వెళ్ళేవారు. వారిని ఆశ్రయించి సూచనలను స్వీకరించేవారు. చివరకు సామాన్య ప్రజల                అబిప్రాయాలూ తెలుసుకుని తమ పాలనను విశ్లేషించు కుంటూ లోపాలను సరిదిద్దుకునేవారు. అందుకే ఎవరి దగ్గర గొప్ప ఆలోచనలు ఉన్నా స్వీకరించమని మనుస్మృతి చెప్పింది. ఆదర్శనీయమైన విలువల్ని ఆచరించమని బోధించింది.

మూర్ఖుడికి ఎలాంటి హితోక్తులు చెప్పినా వ్యర్ధమే. అతడు తనకు తోచినట్లే వ్యవహరించి వినాశనాన్ని కోరి తెచ్చుకుంటాడు. సీతాపహరణకు పాల్పడిన రావణుడితో విభీషణుడు 'అన్నా! అనవసరంగా పోరు తెచ్చుకొంటున్నావు.. ఇందులో మన సోదరి శూర్పణబడే తప్పు... ఆమె మాటల్ని నమ్మి నువ్వు సీతాదేవిని అపహరించుకు రావడం ఆధర్మం. రాముడితో యుద్ధం సామాన్యం కాదు. సీతను మళ్ళీ రాముడి వద్దకు చేర్చి ఆయనను శరణు వేడుకో" అని హితవు పలుకుతాడు.

తమ్ముడి మాటలతో రావణుడిలో కోపం తారస్థాయికి చేరుకుంది. "నువ్వు శత్రుపక్షపాతిని' అంటూ విభీషణున్ని నిందించి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. చివరకు తన వినాశనం తానే కొని తెచ్చుకున్నాడు. వినేవాడు వివేకవంతుడైతే తన తప్పు తెలుసుకుంటాడు. తనను తాను సరిదిద్దుకుంటాడు. బుద్ధిహీనుడు అపార్ధం చేసుకుంటాడు అంటారు పెద్దలు.

'నీ జీవితాన్ని శ్రేయో మార్గం వైపు నడిపే దేనినైనా ఎలాంటి భేషజం లేకుండా వెంటనే అంగీకరించు' అంటారు స్వామి వివేకానంద. పెద్దల మాటలు అమృతంతో సమానం. అవి మన జీవితాలకు దిశానిర్దేశం చేస్తాయి. ఆ హిత వచనాలను వివేకంతో అర్ధం చేసుకుని వాటిని మన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే కోరుకున్న లక్ష్యాలను చేరుకుంటాం. దానికి కావలసినది శ్రద్ధ, అవగాహన.

🙏 సర్వేజనా సృజనో భవంతు 🙏🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌷🙏🌷🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷



అద్భుత క్షణాలు (26-Feb-23,Enlightenment Story)

 🌞*అద్భుత క్షణాలు*🌞

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏

మనిషి తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు జీవించే ప్రతిక్షణం అద్భుతమే. అనుక్షణం ఆనందాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలగడం మహాద్భుతం. 

భగవంతుడు మనిషి జీవన ప్రాంగణంలోకి అద్భుత క్షణాలను వర్తమానం ద్వారా నిరంతరం పంపుతూ ఉంటాడు. అవి అనుక్షణం మనిషి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటిని అందిపుచ్చుకోవాలంటే మనిషి వర్తమానంతో అనుసంధానం కావాలి. అంతర్లీనంగా ఉన్న అనంత శక్తిని వెలికి తీయడానికి అద్భుత క్షణాలు సదా సంసిద్ధంగా ఉంటాయి. వాటిని గుర్తించడానికి ఒక్క క్షణం, రోజు, నెల, సంవత్సరం, దశాబ్దం, ఒక జీవితకాలం కూడా పట్టవచ్చు. దాన్ని సరైన సమయంలో గుర్తించి సద్వినియోగం చేసుకున్నవారే చరిత్ర సృష్టిస్తారు.

*అద్భుత క్షణాలు*

రమణ మహర్షి చిరుప్రాయంలోనే మరణానుభవం పొందిన అద్భుతమైన క్షణం నుంచీ ఆయన మరణ భయం నుంచి విముక్తులయ్యారు. అక్షరం రాని కాళిదాసు అచంచల భక్తి విశ్వాసాలు ప్రదర్శించి కాళికాదేవి అనుగ్రహం పొందాడు. ఆమెతోనే నాలుకపై బీజాక్షరాలు రాయించుకున్న క్షణం అద్భుతం. వెంటనే లోపల దాగి ఉన్న కవితాధార గంగాప్రవాహంలా ఉప్పొంగింది. మహాకావ్యాలను సృజించి కవికుల గురువుగా ప్రసిద్ధిచెందారు.

ఆల్చిప్పలో సరైన సమయంలో నీటి బిందువు పడటం అద్భుతం. తరవాత అది ముత్యంగా మారడం మరో అద్భుతం. నవమాసాలు మోసి ప్రసవ వేదనతో మరణపుటంచుల వరకు వెళ్ళి, బిడ్డను ప్రసవించిన క్షణం- మాతృమూర్తికి మరువలేని అద్భుతం. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఏడు కొండలూ ఎక్కి, ఎన్నో కోరికలతో శ్రీవారిని దర్శించుకున్న క్షణంలో మనసు స్తబ్ధమవుతుంది. అప్పుడు  కలిగే వాంఛారహిత శూన్య స్థితి అత్యద్భుతం. మొలకెత్తే లక్షణం ఉన్న విత్తనం భూమిని చేరిన తక్షణం అంకురించే దశ ఉద్దీపన కావడం అద్భుతం. తద్వారా వందల నందన వనాలు రూపొందుతాయి.

వ్యక్తి తనలో ఉండే సానుకూల శక్తిని వెలికి తీసే క్షణాన్ని గుర్తించినప్పుడే వందలాది సత్సమాజాలకు సృష్టికర్త కాగలుగుతాడు. గౌతమ బుద్ధుడు, వివేకానందుడు, మహాత్మా గాంధీ వంటి మహోన్నత వ్యక్తులు చేసిందదే. హృదయ కుహరంలో దాగి ఉన్న శక్తి గురించి మీకు తెలిసింది చాలా తక్కువ. అవధులు లేని సంద్రంలా మీలో అనంత శక్తి విస్తరించి ఉంది. దాని దివ్యత్వాన్ని జాగృతపరచే అద్భుత క్షణాన్ని మీరు గుర్తించగలగాలి. అప్పుడే ఆ అనంత శక్తి మిమ్మల్ని విశ్వ విజేతల్ని చేస్తుంది అన్నారు యువతను ఉద్దేశించి స్వామి వివేకానంద. అలాగే అద్భుత క్షణాల్ని ఒక్కసారి చేజార్చుకుంటే మరోసారి అవి  తిరిగివచ్చే అవకాశం రాదు. ఎందుకంటే మరుక్షణమే అది  గతంగా మారిపోతుంది.  ఎంతోమంది క్రీడాకారులు కఠోర పరిశ్రమ అనంతరం పోటీల్లో పాల్గొంటారు. గెలుపును అందుకునే తరుణంలో లక్ష్యం క్షణంలో వెయ్యోవంతు గురి తప్పినా పసిడి పతకం పరాధీనమవుతుంది.

అదృష్టం తరచూ వచ్చిపోతూ ఉంటుంది. కానీ అద్భుత క్షణాలు జీవితంలో ఒక్కసారే తలుపు తడతాయి. ఒక్కసారి ఆహ్వానించాక ఆపై ప్రవేశించే క్షణాలు ఉండవు. ఆహ్వానించే వ్యక్తీ ఉండరు. తొలి అడుగే తుది అడుగు...  అదే అసలైన ఆధ్యాత్మికత అన్నారు జిడ్డు కృష్ణమూర్తి.

🙏 సర్వేజనా సృజనో భవంతు 🙏🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌷🙏🌷🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Thursday, 23 February 2023

గత జన్మ పాపాలు....నేటి కర్మలు (25-Feb-23,Enlightenment Story)

🌞*గత జన్మ పాపాలు....నేటి కర్మలు!*🌞

🌷🙏🌷🌷🙏🌷🌷🙏 🌷🌷🙏      

ఈ లోకంలో ఏదీ కారణం లేనిదే జరుగదు. ప్రతిదానికీ ఓ కారణం ఉంటుంది. మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు, ఖర్మకు పూర్వకర్మయే కారణం. ఎందుకంటే ఈ లోకమున ప్రతి జీవి జన్మించడానికి కారణం.. ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మ ఫలాలే! చెడు కర్మకి ఫలితం పాపం, పాపానికి దుఃఖం, మంచి కర్మకి ఫలితం పుణ్యం. పుణ్యానికి సుఖం అనుభవించాలి. 

వాటిని అనుభవించడానికే ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది. ఇది హిందూ సనాతన ధర్మము చెప్పే కర్మ సిద్దాంతము. ఈ సిద్ధంతమే హిందూ మతానికి పునాది కూడా. కర్మ సిద్దాంతము ప్రకారం.. జన్మించడానికి పూర్వం ఆ జీవి కొంత కర్మ చేసుండొచ్చు, ఆ కర్మఫలం వల్ల ఆ జీవి ఆ జన్మలో అనుభవించకపోతే దాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మిస్తుంది. ఆ కర్మ ఇంకా మిగిలి ఉంటే దాన్ని అనుభవించడానికి ఈ జన్మ లాగే మరో జన్మని కూడా తీసుకోవచ్చు. గత జన్మ లాగే ఈ జన్మలో కూడా మరి కాస్త కర్మని చేసి అనుభవించాల్సిన కర్మని పెంచుకోవచ్చు.

మొత్తానికి పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం. పూర్వ జన్మలో మనం చేసిన పాపం ఏదైనా వ్యాధి రూపంలో అనుభవములోనికి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. గత జన్మలో మనం చేసిన పాప పుణ్యములను బట్టియే మన జన్మ ఆధారపడి ఉంటుంది. మన జాతక చక్రం అందుకు అనుగుణంగా తయారవుతుంది. మన కర్మే    గ్రహాల రూపంలో వచ్చి మనల్ని బాధ పెట్టడమో లేదా సుఖ పెట్టడమో జరుగుతుంది.     ఆ గ్రహాలు కూడా ఏదో మనిషి రూపములోనో లేదా వ్యాధుల రూపంలోనో వచ్చి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి.

మానవుడు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణాలు ఏంటీ..? వాటిని ఎలా నివారించుకోవాలి అనే  విషయాలను వివరించగలగడం జ్యోతిర్విజ్ఞానంలోని అద్భుతాలలో ఒకటి. గతజన్మ పాపాలు వాటి ప్రభావాలను గురించి అంపశయ్యమీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు అనేక ఉదాహరణలతో వివరిస్తాడు. 

ఈ వివరాలు భారతంలో మనం చూడవచ్చు. కనుక కర్మతో పాటు దాని ఫలితం అనుభవించడమూ ఉన్నదని స్పష్టమవుతోంది. సాధారణ జ్యోతిష్యంవల్ల కూడా ఈ వివరాలు తెలుసుకోవచ్చు. నాడీగ్రంధాల నుంచి కూడా తెలుసుకోవచ్చు. కాని నాడీ గ్రంధాలు ఈ విషయాలలో స్పెషలైజుడ్ రీసెర్చి చేసినవి గనుక వాటి నుంచి ఈ వివరాలు బాగా తెలుస్తాయి. 

పూర్వ జన్మలో మానవులు చేసే పాపాలు, ప్రస్తుత జన్మలో వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో కొన్నింటిని పరిశీలిద్దాం. గత జన్మలో ఓ వ్యక్తి తల్లిదండ్రులను పట్టించుకోకుండా గాలికొదిలేశాడు. ఫలితంగా ఈ జన్మలో అతడు కొడుకుల తిరస్కారంతో వృద్ధాశ్రమంలో చేర్చబడి, పూర్వజన్మలో తన తల్లిదండ్రులను తాను పెట్టిన బాధను ప్రస్తుతం అనుభవిస్తున్నాడు.

గత జన్మలో ఓ వ్యక్తి ఒక కన్యను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఈ జన్మలో ఇతనికి సంతానం లేదు. ఇప్పటికి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఇద్దరు భార్యలూ విషాద పరిస్థితుల్లో మరణించారు. వయసు అయిపోతోంది. చేతిలో డబ్బులేదు. ముసలి వయసులో ఫుట్ పాత్ మీద అడుక్కుంటూ దిక్కులేని చావు గతి అయ్యేటట్లు ఉంది.

గత జన్మలో ఒక అమ్మాయి అసూయతో తన తోటి అమ్మాయిల పెళ్ళి సంబంధాలు చెడగొట్టేది. ఈ విషయం ఆ అమ్మాయి జాతకంలో క్లియర్ గా కనిపిస్తున్నది. ఈ జన్మలో ఆ అమ్మాయికి ఎన్ని పెళ్ళిసంబంధాలు వచ్చినా ఒక్కటీ కుదరటం లేదు. గట్టిరెమెడీలు చేస్తే గాని ఈ దోషం తొలగదు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జన్మలో పూర్వ జన్మ ప్రభావం ఎదుర్కొంటున్నవారు కనిపిస్తారు. వీరందరూ సరియైన రెమెడీలు పాటిస్తే ఈ సమస్యలు  ఆగిపోతాయి. అయితే, సరియైన సమయంలోనే ఆ రెమెడీలు పాటించాల్సి ఉంటుంది.

గత జన్మ పాపాలకు ప్రస్తుతం పూజలెందుకు?

పూర్వ జన్మలో చేసిన పాప ప్రక్షాళనకు ఈ జన్మలో ఆ సర్వేశ్వరునికి త్రికరణశుద్ధితో పూజలు చేయాల్సి ఉంటుంది. అయితే కొందరు మాత్రం పూర్వ జన్మలో చేసిన పాపాలకు ఇప్పుడు పూజలు చేయటమేమిటని అనుకుంటారు. అయితే, పాప ప్రక్షాళనకు భగవంతునికి చేసే పూజలు, వ్రతాలు వంటివన్నీ వ్యాధి వస్తే మాత్ర వేసుకోవటం వంటివి. తలనొప్పి దాని పని అది చేస్తూ ఉంటే మాత్ర దానికి సమాంతరంగా తన పని అది చేసుకుంటూ పోతుంది. చివరికి ఒక దశలో దాని ప్రభావం ఎక్కువై తలనొప్పి తగ్గిపోతుంది.

*అదే మాదిరిగా గత జన్మలో చేసిన పాపాల ప్రభావం, వాటికి విరుగుడుగా చేసే పూజలు, వ్రతాలు శాంతులు సమాంతరంగా సాగుతుంటాయి. ఎప్పుడైతే ఆ భగవంతుని ప్రభావం ఎక్కువవుతుందో గత జన్మలో చేసిన పాపాలు పటాపంచలవుతాయి. దోషాలు పోతాయి...గత జన్మ పాపాలు…

 🙏 సర్వేజనా సృజనో భవంతు 🙏🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌷🙏🌷🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Wednesday, 22 February 2023

అగ్ని సాక్షి (24-Feb-23,Enlightenment Story)

 🌞 అగ్ని సాక్షి ? 🌞

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🙏🌷🌷🙏🌷🌷🙏

పంచభూతాలలో ఒకటయిన అగ్ని ఎన్నో కర్మలకి సాక్షీ భూతం అని మన పురాణా లలో వ్యవహరించారు. అగ్ని పవిత్రతకి, శక్తికి మారు పేరు. వేదాలలో అగ్ని దేవుడు దేవతల పురోహితుడు అని చెప్పబడింది. ఈయన ఆగ్నేయానికి దిక్పాలకుడు.

