Wednesday, 12 April 2023

పోతన భాగవతంలోని నవమస్కంధం (18-Apr-23, Enlightenment Story)

🥀 పోతన భాగవతం లోని నవమ స్కంధం🥀

🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

పూర్వం చంద్ర వంశం లో గాధి అనే క్షత్రియుడు ఉండేవాడు. ఈ దంపతులకు మగ సంతానం కలగాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఇతనికి సత్యవతి అనే కూతురు మాత్రమే జన్మించింది. ఈమెను ఋచీకుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు గాధి.   గాధి కి మగ సంతానం కలగాలనే ఆకాంక్ష తో తన అల్లుడు బ్రాహ్మణుడు అయిన కారణంగా ఆయనతో యజ్ఞాలు జరిపించాలని పూనుకొని ఋచీకుడి తో విషయం చెప్పాడు. ఋచీకుడు తన మామ చెప్పిన మాటలు విని తన భార్య అయిన సత్యవతి కోసం బ్రాహ్మణ మంత్రాలతో, తన మామ అయిన గాధి కోసం క్షత్రియ మంత్రాలతో యజ్ఞాలను విడివిడి గా నిర్వహించి, యజ్ఞ ఫలాలను తయారు చేశాడు.

ఋచీకుడు యజ్ఞాలు పూర్తి చేసి చరువులను (యజ్ఞ ఫలాలను) తన భార్య సత్యవతికి బ్రాహ్మణ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, తన అత్త అయిన గాధి భార్య కు క్షత్రియ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, విడివిడిగా ఇచ్చి స్నానానికి వెళ్ళిపోతాడు.  గాధి భార్య కొంత దుర్బుద్ధి తో ఆలోచించి ఇలా అనుకుంది "ఋచీకుడు తన భార్య కు మంచి లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం జరిపించి మంచి ఫలాన్ని తన భార్యకు, మామూలు లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం గావించి ఆ ఫలాన్ని నాకు ఇచ్చి ఉంటాడు. ఎలాగైనా ఈ యజ్ఞ ఫలాలను తారు మారు చేయాలి" అనుకుంది. తన కూతురు అయిన సత్యవతిని ఒప్పిస్తుంది. సత్యవతి కూడా విషయం తెలియక ఒప్పుకుని తన ఫలాన్ని తన తల్లి కి మరియు తన తల్లి ఫలాన్ని తానూ తారు మారు చేసుకుని సేవిస్తారు.

స్నానం చేసుకుని తిరిగివచ్చిన ఋచీకుడు జరిగిన విషయం తెలుసుకొని తన భార్య కు ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు. ఇలా జరిగినందుకు నీకు (అంటే ఋచీకుడు మరియు సత్యవతీ దంపతులకు) క్షత్రియ లక్షణాలు కలిగిన బాలుడు, మీ అమ్మ (గాధి దంపతులకు) కు బ్రాహణ లక్షణాలు కలిగిన బాలుడు జన్మిస్తాడు అని ఋచీకుడు తెలియజేస్తాడు. ఋచీకుడు, సత్యవతి కోరిక మేరకు జరిగిన తప్పు ను మన్నించి పుట్టబోయే సంతానం లో కొంత మార్పు చేస్తాడు. తమకు (సత్యవతి, ఋచీకుల దంపతులకు) కొడుకు గా కాకుండా మనుమడు గా క్షత్రియ లక్షణాలు గల బాలుడు జన్మిస్తాడు అని చెబుతాడు.  తద్వారా గాధి దంపతులకు జన్మించిన బాలుడు విశ్వామిత్రుడుగా, సత్యవతి - ఋచీకుల దంపతులకు జన్మించిన బాలుడు జమదగ్ని మహర్షి గా ఎదుగుతారు. ఈ జమదగ్ని మహర్షి కుమారుడే పరశురాముడు.

ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే.ఈ మధ్య కాలం లో కులాల పేరుతో చాలా గొడవలు, హత్యలు జరుగుతున్నాయి కానీ వారికి కులం అనేది పుట్టుకతో వచ్చింది కాదు వృత్తి ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అనే విషయం తెలియదు. ఇటువంటి కథలు చదివినపుడు మాత్రమే అసలైన విషయం తెలుసుకుంటారు

పూర్వం సూర్య వంశం లో శ్రాద్ధ దేవుడు - శ్రద్ధ అనే దంపతులకు దృష్టుడు, దిష్టుడు అనే కుమారులు ఉన్నారు. వీరిలో దృష్టుడు పేరుతో దార్జ వంశం అవతరించింది. ఈ దృష్టుడు పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి బ్రాహ్మణుడి గా పేరు తెచ్చుకున్నాడు. అలాగే దిష్టుడు కూడా పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి వైష్యుడి గా పేరు గాంచాడు.

ముగింపు: విశ్వామిత్రుడు, పరశురాముడు, ధృష్టుడు,దిష్టిడు మొదలైన వారి కులాలు పుట్టుకతో నిర్ణయించబడలేదు. వారి వృత్తి ధర్మాన్ని బట్టి వారి కుల నిర్ణయం జరిగింది. 

అంటే ఉదాహరణకు 

బ్రాహ్మణ కులం లో జన్మించిన వ్యక్తి వ్యాపారాలు చేసినట్లైతే వైశ్యుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేస్తే క్షత్రియుడు గా, సేవా కార్యక్రమాలు చేస్తే శూద్రుడు గా పరిగణించవచ్చు. అలాగే శూద్రులు కూడా వేదాలు పఠించడం, పాఠాలు చెప్పడం వంటివి చేసినపుడు బ్రాహ్మణుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేసినపుడు క్షత్రియుడు గా, వ్యాపారాలు చేసినపుడు వైశ్యుడు గా పరిగణించాలి. ఇదే నియమం క్షత్రియులకు మరియు వైశ్యులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించినపుడు కులాల పేరుతో జరిగే గొడవలను మనం ఆపగలము.

గమనిక: పై రెండు కథలు పోతన భాగవతం లోని నవమ స్కంధం లోనివి.

⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

*ప్రియమైన భగవత్బంధువులుకి శతకోటి వందనాలు 🙏*

*క్రమం తప్పకుండా కథలు చదువుతున్నందుకు ధన్యవాదాలు. ఎవరికైనా నా నుండి ఆన్‌లైన్ యోగా మరియు ధ్యానం నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే, దయచేసి నాకు వాట్సాప్ చేయండి @+1-314-562-5762. Email: Chandra65402020@gmail.com మీ చంద్రశేఖర్*
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ 
జ్ఞానోదయం కథనాన్ని చదవడానికి వాట్సాప్ గ్రూప్ లింక్ ని మీ స్నేహితులకు షేర్ చేయమని అభ్యర్థిస్తున్నాను
https://chat.whatsapp.com/HRPovJXg2z1AXAWUmU5kMe
⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️⚜️🕉️⚜️ 🕉️⚜️🕉️ ⚜️🕉️⚜️

1 comment:

అన్నదాన మహిమ (04-July-24, Enlightenment Story)

 అన్నదాన మహిమ 🍀🌺🍀🌺  🍀🌺🍀🌺 పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు. వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస...