*పరిశీలాత్మక శక్తి *
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️
బ్రహ్మానందం నెమ్మదిగా ఇంటర్వ్యూ జరుగుతున్న రూమ్ డోర్ ని తట్టాడు. కొద్దిగా డోర్ తెరిచి "మే ఐ కమిన్ సార్?" అన్నాడు. ఇంటర్వ్యూ బోర్డులో కూర్చున్న వారిలో ఒకరు. "ఎస్! కమిన్!" అన్నాడు. లోపలికి అడుగు పెట్టిన బ్రహ్మానందం వారితో ఏదో చెప్పబోయాడు.
"ఫస్ట్ యూ సిట్!" అన్నారు వాళ్ళు.ఇక గత్యంతరం లేక కూర్చున్నాడు బ్రహ్మానందం. బోర్డ్ సభ్యుల్లో ఒకరు "ఈ గది గురించి నీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు గంభీరంగా.
"చక్కని ఫర్నీషింగ్ తో చాలా బాగుంది సార్! మంచి అందమైన కార్పెట్, కిటికీలకు అత్యంత సుందరమైన కర్టెన్స్, బోర్డ్, ప్రొజెక్టర్, వైట్ స్క్రీన్ చాలా గొప్పగా, కళాత్మకంగా ఉంది సార్!"
"ఓహ్! నైస్ అబ్సర్వేషన్! కానీ పేపర్ ముక్కలు ఉండ చుట్టి ఓ పక్కన పడి ఉన్నాయి. అది గమనించలేదా? ఇంత అందమైన రూమ్ కి దిష్టి చుక్కలా లేదా?"
"సార్! నేను రూమ్ లోకి అడుగుపెట్టినప్పుడే అది చూశాను. కానీ నేను ఆ విషయం చెబితే, ఆ ఉండలు పడేసిన వ్యక్తి ఫీల్ అవుతాడు కదా! అందుకే చెప్పలేదు. అది పడేసిన వ్యక్తి ఎడమ వైపు నుంచి రెండవ స్థానంలో కూర్చున్నాడు. అతని వద్ద ఉన్న ప్యాడ్ పైన పేపర్స్ చించినట్టు కనిపిస్తోంది. పక్కన మరో రెండు ఉండలు పడి ఉన్నాయి"
"గుడ్! నీలో మంచి పరిశీలాత్మక శక్తి ఉంది. బయట ఉన్న స్వీపర్ ను ఓ సారి పిలిచి, క్లీన్ చేయమని చెప్పగలవా?"ఎస్ సార్!అమె పేరుచెప్పండి!" బోర్డ్ మెంబర్స్ ఎవరూ మాట్లాడలేదు. "ఓకే సార్! మీకెవ్వరికీ ఆమె పేరు ఏంటో తెలియదనుకుంటా! ఎనీవే! నేను కనుక్కుని, పిలుస్తాను!"
అని రూమ్ బయటకు వెళ్ళాడు. అక్కడ ఉన్న హెల్పర్ బాయ్ ని అడిగి, పేరు తెలుసుకుని, ఆమెను పిలిచి రూమ్ క్లీన్ చేయమనిచెప్పాడు. ఆమె వచ్చి, క్లీన్ చేసి, వెళ్ళింది.
మళ్ళీ ఇంటర్వ్యూ మొదలుపెట్టారు.
"నువ్వు చాలా మంచి పని చేసావు. గుడ్! ఏ పని చేసేవారిని అయినా నువ్వు గౌరవిస్తావన్నమాట! ఈ ప్రశ్నకు జవాబు చెప్పు! ఇక్కడ ఉన్న మాలో ఎవరు ఏ కంపెనీ బాస్ నో చెప్పగలవా?"
"ఎస్ సార్! మీలో ఆ ఇద్దరూ జస్ట్ వాచింగ్. చూస్తూ కూర్చున్నారు అంతే! వారిలో ఒకరు ఫైనాన్స్ పర్సన్ అంటే శాలరీ బేరసారాలు చేసే వ్యక్తి. ఇక రెండో ఆయన హెచ్ ఆర్ అతను. ఆ చివర కూర్చున్న వ్యక్తి కేవలం ఓ చిన్న నవ్వు నవ్వడం, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అతనే అసలైన బాస్! మధ్యలో కూర్చున్న వ్యక్తి మీ అందరితో తెగ మాట్లాడుతూ వున్నట్టు ప్రవర్తిస్తున్నాడు. అతనే బాస్ అని నేను కన్ఫ్యూజ్ అవ్వాలనేమో!" అని వివరించాడు బ్రహ్మానందం.
వెంటనే సంతోషంగా చప్పట్లు చరిచి "అద్భుతంగా వివరించావు. మేము నీవంటి క్యాండిడేట్ కోసమే చూస్తున్నాము. యూ ఆర్ సెలెక్టెడ్! బయట వెయిట్ చేసి, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో!"
"ఇంకా ప్రశ్నలు అడగరా సార్? సర్దార్ పటేల్ స్టాట్యూ హైట్ ఎంత? రాష్ట్రపతి అవ్వకమునుపు ఆమె ఎక్కడ ఎమ్మెల్యే గా చేసింది? మొదలైన ప్రశ్నలు అడగరా?"
"ఇంకా ప్రశ్నలు అడిగే అవసరం లేదు. నీ పేరు ఒక్కటి కన్ఫర్మ్ చేసుకోవాలి. యూ ఆర్ మిస్టర్ గిరిధర్ ఫ్రమ్ హైదరాబాద్. కరెక్టే కదా!"
"సారీ సార్! అతను బయట వెయిట్ చేస్తున్నాడు"
"అయితే నువ్వు ఎవరు?"
"సార్! నేను మీ కంపెనీ పక్కన క్యాంటీన్ లో మేనేజర్ గా చేస్తున్నాను. ఇవ్వాళ ఇంటర్వ్యూలు ఉన్నాయని, టీ, కాఫీలు చెప్పారు. అవి ఎన్ని కావాలి? ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా కావాలేమో కనుక్కుని రమ్మని నన్ను పంపించారు. నేను అదే చెప్పబోతుంటే విన్పించు కోకుండా కూర్చోమని, ఇంటర్వ్యూ చేశారు.
ఈ ఇంటర్వ్యూ చాలా బావుంది సార్! చాలాఎంజాయ్ చేశాను. ఇప్పుడు చెప్పండి! ఎన్ని కాఫీలు, టీలు కావాలి? ఎన్ని తీసుకురమ్మంటారు?" అని అడిగాడు అదే నమ్రతతో.
బోర్డ్ అంతా షాక్
🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️🌸❄️❄️🌸❄️🌸❄️🌸🌸❄️🌸❄️🌸*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*
No comments:
Post a Comment