అగ్ని సాక్షిగా వివాహం అనేది మన హిందూ సాంప్రదాయం. అయితే అగ్నినే ఎందుకు సాక్షిగా పెడతాం అన్న విషయం ఋగ్వేదంలో వివరించారు.

||సోమః ప్రధమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తరః||తృతీయాగ్నిష్టే పతిః తురీయప్తే మనుష్యచౌః”||

అని వివాహ సమయములో వరుడు స్త్రీతో అంటాడు. అంటే నిన్ను ప్రారంభ కాలంలో సోముడూ, తరువాత గంధర్వుడూ, ఆ తరువాత అగ్నీ ఏలారు. ఇహ నాల్గవ వానిగా నేను నిన్ను ఏలుతాను అని అర్థం. అమ్మాయి పుట్టిన వెంటనే తన ఆలనా పాలనా చూడవలసినది సోముడు (చంద్రుడు). ఎన్ని సార్లు చూసినా చంద్రుడు ఎంత ఆకర్షణీయంగా ఉంటాడో అలానే పసి పాపను చూసినప్పుడు కూడా అదే భావన కలగటానికి కారణం చంద్రుని పాలన. కొంత వయసు వచ్చాక గంధర్వునికి ఇచ్చేసి చంద్రుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆమెని చంద్రుని సాక్షిగా గంధర్వుడు స్వీకరించాడు. “లావణ్యవాన్ గంధర్వః” అన్నట్టు గంధర్వుడు ఆమెలో అందాన్ని ప్రవేశ పెడతాడు. గంధర్వులు గాన ప్రియులు కనుక అందమయిన కంఠాన్ని లేదా సంగీతాన్ని ఇష్టపడే మనసుని ఇస్తాడు. అలా అందాన్ని, చందనాన్ని ఇచ్చేసి నా పనయిపోయింది ఇక నీదే పూచీ అని కన్యని అగ్నికి అప్పచెప్పి గంధర్వుడు వెళిపోతాడు. ఇప్పుడు ఆమెని గంధర్వుని సాక్షిగా అగ్ని స్వీకరించాడు. “అగ్నిర్వై కామ కారకః” అన్నట్టు అగ్ని ఆమె శరీరంలోకి కామ గుణాన్ని (కామాగ్ని) ప్రవేశ పెడతాడు. ఇలా ఒక కన్య చంద్రుని ద్వారా ఆకర్షణని, గంధర్వుని ద్వారా లావణ్యతని, అగ్ని ద్వారా కామ గుణాన్ని పొందుతుంది. ఇహ ఆమె వివాహానికి యోగ్యురాలని భావించిన అగ్ని, ఆమెను వేరొకరికి ఇచ్చి తను వెళ్ళాలి కనుక కళ్యాణ సమయములో ఆమెను నరునికి ఇస్తాడు. అలా ఆమెను “అగ్ని సాక్షిగా” వరుడు స్వీకరిస్తాడు.

అగ్ని ఉన్న ప్రదేశాన్ని బట్టి వివిధ నామాలతో పిలువ బడుతుంది. అవి:

*క్రోధాగ్ని*: కోపము వలన పుట్టేది క్రోధాగ్ని. ఇది ఎక్కువగా కళ్ళలో ఉంటుంది. పరమేశ్వరునికి మూడు కన్నులూ సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని. అందువలననే శివుడు మూడవ కన్ను తెరిస్తే అది అగ్ని రూపము కనుక క్రోధాగ్ని జ్వాలలలో భస్మం అవుట తధ్యం.

*బడబాగ్ని*: ఇది సముద్రము అడుగు భాగములో ఉండే అగ్ని. దీనినే బ్రహ్మాగ్ని అని కూడా అంటారు. దీనికి ఆహారం సముద్రోదకం అనగా సముద్రములోని నీరు.

*జఠరాగ్ని*:  ఇది ప్రతీ ప్రాణిఉదరములోనూ ఉండి ఆహార జీర్ణనకి ఉపయోగపడుతుంది. దీని విలువ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది.

||అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః|| ప్రాణాపాన సమాయుక్తా పచామ్యన్నం చతుర్విధం||

అని భగవద్గీతలో చెప్పారు. ఈ శ్లోకం నిత్యం భోజనం చేసే ముందు చదువుకుని తినటం ఒక అలవాటు. ఇక్కడ అహం అంటే పరమాత్మ, వైశ్వానరుడు అనే పేరుతో ప్రాణుల (ఇవి నాలుగు రకాలు – జరాయుజాలు అనగా తల్లి గర్భం నుండి ఉద్భవించేవి, అండజాలు అనగా గ్రుడ్డు నుండి పుట్టేవి, స్వేదజాలు అనగా చెమట నుండి పుట్టేవి మరియు ఉద్భిజ్జములు అనగా భూమిని చీల్చుకుని పుట్టేవి) దేహములో (శరీరములో) ఉన్నాడు. అన్నం చతుర్విధం అన్నారు అంటే నాలుగు విధములయిన పదార్థాలు [అవేమనగా భక్ష్యం (కొరికి తినేవి), భోజ్యం (నమిలి తినేవి), లేహ్యం (నాకి తినేవి), చోష్యం (పులుసు, మొదలయినవి)] మన భోజనములో ఉంటూ ఉంటాయి. మనం తినే భోజనం జీర్ణమయ్యి మన ప్రాణాన్ని నిలపెడుతుంది. అంటే అగ్నిలో ఆహుతయ్యి ఆ అగ్ని (హవ్యా వాహనుడు) శరీరమంతా ప్రాణ వాయువు రూపములో వ్యాపిస్తుంది. తిన్న ఆహారమును జీర్ణము చేసి మలమూత్ర శుక్ర రూపములో క్రిందకి తోసేది అపాన వాయువు. త్రాగిన వాటినీ, తిన్న వాటినీ రక్తముగా, పిత్తముగా, శ్లేష్మముగా మార్చి శరీరానికి సమానముగా అందించేది సమాన వాయువు. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం.

ఇటువంటి భోజనాన్ని మనలో ఉన్న వైశ్వానరుడు అనే అగ్నికి ఇచ్చే హవిస్సు క్రింద భావించాలి. అప్పుడే మనకి యజ్ఞం చేసినంత పుణ్య ఫలము లభించును. కనుక భోజనం చేసే ముందు ఈ శ్లోకాన్ని చదువుకుంటూ హోమం చేస్తున్నంత శ్రద్ధగా తినాలి.

||బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం||బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా”

అన్నారు. అంటే హవిస్సు బ్రహ్మే, అగ్నీ బ్రహ్మే, హోత అనగా హోమం చేసేవాడూ బ్రహ్మే అన్నీ ఆయనే కనుక మనం చేసిన యజ్ఞం కాని, అన్నం కాని ఏదయినా సరే ఆ బ్రహ్మకే అర్పిస్తున్నాం అన్న భావనతో ఉండాలి. “సర్వం కల్విదం బ్రహ్మ” అన్నారు కదా! అందుకే “అన్నం పరబ్రహ్మ స్వరూపం” అంటారు.

*జ్ఞానాగ్ని*:  ఆత్మలో నిత్యం రగిలే అగ్నిని జ్ఞానాగ్ని అంటారు. “జ్ఞానాగ్నిః సర్వ కర్మాణి భస్మసాత్ కురుతేర్జునా” అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే జ్ఞానం అనే అగ్ని పుడితే సర్వ కర్మలూ (ఆగామి, సంచితం, ప్రారబ్ధం) భస్మమయిపోతాయి అని అర్థం. ఈ అగ్ని మనకి ముఖ్యముగా రామాయణము లో తారసపడుతుంది. సీతాదేవి అగ్ని ప్రవేశం వెనుక ఉన్న అంతరార్థాన్ని గ్రహిస్తే ఈ జ్ఞానాగ్ని మనకి బోధపడుతుంది.

🙏 సర్వేజనా సృజనో భవంతు 🙏🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌷🙏🌷🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

హిమాలయ పర్వత శిఖరాల (23-Feb-23,Enlightenment Story)

*మహాభారతంలోని శాంతిపర్వం నుండి*

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🙏🌷🌷🙏🌷🌷🙏

హిమాలయ పర్వత శిఖరాల మీద ఒక బూరుగు చెట్టు ఉండేది. విశాలమైన శాఖలతో, విస్తారమైన కాండంతో ఆ బూరుగు చెట్టు తన తెల్లటి దూదితో మరో మంచుకొండను తలపిస్తూ ఉండేది. ఒక రోజు అటువైపుగా వెళ్తున్న నారదుని దృష్టి ఆ బూరుగు చెట్టు మీద పడనే పడింది.

వేల అడుగుల ఎత్తున ఇంతటి మహావృక్షం మనుగడ సాగించడం సాధ్యమేనా!’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బూరుగు చెంతకు వెళ్లి..నువ్వు అల్లంత ఎత్తున ఇంతగా విస్తరించి ఉన్నావు కదా! మరి నీకు ఏనాడూ ఆ వాయుదేవుని వల్ల నష్టం వాటిల్లలేదా? ఆయన తన పవనాలతో నిన్ను విరిచేందుకు ప్రయత్నించలేదా! నీకూ వాయుదేవునికీ మధ్య ఏమన్నా బాంధవ్యం ఉందా ఏం?’’ అని అడిగాడు నారదుడు.

నారదుని మాటలతో బూరుగు చెట్టుకి పౌరుషం పొడుచుకువచ్చింది- ‘‘వాయుదేవుని స్నేహంతోనో, అతని దయాదాక్షిణ్యాలతోనో నేను మనుగడ సాగించడం లేదు. నన్ను కూల్చేంత సామర్థ్యం వాయుదేవునికి లేనే లేదు. నా బలంతో పోలిస్తే ఆయన బలం ఒక మూలకు కూడా సరిపోలదు,’’ అంటూ పరుషమైన మాటలెన్నో పలికింది.

బూరుగు చెట్టు మాటలను వినగానే కలహభోజనుడైన నారదునికి, మరో కథ నడిపేందుకు అవకాశం చిక్కింది. ‘‘నువ్వు ఇలా మాట్లాడటం సబబుగా లేదు! ఆ వాయుదేవుడు తల్చుకుంటే కొండలనైనా కదిలించేయగలడు. మరి నువ్వు ఇన్నేసి మాటలు అన్న విషయం తెలిస్తే ఆయన నీకు కీడు చేయక మానడు,’’ అంటూనే బూరుగు చెట్టు గర్వంతో వదరిన మాటలన్నింటినీ పూసగుచ్చినట్లుగా వాయుదేవునికి చేరవేశాడు.

బూరుగు చెట్టు తనని కించపరచడాన్ని వాయుదేవుడు సహించలేకపోయాడు. వెంటనే ఆగమేఘాల మీద బూరుగుని చేరుకుని ‘‘ఒకనాడు బ్రహ్మదేవుడు నీ చెంత సేదతీరాడన్న కారణంగా, ఇన్నాళ్లూ దయతలచి నీ జోలికి రాలేదు. నేను చూపిన కరుణ నీలో కృతజ్ఞతను కలిగించకపోగా, గర్వాన్ని రగిలించింది. రేపు ఈపాటికి నిన్ను ఏం చేస్తానో చూడు!’’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు.

వాయుదేవుని మాటలకు బూరుగు నిలువెల్లా వణికిపోయింది. ‘ఇప్పటివరకూ తనకు ఎదురులేదన్న పొగరుతో అనకూడని మాటలన్నీ అనేసింది. వాయుదేవునితోనే వైరం తెచ్చుకుంది. నారదుడు చెప్పినట్లు వాయుదేవుడు తల్చుకుంటే కొండలు కూడా కదిలిపోయే మాట వాస్తవమే! అలాంటి తాను మాత్రం ఆ ప్రభంజనుడికి ఎదురొడ్డి ఎలా నిలబడగలదు. ఇప్పుడేం చేయడం!’- ఇలా పరిపరి విధాలా ఆలోచించిన బూరుగు చివరికి ఓ నిశ్చయానికి వచ్చింది. వాయుదేవుడు తనకు నష్టం కలిగించే లోపుగా తానే తన కొమ్మలనీ విరిచేసుకుంది, రెమ్మలన్నింటినీ తుంచేసుకుంది, పూలన్నింటినీ రాల్చేసింది. చిట్టచివరికి ఒక మోడుగా మారింది. ‘ఇప్పుడిక వాయుదేవుడు నష్టపరిచేందుకు నా వద్ద ఏమీ మిగల్లేదు’ అన్న నమ్మకంతో పవనుడి రాక కోసం ఎదురుచూసింది.

మర్నాడు వాయుదేవుడు రానేవచ్చాడు. మోడులా నిలిచిన బూరుగుని చూసి జాలిపడ్డాడు. ‘‘నేను విధించాలనుకున్న శిక్షను నువ్వే స్వయంగా అమలుచేసుకున్నావు. ఇక మీదనైనా అహంకారాన్ని వీడి నమ్రతతో జీవనాన్ని సాగించు!’’ అంటూ సాగిపోయాడు.

పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియచేస్తోంది. గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని పదే పదే వినిపిస్తోంది.

🙏 సర్వేజనా సృజనో భవంతు 🙏🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌷🙏🌷🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Tuesday, 21 February 2023

8 (అష్ట) శివరూపాలు (27-Feb-23,Enlightenment Story)

  🌞*8 (అష్ట) శివరూపాలు*  🌞

 🕉️⚜️🔱⚜️🔱✳️🔱⚜️🔱⚜️🕉️

||శర్వోభవః తథా రుద్రో ఉగ్రో భీమః పశోః పతిః! ||ఈశానశ్చ మహాదేవో మూర్తయశ్చాష్ట విశ్రుతాః!! ||

⚜️ శివుడు సర్వవ్యాపి. ఈ జగత్తు అంతటా శివచైతన్యమే నిండి ఉంది. అయితే, అంతటా నిండివున్న శివుణ్ణి ఎలా గుర్తుపట్టాలి? అని సనత్కుమారుడు ఒక పర్యాయం నందీశ్వరుని అడిగాడు. అప్పుడు..., 

🔱 "ఓ సనత్కుమారా! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, జీవాత్మ, సూర్యుడు, చంద్రుడు -  మొదలైన వాటన్నింటిలో తన ఎనిమిది స్వరూపాల్లో శివుడే అధిష్టించి ఉన్నాడు. ఆయన అష్టమూర్తి తత్త్వాన్ని తెలుసుకుంటే ఆయనను తెలుసుకోవడం తేలికవుతుంది. 

⚜️ శివుని అష్టమూర్తులు ఇవి.... 

1 .శర్వుడు:  🙏

🔱 స్థావర జంగమాత్మక మైన ప్రాణికోటినంతటినీ భరించే భూమిని శర్వుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. ప్రళయకాలంలో ప్రాణులను లయం చేసే శివస్వరూపమే శర్వుడు. ఓం శర్వాయ క్షితి మూర్తయే నమః  అని స్మరిస్తూ భూమిపై నడచినా, భూమిని స్పర్శించినా ధ్యానపారవశ్యం కలిగి పాపనాశనమవుతుంది.

2. భవుడు: 🙏 

⚜️ సర్వజగత్తులో సకలప్రాణులను జీవింపజేసే జలమును భవుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. నీటిని స్పర్శించినప్పుడు, త్రాగినప్పుడు ఓం భవాయ జలమూర్తయే నమః అని స్మరించాలి.

3. రుద్రుడు: 🙏 

🔱 ఈ జగత్తును ప్రకాశింపజేసే అగ్నిని రుద్రుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. అగ్నిని దర్శిస్తూ, ఓం రుద్రాయ అగ్నిమూర్తయే నమః అని స్మరిస్తే మనస్సు అంతర్ముఖమై పుణ్యం చేకూరుతుంది.

4. ఉగ్రుడు: 🙏

⚜️ ప్రాణుల బాహ్యమందు, లోపల చలించే వాయువును ఉగ్రుడు అనే మూర్తి రూపంలో శివుడు ఉంటాడు. వాయువు వీస్తుంటే,  ఓం ఉగ్రాయ వాయుమూర్తయే నమః అని స్మరిస్తే శాంతి, సౌఖ్యం, సద్గుణాలు లభిస్తాయి.

5. భీముడు: 🙏

🔱 జీవులందరికీ అవకాశాన్ని కలిగిస్తూ, సర్వాన్ని వ్యాపించే ఆకాశాన్ని,  భీముడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. ఆకాశాన్ని దర్శిస్తూ, ఓం భీమాయ ఆకాశమూర్తయే నమః అని స్మరిస్తే శీఘ్రంగా ఆత్మానందం కలుగుతుంది.

6. పశుపతి: 🙏 

⚜️ సర్వదేహాలలోని జీవులందరిలో పశుపతి అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. జీవుల అజ్ఞానమోహాలను నశింపజేసే శివస్వరూపమే పశుపతి. ఏ ప్రాణిని దర్శించినా ఓం పశుపతయే యజమాన మూర్తయే నమః అని స్మరిస్తే మోహం నశించిపోతుంది.

7. ఈశానుడు: 🙏 

⚜️ సర్వజగత్తును ప్రకాశింపజేసి జీవశక్తిని ప్రసాదించే సూర్యుని ఈశానుడు అనే మూర్తి రూపంలో శివుడు అధిష్టించి ఉంటాడు. సూర్యుని దర్శిస్తూ, ఓం ఈశానాయ సూర్యమూర్తయే నమః  అని స్మరిస్తే వారికి ఆరోగ్యం, జ్ఞానం, ధ్యానం సిద్ధిస్తాయి.

8. మహాదేవుడు: 🙏 

⚜️ సర్వ జగత్తుకు అమృతకిరణాలను వెదజల్లుతూ వెలుగును ప్రసాదించే చంద్రునిలో మహాదేవుడు అనే మూర్తి రూపంలో శివుడు ఉంటాడు. చంద్రుని దర్శిస్తూ,  ఓం మహాదేవాయ సోమ మూర్తయే నమ: అని స్మరిస్తే ఆనందం చేకూరుతుంది.... 

✅ అని నందీశ్వరుడు సనత్కుమారునికి చెప్పాడు.

🙏 సర్వే జనాః సుఖినోభవంతు  🚩 హిందువునని గర్వించు 🚩 హిందువుగా జీవించు

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

భగవద్గీత పారాయణం విలువ (24-Feb-23,Enlightenment Story)

🌞భగవద్గీత పారాయణం విలువ 🌞

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🙏🌷🌷🙏

ఒక రోజు ఒక పంచె కట్టుకుని భుజాలమీద శాలువ కప్పుకొని ఉన్న ఒక పెద్ద మనిషి భగవద్గీత పారాయణం చేస్తూ చెన్నై సముద్రపు ఒడ్డున కూర్చుని ఉన్నారు. 

అదే సమయంలో ఒక యువకుడు ఆయన దగ్గరగా వచ్చి "ఇంకా మీరు పాత చింతకాయల పచ్చడి లా ఉన్న ఇలాంటి పుస్తకాలు చదువుతున్నారా...! అదీ ఈ నవీన యుగంలో.  మనం చంద్రుడు మీదకు వెళ్ళాం. ఇంకా మీలాంటి వారు రామాయణం, మహాభారతం పుస్తకాల దగ్గరే ఆగిపోయారు.

అప్పుడు, ఆ పెద్దమనిషి ఆ యువకుడు ని అడిగారు, " బాబూ.. గీత గురించి నీకు ఏమి తెలుసు "? అని

అప్పుడు, ఆ యువకుడు దానికి సమాధానం చెప్పకుండా  ఇంకా చెప్పుకుంటూ పోతున్నాడు, ఏం జరుగుతుంది / వస్తుంది ఈ భగవద్గీత చదివితే. నేను విక్రమ్ సారాభాయ్ ఇన్స్టిట్యూట్ లో పరిశోధనలు చేస్తున్నాను, నేను ఒక శాస్త్రవేత్త ను.... ఈ భగవద్గీత అంశం ఉపయోగం లేనిది. 

ఆ పెద్దమనిషి, ఆ యువకుడి మాటలకు నవ్వుతూండగా.. రెండు పెద్ధ కార్లు అక్కడ కు వచ్చి ఆగాయి. ఒక కారు లో నుండి కొంతమంది Black Commandos దిగారు, రెండవ కారు లోంచి ఒక సైనికుడు దిగాడు. ఆ సైనికుడు దిగీ దిగగానే, వినయంగా సెల్యూట్ కొట్టి, కారు వెనుక తలుపు తెరిచి పెట్టుకున్నాడు. ఆ భగవద్గీత పారాయణం చేస్తూన్న పెద్దమనిషి, మెల్లిగా వెళ్ళి కారులో కూర్చున్నారు. 

అప్పుడు ఆ యువకుడు విస్మయం చెంది, ఈయన ఎవరో గొప్ప వ్యక్తి లా ఉన్నారు అనుకుని, కారు దగ్గరకు పరుగెత్తి, ఆ పెద్దమనిషి ని "అయ్యా తమరు ఎవరు" అని అడిగాడు. 

ఆ పెద్దమనిషి చాలా ముందుగా, "నేను విక్రమ్ సారాభాయ్ ని" అన్నారు. ఆ కుర్రవాడు కి 440 వోల్టుల విద్యుత్ఘాతం తగిలినట్టయింది. ఆ యువకుడు 

ఆ తర్వాత ఆ యువకుడు భగవద్గీత, రామాయణం, మహా భారతం పుస్తకాలు చదివారు. అంతే కాకుండా ఆయన మాట్లాడుతూ రామాయణం, మహాభారతం, భగవద్గీత ఇవన్నీ పురాణాలు కాదు, శాస్త్రాలు. అంతే కాకుండా ఇవి మన దగ్గర పుట్టడం, భారతీయులకు గర్వకారణం, మరియు గొప్ప వారసత్వ సంపద అని రాశారు. 

ఇది చాలా ఇష్టం తో చేసిన అనువాదం. ఇలాంటి గొప్ప విషయాలను పది మందికి పంచండి. కృతజ్ఞతలు. 🙏🙏 

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

మహాప్రజ్ఞ మరియు మహాకరుణ (22-Feb-23, Enlightenment Story)

🌞మహాప్రజ్ఞ మరియు మహాకరుణ🌞

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🙏🌷🌷🙏

ఒక యువకుడు గురువు గారి దగ్గరకి వచ్చాడు.*నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి. కాసింత కూడు పెట్టండి. ఏదో దేవుడిని తలచుకుంటూ, మీ సేవ చేసుకుంటూ బతుకుతాను.*అని అడిగాడు.

*నీకేం వచ్చోయ్?* అని ప్రశ్నించారు గురువుగారు. నాకేమీ రాదండీ. చదువుకోలేదు. ఏ విద్యా నేర్చుకోలేదు. కప్పులు కడగడం, ఇల్లు ఊడ్వడం వంటి పనులు వచ్చు. అంతే నండీ" అన్నాడు యువకుడు.

*ఇంకే పనీ రాదా?*అంటే ... చదరంగం కొద్దిగా వచ్చు*

అప్పటికప్పుడు చదరంగాన్ని తెప్పించారు గురువుగారు. ఆటాడుదాం. ఒకటే పందెం. ఇదిగో ఈ కత్తిని చూశావా? ఓడిన వాడి ముక్కు తెగ కోయాలి. ఒప్పుకుంటావా?"

యువకుడికి ఉద్యోగం కావాలి. ఇంకో మార్గం లేదు. ఒప్పుకున్నాడు. ఆట మొదలైంది. యువకుడు మొదట్లో కొన్ని తప్పులు చేశాడు. ఆటలో వెనకబడ్డాడు. అతని దృష్టి పొడవాటి కత్తిపై పడింది.చేత్తో ముక్కును తడుముకున్నాడు.

మొత్తం దృష్టినంతా కేంద్రీకరించాడు. ఏకాగ్రతతో పావులు కదిపాడు. యువకుడిదే పైచేయి అయింది. ఇంకో రెండు మూడు ఎత్తులతో గురువుగారిని చిత్తు చేసే స్థితికి వచ్చాడు.ఆ సమయంలో అతను మళ్లీ కత్తి వైపు చూశాడు.

గురువుగారి ముక్కు వైపు చూశాడు. ఏమనుకున్నాడో ఏమో కావాలనే ఒక తప్పుడు ఎత్తుగడ వేశాడు. గురువు గారు ఒక్క ఉదుటున లేచి కత్తితో చదరంగం పై పావులను తోసేశారు.

*ఆట అయిపోయింది. నువ్వు ఆశ్రమంలో ఉద్యోగానికి ఎంపికయ్యావు.*అన్నారాయన. యువకుడికి ఏమీ అర్ధం కాలేదు.

మంచి పనివాడికైనా, మంచి సాధకుడికైనా రెండు గుణాలుండాలి. మొదటిది మహాప్రజ్ఞ. అంతులేని ఏకాగ్రతతో దృష్టిని చేస్తున్న పని మీదే పెట్టగలగాలి. రెండవది అన్నీ ఉన్నా అతనికి తప్పనిసరిగా మహాకరుణ ఉండాలి. నువ్వు గెలిచే ఆటని నేను ఓడకుండా ఉండేందుకు వదులుకున్నావు. నా ముక్కు తెగే కన్నా నీ ముక్కు తెగడమే మంచిదనుకున్నావు. ఇదే మహాకరుణ. ఈ రెండు గుణాలూ నీకున్నాయి. అందుకే నువ్వు మాతోటే ఉండు*.అన్నారు గురువుగారు.

*బ్రతుకు గెలుపు కాదు, ఓటమి కాదు.  బ్రతుకంటే బ్రతుకే*

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Saturday, 18 February 2023

శుభోదయం- నమస్కారం గురువు గారు* (21-Feb-23, Enlightenment Story)

*శుభోదయం- నమస్కారం గురువు గారు*


"ఆయుష్మాన్ భవ, చిరంజీవ, సుఖీభవ" "ఏఁవి దీవెనలో కానీ గురువు గారు, ఉయ్యాలకోసం గొలుసు వేస్తే ఉన్న గొళ్ళెం ఊడిందట. అలా ఉంది నా పరిస్థితి"

"అదేం దిక్కుమాలిన సామెత నాయనా? ఎప్పుడు వినలేదే .... ?" "అన్నీ మనం వినాలని లేదుగా గురువు గారు. నాకు తోచిన సామెత చెప్పాను". "మంచిది !.... కానీ నువ్వు చెప్పిన సామెతకు నా దీవెనకు సంబంధం ఏమిటి?"  "అలా అడిగారు బాగుంది .... మీకు తెలుసుగా గురువు గారు, నాకు ఆ మధ్య గుండె ఆగిందన్న విషయం ....?"

"ఆగలేదు నాయనా! ఒక జర్క్ ఇచ్చిందంతే" "అదేలెండి! .... దానికి మందులు వాడటం వల్ల గ్యాసు సమస్య వచ్చింది .... " మళ్ళీ బుక్ చేసుకో నాయనా, రెండు రోజుల్లో వచ్చేస్తోందిప్పుడు .... ""ఆ గ్యాసు కాదు గురువు గారు. కడుపులో గ్యాసు .... " "ఓహో! ,,,, మరి దానిక్కూడా మందులు ఇస్తారుగా డాక్టర్లు?" "ఇచ్చారండి .... మనకు బి.పి., సుగరు ఉన్నాయి కదా .... ?" "మనకు కాదు నాయనా! నీకు".

"అదేలెండి !.... నాకే .... వాటికి మందులు వాడటం .... ఇలా రోజుకి పదకొండు మందులు వేయవలసి వస్తోంది"."అన్ని వాడితే సిలిండరు పేలిపోతుంది నాయనా..!""ఏ సిలిండరు గురువు గారు?""నీ కడుపులో గ్యాసు ఉందన్నావు కదా! ఆ సిలిండరు". "ఓహో!.... మరి ఆ సిలిండరు పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి గురువు గారు?"."నడవాలి నాయనా .... ""ఆయాసం వస్తోంది! గురువు గారు"

"ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నాయన్నమాట ....!" "దడ వస్తోంది గురువు గారు" "గుండె బలహీనంగా ఉందన్నమాట"! "కాళ్ళు వాస్తున్నాయి గురువు గారు" మూత్రపిండాల సమస్య .... ""ఇన్ని సమస్యలతో నేనెందుకు బతికుండాలి అనిపిస్తోంది గురువు గారు"

"అదే పొరపాటు నాయనా ....!""ఎందుకని గురువు గారు?" "నువ్వు ఒక ఇంట్లో అద్దెకి ఉంటున్నావనుకో, ఆ ఇంటికి రిపేరొస్తే ఏం చేస్తావ్?""ఓనరుకి చెప్పి రిపేరు చేయించమంటాను" "కానీ ఆ ఓనరు ఆ ఇల్లు నువ్వు బతికున్నంత కాలం అనుభవించేందుకు అనుమతిచ్చాడనుకో .... అద్దె లేకుండా, అప్పుడేం చేస్తావ్?"

"అద్దె లేకుండానా? అలాంటి వాళ్ళెక్కడ దొరుకుతారు గురువు గారు ఈ రోజుల్లో?" "దొరికాడనుకో .... ఏం చేస్తావ్?""నేనే రిపేరు చేయించుకుంటాను""అసలు రిపేరు ఎందుకు రావాలి?""ఎందుకంటే .... వాడకంలో కొంచెం అటూ ఇటూ అవుతుంది కదా గురువు గారు?"

"అలా అవకుండా జాగ్రత్త పడితే ఇలా రిపేర్ల ఖర్చు ఉండదు కదా? "కాస్త అర్ధం అయేలా చెప్పండి గురువు గారు ....!""అలా అడిగావు, బాగుంది. ఈ శరీరం అనేది భగవంతుడు మనకు ఇచ్చిన అద్దె కొంపలాంటిది. ఆయన ఆ కొంపను మనకు జీవితాంతం ఉచితంగా వాడుకోమని ఇచ్చాడు. కానీ ఎప్పుడైనా ఖాళీ చెయ్యమని అడగొచ్చు.  నీవిలాగ దానికి రిపేర్లు చేయించి, పై పూతలు పూసి, మసి పూసి మాయ చేస్తే ఆయన ఒప్పుకుంటాడా?"

"ఒప్పుకోడు .... ""మరి ఆ కొంపను జాగ్రత్తగా చూసుకోవాలి కదా?""అందులో నా నిర్లక్ష్యం ఏముంది గురువు గారు?" "నువ్వు పుట్టినప్పుడు ఈ రోగాలన్నీ ఉన్నాయా?""లేవు .... ""మధ్యలో ఎందుకొచ్చాయ్?""అంటే .... అది .... సమస్యలు వస్తే ఏం చెయ్యాలో అనే ఆలోచనల వల్ల .... ""కదా? కానీ సమస్య ఉందంటే పరిష్కారం ఉన్నట్లే .... "

"అదేంటి గురువు గారు? పరిష్కారం లేని సమస్యలు ఉండవా లోకంలో?""ఉండనే ఉండవు. కానీ సాధ్యమైనంత వరకు సమస్యలు రాకుండా చూసుకోవాలి .... ""నా ఉద్యోగం అలాంటిది గురువు గారు. రెవిన్యూలో ఉద్యోగం అంటే మీకు తెలియనిదేముంది చెప్పండి?""పైగా నువ్వు మడి కట్టుక్కూచుంటావు కూడా .... "

అదే పెద్ద సమస్య గురువు గారు""సమస్య అది కాదు నాయనా!. అన్ని సమస్యలకు అదే పరిష్కారం .... ""ఇదేం ఫిట్టింగు గురువు గారు? నేను అలా మడి కట్టుక్కూచోడం వల్లే నా మీద విపరీతమైన వత్తిడి, బెదిరింపులు, బదిలీలు .... వీటన్నిటవల్ల ఆరోగ్య సమస్యలొస్తున్నాయి .... "

"వాటివల్ల రాలేదు .... ""మరి ....?""వాటిని నువ్వు సమస్యలుగా భావించడం వల్ల వచ్చాయి""అదేంటి గురువు గారూ, అవి సమస్యలు కావా?""కానే కావు. నువ్వు రూలు ప్రకారం పని చేసుకెళ్తావు. ఏ వత్తిడికి లొంగవు. బెదిరింపులకు భయపడవు. బదిలీలంటావా, ఉద్యోగంలో అదొక భాగం. ఇప్పుడు చెప్పు నీకు వీటిలో సమస్య ఎక్కడుంది?"

"అలా ఆలోచిస్తే సమస్యల్లాగా కనపడవు. కానీ అలా ఆలోచించలేం కదా గురువు గారు?""అలాగే ఆలోచించాలి నాయనా!. సమస్య అనుకుంటే సమస్య .... కాదనుకుంటే కాదు""మరి మందులు ఆపేయమంటారా?"

"అది పరిష్కారం కాదు. ఇప్పటికే రిపేరుకు వచ్చింది కాబట్టి మందులు వాడు. వ్యాయామం చెయ్యి. కనీసం రోజూ అరగంటైనా నడక అలవాటు చేసుకో .... పిల్లలు సెటిలయ్యారు కదా?""అయ్యారండి..!? .... "

"హాయిగా నీకు నచ్చినట్లు బతుకు. ముఖ్యంగా మీ ఆవిడ మాటను పట్టించుకో. కనీసం పట్టించుకున్నట్లుండు. అప్పుడు పరిస్థితుల్లో మార్పులు వస్తాయి"."అంటే భార్య చెప్పింది వినమంటారా? వద్దంటారా?"

"చూడు నాయనా !.... జీవితం అనేది ఒక రైలు ప్రయాణంలాంటిది. అందులో మధ్యలో వచ్చి రైలెక్కేది భార్య. ఆమె ముందుగానే దిగొచ్చు లేదా నీ తరువాత దిగొచ్చు. అంటే తోటి ప్రయాణీకురాలు. అలాగే పిల్లల్లున్నూ .... "

"అదేంటి గురువు గారు, భార్య, పిల్లలు తోటి ప్రయాణీకులా?""అలా అనుకుంటేనే నీకు సమస్యలు రాకుండా ఉంటాయి .... ""మరి పిల్లల్ని జాగ్రత్తగా పెంచకుండా, తోటి ప్రయాణీకులుగా భావించి వదిలేయలేం కదండీ?""రైల్లో బెర్తు కన్ఫమ్ అయ్యేదాకా నీ పక్కన కూర్చునే ప్రయాణీకులనుకో .... "

"ఓహో .... ""ఇప్పుడు వాళ్ళ బెర్తులు కన్ఫమ్ అయినాయి కదా!. ఇంక వాళ్ళ గురించి నీకెందుకు బెంగ?""మరి వాళ్ళకు ఏదైనా సమస్యలొస్తే?""టి.టి.ఈ. ఉన్నాడు కదా?""టి.టి.ఈ ఉన్నాడా? అంటే?"

"రైలు అనే జీవితానికి భగవంతుడే టిటిఈ. ఏవైనా సమస్యలొస్తే ఆయన్నే అడగాలి. అంతే కానీ రైలు చైన్ లాగి నువ్వేమన్నా చేద్దామనుకుంటే .... ఇదుగో .... ఇలాగే అవుతుంది .... "

"ఆహా .... శరీరాన్ని అద్దె కొంపతోను, జీవితాన్ని రైలు ప్రయాణంతోను పోల్చి చెప్పారు చూడండి గురువు గారు .... అద్భుతం. కానీ ఒక అనుమానం కొడుతోంది, అడగమంటారా?"

"అడుగు నాయనా?""ఇన్ని ఆలోచించే మీకు మీ గుండె ఎందుకు జర్క్ ఇచ్చిందంటారు?""జర్క్ ఇచ్చిన తరువాతే ఇవన్నీ తెలిసాయి నాయనా ! .... ఇక ఉంటా నాయనా .... 

మా ఆవిడ పెసరట్లు వేస్తోంది. చల్లారితే బాగుండవ్ .... "మరి అది మీకు సమస్యేగా?""అందుకే వేడిగా తినాలన్నది .... అదే పరిష్కారం .... "



జ్ఞానదీపం (20-Feb-23, Enlightenment Story)

 🔥జ్ఞానదీపం🔥

🕉🌞🌎🌙🌟🚩

ఒక సాధకుడు దైవత్వం గురించి పూర్తిగా తెలుసుకోవాలని అనుకున్నాడు. ఎలాగయినా సాధన చేసి మూడవకన్ను (జ్ఞాననేత్రం) తెరుచుకునేలా చేసుకోవాలని చాలా ఆశగా ఉన్నాడు.

ఒక గుహలో తపస్సు చేసుకుంటున్న గురువుగారి దగ్గరకు వెళ్ళేడు.గుహలోకి వెళ్ళేటప్పుడు అతనికి చిన్నవెలుగు కనిపించింది. దానికి దగ్గరగా వెళ్ళేకొద్దీ తగ్గిపోతూ చివరికి పుర్తిగా చీకటి అయిపోయింది. ఆ కటిక చీకటిలో అతనికి చాలా భయంవేసి ఆర్తితో”ఓం నమశ్శివాయ” అని అరిచాడు.ఆ పిలుపు విన్న గురువుగారు ఎవరది అని అడిగారు.మీ అనుగ్రహం కోసం వచ్చాను అని సాధకుడు చెప్పేడు. ఆ గురువుగారు ఆ గుహలో కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. 

ఈ సాధకుడిని పరీక్షించాలని అక్కడ ఉన్న దీపం వెలిగించమని చెప్పారు. సాధకుడు ప్రయత్నించినా అది వెలగలేదు. అగ్గిపెట్టెలో ఉన్న పుల్లలు అన్నీ అయిపొయాయి, కాని దీపం వెలగడం లేదు అని సాధకుడు గురువుగారితో చెప్పాడు.అప్పుడు ఆ గురువుగారు ఆ ప్రమిదలో ఉన్న నీటిని తీసివేసి, నూనెతో నింపి వెలిగించమని చెప్పారు.సాధకుడు అలా ప్రయత్నించినా కూడాఅది వెలగలేదు. 

అప్పుడు గురువుగారు ప్రమిదలో ఉన్న వత్తి నీటిలో నానిపోయి ఉంటుంది కాబట్టి దానిని బాగ ఆరబెట్టి అప్పుడు ప్రయత్నించమని చెప్పారు. అలా చేసి సాధకుడు దీపం వెలిగించగలిగాడు.ఈసారి తనని అనుగ్రహించమని గురువుగారిని అడిగాడు.

గురువుగారు ఆశ్చర్యతో ఇంతసేపూ నీకు అనుగ్రహం పొందే మార్గమే కదా బోధించాను అన్నారు. అప్పుడు సాధకుడు తన అజ్ఞానాన్ని క్షమించమని అర్థమయ్యేలా చెప్పమని అడిగాడు. గురువుగారు ఈ విధమగా వివరించారు.

నీ హృదయం అనే ప్రమిదలో వత్తి అనబడే ఆత్మ ఉంది.అది ఇన్నాళ్ళూ కోరికలు, లోభం, అసూయ,అహంకారం మొదలైన దుర్గుణాలు అనే నీటిలో నానిపోయిఉంది.అందువల్ల నువ్వు జ్ఞానం అనే దీపాన్ని వెలిగించ లేకపోతున్నావు. అవన్నీ తీసివేసి నీ హృదయాన్ని ప్రేమ,కరుణలతో నింపు.ఆత్మని విచక్షణతో సాధన అనే ఎండలో ఆరబెట్టు.హృదయాన్ని సాధన(ధ్యానం) నమ్మకం అనే నూనెతో నింపు. అప్పుడు నీకు జ్ఞానదీపం వెలిగించుకోవడానికి వీలవుతుంది.” అని జ్ఞాన బోధ చేసారు ఆసాధకునకు.

నీతి:-

మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది. కాని చీకటి అనే అజ్ఞానం తో మనసంతా చెడు ఆలోచనలతోనూ, దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించ లేకపోతున్నాము. మన అజ్ఞానం ఎంతటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ నూనెకు తేడా తెలియనటు వంటి చీకటి స్ధితిలో ఉన్నాము. మరి ఈచీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం.

ఆ గురువు సాన్నిధ్యంలో కామ,క్రోధ,లోభ,మోహ, మద, మాత్సర్యాలు అనే దుర్గుణాలను , అహకారాన్ని విడిచిపెట్టి ధ్యాన సాధన చేస్తే హృదయం  పవిత్రమవుతుంది. అప్పుడు ఆ పవిత్ర మైన హృదయంలో జ్ఞానమనే దీపం వెలిగించుకోవడం సాధ్యమవుతుంది.

🔥💖🔥💖🔥💖🔥🔥💖🔥💖🔥💖🔥🔥💖🔥💖🔥💖🔥🔥💖🔥💖🔥💖🔥🔥💖🔥💖🔥💖

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🔥💖🔥💖🔥💖🔥🔥💖🔥💖🔥💖🔥🔥💖🔥💖🔥💖🔥🔥💖🔥💖🔥💖🔥🔥💖🔥💖🔥💖


సత్సంగత్వే నిస్సంగత్వ0 (19-Feb-23, Enlightenment Story)

🌞 సత్సంగత్వే నిస్సంగత్వ0 🌞

🌷🙏🌷🌷🙏🌷🌷🙏

పూర్వకాలం  కాంచీపురాన్నీ పరిపాలించే మహారాజు తన కుమారుడిని మంచి విద్యావంతుడిని చేశాడు. సర్వశాస్త్రాలు నేర్పించాడు. రాజ్యపాలనకు సంబంధించిన అన్ని విషయాలలో తర్ఫీదు ఇప్పించాడు. యవ్వనుడైన ఆ కొడుకుకు యువరాజ పట్టాభిషేకం చేసాడు. రాజ్యపాలనలో యువరాజు సలహాలు తీసుకొనేవాడు.

ఒకరోజు రాజ్యంలోని కొందరు ప్రజలు రాజు దగ్గరకు వచ్చారు. అడవికి దగ్గరగా ఉన్న తమ గ్రామాలలోకి క్రూరమృగాలు వస్తున్నాయని, వాటి నుండి తమను రక్షించాలని కోరారు. వెంటనే రాజు పక్కనే ఉన్న యువరాజు వంక చూశాడు. ఆ చూపు అర్ధం చేసుకున్న యువరాజు ప్రజల వెంట అడవికి బయలు దేరాడు. క్రూరమృగాల్ని వేటాడుతూ యువరాజు అడవిలో చాలా దూరం పోయాడు.

క్రూరమృగాల్ని చాలా మటుకు వధించాడు. వేటలో అలసట చెందిన యువరాజుకు దాహం వేసింది. నీటి కోసం చుట్టూ చూసాడు.ఎక్కడ నీటి జాడ కనిపించలేదు. దగ్గరగా ఉన్న ఒక చెట్టు ఎక్కి చూడగా కొద్ది దూరంలో ఒక ఆశ్రమ కనిపించింది. చెట్టు దిగి ఆశ్రమం చేరుకొన్నాడు. ఆశ్రమంలో ఒక స్వామి ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు.

యువరాజు వచ్చిన అలికిడికి కళ్లు తెరిచిన ఆ స్వామి యువరాజును లోనికి ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసాడు.సేద తీరిన యువరాజును ఆ స్వామి మీరెవరు? మీ పేరేమిటి? అని ప్రశ్నించాడు. అందుకా యువరాజు స్వామీ! మాది సమీపంలోని ఒక రాజ్యం.

నేను యువరాజును నా పేరు మోహదీప్తుడు. అయినా అందరూ నిస్సంగుడు అని పిలుస్తారు అని బదులిచ్చాడు. అపుడా స్వామి నాయనా! నీ పేరు విచిత్రంగా ఉందే అన్నాడు. అందుకా యువరాజు స్వామీ! నా ఒక్క పేరేమిటి? మా రాజ్యంలో పేర్లన్నీ ఇట్లాగే ఉంటాయి.

అనగానే స్వామికి ఏదో తోచింది. యువరాజా! మీరు ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. ఆపైనున్న మీ ఉత్తరీయం నాకివ్వండి. నేను రాజ్యంలోకి పోయి మరలా వస్తాను. అని ఉత్తరీయాన్ని తీసుకున్నాడు. కొంతదూరం పోయిన తర్వాత ఆ ఉత్తరీయానికి అక్కడక్కడ కొంత రక్తం మరకలు పులుముకుని రాజ్యం చేరుకున్నాడు.

రాజాంతఃపుంర ద్వారం దగ్గర ఒక దాసి ఎదురైంది స్వామికి. అపుడా స్వామి ఆ దాసితో అమ్మా! అడవిలో మీ యువరాజును పులి చంపేసింది. ఇదిగో రక్తంతో తడిసిన ఆయన ఉత్తరీయం అన్నాడు. అప్పుడా దాసి దానిదేముంది

స్వామీ భగవద్గీతలోని రెండవ అధ్యాయంలోని శ్లోకాలను గుర్తుకు తెచ్చుకోండని వెళ్లిపోయింది. ఆశ్చర్యపోయిన ఆ స్వామి అంతఃపురంలోని రాజు దగ్గరకు పోయి యువరాజు మరణం గురించి చెప్పాడు. అందుకా రాజు స్వామితో రుణగ్రస్తుడు. రుణం తీరింది వెళ్లిపోయాడు అని తన పనిలో మునిగిపోయాడు. స్వామికి మరింత ఆశ్చర్యం వేసింది. 

