Saturday, 1 April 2023

పారిజాత వృక్షం సముద్రగర్భం (08-Apr-23, Enlightenment Story)

🥀* క్రిందపడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా.*🥀
🌸❄️🌸❄️🌸❄️❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️🌸
పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.
పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. అయితే, దేవేంద్రుడి శాపం కారణంగా ఈ పూలు రాత్రివేళలో మాత్రమే వికసిస్తాయి. ఉదయానికి రాలిపోయి చెట్టు కింద తెల్లని తివాచీ పరచినట్లుగా పడతాయి. కిందపడ్డ పూలనే జాగ్రత్తగా ఏరి, దేవుడి సేవలో వినియోగిస్తారు. దేవతా పుష్పాలు కావడంతో కిందపడినా వీటికి ఏ దోషమూ ఉండదు. అలాగే, చాలా ఎత్తు ఎదిగే పొన్న చెట్టు (దేవ వల్లభం) కూడా దేవతా వృక్షమే. ‘ఓం చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచాయై నమః’ అని లలితాదేవిని ఆరాధిస్తారు. పొడుగాటి కాడలతో చాలా ఎత్తులో వికసించే పున్నాగలను రాల్చకూడదు. కార్తికం మొదలు మాఘ మాసం వరకు విరివిగా పూసే ఈ పూలు రాలిన ప్రదేశాన్ని కూడా పవిత్రమైనదిగా భావిస్తారు. కిందరాలినా వీటికి ఏ దోషం ఉండదు కాబట్టి దేవుడికి నిస్సంకోచంగా సమర్పించవచ్చు.
సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు. ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు కనుక ఈ పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడి అనుగ్రహం తప్పకుండ కలుగుతుందని భావిస్తారు.

*పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్రగర్భం నుంచి ఉద్భవించింది*
అనంతరం ఈ వృక్షాన్ని విష్ణుదేవుడు స్వర్గానికి తీసుకువెళ్లగా తర్వాత ఈ యుగంలో సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు భూలోకానికి తీసుకువచ్చాడు. ఇలా భూలోకంలో ఉన్న ఈ పారిజాత వృక్షానికి పూసిన పుష్పాలు చెట్టుమీద కోయకుండా కిందికి రాలిన పుష్పాలను మాత్రమే ఏరుకొని స్వామికి సమర్పించాలని చెబుతారు. అలా కింద పడిన పుష్పాలతో స్వామికి ఎందుకు పూజ చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియక పోవచ్చు కేవలం పారిజాత పుష్పాలు మాత్రమే చెట్టు నుండి కోయకుండా ఎందుకు రాలిన పుష్పాలని ఏరుకొని పూజ చేయాలి అనే విషయానికి వస్తే. 
సాధారణంగా ప్రతి వృక్షం భూమినుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది. ఇలా స్వర్గం నుంచి భూలోకంలోకి రావడం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెబుతారు. అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవుపేడతో అలికి నేల పై రాలిన పుష్పాలు ఏరుకొని భగవంతుడికి సమర్పించాలి. ఇక పారిజాత వృక్షం ఏ ఇంటి ఆవరణంలో అయితే ఉంటుందో ఆ ఇంటిలో సిరిసంపదలకు కొదవుండదని చెప్పవచ్చు.
పారిజాతం గింజలను ఎండబెట్టి వాటిని పొడి చేసి వాటిని నీటితో కలిపి తలమాడుకు పెట్టుకుంటే పొక్కులు తగ్గుతాయి. ఈ పారిజాత చుర్ణాన్ని కొబ్బరినూనెలో కలుపుకొని పెట్టుకుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
పారిజాతం ఆకులను మెత్తగా నూరి వాటిని ఆముదం నూనెలో కలిపి, సన్నని సెగపై వేడి చేసి వాతపు నొప్పులు ఉన్న ప్రాంతంలో పెట్టుకుంటే నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. దీని ఆకుల రసాన్ని నాలుగు చుక్కలను చెవిలో పోసుకుంటే చెవిపోటు తగ్గతుంది. 20 పారిజాతం ఆకులను మెత్తగారుబ్బి రసాన్ని తీసి సన్నని సెగపై సగం అయ్యే వరకు వేడి చేయాలి. గోరు వెచ్చగా ఉండగానే దానిలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే.. సయాటికా నొప్పి తగ్గిపోతుంది.

గజ్జి, తామర సమస్య ఉన్నవారు పారిజాతం గింజలను కుండపెంకుల్లో మాడ్చి.. మసిగా చేసి ఈ చూర్ణంలో కర్పూరం కలిపి ఆ లేపనాన్ని పూస్తే మంచి ఫలితం ఉంటుంది. చాలా మంది ఈ చెట్లను దేవాలయాల్లోనే పెట్టాలి అంటారు. ఆ సందేహం లేదు. ఇది మన ఇళ్ల దగ్గర పెట్టుకుంటే వాస్తు దోషాలు పోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ చెట్టు కింద పేడతో అలికి పెట్టాలి. దానిపై పడిన పూలను దేవుడికి ఉపయోగించాలి. ఇది ఎవరూ ఇచ్చినా తీసుకోకూడదు. ఇచ్చినవారికి మాత్రమే పుణ్యం చెందుతుంది. పారిజాతం ఉన్న ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అంటారు. పారిజాత పుష్పం వాసనతో మనకు ఆరోగ్యం. వీటి ఆకుల్లో ఉండే ఫ్లావనాయిడ్స్‌ మోకాల్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు మొలలు కూడా తగ్గిపోతాయి. నిఫా వైరస్‌కు కూడా పారిజాతం ఆకులు ఉపయోగపడతాయని పరిశోధకులు చెబుతున్నారు.
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸
*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸❄️❄️

1 comment:

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...