Wednesday, 19 April 2023

స్వామివారి హామీ (22-Apr-23, Enlightenment Story)

 *స్వామివారి హామీ*  

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

22-Apr-23, Saturday - దయచేసి శ్రీవారు వీడియో చూడండి 

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️

*స్వామికి బియ్యం తెచ్చాను..రేప్పొద్దున పొంగలి పెట్టుకొని నేనూ మా కుటుంబం అంతా స్వామిని దర్శించుకుంటాము..రాత్రికి ఇక్కడే ఉంటాము..రేపు మా మనవడికి ఇక్కడ పేరు పెట్టించాలి.." అన్నాడు ఆ పెద్దమనిషి..దగ్గర దగ్గర అరవై ఏళ్ల వయసుంటుంది..ఆయన పేరు దేవరకొండ వెంకటేశ్వర్లు..ఉప్పుగుండూరు గ్రామం..రశీదు రాసిచ్చాను..తీసుకొని వెళ్ళిపోయాడు.*

ఆరోజు శనివారం..సాయంత్రం పల్లకీసేవ హడావిడిలో మేమున్నాము..బియ్యం తెచ్చి ఇచ్చిన వెంకటేశ్వర్లు కూడా తన భార్యా బిడ్డలతో కలిసి పల్లకీసేవ లో పాల్గొనడానికి మంటపం లో కూర్చుని వున్నాడు..శ్రీ స్వామివారి పల్లకీ ప్రదక్షిణాలకు బైలుదేరేముందు తన కుమారుడికి చెప్పి, అతని చేత పల్లకీ మోయించాడు..ఆ కుమారుడు కూడా అత్యంత భక్తిగా పల్లకీ మోసాడు..

ఆ కార్యక్రమం పూర్తీ కాగానే..వెంకటేశ్వర్లు మళ్లీ నా దగ్గరకు వచ్చి.."రేపుదయం మా మనవడికి పేరు పెట్టాలి అని చెప్పాను కదా..ఎన్ని గంటలకు మమ్మల్ని రమ్మంటావు..?" అని అడిగాడు..ఉదయం పది గంటలకు రమ్మన్నాను..సరే అని వెళ్ళిపోయాడు..ప్రక్కరోజు ఆదివారం నాటి  ప్రభాతసేవ కార్యక్రమం పూర్తి కాగానే..దర్శనానికి వచ్చే భక్తుల తాకిడి మాకు ఎక్కువగా ఉంటుంది..ఆ హడావుడిలో వెంకటేశ్వర్లు విషయమే నాకు గుర్తు రాలేదు..

అర్చక స్వాములకు ఒక నామకరణ కార్యక్రమం ఉన్నదీ అని చెప్పడం మర్చిపోయాను..ఈలోపల ఇద్దరు ముగ్గురు భక్తులు శ్రీ స్వామివారి విగ్రహానికి అభిషేకం చేయించుకోవాలని పూజా సామాగ్రి తీసుకొని లోపలికి వచ్చేసారు..అర్చక స్వాములు అభిషేకాలు చేయడం కొద్దిగా ఆలస్యం అవుతుందనీ..పది గంటలకు అభిషేకం చేస్తామని వాళ్లకు నచ్చచెప్పి..ఒక ప్రక్కన కూర్చోబెట్టారు..సరిగ్గా అప్పుడు నాకు గుర్తుకొచ్చింది..

వెంకటేశ్వర్లు కు కూడా పది గంటలకే నామకరణం చేస్తామని చెప్పాను కదా..అభిషేకము , నామకరణం రెండూ ఒకేసారి జరుపలేము కదా..అని..పూజారి ని పిలిచి విషయం చెప్పాను..పూజారి గారు ఒక్కక్షణం ఆలోచించి.."ముందు అభిషేకాలు పూర్తి చేస్తాను..వెంకటేశ్వర్లు కు నచ్చచెప్పి నామకరణం ఆ తరువాత చేస్తాను..వెంకటేశ్వర్లు వాళ్ళు కూర్చొని వుంటారు లేండి..మీరేమీ కంగారు పడకండి.." అన్నారు..