సరే అనుకుని రాణి దగ్గరకు పోయి కొడుకు మరణవార్త వినిపించాడు.అందుకామె బాధ పడలేదు. పైగా స్వామీ! చెట్టుపై సాయంత్రం చేరిన పక్షులు ఉదయమే వెళ్లిపోతాయి. మరలా సాయంత్రం ఆ చెట్టుపైకి ఎన్ని పక్షులు చేరుకుంటాయో తెలియదు కదా అని అన్నది.

అదేమిటి ఈమె కూడా ఇట్లా అన్నదే అని ఆ స్వామి యువరాజు భార్య దగ్గరకు పోయి విషయం చెప్పాడు. అందుకామె స్వామీ ప్రవహిస్తున్న గంగానదిపై ఉన్న దుంగలం మేమంతా. అలలపై కొన్ని దుంగలు కొట్టుకుని పోతాయి. అందుకు చింతించాల్సిన పనిలేదు అని సమాధానం చెప్పింది. స్వామి ఇక్కడ యింకేం పని లేదనుకుని ఆశ్రమం చేరాడు.

యువరాజుతో రాజా! మీ రాజ్యాన్ని శత్రురాజులు ఆక్రమించుకున్నారు. మీ తల్లిని, తండ్రిని బంధించారు అని అన్నాడు. అందుకా యువరాజు స్వామీ ఇందులో విచిత్రమేముంది? యాత్రికులలాగా ఇక్కడికి వచ్చాం. యాత్ర ముగిసింది. అంతేగదా అని అనగానే స్వామికి ఆనందం రెట్టింపు అయింది.

||సత్సంగత్వే నిః సఙ్గత్వం ||నిఃసఙ్గత్వే నిర్మోహత్వం || నిర్మోహత్వే నిశ్చలతత్త్వం || నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||

జ్ఞానులైన సజ్జనులు సాంగత్యము వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధ తత్వము గోచరమగును. అది తెలిసినపుడు జీవన్ముక్తి కలుగుతుంది .

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Friday, 17 February 2023

లింగోద్భవం (18-Feb-23, Enlightenment Story)

 🌞*లింగోద్భవం*🌞

  🌷🙏🌷🌷🙏🌷🌷🙏

లింగోద్భవ సమయం 18-02-2023 శనివారం రాత్రి తెల్లవారితే ఆదివారం రాత్రి 12 గంటల 32 నిమిషాల 10 సెకెండ్ల నుండి 12 గంటల 35 నిమిషాల 43 సెకెండ్ల పాటు లింగోద్భవ కాలం. 

సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.

ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే. 

అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆ భవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది.

పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.

హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు.

భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.

మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Thursday, 16 February 2023

రావి చెట్టు - ప్రదక్షిణం (17-Feb-23, Enlightenment Story)

 🌞రావి చెట్టు - ప్రదక్షిణం🌞

  🌷🙏🌷🌷🙏🌷🌷🙏

పరమాచార్య స్వామి (చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి / నడిచే దేవుడు) వారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్నా కొన్ని సంఘటనలు వారి నిజరూపాన్ని వారి అపార శక్తిని తెలియపరుస్తాయి. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగింది…అప్పుడు పరమాచార్య స్వామి వారు తిరువనైక్కావల్ లో మకాం చేసారు. నేను నా భర్త మహాస్వామి వారిని దర్శించుకుని తిరిగి తంజావూరు వెళ్ళిపోవాలి. మరుసటి రోజు సోమవార అమావాస్య. మేమిద్దరమూ తంజావూరులో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి.

మహాస్వామి వారు అక్కడకు వచ్చిన అందరితోను మాట్లాడి వారికి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. మా విన్నపం విని కూడా మా మాటలు విననట్టు ఉన్నారు. మేము వరుసలో వచ్చినప్పుడు మా ముందువరకు అందరికి ప్రసాదం ఇచ్చి మా వంతు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారు – వారు పదే పదే ఇలాగే చేస్తుండేవారు.

మేము తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకుని రాత్రికి అక్కడే ఉండిపోయాము. నాకు మహాస్వామి వారిపై చాలా కోపంగా ఉన్నింది. మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తరువాత, వారి గంట జపం మొదలుపెట్టేముందు మేనేజరు వారితో “ముప్పావు గంట తరువాత నేను జపంలో ఉండగానే పల్లకిని కొల్లిదం నది ఒడ్డుకు చేర్చుటకు ఏర్పాట్లు చెయ్యమని” చెప్పారు. వారు పల్లకిలోపల కూర్చుని తలుపులు వేసుకున్నారు.

రావి చెట్టుకు ఎలాగు ప్రదక్షిణలు చేయలేమని తెలుసుకుని, కనీసం మహస్వామి వారి చుట్టూ తిరుగుదామని అనుకున్నాము. మేనా చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం మొదలుపెట్టాము. అది పూర్తి అయినతరువాత పల్లకి బయలుదేరింది. మేము కూడా దాని వెంట వెళ్ళి కొల్లిదం చేరుకుని అక్కడే స్నానాదులు ముగించాము.

పరమాచార్య స్వామి వారు తమ అనుష్టానానికి కూర్చుంటూ నన్ను పిలిచి ”ఎన్ని ప్రదక్షిణలు చేసావు?” అని అడిగారు. “తొంబై ప్రదక్షిణలు” అని చెప్పాను. కాని నేను ప్రదక్షిణలు చేసినట్టు మహాస్వామి వారు చూసే అవకాశమే లేదు. మిగిలిన ప్రదక్షిణములు కూడా పూర్తి చెయ్యమని చెప్పారు.

నేను మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత నన్ను అడిగారు, “ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేసావు?”

“గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః అని మననం చేస్తూ ప్రదక్షిణ చేసాను” అని చెప్పాను.

“రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు?” అని అడిగారు.

”మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః” అని అన్నాను.

వెంటనే మహాస్వామి వారు “మరింకేంటి ఇక్కడా త్రిమూర్తియే అక్కడా త్రిమూర్తియే. సరిపోయింది కదా!” అని అన్నారు.

ఈ మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. అప్పటినుండి ప్రతి సోమవార అమావాస్య నాడు పరమాచార్య స్వామి వారికి ప్రదక్షిణ చెయ్యాలని నియమం పెట్టుకున్నాను.

--- జయలక్ష్మీ అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియావళ్ – దరిశన అనుభవంగళ్ 4

||అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం|| శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

🌷🙏🌷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🌷🙏🌷🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Wednesday, 15 February 2023

ఆకుకూరలు (15-May-24, Enlightenment Story)

  ఆకుకూరలు

🌺🍀🌺🍀🌺🌺

రవి సాఫ్ట్ వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు. ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు.

ఆకు కూరలు..ఆకు కూరలు" అని కేక వినిపించింది.  డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు. "కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?"  అడిగాడు.   "పది రూపాయలకు మూడయ్యా"  చెప్పింది అవ్వ. "మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు." అన్నాడు చిరుకోపంగా  "నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ

పదిరూపాయలు ఇచ్చాడు.  "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని. గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి ....అవ్వ వెళ్ళిపోయింది.  "ఎంత ఆశో ఈ ముసలిదానికి..  ఇవాళో రేపో చావబోతుంది...ఇంకా మూటలు కడుతున్నది"ముసిముసిగా నవ్వుకున్నాడు.


అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.  కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు.  అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ "నానమ్మా.. నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." ఏడుస్తూ వచ్చింది.

అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ.. బాబూ...కాస్త గంప కిందికి దించు!" అన్నది రవితో. "ఏడవకమ్మా...నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే..నా తల్లే... ఇంటికిపొదాం పద"  అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.

రవికి అర్ధం కాలేదు.  "ఎవరీ పిల్ల?"  అడిగాడు అవ్వను. "నా మనవరాలు బాబూ...ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు ఎలుకలమందు మింగి చచ్చిపోయింది.  మా ఆయన మూడేళ్ళబట్టీ మంచం మీదున్నాడు.  ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని  మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ  అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా.  మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు.  నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు.  ఈరోజు చూడు బాబు... పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు." అన్నది కళ్ళు తుడుచుకుంటూ.

రవి నరాలు మొత్తం బిగుసుకుని పోయాయి. రక్తప్రవాహం స్తంభించి పోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు.  అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది.  మనసంతా ఉష్ణ జలపాతం  అయింది.  ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు  ధారలు కట్టాయి.  "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది.  ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటి గాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు ...

పర్సులో చెయ్యి పెట్టాడు.  బయటకొచ్చి "అవ్వా ... ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి"  అన్నాడు. బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని. హంపి మొహంజదారో శిధిలాలకు  ప్రతీకలాంటి   అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది. "బాబూ .... ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది"  అన్నది వణుకుతూ.

"అప్పని ఎవరు చెప్పారు?  చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను ....  ఇప్పుడే కాదు .... నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను .... రేపటినుంచి రోజూ  నేను ఉన్నా లేకపోయినా  పది రూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు" గంప పైకెత్తాడు రవి.

మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు.  వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి! ఇట్టాంటి చిట్టి కధలు మ మనస్సులని కదిలిస్తాయి✍️


🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

🍀🌺🍀🌺  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు   🍀🌺🍀🌺  లోకా సమస్తా సుఖినోభవన్తు!🍀🌺🍀🌺

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  
దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
 *మీ చంద్రశేఖర్* (Cell:+1-314-562-5762)

☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️

Tuesday, 14 February 2023

కడుపు నింపే దేవాలయ నిర్మాత!సర్ఆర్ధర్.కాటన్ (15-Feb-23,Enlightenment Story)

 🌞కడుపు నింపే దేవాలయ నిర్మాత!🌞

🌷🙏🌷🌷🙏🌷🌷🙏

ఆ నవయువకుడు తనది కాని దేశంలో ఉద్యోగం చేయడానికి కడుపు చేతితో పట్టుకుని వచ్చాడు. కావేరి, గోదావరి నదుల దగ్గర ఉద్యోగం చేశాడు. ధవళేశ్వరంలో ఉద్యోగ నిమిత్తం కాపురం ఉన్నాడు. ఓసారి ఆతని ఇంటిలో పనిచేసే ఆమె ఓ పదిరోజులు పనిలోకి రాలేదు. పదకొండో రోజున పనిలోకి వచ్చిన పనిమనిషిని ఆతని భార్య నిలదీసింది 'పనిలోకి ఇన్ని రోజులనుంచి ఎందుకు రాలేదని?' 

అంతే...ఆ పనిమనిషి భోరున ఏడవడం మొదలుపెట్టింది. ఆ దొరసాని పనిమనిషిని ఓదార్చి వివరం కనుక్కుంది. ఆరోజులలో గోదారి సీమ అంతా కరువు కాటకాలతో తల్లడిల్లిపోతోంది. కడుపుకింత అన్నం కూడ లేదు. గోదారి ఒండ్రు మట్టిని కూసింత గంజిలో కలుపుకుని అదే అమృతంగా ఇంటిల్లిపాదీ రోజూ తాగి కడుపు నింపుకునే వారు. బతుకు కొనసాగించేవారు. 

అలాంటి వేళలో ఎవరో కాస్త కలిగిన మహానుభావులు ఆ పనిమనిషి సంతానమైన ఆడపిల్లను కొనుగోలు చేసేందుకు వచ్చారు. ఆతల్లి ముందు- వెనుకలాలోచించకుండా తన సంతానాన్ని అమ్మేసింది! డబ్బుకోసం కాదు!! తనెలాగూ తన బిడ్డను పోషించలేదు. కాస్త కలిగిన చోట పడితే కనీసం అదన్నా బతుకుతుందని!!! 

ఆ చేతిలో పడ్డ కాసులతో మిగతా కుటుంబం కాలం వెళ్ళదీయచ్చునని!!!!అమ్మడమంటే అమ్మేసింది కాని అమ్మ మనసును గట్టిపరుచుకోవడానికి సమయం పట్టింది. అందుకే పనిలోకి రాలేకపోయింది. ఇదంతా దొరసానికి భోరున విన్నవించుకుంది.

ఆతర్వాత ఆ దొరసానికి రెండు రాత్రుళ్ళు కంటికి నిద్ర లేదు.. నోటికి ముద్ద పోలేదు. భర్తేమో ఊళ్ళో లేడు. భర్త రాగానే ఈ విషయాన్నంతటినీ వివరించింది. “మీరు ఇంజనీర్ కదా...ఇంతటి గోదావరి మహానది ప్రవహిస్తున్నా ఇక్కడి ప్రజానీకాన్ని ఇలాంటి దుర్గతి నుండి తప్పించలేరా....”అని నిలదీసింది.

ఆ దొర గారు అప్పుడు ఆలోచించారు. ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. గోదారి నీళ్ళను బీడు భూములలోనికి ప్రవహింప చేయాలనుకున్నాడు. పంటలు పండించి అందరి కడుపు నింపాలనుకున్నాడు.!!!వెంటనే ప్రభుత్వానికి మహజరు పంపాడు. ఎన్నో తిప్పలు పడి విదేశీ ప్రభుత్వాన్ని ఒప్పించాడు.

కాని ఇప్పుడొచ్చింది అసలు సమస్య!! మహోధృతంగా ఉత్తుంగ తరంగంగా ప్రవహించే గోదావరి నదికి తాను అడ్డుకట్ట వేయగలడా!? దైవప్రేరేపణ కాకుంటే అసలు తనకా ఆలోచన ఎందుకు వచ్చింది? అని తర్కించుకున్నాడు!!

వెంటనే ఓ మెరుపు మెరిసింది!! తాను కావేరీ నది పరీవాహాన్ని అధ్యయనం చేసినప్పుడు ఆనదిపై 900 సంవత్సరాల క్రితమే రాజరాజ చోళుడు ఇసుకతో ఆనకట్టను నిర్మించిన ఘట్టం గుర్తుకొచ్చింది. తాను మాత్రం ఆవిధంగా ఎందుకు చేయకూడదు?అనుకుని తన మిత్రుడు అయిన 'వీరం వీణెన్న’ను వెంటబెట్టుకుని రంగంలోకి దిగిపోయాడు. గోదావరి సీమ అణువణువూ గాలించేశాడు. గోదారమ్మ పాయలుగా చీలుతున్న ధవళేశ్వరం, ర్యాలి గ్రామాల మధ్యన ఆనకట్ట కట్టేడు.

కోట్లాది మంది కడుపులు నింపాడు. శతాబ్దాలకు,సహస్రాబ్దాలకు సరిపడే సంపద కూర్చి పెట్టేడు!!!!!! *ఆ దొర గారే సర్.ఆర్ధర్.కాటన్.....!*  అంత కష్టపడ్డందుకు ఆయనకు కలిగిన ఫలితం...ఆయన ఆనకట్ట పనిమీద దూరంగా ఉన్నప్పుడు ఆయన ముద్దుల కూతురు ఆయన లేకుండానే తుది శ్వాస విడిచింది..!


ఆ పాప సమాధి ధవళేశ్వరంలో ఉంది. ఆనకట్ట కట్టిన తరువాత దాని పర్యవేక్షణలో కోనసీమలో తిరుగుతుండగా ఓ అగ్రహారంలో ఓ ఉదయాన్న ఓ పండితుడు కాటన్ మహాశయం తన్నమమ అంటూ సూర్యభగవానునికి అర్ఘ్యమిస్తుండగా చూశాడు. 

వెంటనే డఫేదారుని అలా ఎందుకంటున్నాడో కనుక్కు రమ్మని పంపేడు. "ఇక్కడ ఇంత గోదారి ఉన్నా మాకు మన్నేగాని అన్నమేనాడూ లేదు. కాటన్ దొరగారి పుణ్యమా అని మాకందరకూ అన్నపానాలకు, సిరిసంపదలకూ లోటులేకుండా బ్రతుకు గడిచిపోతోంది. ఆయనే మా ప్రత్యక్ష దైవం! అందుకే మా సూర్యునితో పాటుగా ఆయనకూ అర్ఘ్యమిస్తున్నాను" అని అన్నాడట ఆ ఘనాపాటి.

"ఇంతకన్నా నాకింకేం కావాలి"  అని తన జీవితచరిత్ర లో వ్రాసుకున్న అల్పసంతోషి సర్.ఆర్ధర్ కాటన్. లోకా సమస్తా సుఖినోభవన్తు!

          

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷🌷🙏🌷

Monday, 13 February 2023

అనుష్ఠానం (14-Feb-23,Enlightenment Story)

🌞అనుష్ఠానం - తోటివారిని సంతోష పెట్టేదో, సాటివారి కన్నీరు తుడిచేదో, ఏదైనా అనుష్ఠానమే!🌞

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

నేను ఎప్పుడు అనుష్ఠానానికి కూచున్నా సరిగ్గా టాయిలెట్స్ కడిగే అమ్మాయి అప్పుడే వస్తుంది. మనిషి బక్కపలచగా నీరసంగా ఉంటుంది. జక్కంపూడి నుంచి రానూ, పోనూ 50/-ఇచ్చి ఆటోలో వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మంగళ, శుక్రవారాల్లోనే వస్తుంది. మొదట్లొ కొంచెం విసుక్కున్న మాట నిజమే! కానీ, ఆ అమ్మాయికి ఆకలి, అరడజను ఆడపిల్లల ఆలనా, పాలనా తప్ప మన సెంటిమెంట్ పట్టదు అని గ్రహించా. నాలాంటి వారు నలుగురు పని చెబితేనే ఆరోజు గడుస్తుంది ఆ ఇంటిల్లిపాదికి. ఆటో చార్జీలు, దాన్లో మళ్ళీ ఆసిడ్ బాటిల్, ఫినాయిల్ కి పెట్టుబడి పోగా, మిగిలే యాభయ్యో, వందో రూపాయల కోసం మనం అసహ్యించుకునే పనిని ఆప్యాయంగా చేస్తుంది. అటువంటి అమ్మాయిని ఇవ్వాళ శుక్రవారం, పైగా పూజ మధ్యలో ఉన్నా, రేపురా అని ఎలా అనగలను? అలా అంటూ...."అన్తశ్చరతి, భూతేషు, గుహాయామ్, విశ్వమూర్తిషు" అంటూ మననం చేస్తుంటే పూజిస్తున్న దేవుడు తెల్లబోడూ? ‘చదువుతున్నది ఏమిటి, చేస్తున్నది ఏమిటి?’  అని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోను?  అందుకే పూజ ఆపి, ఆ అమ్మాయి పని అయి, పంపాకే శేషానుష్ఠానాన్ని సాగిస్తున్నా. ఇక్కడే నాకు సందేహం వచ్చింది! అసలు "అనుష్ఠానం" అంటే ఏమిటని! అనుష్ఠానం ఒక పవిత్రమైన పదం.

పదం ఎంత గంభీరమో, దాని అర్ధం కూడా అంతే గూఢం. భగవంతుడికి సంబంధించిన పదం కాబట్టి దీని అర్ధం విలక్షణంగానూ, విస్తృతంగానూ, ఉంటుంది. "ఫలానాలా చేస్తేనే అనుష్ఠానం" అని గిరి గీసి చెప్పటానికి లేకుండా "గిరి" అంత ఉన్నతమైన విలువ కలది. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతునిలానే అనిర్వచనీయం. సమాజ హితంకోసం ఏకాగ్రతతో చేసే అనుష్ఠానం, ధ్యానం లేదా తపస్సు, ఒక దృఢమైన సంకల్పశక్తిగా లోకకల్యాణానికి ఎలా మారుతుందో…. మహానుభావుల చరిత్ర చూస్తే తెలుస్తుంది. మరి మనం అలా చెయ్యాలంటే అంత మానసిక, శారీరక, తుష్టి, పుష్టి మనకి ఉందా? అంత ఏకాగ్రత మనం సంపాదించుకోగలమా? 

ఒక ఆహ్లాదమైన అనుష్ఠానాన్ని చెబుతా. ఆ మధ్య హంసల దీవికి వెళ్ళా. నాకు తెలుసు అక్కడ బెస్తవారి పిల్లలు ఉంటారు. వాళ్ళకి చేపలు, సముద్రం, తప్ప వేరే లోకం తెలియదు. కార్లు, బైకులు వేసుకొచ్చి సముద్రంలో దిగి ఆటలాడుతూ, తింటూ, తాగుతూ ఉండే మనుష్యులని ఆశ్చర్యంగా, ఆశగా చూస్తూ దూరంగా ఉంటారు. నేను వారికి సర్ ప్రైజ్ ఇద్దామని "కొన్ని వేఫర్లు..కొన్ని మిల్క్ డైరీ చాకలెట్స్ తీసుకెళ్లి పిలిచా" అవి చూపిస్తూ. ముందు రామంటూ అడ్డంగా తల ఊపుతూ పారిపోయారు. తర్వాత దూరంగా నన్ను చూస్తూ నిలబడ్డారు. ఒకళ్లిద్దరు గుడిసెలో దూరి వాళ్ళమ్మకి చెప్పినట్లున్నారు. ఆవిడ తల బైటపెట్టి నన్ను చూసి ఏమనుకుందో ఏమో!! వాళ్ళకి ఏదో చెప్పింది. అప్పుడు వాళ్ళు భయం భయంగానే  నాదగ్గరకి వచ్చారు. అప్పుడు నేను చాకలెట్స్ ఇస్తూ వాళ్ళ వివరాలు కనుక్కుంటూ కబుర్లు చెప్పా. ఆ వేఫర్స్, చాకలెట్స్, వాళ్ళు ఎప్పుడూ తినలేదట! ఎవరూ ఇవ్వలేదట!! అసలు వాళ్ళని చేరదీసి ఇలా పలకరించింది లేదనే  చెప్పారు. మాటల్లో సముద్రం గురించి ఎన్ని విషయాలు చెప్పారో?? ఆశ్చర్యం వేసింది. అలలు, వారి వలలు, చేపలు, తెరచాపలూ, బోటులు, కడలి అటు పోటులూ.... ఇలా మా మధ్య స్నేహం కుదిరిన ఆ గంట అలా అలలా జారిపోయింది. నా హృదయం అల జారిన మెత్తని ఇసుకగా మారిపోయింది. కొందరు ఆ చాక్ లెట్స్ కాగితాలు దాచుకున్నారు జేబుల్లో. ఆడపిల్లలయితే నెమ్మదిగా తింటూనే ఉన్నారు.

చెలియల కట్ట దాటిన  ఆ చిన్నారుల స్వచ్ఛ దరహాస తరంగాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. పరుగున వెళ్లి వాళ్ళు దాచుకున్న గవ్వలూ, ఆల్చిప్పలు, నత్తగుల్లలు, ఇత్యాదివి పోటీపడి చూపించారు. "అచ్చంగా నన్ను తీసుకోమని" ఒకరిద్దరు కోరారు కూడా. నాకు ఏదో ఒకటి ఇవ్వాలన్న ఆ "శైశవ తపన" చూస్తే ఎంత ముచ్చటేసిందో!!

నేనిచ్చిన చిన్న కానుక్కే వాళ్ళ మొహాలు లైట్ హౌస్ లా మారి వింతకాంతి పుంజం విరబూసి జీవితం పట్ల నాకున్న దృక్కోణానికి దిశానిర్దేశం చేసాయా? అనిపించింది. చాలు, ఈ జీవితానికి, ఆ పసి మనసుల సమక్షంలో నేను చేసుకున్న "చిన్ని అనుష్ఠానం". ఇలా చేసే "అనుష్ఠానాలు" కాకుండా కొన్ని చేయకుండా ఉంటే "అనుష్ఠానాలుగా" మారేవి ఉన్నాయి. ఉదాహరణకు తన దారిన తాను పోతున్న కుక్కనో, పందినో ఊరికే కొట్టడం, నడుస్తున్న వారి మీద రోడ్డుపై నిలిచిన వాననీళ్లు పడేలా బళ్లు వేగంగా నడపడం,       అందుతున్నాయి కదా అని అనుమతి లేకుండా పక్కవారి పూలు, కాయలు కోసేయడం, ఇలాంటివి చేయకుండా ఉంటే ‘అనుష్ఠానం’ చేసినట్లే!!

ఇలా రాస్తూ పోతే ఎన్ని రకాల అనుష్ఠానాలైనా చెప్పచ్చు, చేస్తూ పోవచ్చు. తోటివారిని సంతోష పెట్టేదో, సాటివారి కన్నీరు తుడిచేదో ఏదైనా *అనుష్ఠానమే*మీరూ ఆలోచించండి, ఆరంభించండి. శరీరానికి ఎంత కాంతి, మనసుకి ఎంత శాంతి!

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Sunday, 12 February 2023

శివుని తల మీద చంద్రుడు ఎందుకు? (13-Feb-23, Enlightenment Story)

 శివుని తల మీద చంద్రుడు ఎందుకు? 

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

రమణ సమూహం

శివుని తల్చుకోగానే తల మీద చంద్రవంకతో, మెడలో ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది. ఇంతకీ ఈ పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? అంటే ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి.

దత్తాత్రేయుని సోదరుడు

చంద్రుడు, పరమపతివ్రత అనసూయాదేవి సుతుడు. దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహాశక్తిసంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సుని శాసించేవాడిగా జ్యోతిషంలో స్థానాన్ని పొందాడు. అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్తెలు. దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు, చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకీ సమానమైన ప్రేమని అందిచాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాటాడకుండా సరేనన్నాడు చంద్రుడు.

 మాట తప్పాడు

దక్షుని 27మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగవైభవంగా జరిగిపోయింది. ఒకో రోజు ఒకో భార్య వద్ద ఉండసాగాడు చంద్రడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచేకొద్దీ చంద్రునికి ఆ 27 మందిలో రోహిణి అనే భార్య మీద అధికప్రేమ కలుగసాగింది. ఆ విషయం మిగతా భార్యలలో అసూయ కలిగించేంతగా, రోహిణి పట్ల చంద్రుని వ్యామోహం పెరిగిపోయింది. కొన్నాళ్లకి ఈ వ్యవహారాన్ని తండ్రి చెవిన వేశారు మిగతా భార్యలు. విషయాన్ని విన్న దక్షుడు, చంద్రుని మందలించాడు. కానీ కొద్దికాలం గడిచాక చంద్రునిలో అదే తీరు కనిపించసాగింది. మిగతా భార్యలకంటే అతనికి రోహిణి మీదనే ఎక్కువ ప్రేమ కలగసాగింది. ఇక ఈసారి దక్షుడు ఊరుకోలేదు.

దక్షుని శాపం!

కేవలం రోహిణి మీద ఉన్న ప్రేమతో తన మిగతా కూతుళ్లను సవ్యంగా చూసుకోవడం లేదంటూ దక్షుడు, చంద్రుని మీద కోపగించుకున్నాడు. ఏ వెలుగుని చూసుకుని నువ్విలా విర్రవీగుతున్నావో, ఆ వెలుగు క్రమేపీ క్షీణించిపోతుందని శపించాడు. బ్రహ్మ కుమారుడైన దక్షుని మాటకు తిరుగేముంది! ఆయన శపించినట్లుగానే ఒకో రోజు గడిచేకొద్దీ చంద్రుడు క్షీణించిపోసాగాడు. చంద్రుడే కనుక క్షీణించిపోతే ఔషధుల పరిస్థితి ఏంకాను? మనుషుల మనస్సులు ఏం కాను? అంటూ అంతా కలవరపడిపోసాగారు దేవతలు. చంద్రుడు కూడా తనకు శాపవిమోచనం ప్రసాదించమంటూ అటూఇటూ తిరిగాడు. కానీ ఎక్కడా అతనికి ఉపశమనం లభించలేదు. చివరికి మరికాస్త వెలుగు మాత్రమే మిగిలిన సమయంలో శివుని చెంతకు చేరాడు.

నెలనెలా శాపం

చంద్రుని పరిస్థితిని గమనించిన భోళాశంకరుని మనసు కరిగిపోయింది. దక్షుని శాపం అకారణమైనది కాదు. కాబట్టి ఆ శాపం నెరవేరక తప్పదు! అదే సమయంలో అతని శాపం వల్ల ఈ లోకం అంధకారంలో ఉండటమూ మంచిది కాదు. కాబట్టి మధ్యేమార్గంగా ఒక ఉపాయాన్ని సూచించాడు పరమేశ్వరుడు. దక్షుని శాపం కారణంగా చంద్రుడు ఒక పక్షం పాటు క్షీణించక తప్పదనీ, అయితే లోకకళ్యాణార్థం మరుసటి పక్షం వెలుగుని సంతరించుకుంటాడనీ తెలియచేశాడు. పరమేశ్వరుని వద్ద ఉంటే అలా దక్షుని శాపం నుంచి కొంతైనా విమోచనం పొందే మార్గం ఉందని గ్రహించిన చంద్రుడు, అప్పటి నుంచి శివుని సిగలో ఉండిపోయాడు.

మోహం ఎంతటివారినైనా దిగజారుస్తుందనీ, తప్పు తెలుసుకొని పరమేశ్వరుని పాదాలని చేరుకున్న రోజున తిరిగి జీవితం వెలుగులమయం అవుతుందనీ.... ఈ వృత్తాంతం తెలియచేస్తోంది.

(చంద్రడు, శివుని శిరసు మీద ఉండటానికి మరో కథని కూడా చెప్పుకుంటారు. దేవగురువైన బృహస్పతి భార్య తార చంద్రుని మోహంలో పడి ఆయన వద్ద ఉండిపోయిందట. తారను చంద్రుని నుంచి తీసుకువచ్చేందుకు శివుడు చేసిన యుద్ధంలో చంద్రుడు ఓడిపోయాడనీ, ఆ సమయంలో చంద్రుని తునకను విజయచిహ్నంగా పరమేశ్వరుడు ధరించాడనీ అంటారు.)