తొమ్మిదిన్నరకే వెంకటేశ్వర్లు తన కుటుంబం తో సహా లోపలికి వచ్చాడు..అతనిని దగ్గరకు పిలిచి.."అభిషేకాలు ఉన్నాయి..అవి పూర్తి కాగానే మీ మనుమడికి నామకరణం చేయిస్తాను..కొద్దిగా ఆలస్యం అవుతుంది.." అన్నాను.."అయ్యా నా కుమారుడి నామకరణం ఇక్కడే చేసాను..నా మనుమడికి నామకరణం ఇక్కడే అనుకున్నాను..నా విషయంలో స్వామివారు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయరు..అంతా అనుకున్న సమయానికే పూర్తి అవుతుంది.." అన్నాడు.."అంత నమ్మకంగా చెపుతున్నావే..ఏమిటి కారణం..? " అన్నాను..

"నా చిన్నతనం లో నేనూ మా నాయనా మాలకొండ వచ్చాము..అప్పుడు స్వామివారు  అమ్మవారి మఠం లో వున్నారు..మా నాయన తో ఉన్న నన్ను చూసి, "వీడు నీ కుమారుడా..అని అడిగారు..అవునన్నాడు మా నాయన..వీడికి అన్నీ సక్రమంగా జరుగుతాయిలే..నువ్వు వీడివల్ల ఇబ్బంది పడవు.." అన్నారు..అదిగో ఆనాటి నుంచి..నాకు ఏ కష్టమూ రాలేదు..నేను కూడా ఈ స్వామినే నమ్ముకున్నాను..నా పెళ్లి ఇక్కడే జరిగింది..నా కుమారుడి నామకరణం ఇక్కడే చేసాను..వాడి పెళ్ళీ ఇక్కడే జరిపించాను..ఇప్పుడు మనుమడి కోసం వచ్చాను..ఆలస్యం అని నువ్వు చెపుతున్నావు..స్వామి ఏ ఏర్పాటు చేస్తాడో..చూద్దాం.." అన్నాడు.

వెంకటేశ్వర్లు ఆ మాట ముగించే లోపలే..మా అర్చక స్వామి నా వద్దకు వచ్చి.."ఎవరిదో నామకరణం వుందన్నారుగా..వాళ్ళను పిలవండి..ఆ కార్యక్రమం పూర్తి చేస్తాను.." అన్నారు..నేను ఆశ్చర్యంగా చూసాను.."అభిషేకాలు ఉన్నాయని అనుకున్నాము కదా..మరి వాళ్ళ సంగతి..? " అన్నాను..

"ఏమో సార్..ఇప్పటిదాకా అభిషేకం ఎప్పుడు? అని అడిగారు..తీరా నేను వాళ్ళను రమ్మని పిలిచే సరికి.."ఇప్పుడు అభిషేకం వద్దు..మా వాళ్ళు బైటకు వెళ్లారు..తరువాత చేయించుకుంటాము"..అన్నారు..ఈలోపల ఈ నామకరణం చేద్దామని అనుకున్నాను.." అన్నారు..

"వీడికి అన్నీ సక్రమంగా జరుగుతాయిలే.." అని స్వామివారు వెంకటేశ్వర్లు విషయంలో స్వయంగా చెప్పిన ఆనాటి మాట..మా కళ్ళముందే ఋజువు అయింది..

వెంకటేశ్వర్లు కు సాక్షాత్తూ స్వామివారే హామీ ఇచ్చి వున్నారు మరి!!

🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. దయచేసి నా యూట్యూబ్ ఛానెల్‌లో ఆధ్యాత్మిక, యోగా మరియు ప్రకృతి సంబంధిత వీడియోలను చూడండి.*  దయచేసి దిగువ లింక్‌ని క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UC2xiQi_bbC86VTPXIIwHFYg
 *మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

No comments:

Post a Comment

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...