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/FwFwgLFi0NbCvnL62WN9pj

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Saturday, 11 February 2023

దేవాలయ నియమావళి (12-Feb-23, Enlightenment Story)

దేవాలయ నియమావళి (12-Feb-23, Enlightenment Story)

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

ఆలయాలు అయిదు విధాలు

  • స్వయంవ్యక్త స్థలాలు - భగవంతుడే స్వయంగా అవతరించినవి.
  • దివ్య స్థలాలు - దేవతలచే ప్రతిష్ఠ చేయబడినవి.
  • సిద్ధ స్థలాలు - మహర్షులు, తపస్సుచేసి సిద్ధి పొందిన స్వాములు ప్రతిష్ఠించినవి.
  • పౌరాణ స్థలాలు - పురాణాలలో చెప్పబడి ప్రసిద్ధిగాంచినవి.
  • మానుష స్థలాలు - రాజుల చేత, భక్తుల చేత ప్రతిష్ఠ చేయబడినవి.

దేవాలయ నిర్మాణం

దేవాలయాలలో గాలి గోపురం, ప్రధాన ద్వారం, వైకుంఠ ద్వారం, ధ్వజ స్తంభంగర్భగుడి, ద్వారపాలకులు, వంటశాల మొదలైన వివిధ భాగాలుంటాయి.

దేవాలయ నియమావళి

హిందూ దేవాలయాలలో సాధారణంగా ఉండే భాగాలు, దేవాలయ సందర్శన సమయంలో భక్తులు పాటించే ఆచారాలు ఈ చిత్రంలో గమనించవచ్చును.

ఆగమ శాస్త్రములో దేవాలయాలలో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.

  1. ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.
  2. ఆలయమునకు ప్రదక్షిణము చేసి, పిమ్మట లోనికి ప్రవేశించాలి.
  3. ఆలయములోనికి తలపాగా ధరించిగాని, చేతితో ఆయుధము పట్టుకొనిగాని ప్రవేశించరాదు.
  4. ఆలయములోనికి ఉత్తచేతులతోగాని, తిలకం ధరించకుండా గాని, తాంబూల చర్వణం చేస్తూగాని, ఆహారాదులు తినుచూగాని ప్రవేశించరాదు.
  5. ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
  6. ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
  7. ఆలయములో ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఏ హింసనూ చేయరాదు.
  8. ఆలయములో ఎన్నడూ వివాదాలు పెట్టుకోరాదు.
  9. ఆలయములో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
  10. ఆలయములో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
  11. ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
  12. అధికార గర్వంతో అకాలంలో ఆలయం ప్రవేశించి అకాల సేవలను చేయరాదు.
  13. ఒక చేతితో ప్రణామం చేయరాదు.
  14. ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.

దేవాలయాలలో రకాలు

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/FwFwgLFi0NbCvnL62WN9pj

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Friday, 10 February 2023

ఆనందం ఎక్కడో లేదు (11-Feb-23,Enlightenment Story)

 *ఆనందం ఎక్కడో లేదు*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺

మనసులోని నిర్మ్యాల్యం తొలగించుకుంటేనే మానసిక ఆనందం అనుభవించగలం. మనం నిత్యమూ ఆనందం, సుఖ సంతోషాలు కలుగాలని కోరుకుంటాము. కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాము. మనలోనే ఉండిన వీటికోసం ఎక్కడెక్కడికో తిరుగుతున్నాము.

రోగము వలన కలిగే బాధలు ఎక్కడ నుండి వచ్చాయి, కాశీ నుండో రామేశ్వరం నుండో కాదుకదా, అవి మన నుండియే వచ్చాయి కదా!!!బాధలు మన నుండియే వచ్చినపుడు సుఖ సంతోషాలు కూడా మన నుండియే రావాలి కానీ ఎక్కడో బయట నుండి ఎలా వస్తాయి!

కాలికి ముల్లు గుచ్చుకుంటె బాధ అంటున్నాం, అదే రోడ్ మీద ఐదు వందల నోటు దొరికితే సంతోషిస్తున్నాము. అంటే సుఖ దుఃఖాలు దొరికే వస్తువు బట్టి మనలో నుండియే వస్తున్నాయి కదా! అంటే బాధలు, సంతోషాలు అన్నీ మనలోనే ఉన్నాయి!!...

మరి మనలో ఉండిన వాటికోసం బయట ఎందుకు వెతుకుతున్నాం! ఇది కేవలము భ్రమ, నిజమునకు మనలో లేనిదేది బయట లేదు!!..పాలలో అంతరముగా ఉన్న వెన్న రావాలంటే కవ్వం పెట్టి చిలకాలి. *అలానే మనస్సును భగవన్నామము అనే కవ్వం పెట్టి చిలికితే అపుడు అనందమనే వెన్న రావడం జరుగుతుంది.*

లోపల సాధన చేయనిదే బయట తిరుగుతూ అది కావాలి ఇది కావాలి అంటే ఏమీ రాదు."మనస్సుకు పరిమితమైనవాడు జీవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవాడు దేవుడు, మనోమూలంలోనికి వెళ్ళినవారి దేహమే దేవాలయమౌతుంది."

దేహమే సమస్త బ్రహ్మాండాలకు ప్రతిరూపం దీనిలోపల ఆత్మయే దైవం!!. భగవంతుడ్ని చిత్రాలలో వెతకొద్దు చిత్తములో వెతకండి అని రమణమహర్షి అంటారు. దీనిని బట్టి మనకి తెలుస్తుందేమిటంటే భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు, కానీ మనకి కానరావడం లేదు!!...

ఎందుకంటే మన మనస్సులో ఉన్న మాలిన్యాల వలన, మనలో ఉన్న దేవుడు కనబడకపోవడానికి ప్రధాన కారణాలు రెండే రెండు తలంపులు!

మొదటిది ' నేను' అనే తలంపు!!... రెండవది ' నాది' అన్న తలంపు!!...

మొదటిది అహంకారం, రెండవది మమకారం! 

ఈ రెండు మాలిన్యాలు వదిలించుకుంటేనే జీవుడు దేవుడౌతాడు. మన హృదయములో ఉన్న పరబ్రహ్మం పరమ పవిత్రుడు, ఆ పరమపవిత్రుడుని పరికించాలంటే మనమూ పవిత్రం కావాలి..

ప్రతిరోజూ పూజగదిలో పూజకు ముందు మనం మొదట చేసే పని, ప్రతిరోజు దేవాలయంలో అర్చకుడు మొదట చేసే పని ఒకటే. అది ముందురోజు నిర్మాల్యములను తీసేసి పుజాసామగ్రిని పూజగదిని శుభ్రపరిచి అన్నీ శుద్ధి చేసిన తర్వాతే పూజ ప్రారంభించడం. 

ఈ రీతిలోనే హృదయమునందున్న భగవంతుడిని అవలోకించాలంటే ముందుగా మనోమాలిన్యాలను తొలగించాలి. అజ్ఞానమును నిర్మాల్యమును తీసేయాలి. ముందురోజు శేషాలను ఎలా తొలగిస్తామో అలాగునే అంతరంగమున కర్మఫల శేషాలను తొలగించాలి, కర్తృత్వ భావనను తొలగించుకోవాలి. మనలో ఉన్న అజ్ఞాన నిర్మాల్యమును తొలగించడానికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి ఆరుఅడ్డంకులు ఉన్నాయి, వాటిని తొలగించాలి.

సత్కర్మాచరణ, సత్సంగీయుల సాంగత్యం, సర్వేశ్వరుని స్మరణ, సదవగాహన, సత్వగుణ సాధన, సేవాతత్పరత, శుద్ధాహారములతో ఈ నిర్మాల్యములను తొలగించవచ్చు. శుద్ధ ఆహారమంటే నోటితో తీసుకున్న ఆహారం మాత్రమే కాదు, పంచేంద్రియాల ద్వారా అంటే నోరు, కన్ను, ముక్కు, చెవి, చర్మముల ద్వారా గ్రహించేది కూడా ఆహారమే అవుతుంది.

మనస్సునూ, బుద్ధిని సంస్కరించుకుంటూ ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ మన ఆలోచనల్లో, మాటల్లో, చేతల్లో పవిత్రతను పెంచుకోవాలి. మన సద్గతికి, దుర్గతికి కారణం మన మనస్సే, మన మనోచాపల్యమే మన అశాంతులకు కారణం. 

మన కర్మలే మన సుఖదుఃఖాలకు కారణం. మనలో అనేక బలహీనతలుంటాయి, అలాగే లోకంలో అనేక ఆకర్షణలుంటాయి. ఇలాంటప్పుడే బుద్ధిని వినియోగించాలి. హృదయంలో భగవంతుడు ఉన్నాడని తెలిసినా దానిని గురించి ఆలోచించం. 

ఇదే మాయ!!... శారీరకంగా, మానసికంగా దేహాన్ని శుద్ధపరుచుకోవాలి. దేహధర్మం ప్రకారం కుటుంబ, సమాజ, ఋషి రుణాలు తీర్చుకుంటూ ఈ దేహం శిధిలమవ్వక ముందే హృదయమందున్న దేవుడిని పట్టుకోవాలి. 

మానవుడు ఆనందమును అనుభవించాలంటే అతనికి రెండు విషయాలు కావాలి!!...అవి ఒకటి ప్రేమ, రెండుజ్ఞానం!! ఈ రెండు ఉన్నప్పుడే ఏకత్వస్థితి వస్తుంది!!..




🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/FwFwgLFi0NbCvnL62WN9pj

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



Wednesday, 8 February 2023

భగవంతుడు చూస్తాడు (10-Feb-23,Enlightenment Story)

 *భగవంతుడు చూస్తాడు*

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺


ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓవ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. రోగి చాలా ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాడు. అక్కడి వైద్యుడు, ఆ ఆసుపత్రి యాజమాని కూడా. రోగిని చూసిన వెంటనే ఐసియులోకి తీసుకెళ్ళాడు. రెండు-మూడు గంటల ఆపరేషన్ తర్వాత, డాక్టర్ బయటకు వచ్చి, "ఈ వ్యక్తికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదా అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా చూసుకోండి", అని తన సిబ్బందికి చెప్పాడు.

ఆ వ్యక్తి నుండి చికిత్స కోసం, మందుల కోసం డబ్బు తీసుకోవద్దని కూడా వారికి సూచించాడు. ఆ రోగి దాదాపు 15 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు. అతను బాగా కోలుకుని, ఆసుపత్రి నుండి బయటకి వెళ్లాలనుకున్నప్పుడు, డాక్టర్ (ఆసుపత్రి యజమాని) అతని తుది నివేదికలను సమీక్ష కోసం తీసుకుంటూ, ఆ రోగికి సంబంధించిన సుమారు 2.5 లక్షల రూపాయల బిల్లు కూడా తీసుకున్నాడు.

డాక్టర్ తన అకౌంట్ మేనేజర్‌ ని పిలిచి, "ఈ వ్యక్తి నుండి ఒక్క పైసా కూడా తీసుకోవద్దు. ఒక పని చేయండి, ఆ పేషెంట్‌ ని నా వద్దకు పంపించండి", అన్నాడు. ఆ వ్యక్తిని వీల్ చైర్‌లో డాక్టర్ క్యాబిన్‌ కు తీసుకువచ్చారు. డాక్టర్ ఆ వ్యక్తిని చూసి ఇలా అడిగాడు, "సోదరా! మీరు నన్ను గుర్తించారా?" 

ఆ పేషెంట్ , "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది కానీ, సరిగా గుర్తు రావడం లేదు!", అన్నాడు. అప్పుడు డాక్టర్ ఇలా చెప్పసాగారు ...."మీకు గుర్తుందా, దాదాపు నాలుగు సంవత్సరాల క్రితం, ఒక సాయంత్రపు సమయంలో నగర శివార్లలో ఒక అడవిలో ఒక కారును మరమత్తు చేసారు. ఆ రోజు నేను మా కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా, కారులో నుండి అకస్మాత్తుగా పొగ రావడం మొదలై, ఉన్నట్టుండి ఆగిపోయింది. మేము కారును ఓ పక్కన ఆపి, దాన్ని మళ్లీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాం, కానీ కారు స్టార్ట్ అవలేదు, అప్పటికే కొద్దిగా చీకటి పడుతోంది, చుట్టూ అంతా నిర్జీవమైన అడవి. మా కుటుంబసభ్యుల ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆందోళన, భయం తాలూకు ఛాయలు కనపడుతూ ఉన్నాయి.

అందరం భగవంతుడిని ప్రార్థిస్తూ, సహాయం దొరుకుంతుందేమో అన్న ఆశలో ఉన్నాం. కొద్దిసేపటికే ఓ అద్భుతం జరిగింది. మీరు బైక్‌ పై రావడం చూశాం. ఆశ నిండిన కళ్లతో మిమ్మల్ని ఆపడానికి మేము చేతులు ఊపాం. మీరు బైక్ ఆపి, విషయం తెలుసుకున్న తర్వాత కారు బానెట్‌ తెరిచి, పరిశీలించి మరమత్తు చేసిన కొద్ది క్షణాల్లోనే కారు స్టార్ట్ అయ్యింది.

మేమంతా చాలా సంతోషించి, చాలా తేలిక పడ్డాం! మిమ్మల్ని ఆ భగవంతుడే పంపినట్లు మాకు అనిపించింది ఎందుకంటే, ఆ నిర్జీవమైన అడవిలో రాత్రంతా గడపాలన్న ఆలోచనకే మా ఒళ్ళు జలదరించింది. 

మీరు ఒక గ్యారేజీని నడుపుతారని ఆ రోజు నాకు చెప్పారు. నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎంత డబ్బు ఉన్నా కూడా అలాంటి కష్ట సమయాల్లో ఎలాంటి సహాయం చేయదని చెప్పాను. అటువంటి క్లిష్ట పరిస్థితిలో మీరు చేసిన సహాయానికి విలువ కట్టలేను, అది అమూల్యమైనది. అయినా కూడా ఎంత ఇవ్వాలి అని నేను మిమ్మల్ని అడిగాను.

ఆ క్షణంలో ముకుళిత హస్తాలతో మీరు చెప్పిన మాటలు నా జీవితానికి స్ఫూర్తిగా నిలిచాయి. "నా నియమం, నా సూత్రం ఏమిటంటే, కష్టంలో ఉన్న వ్యక్తికి చేసే సహాయానికి ప్రతిఫలంగా నేను ఏమీ తీసుకోను. నాభగవంతుడే నేను చేసిన పనికి సంబంధించిన లెక్కను చూస్తాడు”*, అని మీరు అన్నారు.

నామమాత్రపు ఆదాయం ఉన్న వ్యక్తి ఇంత ఉన్నతమైన ఆలోచనలు, విలువలు కలిగి ఉండి, ఎంతో దృఢ సంకల్పంతో వాటిని అనుసరించ గలిగినప్పుడు, నేను ఎందుకు చేయలేను అని ఆ రోజు అనుకున్నాను. అప్పటి నుండి, నా జీవితంలో కూడా అలాగే ఉండాలని సంకల్పించుకున్నాను. నాలుగు సంవత్సరాలు గడిచాయి, నాకు ఎప్పుడూ దేనికి కొరత లేదు. నిజానికి, నేను గతంలో కంటే చాలా ఎక్కువ పొందుతున్నాను. ఈ ఆసుపత్రి నాది. మీరు ఇక్కడ నా అతిథి, మీ స్వంత నియమం, మీ సూత్రం ప్రకారంగా కూడా నేను మీ నుండి డబ్బు తీసుకోలేను.”

“ఆభగవంతుడి దయ వల్ల మీలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తికి సేవ చేసే అవకాశం నాకు కలిగింది. ఆ సర్వశక్తిమంతుడు మీ మంచి పనుల జాబితా లెక్కను ఉంచుకున్నాడు, ఈ రోజు మీ భగవంతుడు ఆ లెక్కను చెల్లించాడు. నేను చేసిన పనుల ఖాతా కూడా ఆయన వద్ద ఉంచుకుంటాడు, నాకు అవసరమైనప్పుడు, దాని నుండి ఖచ్చితంగా ఆయనే సరిచేస్తారు.

మీరు హాయిగా ఇంటికి వెళ్ళండి , ఏ సమస్య వచ్చినా మీరు సంకోచం లేకుండా నా దగ్గరకు రావచ్చు", అని డాక్టర్ ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ వ్యక్తి క్యాబిన్ నుండి బయటికి వెళుతూండగా, గదిలో ఉంచిన భగవంతుని బొమ్మను చూడగానే, చేతులు వాటంతటవే పైకి లేచి నమస్కరించగా, అతని కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అతని హృదయం అపారమైన ప్రేమతో నిండిపోయింది !!

మనం చేసిన పనులు వడ్డీతో సహా తిరిగి మన వద్దకే వస్తాయి. ఇది ఈ విశ్వం యొక్క నియమం! ఈ ప్రపంచపు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయడమే ఉత్తమమైన త్యాగం, అదే ఉత్తమ ఆరాధన. ఇలా ప్రవర్తించేవాడు కర్మ బంధనం నుండి విముక్తి పొందుతాడు.

            సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/FwFwgLFi0NbCvnL62WN9pj

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Sunday, 5 February 2023

భువి నుండి దివికి - వాణి జయరామ్ గారు (06-Feb-23,Enlightenment Story)

*అనంతాన కలసి పోయింది - వాణి జయరామ్ గారు*

*బాలు గారు పిల్చారో, !!!!  సిరివెన్నెల గారు రమ్మన్నారో, !!!! కళాతపస్వీ కాశీనాధుని విశ్వనాధ్ గారు సినిమా డైరెక్షన్ ప్లాన్ చేసారో,!!!  వాణి జయరామ్ గారు కాశీనాధుని విశ్వనాధ్ గారి తర్వాత బయలు దేరారు భువి నుండి దివికి*

మరో స్వర రాగ గంగా ప్రవాహం.....అనంతాన కలసి పోయింది. దేహానికే గాని...ఆ సుస్వరధుని కి కాదు మరణం. అది అజరామరం.కళ కోసమే జీవితాన్ని అంకితం చేసినవారు ధన్యులు. భువిని వారి కీర్తి సుస్థిరం. స్వరములు ఏడైనా రాగాలెన్నో...రాగాలెన్నున్నా...రాగం నిలిపే కోయిలలు...బహు కొన్ని మాత్రమే.

పై స్థాయి లో సైతం....పతాక స్థాయిలో స్థిరంగా నిలిచి పాడగలిగే గాయనీ గాయకులలో...వాణీ జయరాం గారు ప్రప్రథములు. వారి స్వరాన....ఓ వింత సోయగం ఉంది. గమకాలు గమ్మత్తులు చేస్తాయి. కర్ణాటక మరియు  హిందుస్థానీ లలో ప్రావీణ్యం....ఆ సుస్వరానికి మరింత వన్నె తెచ్చింది. క్లాసికల్ మొదలు....క్లబ్ డాన్స్ వరకు.....ఝమ్మనిపించే అద్భుత స్వరం.

19 భాషలలో...వెయ్యికి పైగా మూవీస్ లో 10 వేల దాకా పాటలు...వేలకొలదిభజనలు..గజళ్ళు..కీర్తనలు...కృతులు...లెక్కకు అందని దేశ- విదేశీ కచేరీలు.దాదాపు 5 దశాబ్ధాల సంగీత ప్రస్థానం...

వెరసి...

3 సార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయని...3 ఫిల్మ్ ఫేర్ అవార్డులు...4 స్టేట్ అవార్డులు...

ఇతరత్రా అవార్డులెన్నో కాక...ఈ ఏడాదే అనౌన్స్ చేసినపద్మభూషణ్....అందుకోకనే...హఠాన్మరణం పొందిన ఉత్రమశ్రేణి గాయనీమణి....శ్రీమతి. వాణీ జయరాం గారి జన్మ ధన్యం.

నీ పదములొత్తిన పదము, ఈ పథము, నిత్య కైవల్య పథము. నీ కొలువుకోరిన తనువు, ఈ తనువు, నిగమార్ధ నిధులున్న నెలవు. కోరిన మిగిలిన కోరికేమి, నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్ప...చేరినా ఇక చేరువున్నదేమి, నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప.

(వాస్తవం ఇంకా తేలలేదు. కానీ ఇది యాక్సిడెంటల్ డెత్!)

(బాత్ రూం లో కాలు జారి పడి...తల కు దెబ్బ తగిలి స్పృహ కోల్పోయినందు వలన....అదీ ఒంటరిగా ఉంటున్నందువలన....

సమయానికి ఎమర్జెన్సీ కేర్ లేకుండా పోయింది. డోర్ బలవంతాన తెరచేసరికే....ప్రాణం విడిచేశారట.శ్రధ్ధాంజలి.🌹🙏

కొన్ని సుమధురాలు.

**********************************************************************

  • మేఘమే...మేఘమే.....   https://youtu.be/nF3Ihy3XEwU
  • ఎప్పటి వలె కాదురా నా స్వామి..... https://youtu.be/6AJY3pN07rc
  • ఏజు స్వరంగలుక్కుల్ ఎత్తనై పాడల్.....(మొదటి జాతీయ అవార్డ్)  https://youtu.be/2xVFBKSxMP0
  • నీలి మేఘమా జాలి చూపుమా.....https://youtu.be/fm7Sj8ua7qw
  • ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది....https://youtu.be/wEqTVp3JB0E
  • నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా....https://youtu.be/Ik-1fg4gXbk
  • పూజలు చేయ పూలు తెచ్చాను...https://youtu.be/7TF3BvD31cg
  • నింగి నేల ఒకటాయెలే.....https://youtu.be/UEst7NVNZr8
  • విధి చేయు వింతలన్ని....https://youtu.be/IN5ZaWVd04E
  • కలిసిన హృదయాలలోన.....https://youtu.be/_imcRTDI7pc
  • దొరకునా ఇటువంటి సేవ....(2వ జాతీయ అవార్డ్)https://youtu.be/94s_-MSZZGM
  • నువ్వు వస్తావని బృందావని.....https://youtu.be/w2XGhjiJGHw
  • ఒక బృందావనం...సోయగం....https://youtu.be/CpYOa-7jT9A
  • కురిసేను విరిజల్లులే.. https://youtu.be/ONC-qobgdEU
  • రోజాలో లేతవన్నెలే.....https://youtu.be/9w-SWYJjZrM
  • అందెల రవమిది పదములదా....https://youtu.be/dDtvU51WXGQ
  • తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ.....https://youtu.be/7nxa5q1_9kw
  • సాగర సంగమమే ప్రణవ.....https://youtu.be/20RBrYyGEuU
  • అలలు కలలు ఎగసి ఎగసి అలసు సొలసి పోయె...https://youtu.be/UQ0nn5K5qO8
  • మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ....https://youtu.be/tMiTWv2tkmo
  • ఆనతినీయరా హరా....(3వ జాతీయ అవార్డ్) ... https://youtu.be/m3G5iD-NZhU
  • శృతి నీవు గతి నీవు...https://youtu.be/dshv5EvUxpY
  • శివాని...భవాని...శర్వాణి...https://youtu.be/aspxz0PkmWM
  • వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే....https://youtu.be/wUzKBdlwb3A
  • నేనా పాడనా పాట....మీరా అన్నది మాట....లైవ్ పర్ఫార్మెన్స్...https://youtu.be/7yTML5t2FT8
  • ప్రణతి ప్రణతి ప్రణతి ప్రణవనాద జగతికి....లైవ్ పర్ఫార్మెన్స్..... https://youtu.be/vi9-OvYTFMk

🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

Friday, 3 February 2023

శివైఖ్యం - కళాతపస్వీ కాశీనాధుని విశ్వనాధ్ (04-Feb-23,Enlightenment Story)


*శివైఖ్యం - కళాతపస్వీ కాశీనాధుని విశ్వనాధ్* 

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

భీష్మాచార్యులు ఇచ్ఛామరణం పొందాడంటారు...ఇవాళ కాశీనాథుని విశ్వనాథుడూ అంతే... తాను చేయాలనుకున్న పనులన్నీ చేసి దివి పథాన మేఘాల పల్లకిలో గర్వంగా ఊరేగుతూ పోయాడు...

భీష్ముడు విష్ణు దివ్య సహస్రనామామృతాన్ని, అర్జునుడికే కాదు - నిఖిల జగతికీ రుచిచూపి ఆచార్యుడయ్యాడు... 

విశ్వనాథుడు ఓంకారనాద అనుసంధానమైన శంకరాభరణ గానాన్ని వినిపించి, పాశ్చాత్య మెదళ్ల బూజుదులిపి, మన సంస్కృతి నాడుల్ని తట్టి లేపాడు... విష్ణు సహస్ర నామాల అమృతం మనకు అందింది మాఘ శుద్ధ ఏకాదశి పర్వదినాన...!

శంకరాభరణం ఓ గొప్ప వరంగా మనకు అందిన రోజే కాక - దాన్ని మనకు అందించి కళాతపస్వి విశ్వనాథుడు దివికేగిన రోజుకూడా భీష్మ ఏకాదశి - ద్వాదశి సంధి ఘడియల్లోనే...!! ఎంత యాదృచ్ఛికం...

"ఓం నమశ్శివాయ..ఓం నమశ్శివాయ.. చంద్రకళాధర సహృదయా..చంద్రకళాధర సహృదయా.. సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా!! ఓం నమశ్శివాయ..ఓం నమశ్శివాయ.. పంచభూతములు ముఖ పంచకమై..ఆరు ఋతువులు ఆహార్యములై.. పంచభూతములు ముఖ పంచకమై..ఆరు ఋతువులు ఆహార్యములై.. ప్రకృతి,పార్వతి నీతో నడచిన ఏడు అడుగులే స్వర సప్తకమై"

ఫక్తు వ్యాపార మాధ్యమమైన సినిమాను ఓ కళగా ఆరాధించాడు... సినిమానే ఉపాసించాడు... తపస్సులా చేశాడు ఆ పనిని... అలా ఆ నిరంతర కళాతపస్సులో ఆయనకు సాక్షాత్కరించిన ఓ అజరామరమైన దృశ్య రూపమే శంకరాభరణం...!!! 

అలా ఆ విశ్వనాథుని నిరంతర తపస్సులో ఆయన పొందుతూ వచ్చిన దివ్యానుభూతులెన్నో ఓ శుభలేఖగా, ఓ స్వాతిముత్యంగా, ఓ సాగరసంగమంగా, ఓ స్వర్ణకమలంగా, ఓ స్వాతికిరణంగా, ఓ స్వయంకృషిగా ఇలా ఎన్నెన్ని శాశ్వత దృశ్యరూపాలై మనకూ, మన పిల్లల తరాలకూ అదృష్టంగా దక్కాయని..!!! 

92 ఏళ్ల వయసులో కూడా సినీకళ గురించే పలవరిస్తూ వెళ్లిపోయాడంటే ఆయనది ఎట్లాంటి కళారాధనో అర్థంమౌతుంది.... 

అందుకే ఆయన కళాతపస్వి విశ్వనాథుడయ్యాడు

ఇవాళ PAN INDIA అని తెగ చెప్పుకుంటున్నాం కాని - విశ్వనాథ్ ఇవాల్టికి 43 ఏళ్ల క్రిందటే Pan india నే కాదు Pan World స్థాయిలో గర్వంగా నిలబెట్టాడు శంకరాభరణం తో తెలుగు సినిమాని..!

స్థాయిల గురించిన ఆలోచనే లేదాయనకు... సినిమానే శ్వాసిస్తూ, అదే జీవితంగా తపిస్తూ, జ్వలిస్తూ, ఆరాధిస్తూ ఆలోచనల్ని అందమైన ఫ్రేముల్లో బంధిస్తూ పోవడమే తప్ప ఆయన ఏ అవార్డుల్నీ, రివార్డుల్నీ మనసులో పెట్టుకొని తీయలేదు... ప్రపంచమే ఆయన్ని గుర్తించి, ఆయన దగ్గరికే నడుకుంటూ వచ్చింది... 

విశ్వనాథుని గురించి రాయడమంటే గంగవెల్లువను కమండలంలో ఇమడ్చడమే... వేనవేల అక్షరాలు ఆయన గరిమను ఇముడ్చుకోవడానికి వెల్లువలా ముంచెత్తుతాయి... 

 విశ్వనాథ్ గారు మన  భక్తబంధుకోటికి కూడా ఆత్మీయులే అని భావిస్తూ, దివిలో కచ్చితంగా ఆయన శంకరుని గళసీమలో ఆభరణంగా అలంకృతుడయ్యే వుంటారని, అలా వుండాలని వారికి ఘనంగా నివాళి అర్పిస్తున్నాం...🙏

విశ్వనాథ్ సినిమాల ప్రత్యేకత విశ్వనాథ్ సినిమాలలో సంగీతానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తన సినిమాలకు ఎక్కువగా కె.వి.మహదేవన్ నుగానీ, ఇళయరాజాను గానీ సంగీత దర్శకులుగా ఎంచుకునేవాడు. కొన్ని సినిమాలలో పండిత హరిప్రసాద్ చౌరాసియా, కేలూచరణ్ మహాపాత్ర, షరోన్ లోవెన్ వంటి ప్రముఖ కళాకారులతో కలిసి పనిచేసాడు. కెరీర్ చివర్లో దర్శకత్వ బాధ్యతలను తగ్గించుకుని నటుడిగా ప్రేక్షకులను అలరించాడు. జాతీయ చలనచిత్ర పురస్కారాలు 1980-జాతీయ ఉత్తమ కుటుంబకథా చిత్రం-శంకరాభరణం 1982-నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా ఉత్తమచిత్రం - సప్తపది 1984- జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు సాగరసంగమం 1986 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు - స్వాతిముత్యం 1988 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు శృతిలయలు 2004 - జాతీయ ఉత్తమ చలనచిత్రం - తెలుగు స్వరాభిషేకం 1992 - రఘుపతి వెంకయ్య పురస్కారం 1992 - పద్మశ్రీ పురస్కారం 2016 : దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం. కె. విశ్వనాథ్‌ వృధ్యాప సమస్యలతో బాధపడుతూ అపోలో ఆస్పత్రితో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి 2023 ఫిబ్రవరి 2న శివైక్యం చెందినారు

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను

https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe

🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...